Yes Bank
-
మొబిక్విక్, క్రెడ్లో ఈ–రూపీ వాలెట్లు
డిజిటల్ ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలు మొబిక్విక్, క్రెడ్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ–రూపీ వాలెట్లను ప్రవేశపెట్టాయి. దీనికి యస్‌బ్యాంక్‌తో జతకట్టాయి. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదును బదలాయించేందుకు, అలాగే వ్యక్తులు.. వ్యాపారవర్గాలకు చెల్లింపులు జరిపేందుకు సర్వీసులు ఉపయోగపడనున్నాయి. 2024లో రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా డిజిటల్ కరెన్సీ ఈ–రూపీని ప్రవేశపెట్టినప్పుడు కేవలం బ్యాంకులకు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (టీపీఏపీ) కూడా సీబీడీసీ సేవలను అందించేందుకు వెసులుబాటు లభించింది. ఇప్పుడు ఈ–రూపీ వాలెట్ల రోజువారీ లావాదేవీల పరిమితి రూ. 50,000గా ఉండగా, ఒక్కో లావాదేవీ విలువ పరిమితి రూ. 10,000గా ఉంది. అర్థ రూపాయి, 1 రూపాయి నుంచి రూ. 500 వరకు కరెన్సీ డినామినేషన్లలో ఈ–రూపీ అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌తో ముగిసిన సస్తాసుందర్ భాగస్వామ్యంజెప్టో ‘రివర్స్ ఫ్లిప్’ పూర్తి..దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా క్విక్ కామర్స్ సంస్థ జెప్టో మరో అడుగు ముందుకు వేసింది. తమ హోల్డింగ్ కంపెనీ కిరాణాకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. రివర్స్ ఫ్లిప్గా వ్యవహరించే ఈ ప్రక్రియకు సంబంధించి సింగపూర్ కోర్టులు, భారత్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి లాంఛనంగా అనుమతులు లభించినట్లు సంస్థ సహ–వ్యవస్థాపకుడు ఆదిత్ పలీచా తెలిపారు. తక్కువ సమయంలోనే దీన్ని సాకారం చేశారని తమ బృందానికి కితాబిచ్చారు. -
కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!
ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫర్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. యెస్ బ్యాంక్, ఎన్పీసీఐ భాగస్వామ్యంతో ఫిన్ టెక్ సంస్థ రియో.. యెస్ బ్యాంక్ రియో రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది.యూపీఐతో మిళితం చేసిన ఈ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా 10 కోట్లకుపైగా వ్యాపార స్థానాల నుండి షాపింగ్ చేయవచ్చు. ఈ కార్డ్ రియో యాప్‌లోని నో యువర్ ఆఫర్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు రూ. 5 లక్షల వరకు క్రెడిట్ పరిమితి, వ్యక్తిగతీకరించిన రివార్డ్‌లు, ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తుంది.ఈ కార్డు కావాలంటే..చిన్న నగరాల వినియోగదారులే ఈ కార్డుపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. దాని బీటా లాంచ్ సమయంలో 60 శాతం అప్లికేషన్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే వచ్చాయి. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు, ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం కలిగి ఉన్నవారెవరైనా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారు కనీసం రూ. 25,000 నికర నెలవారీ జీతం లేదా రూ. 5 లక్షల వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్ కలిగి ఉండాలి. అయితే ఇప్పటికే ఉన్న యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ కొత్త కార్దుకు అర్హులు కాదు.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాజీవితకాలం ఉచితంఈ కార్డ్ జీవితకాలం ఉచితం. జాయినింగ్ ఫీజు కూడా లేదు. ఈ కార్డ్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట లావాదేవీలకు ఛార్జీ ఉంటుంది. ఒక నెలలో రూ. 15,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుము, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడ్ లేదా ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజుల చెల్లింపుపై 1% రుసుము, జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా రూ. 10,000లకు మించి ఇంధన లావాదేవీలకు ఒక్కో దానిపై 1% రుసుముతో పాటు జీఎస్టీ విధిస్తారు. -
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాల కోత
దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు సర్వసాధారణమై పోతున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రకటించింది. ఫలితంగా 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణ కోసం యెస్ బ్యాంక్ ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రకటించిన తొలగింపులతోపాటు రానున్న వారాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పెడుతుందని భావిస్తున్నారు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకున్న యెస్ బ్యాంక్ ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు తొలగింపులు చేపట్టింది. హోల్‌సేల్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభారం పడింది.ఆపరేషన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, సిబ్బంది వినియోగాన్ని మెరుగుపరుచుకోవడమే పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా బ్యాంక్ పేర్కొంటోంది. అయితే వ్యయ నియంత్రణలో భాగంగానే డిజిటల్ బ్యాంకింగ్ వైపు యెస్ బ్యాంక్ మరింతగా మళ్లుతోందని నివేదికలు చెబుతున్నాయి. -
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్‌లకు ఆర్బీఐ వార్నింగ్..
ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. -
దక్షిణాదిపై యస్ బ్యాంక్ మరింత దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ దక్షిణాదిలో కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోను శాఖలను విస్తరిస్తోంది. ప్రస్తుతం 25గా ఉన్న బ్రాంచీల సంఖ్యను మార్చి ఆఖరు నాటికి 29కి పెంచుకోనున్నట్లు, తదుపరి మరో రెండు కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 1,200 పైచిలుకు శాఖలు ఉండగా.. దక్షిణాదిలో 216 ఉన్నాయన్నారు. మైక్రోఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించడంపైనా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుదిరితే ఏదైనా సూక్ష్మ రుణాల సంస్థను కొనుగోలు చేస్తామని లేదా సొంతంగానైనా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పేటీఎం పరిణామాలపై స్పందిస్తూ దానికి సంబంధించి నాలుగు బ్యాంకులకు వచ్చే వ్యాపారంలో తమకు పాతిక శాతం వాటా రాగలదని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంపైనా (ఎంఎస్ఎంఈ) దృష్టి పెడుతున్నామన్నారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో దీని వాటా 30 శాతంగా ఉండగా వచ్చే రెండు, మూడేళ్లలో 35 శాతం వరకు పెంచుకోనున్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 18 శాతం, రుణాల్లో 15 శాతం వరకు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ మార్కెట్‌పై స్పందిస్తూ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 16.6 శాతం వృద్ధి చెంది రూ. 8,887 కోట్లకు చేరాయని, స్థూల రుణాలు 24 శాతం వృద్ధితో రూ. 11,157 కోట్లకు పెరిగాయని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొత్త కాసా (కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) అకౌంట్లు 14 శాతం వృద్ధి చెందాయన్నారు. దక్షిణాదిలో తమ కాసా డిపాజిట్లలో నగరానికి 14 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. -
యస్ బ్యాంక్‌కు భారీ పెనాల్టీ
ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ తమిళనాడు వస్తు సేవల పన్ను (GST) విభాగం భారీ పెనాల్టీ విధించింది. జీఎస్టీ సంబంధిత సమస్యల కారణంగా తమిళనాడు జీఎస్టీ విభాగం నుంచి రూ.3 కోట్ల పన్ను నోటీసును యస్ బ్యాంక్ సోమవారం అందుకుంది. యస్ బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ రూ. 3,01,50,149 జరిమానా విధించింది. అయితే దీని వల్ల బ్యాంక్ ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని, దీనిపై న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఇదీ చదవండి: వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా? కలవరపెడుతున్న అంచనాలు! కాగా యస్ బ్యాంక్ గతంలోనూ జీఎస్టీ నోటీసులు అందుకుంది. గతేడాది డిసెంబర్లో బిహార్ జీఎస్టీ డిపార్ట్మెంట్ వరుసగా రూ. 20,000, రూ. 1,38,584 చొప్పున రెండు వేర్వేరు పన్ను నోటీసులను జారీ చేసింది. -
యస్ బ్యాంక్ రాణా కపూర్‌కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి
న్యూఢిల్లీ: ఏటీ–1 బాండ్ల తప్పుడు విక్రయాల కేసుకు సంబంధించి రూ. 2.22 కోట్లు కట్టాలంటూ యస్ బ్యాంక్ మాజీ ఎండీ రాణా కపూర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించని పక్షంలో అరెస్ట్ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే అసెట్స్, బ్యాంక్ ఖాతాలను కూడా అటాచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్‌ల గురించి చెప్పకుండా వాటిని అమాయక ఇన్వెస్టర్లకు యస్ బ్యాంక్ సిబ్బంది అంటగట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2022 సెపె్టంబర్లో రాణా కపూర్‌కు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. -
ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
సాక్షి,ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణకు హాజరైనారు. ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం చేరుకోవడం చర్చనీయాంతంగా నిలిచింది. అయితే ఏ కేసుకు సంబంధించి అంబానీని పిలిచారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఫెమా ఉల్లంఘన కేసులో అంబానీనీ విచారించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) కింద అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరైనట్టు తెలుస్తోంది. కాగా 2020లో మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు అధికారులను, అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో యెస్ బ్యాంక్స్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ. 12,800 కోట్ల రుణాలు పొందాయి. రిలయన్స్తోపాటు, పాటు చాలా కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ గతంలో అంబానీకి సమన్లు జారీ చేసి విచారించింది. -
రైట్ కాదు.. ఫ్లైట్! లోగో మార్చిన యస్ బ్యాంక్
ముంబై: కస్టమర్లకు చేరువయ్యే దిశగా ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రకటనలపై 30 శాతం అధికంగా వెచ్చించనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిపుణ్ కౌశల్ తెలిపారు. జూన్ 20 నుంచి ప్రారంభించే ప్రచార కార్యక్రమాలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. తమ రిటైల్ కార్యకలాపాలు కీలక స్థాయికి చేరుకున్నాయని, ఇక నుంచి లాభదాయకత పెరగగలదని చెప్పారు. యస్ బ్యాంక్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా కౌశల్ ఈ విషయాలు తెలిపారు. స్వల్ప మార్పులతో యస్ బ్యాంక్ తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. బ్యాంక్ ప్రస్తుత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ టిక్ స్థానంలో పైకెగిరే పక్షిని తలపించేలా మార్పులు చేశారు. ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర -
ఢిల్లీ హైకోర్టుకు ‘యస్ బ్యాంక్ ఒత్తిడి రుణ’ బదలాయింపు వివాదం
