
న్యూఢిల్లీ: యస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా ఓవర్‌నైట్ ఫండ్ పేరుతో మరో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా సమీకరించిన నిధులను ఒక్క రోజు వ్యవధి ఉండే టీఆర్‌ఈపీఎస్, ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్ తదితర సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందులో తక్కువ రిస్కు, అధిక లిక్విడిటీ వెసులుబాటు ఉంటుంది. తదనుగుణంగానే రాబడులు కూడా ఉంటాయి. ఆగస్టు 23తో ఈ న్యూ ఫండ్ ఆఫర్ ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1,000. ఎంట్రీ,ఎగ్జిట్ లోడ్ లేదు. డెట్ స్కీమ్– ఓవర్‌నైట్ ఫండ్ విభాగంలో ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్.