దేశంలో లభ్యమవుతున్న అన్ని రకాల ఔషధాలను ధరల నియంత్రణ కిందకు తీసుకురావాలని...
పార్లమెంటరీ కమిటీ సూచన
న్యూఢిల్లీ: దేశంలో లభ్యమవుతున్న అన్ని రకాల ఔషధాలను ధరల నియంత్రణ కిందకు తీసుకురావాలని కెమికల్స్, ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సోమవారం పార్లమెంట్‌లో పేర్కొంది. ప్రాణాధార ఔషధాలతో పాటు అన్ని రకాల ఔషధాలను అందుబాటు ధరల్లో మార్కెట్‌లోకి తీసుకురావాలని సూచించింది. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా ఆధారంగా ఔషధ ధరల నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) 509 ఫార్ములేషన్ ప్యాక్స్‌కు ధరలను నిర్ణయించింది.
జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో అన్ని ఔషధాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కమిటీ పేర్కొంది. ‘ప్రతి ఔషధం అవసరమైనదే. అవసరాన్ని బట్టి రోగులు వాటిని వినియోగిస్తారు. వాటిని అందుబాటు ధరల్లో అందించడం సమంజసంగా ఉంటుందని వివరించింది.