న్యూఢిల్లీ: జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి యస్ బ్యాంక్‌కు చెందిన రూ. 48,000 కోట్ల స్ట్రెస్ అసెట్ (మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న) పోర్ట్‌ఫోలియోను బదిలీ చేయడంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బదలాయింపుపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్రం, ఆర్బీఐ, సెబీల ప్రతి స్పందనను కోరింది. సమాధానానికి నాలుగు వారాల గడువును ఇస్తూ, తదుపరి కేసును జూలై 14న లిస్ట్ చేయాలని ఆదేశించింది. రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యం స్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరహా ఒప్పందాల్లో ఎటువంటి వివాదాలకూ తావివ్వకుండా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని, ఇందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, సెబీలను ఆదేశించాలని ఆయన ఈ పిటిషన్లో కోరారు. ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ షేర్లకు సంబంధించిన మూడేళ్ల లాకిన్ వ్యవధి ఈ నెల 13వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్ బ్యాŠంక్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు రూ. 10,000 కోట్ల చొప్పున సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్ బ్యాంక్‌ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్ విధించారు. యస్ బ్యాంక్ షేర్ ఎన్ఎస్ఈలో శుక్రవారం 1 శాతం పెరిగి రూ.15.05కు చేరింది. -
నేటితో ముగియనున్న యస్ బ్యాంక్ షేర్ల లాకిన్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ షేర్ల మూడేళ్ల లాకిన్ వ్యవధి సోమవారంతో ముగియనుంది. దీంతో మార్కెట్లో భారీ అమ్మకాలు వెల్లువెత్తవచ్చని భావిస్తున్నారు. 2020 మార్చిలో యస్ బ్యాంక్‌లో దాదాపు 49 శాతం వాటాలు కొనుగోలు చేసిన తొమ్మిది బ్యాంకులు తాజాగా షేర్లను అమ్ముకుని నిష్క్రమించేందుకు ప్రయత్నించవచ్చని అంచనా. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు (రిటైల్, సంపన్న వర్గాలు, ప్రవాస భారతీయులు) చెందిన 135 కోట్ల షేర్లు, ఈటీఎఫ్‌లకు చెందిన 6.7 కోట్ల షేర్లు లాకిన్ అయి ఉన్నాయి. 2022 డిసెంబర్ ఆఖరు నాటికి ఎస్బీఐకి 605 కోట్లు, హెచ్డీఎఫ్సీ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంకులకు తలో 100 కోట్ల షేర్లు ఉన్నాయి. నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు తలో రూ. 10,000 కోట్లు సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్ బ్యాంక్‌ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్ విధించారు. ఇతర ఇన్వెస్టర్లకూ ఇదే నిబంధన వర్తింపచేశారు. -
యస్ బ్యాంక్‌కు మొండి బాకీల భారం
ముంబై: గత మొండిపద్దులకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 79 శాతం క్షీణించింది. రూ. 55 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజనింగ్ రూ. 375 కోట్ల నుంచి రూ. 845 కోట్లకు ఎగిసింది. భవిష్యత్తులోనూ పాత మొండి బాకీలకు సంబంధించి మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రావచ్చని బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. రుణ వృద్ధి ఊతంతో సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం సుమారు 12 శాతం పెరిగి రూ. 1,971 కోట్లకు చేరింది. సింహ భాగం మొండి బాకీలను జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదలాయించడంతో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి అంతక్రితం త్రైమాసికంలోని 13 శాతంతో పోలిస్తే 2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఇప్పటివరకు రూ. 4,300 కోట్ల రుణాలు రాబట్టగా, చివరి క్వార్టర్లో మరో రూ. 1,000 కోట్ల రికవరీకి అవకాశం ఉందని కుమార్ వివరించారు. రూ. 8,400 కోట్ల ఏటీ–1 బాండ్ల రద్దు చెల్లదంటూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
వారికోసం యస్ బ్యాంక్ ప్రైవేట్ డెబిట్ కార్డు, బెనిఫిట్స్ ఏంటి?
ముంబై: అత్యంత సంపన్న కస్టమర్ల (హెచ్ఎన్ఐ) కోసం మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో యస్ బ్యాంక్ కొత్తగా ప్రైవేట్ డెబిట్ కార్డును ఆవిష్కరించింది. సంపన్న ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో ఫీచర్లు ఉంటాయని యస్ బ్యాంక్ గ్లోబల్ హెడ్ రాజన్ పెంటాల్ తెలిపారు. ట్రావెల్, వెల్నెస్, లైఫ్‌స్టయిల్ వంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందు కోవచ్చని పేర్కొన్నారు. ఓబెరాయ్ హోట ల్స్ నుంచి ఈ-గిఫ్ట్ వోచర్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ పొందవచ్చని వివరించారు. ఆసి యా పసిఫిక్ దేశాల్లో ఈ తరహా వర ల్డ్ ఎలైట్ డెబిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ తెలిపారు. -
జేసీ ఫ్లవర్స్‌కు 7 కంపెనీల షేర్లు
న్యూఢిల్లీ: రుణాల రివకరీకి వీలుగా తనఖాకు వచ్చిన 7 కంపెనీల షేర్లను ఆస్తుల పునర్నిర్మాణ సంస్థ(ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు బదిలీ చేసినట్లు ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. జాబితాలో డిష్ టీవీ, ఏషియన్ హోటల్స్, అవంతా రియల్టీ తదితరాలున్నట్లు పేర్కొంది. మొత్తం రూ. 48,000 కోట్ల రుణ రికవరీలో భాగంగా తాజా చర్యలు చేపట్టింది. తనఖాకు వచ్చిన డిష్ టీవీ ఇండియాకు చెందిన దాదాపు 44.54 కోట్ల షేర్లు(24.19 శాతం వాటాకు సమానం) జేసీ ఫ్లవర్స్‌కు బదిలీ చేసినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. పొందిన రుణాలను ఎస్సెల్ గ్రూప్ తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇక ఇదే అంశంలో ఏషియన్ హోటల్స్(నార్త్)లో 7.21 శాతానికి సమానమైన 14 లక్షలకుపైగా షేర్లను జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి బదిలీ చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రియల్టీ కంపెనీ అవంతాకు చెందిన 30 శాతం వాటా(10 లక్షలకుపైగా షేర్లు), తులిప్ స్టార్ హోటల్స్‌కు చెందిన 20.61 శాతం వాటా(9.5 లక్షల షేర్లు), రోజా పవర్ సప్లై కంపెనీకి చెందిన 29.97 శాతం వాటా(12.73 కోట్ల షేర్లకుపైగా), డియాన్ గ్లోబల్‌కు చెందిన 14.11 శాతం వాటా(45.46 లక్షల షేర్లు), వడ్రాజ్ సిమెంట్‌కు చెందిన 20 శాతం వాటా(40 కోట్ల షేర్లు) బదిలీ చేసినట్లు వివరించింది. -
యస్ బ్యాంక్‌లో వాటాలకు కార్లైల్‌కి గ్రీన్ సిగ్నల్
ముంబై: యస్ బ్యాంక్‌లో 9.99 శాతం వరకూ వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు ది కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్లకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యస్ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ ఏడాది జూలైలో ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి. నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటాలు తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. కార్లైల్, యాడ్వెంట్ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ రెండు వేర్వేరు లేఖల ద్వారా నవంబర్ 30న ‘షరతులతో కూడిన ఆమోదం‘ తెలిపినట్లు బ్యాంక్ వెల్లడించింది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ YES Bank (యస్ బ్యాంక్) కీలక ప్రకటన చేసింది. ఇకపై సబ్స్క్రిప్షన్ ఆధారిత ఎస్ఎంఎస్ (SMS) బ్యాలెన్స్ అలర్ట్ సేవలను నిలిపివస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ నుంచి తప్పనిసరి అలర్ట్స్ (Mandatory Alerts)మాత్రం యథావిధిగా వస్తాయని తెలిపింది. కాగా బ్యాంక్ ఈ తప్పనిసరి అలర్ట్‌తో పాటు, సబ్స్క్రిప్షన్ ఆధారిత ఎస్ఎంఎస్ అలర్ట్ సదుపాయాన్ని గతంలో అందించేది. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘డిసెంబరు 01, 2022 నుంచి SMS ద్వారా బ్యాలెన్స్ అలర్ట్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నాం. ఒకవేళ కస్టమర్లు ఎస్ఎంస్ అలర్ట్ ప్యాకేజీకి సబ్‌స్క్రైబ్ చేసుకుని, కస్టమర్లుకు కూడా ఈ సేవలను ఇకపై పని చేయవు. అయితే ఇదివరకు మాదిరిగానే తప్పనిసరి అలర్ట్స్ మాత్రం మాత్రం వస్తాయని’ స్పష్టం చేసింది. అయితే కస్టమర్లు తమ బ్యాలెన్స్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకోవచ్చని తెలుపుతూ.. అందుకోసం యస్ మొబైల్, యస్ ఆన్లైన్, యస్ రోబోట్ వంటి ఆన్లైన్ సౌకర్యాలను ఉపయోగించుకునే సదుపాయం ఉందని వెల్లడించింది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
నెలాఖరులోగా మొండి పద్దుల విక్రయం పూర్తి
ముంబై: దాదాపు రూ. 48,000 కోట్ల మొండి పద్దులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు విక్రయించే ప్రక్రియ నవంబర్ నెలాఖరుకి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు యస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనితో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతం లోపునకు దిగి రానుంది. మొత్తం పద్దులకు గాను రూ. 11,183 కోట్లు యస్ బ్యాంక్‌కు జేసీ ఫ్లవర్స్ చెల్లించనుంది. ఇది సుమారు 23 శాతం రికవరీకి సమానం. మరోవైపు, డీల్ ప్రకారం ఏఆర్‌సీలో యస్ బ్యాంక్ 9.9 శాతం వాటాలు తీసుకోనున్నట్లు, ఆర్బీఐ అనుమతితో దీన్ని తదుపరి 20 శాతానికి పెంచుకోనున్నట్లు ఎఫ్‌ఐబీఏసీ 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ వివరించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. -
యస్ బ్యాంకు ఎండీగా మరో మూడేళ్లు ప్రశాంత్ కుమార్
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ మరో మూడేళ్లు కొనసాగనున్నారు. అక్టోబర్ 6 నుంచి తదుపరి మూడేళ్ల కాలానికి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలియజేసింది. ఈ ఏడాది జూలైలో ప్రశాంత్ కుమార్ నియామక ప్రతిపాదనను యస్ బ్యాంకు ఆర్బీఐకి పంపింంది. సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకు పునరుద్ధరణకు వీలుగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్న అనంతరం.. 2020లో ప్రశాంత్ కుమార్ మొదటిసారి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా నియమితులు కావడం గమనార్హం. -
జేసీ ఫ్లవర్స్‌కు యస్ బ్యాంక్ మొండి రుణాలు.. విలువ రూ. 48,000 కోట్లు
న్యూఢిల్లీ: ఒత్తిడిలో పడిన మొండి రుణాలను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఎంపిక చేసిన మొత్తం రూ. 48,000 కోట్ల రుణాలను యూఎస్‌కు చెందిన ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈ రుణాల పోర్ట్‌ఫోలియోకు జేసీ ఫ్లవర్స్ ఏకైక బిడ్డర్‌గా నిలిచినట్లు తెలియజేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పారదర్శక బిడ్డింగ్ విధానాలను అవలంబిస్తూ స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లకు ఆహ్వానం పలికినట్లు బ్యాంక్ వెల్లడించింది. ప్రాథమిక(బేస్) బిడ్డింగ్‌కు జులైలోనే జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీ మాత్రమే రేసులో నిలిచినట్లు పేర్కొంది. ఇతర బిడ్స్ దాఖలుకాకపోగా.. స్విస్ చాలెంజ్ ప్రాసెస్‌ను ముగించినట్లు తెలియజేసింది. వెరసి ఈ విధానం ప్రకారం గెలుపొందిన జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. ఒప్పందం ప్రకారం జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీలో 19.99 శాతం వాటా కొనుగోలుకి బ్యాంక్ తగిన పెట్టుబడులకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకునే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
యస్ బ్యాంక్‌లో గాంధీకి బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆర్.గాంధీకి ఆర్బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన గాంధీ మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి నియామకం అమల్లోకి వచ్చినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. రామ సుబ్రమణ్యం గాంధీ ఎంపికకుగాను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు చేసిన ప్రతిపాదనను ఆర్బీఐ అనుమతించినట్లు తెలియజేసింది. ఆర్థిక రంగ విధానాల నిపుణులు, సలహాదారుడైన గాంధీ 2014 నుంచి 2017 వరకూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. గతంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీలోనూ మూడేళ్లపాటు తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు.. ఐడీఆర్‌బీటీ(హైదరాబాద్)లోనూ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలోనూ తొలినాళ్లలో సభ్యులుగా ఉన్నారు. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి! -
డిష్ టీవీ ఛైర్మన్ బై..బై! షేర్లు రయ్ రయ్..!
సాక్షి,ముంబై: డైరెక్ట్-టు-హోమ్ ఆపరేటర్ డిష్ టీవీ ఛైర్మన్ జవహర్ లాల్ గోయల్ కంపెనీ బోర్డు నుండి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డిష్ టీవీ సోమవారంనాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అతిపెద్ద వాటాదారు యెస్ బ్యాంక్.. ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ నేతృత్వంలోని ప్రమోటర్ కుటుంబం డిష్ టీవీ బోర్డు ప్రాతినిధ్యంపై వివాదం, లీగల్ ఫైట్ నేపథ్యంలో ఈ రాజీనామా చోటు చేసుకుంది. 24 శాతానికి పైగా వాటా ఉన్న వైబీఎల్ డిష్ టీవీ బోర్డుని పునర్నిర్మించాలని, గోయెల్‌తో పాటు మరికొందరు వ్యక్తులను తొలగించాలని ఒత్తిడి చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో, యెస్ బ్యాంక్ ప్రతిపాదించిన ఏడుగురు స్వతంత్ర డైరెక్టర్లలో ముగ్గురిని నియమించడానికి డిష్ టీవీ అంగీకరించింది. మరోవైపు జూన్‌లో జరిగిన కంపెనీ అసాధారణ సాధారణ సమావేశంలో గోయల్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్ దువాను కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పునః నియమించాలనే ప్రతిపాదనను 75 శాతం షేర్హోల్డర్లు తిరస్కరించారు. కాగా ఆగస్టు 30 నాటి కంపెనీ డిష్ టీవీ, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ సెప్టెంబర్ 26, 2022న జరగనున్న కంపెనీ ఏజీఎంలో పదవినుంచి వైదొలుగుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో డీష్ టీవీ షేరు సోమవారం 10శాతం లాభపడగా, మంగళవారం మరో 6శాతం ఎగిసి 17.80 వద్ద కొనసాగుతోంది. -
రాణా కపూర్‌కు సెబీ జరిమానా
న్యూఢిల్లీ: అదనపు టైర్(ఏటీ)–1 బాండ్ల విక్రయంలో అక్రమాలపై యస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రాణా కపూర్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. యస్ బ్యాంకు అధికారులు రిటైల్ ఇన్వెస్టర్లకు తప్పుడు పద్ధతిలో అదనపు టైర్–1 బాండ్లను విక్రయించడంపై సెబీ తాజా జరిమానాకు తెరతీసింది. సెకండరీ మార్కెట్లో ఏటీ–1 బాండ్లను విక్రయించేటప్పుడు బ్యాంకు, కొంతమంది అధికారులు రిస్కులను ఇన్వెస్టర్లకు వెల్లడించకపోవడాన్ని సెబీ తప్పుపట్టింది. 2016లో ప్రారంభమైన ఏటీ–1 బాండ్ల అమ్మకం 2019వరకూ కొనసాగింది. వీటి విక్రయ వ్యవహారాన్ని మొత్తంగా కపూర్ పర్యవేక్షించినట్లు సెబీ పేర్కొంది. బాండ్ల విక్రయంపై సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందడంతోపాటు అమ్మకాలను పెంచేందుకు అధికారులపై ఒత్తిడిని సైతం తీసుకువచ్చినట్లు తెలియజేసింది. -
దేశంలో ఈడీ హీట్.. రూ.415 కోట్లు విలువైన బిల్డర్స్ ఆస్తులు సీజ్!
ముంబై: దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హీట్ కొనసాగుతోంది. మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్రలోని ఓ బిల్డర్‌కు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ను సీజ్ చేసిన మరుసటి రోజునే మరిన్ని ఆస్తులను అటాచ్ చేసింది. ఆ బిల్డర్‌తో పాటు మరో వ్యక్తికి చెందిన మొత్తం రూ.415 కోట్లు విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఎస్ బ్యాంక్- డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి.. ఇప్పటికే రేడియస్ డెవెలపర్స్ అధినేత సంజయ్ ఛాబ్రియా, ఏబీఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చీఫ్ అవినాశ్ భోంస్లేలను అరెస్ట్ చేసింది ఈడీ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు రూ.34వేల కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతవారం అవినాశ్ భోంస్లేకు చెందిన హెలికాప్టర్‌ను పుణెలో స్వాధీనం చేసుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. తాజాగా బుధవారం సీజ్ చేసిన ఆస్తుల్లో.. ముంబైలోని రూ.116.5 కోట్లు విలువైన ఆస్తి, ఛాబ్రియా సంస్థలో 25 శాతం ఈక్విటీ షేర్లు, రూ.3 కోట్లు విలువైన ఫ్లాట్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్లో లాభం రూ.13.67 కోట్లు, రూ.3.10 కోట్లు విలువైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. మరోవైపు.. అవినాశ్ భోంస్లే ఆస్తుల్లో ముంబైలోని రూ.102.8 కోట్లు విలువైన డూప్లెక్స్ ఫ్లాట్, పుణెలోని రూ.14.65 కోట్లు, రూ.29.24 కోట్లు విలువైన భూములు, నాగ్‌పూర్‌లోని రూ.15.62 కోట్లు విలువైన మరో ల్యాండ్ వంటివి సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. పీఎంఎల్ఏ చట్టం 2002 ప్రకారం ఇరువురికి అటాచ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది ఈడీ. తాజాగా సీజ్ చేసిన ఆస్తులతో మొత్తం ఇద్దరికి సంబంధించి రూ.1,827 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 1988లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఎస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్స్ కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లను విచారిస్తోంది ఈడీ. డీహెచ్ఎఫ్ఎల్కు ఎస్ బ్యాంక్ నుంచి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్లోని స్వల్ప కాలిక నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్స్‌లో రూ.3,700 కోట్లు ఎస్ బ్యాంక్ పెట్టుబడి పెట్టినట్లు ఈడీ పేర్కొంది. అలాగే.. మసాలా బాండ్స్‌లో రూ.283 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. దానికి బధులుగా డీహెచ్ఎఫ్ఎల్ ద్వారా కపిల్ వాద్వాన్.. రాణా కపూర్ సంస్థలకు రూ.600 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టగా సంజయ్ ఛాబ్రియాన్ చెందిన రేడియస్ గ్రూప్‌నకు రూ.2,317 కోట్లు రుణాలు వచ్చాయని... వాటిని అవినాశ్ భోంస్లేతో కలిసి ఇతర మార్గాల్లోకి మళ్లించాడని పేర్కొంది. ఇదీ చదవండి: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు -
యస్ బ్యాంక్ జూమ్.. లాభం వచ్చింది కానీ, అవి తగ్గాయి!
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 314 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 207 కోట్ల నుంచి రూ. 311 కోట్లకు ఎగసింది. గతేడాది(2021–22) క్యూ1తో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 32 శాతం పుంజుకుని రూ. 1,850 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.47 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం మాత్రం 10 శాతం నీరసించి రూ. 781 కోట్లకు పరిమితమైంది. స్లిప్పేజీలు రూ. 2,233 కోట్ల నుంచి రూ. 1,072 కోట్లకు భారీగా తగ్గాయి. ప్రొవిజన్లు 62 శాతం దిగివచ్చి రూ. 175 కోట్లకు పరిమితమయ్యాయి. పునర్వ్యవస్థీకృత రుణాలు రూ. 6,450 కోట్లుకాగా.. 30 రోజులుగా చెల్లించని(ఎన్పీఏలుకాని) రుణాల విలువ రూ. 1,700 కోట్లుగా నమోదయ్యాయి. ఇందుకు భారీ ఇన్ఫ్రా ఖాతా కారణమైనట్లు బ్యాంక్ పేర్కొంది. రికవరీలు, అప్‌గ్రేడ్స్ ద్వారా రూ. 1,532 కోట్లు జమయ్యాయి. ఈ ఖాతా నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కనీస మూలధన నిష్పత్తి 17.7 శాతానికి చేరింది. -
యస్ బ్యాంక్‌లో కార్లయిల్ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజం కార్లయిల్ గ్రూప్.. ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 10 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల మార్గంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ 2023 మార్చివరకూ 26 శాతం వాటాను కొనసాగించనున్న నేపథ్యంలో మార్పిడికి వీలయ్యే రుణ సెక్యూరిటీల జారీపై యూఎస్ పీఈ దిగ్గజం కార్లయిల్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎఫ్‌డీఐ మార్గంలో విదేశీ పోర్ట్‌ఫోలియో(ఎఫ్‌పీఐ) విధానంలో కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ గ్రూప్ ప్రణాళికలు వేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఎఫ్‌డీఐగా అర్హత సాధించాలంటే కనీసం 10 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వచ్చే నెల(జూలై) మధ్యలో యస్ బ్యాంక్ బోర్డు సమావేశంకానుంది. ఈ సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు అంచనా. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక బ్యాంకులో 4.9 శాతానికి మించి వాటాను సొంతం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. దీనికితోడు బ్యాంకులో వ్యక్తిగత వాటా విషయంలో 10 శాతం, ఫైనాన్షియల్ సంస్థలైతే 15 శాతంవరకూ పెట్టుబడులపై ఆర్బీఐ పరిమితులు విధించింది. చర్చల దశలో యస్ బ్యాంకులో 50–60 కోట్ల డాలర్లు(రూ. 3,750–4,500 కోట్లు) వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు పీఈ ఇన్వెస్టర్ల నుంచి 1–1.5 బిలియన్ డాలర్లు(రూ. 7,800–11,700 కోట్లు) సమీకరించేందుకు యస్ బ్యాంక్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్లయిల్ వాటా కొనుగోలు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్లోగల మొత్తం వాటాను విక్రయించేందుకు కార్లయిల్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్‌కల్లా ఎస్బీఐ కార్డ్స్‌లో కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏ రోవర్ హోల్డింగ్స్ 3.09 శాతం వాటాను కలిగి ఉంది. -
లాభాల్లోకి యస్ బ్యాంక్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ గతేడాది(2021–22) రూ. 1,066 కోట్ల నికర లాభం ఆర్జించింది. మూడేళ్ల(2019) తదుపరి బ్యాంక్ లాభాల్లోకి ప్రవేశించినట్లు బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కాగా.. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ రూ. 367 కోట్ల నికర లాభం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. ఈ క్యూ4(జనవరి–మార్చి)లో నికర వడ్డీ ఆదాయం 84 శాతం జంప్‌చేసి రూ. 1,819 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.5 శాతానికి బలపడగా.. వడ్డీ యేతర ఆదాయం 28 శాతం ఎగసి రూ. 882 కోట్లకు చేరింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ అధ్యక్షతన బ్యాంకుల కన్సార్షియం ఆర్థిక సవాళ్లలో ఇరుక్కున్న యస్ బ్యాంకుకు మూడేళ్ల క్రితం బెయిలవుట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.7 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఏడాది(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా రికవరీలు, అప్గ్రేడ్లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రశాంత్ వెల్లడించారు. ఈ బాటలో నికర వడ్డీ మార్జిన్లను 2.75 శాతానికి మెరుగుపరచుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 2022 మార్చికల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.4 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. -
జీ లెర్న్‌పై యస్ బ్యాంక్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: జీ లెర్న్‌పై దివాలా చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కి ఫిర్యాదు చేసింది. మొత్తం రూ. 468 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనందున కంపెనీపై చర్యలు తీసుకోవలసిందిగా యస్ బ్యాంక్ ఆరోపించినట్లు జీ లెర్న్ పేర్కొంది. ఈ ఫిర్యాదుపై ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ నుంచి నోటీసు అందుకున్నట్లు వెల్లడించింది. నిజానిజాలను ధ్రువపరచుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీ జీ లెర్న్ ఎడ్యుకేషన్ విభాగంలో సేవలందించే సంగతి తెలిసిందే. చదవండి: నాకు జాబ్ కావాలి.. మీ జాలి కాదు.. -
Sakshi Cartoon: పద్మభూషణ్ ఇప్పిస్తామని రూ.2 కోట్ల పెయింటింగ్...
పద్మభూషణ్ ఇప్పిస్తామని రూ.2 కోట్ల పెయింటింగ్ కొనిపించిన కాంగ్రెస్-యస్ బ్యాంక్ కపూర్ -
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్‌తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్‌ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్‌సోనియాగాంధీకి న్యూయార్క్‌లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
యస్ బ్యాంక్.. 80 % జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 266 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే లాభం ఏకంగా 80 శాతం ఎగిసింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ గణనీయంగా తగ్గడం ఇందుకు తోడ్పడింది. నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం వృద్ధి చెంది 2.4 శాతానికి పెరిగినప్పటికీ .. రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 31 శాతం క్షీణించి రూ. 1,764 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో రుణ వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్యూ3లో ప్రొవిజనింగ్ రూ. 2,089 కోట్ల నుంచి ఏకంగా 82 శాతం తగ్గింది. రూ. 375 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. భారీ విలువ రుణాలను తగ్గించుకోవడంతో పాటు కార్పొరేట్లు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి గైడెన్స్‌ను 10 శాతానికి కుదించుకున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఇది 15 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. -
డిష్ టీవీ ఫర్ సేల్..! పోటీలో ప్రధాన కంపెనీలు..!
లోన్ రికవరీలో భాగంగా డిష్ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను యస్ బ్యాంకు అమ్మేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకుగాను యస్ బ్యాంకు దిగ్గజ శాటిలైట్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. పోటీలో టాటా స్కై, భారతి ఎయిర్టెల్..! డిష్ టీవీను దక్కించుకునేందుకు దిగ్గజ శాటిలైట్ సంస్థలు టాటాస్కై, భారతీ ఎయిర్టెల్ ముందున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై ఇరు కంపెనీలు స్పందించలేదు. డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య గత కొద్ది రోజల నుంచి అనిశ్చితి నెలకొంది. కంపెనీపై బాధ్యతలు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదనలు చేస్తున్నాయి. వారికే బెనిఫిట్..! డిష్ టీవీ వ్యవహారాలను కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఫ్యామిలీ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటుంది. వీరికి కంపెనీలో ఆరు శాతం వాటాలు కల్గి ఉన్నారు. ఒకవేళ యస్‌బ్యాంకు డిష్‌టీవీ వాటాలను టాటాస్కై, లేదా ఎయిర్టెల్ దక్కించుకుంటే ఆయా శాటిలైట్ టీవీ కంపెనీలు వాటా గణనీయంగా పెరగనుంది. శాటిలైట్ డిష్ టీవీ మార్కెట్లో 88 శాతంతో టాటాస్కై మొదటిస్థానంలో ఉంది. ఎయిర్టెల్, డిష్ టీవీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. అలాగే రూ.67 కోట్ల నష్టాలను చవిచూసింది. డిష్ టీవీ మార్కెట్ విలువ రూ.8,268 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: 500 కోట్ల పరిహారం అడిగాడు.. ఆపై భార్యతో కలిసి ఫోన్లో బండబూతులు తిట్టాడు! -
బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం!
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న సంస్థల తీవ్ర మొండిబకాయిలు (ఎన్పీఏ) భారీ రాయితీలతో పరిష్కారం ఒకవైపు, యస్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు ‘బెయిల్ అవుట్లు’ మరోవైపు... ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ తీవ్ర సవాళ్లలో కూరుకుపోతోందని యూఎఫ్‌బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) విమర్శించింది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) ప్రైవేటీకరణ, విలీనాల వంటి ప్రతికూల నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఆయా విధానాలకు నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మ తప్పదని పేర్కొంది. ఈ మేరకు యూఎఫ్‌బీయూ కన్వీనర్ బీ రాంబాబు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ► 13 కార్పొరేట్ల రుణ బకాయిలు రూ.4,86,800 కోట్లు. అయితే భారీ రాయితీలతో రూ.1,61,820 కోట్లకే రుణ పరిష్కారం జరిగింది. వెరసి బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ► సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులను నిధుల పరంగా గట్టెక్కించడానికి (బెయిల్ అవుట్) గతంలోనూ, వర్తమానంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులనే వినియోగించుకోవడం జరిగింది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాద్‌లు ఇందుకు గత ఉదాహరణలుకాగా, ఇప్పుడు యస్‌బ్యాంక్‌ను రక్షించడానికి ప్రభుత్వ రంగ ఎస్బీఐని వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేటు రంగ దిగ్గజ ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బెయిల్ అవుట్‌కు ఎస్బీఐ, ఎల్ఐసీలను వినియోగించుకోవడం జరిగింది. ► ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న యోచన సరికాదు. జన్ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విజయవంతానికి మెజారిటీ భాగస్వామ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం. ► ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ► బ్యాంకులను ప్రైవేటీకరించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే పక్షంలో, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెతో ఎటువంటి చర్యలకైనా దిగేందుకు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతారు. ప్రైవేటీకరణ విధానం ప్రజల ప్రయోజనాలకు మంచిదికాదు. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తీవ్రమైన భారీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పీఏల్లో ప్రధాన వాటా పెద్ద కార్పొరేట్‌దే కావడం గమనార్హం. -
పురోగమనంలో యస్ బ్యాంకు
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సహా ఇతర ఇన్వెస్టర్లు తీసుకున్న తర్వాత.. పనితీరు మెరుగుపడుతోందని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్‌కుమార్ అన్నారు. నిధుల సంక్షోభంలో పడిపోయిన యస్ బ్యాంకును ఆదుకున్న సమయంలో ఎస్బీఐ సారథిగా రజనీ‹Ùకుమార్ ఉన్న విషయం గమనార్హం. యస్ బ్యాంకుపై ఓ వార్తా సంస్థతో రజనీష్‌కుమార్ తాజాగా మాట్లాడారు. ‘‘యస్ బ్యాంకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థిరపడేందుకు కనీసం మూడేళ్ల సమయం అయినా ఇచ్చి చూడాలి. ఎస్బీఐ ఆదుకున్న సమయంలో యస్ బ్యాంకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటి నుంచి మంచి పురోగతే చూపించింది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. ‘ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్’ పేరుతో రజనీష్‌కుమార్ తాను రచించిన పుస్తకంలోనూ యస్ బ్యాంకుకు సంబంధించి నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు. యస్ బ్యాంకును చివరి క్షణంలో ఆదుకునేందుకు ఎస్బీఐ విముఖంగా ఉన్నప్పటికీ.. నాటి పరిస్థితుల్లో తప్పలేదని పేర్కొన్నారు. ‘‘ఆరు బ్యాంకులను (ఐదు అనుబంధ బ్యాంకులు సహా) ఎస్బీఐలో విలీనం చేసుకున్న అనంతరం మరో బ్యాంకును ఆదుకునే పరిస్థితి ఎస్బీఐకి రాదనుకున్నాను. ఎస్బీఐ అంతకుముందు చివరిగా 1995లో కాశినాథ్ సేత్ బ్యాంకును ఆదుకుంది’’ అని రజనీష్ తెలిపారు. ఆ విషయంలో ఒత్తిడి వచ్చింది.. ‘‘యస్ బ్యాంకులో పెట్టుబడులకు సంబంధించి ఇతర ఇన్వెస్టర్లను 2020 మార్చి 13 నాటికి గుర్తించే విషయమై నాడు నాపై ఒత్తిడి ఉంది. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు విఫలమైతే అది దేశ ఆరి్థక వ్యవస్థపై ప్రభావానికి దారితీయకుండా ఆర్బీఐ నుంచి ఒత్తిడి వచి్చంది’’ అని రజనీష్ నాటి సంక్షోభానికి సంబంధించి తాను ఎదుర్కొన్న అనుభవాలను తన పుస్తకంలో బయటపెట్టారు. 2020 మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడం తెలిసిందే. మొదట ఒక్కో ఖాతాదారు రూ.50,000 వరకు ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. మార్చి 13 నాటికి యస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళికను ఆర్బీఐ ప్రకటించి, 18 నుంచి మారటోరియంను ఎత్తివేసింది. నాటి ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంకులో ఎస్బీఐ తన పెట్టుబడులను మొదటి మూడేళ్లలో 26 శాతానికంటే దిగువకు తగ్గించుకోకూడదు. ఇతర ఇన్వెస్టర్లు, అప్పటికే వాటాలు కలిగి ఉన్న వారు తమ వాటాల్లో 75 శాతాన్ని మూడేళ్లపాటు విక్రయించుకోకుండా లాకిన్ విధించారు. 100 షేర్లలోపు ఉన్న వారికి మాత్రం మినహాయింపునిచ్చారు. ‘‘నాడు ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంకులు సైతం పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. చివర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంకు తరఫున వీ వైద్యనాథన్ సైతం రూ.150 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. కానీ, అప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంది. దాంతో బంధన్ బ్యాంకు ఘోష్‌కు కాల్ చేయగా.. మరో రూ.250కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించారు. చాలా స్వల్ప వ్యవధిలోనే యస్‌బ్యాంకును విజయవంతంగా ఒడ్డెక్కించడం అన్నది ప్రభుత్వం, ఆర్బీఐ చక్కని సమన్వయానికి నిదర్శనం’’ అన్నారు. -
ఓవైపు కేసులు.. మరోవైపు మనవడికి 40 కోట్ల కానుక
బిందు రాణా కపూర్.. యస్ బ్యాంక్ ఫౌండర్, మాజీ ఎండీ రానా కపూర్ భార్య. అక్రమ ధనార్జన కేసు విచారణలో భర్తతోపాటు బిందూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్‌బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆమె తన తొమ్మిదేళ్ల మనవడికి పుట్టినరోజు కానుకగా 40 కోట్ల విలువైన ఆస్తుల్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని పోష్ ఏరియా జోర్‌బాగ్‌లో తన పేరిట ఉన్న ఆస్తిని.. మనవడు ఆశివ్ ఖన్నా పేరిట రాసింది బిందు రాణా కపూర్. ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ విలువ 40 నుంచి 44 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆస్తి.. ఆమె తన తండ్రి నుంచి 2004 లో పొందినట్లు డాక్యుమెంట్లలో ఉంది. జప్కీ డాట్‌కామ్ ద్వారా డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. జులై 31న ఆస్తి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన 36 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు జరిగిందని.. ఆ ఆస్తికి బిందూ కూతురు, ఆశివ్ ఖన్నా తల్లి రాధా కపూర్ గార్డియన్‌గా నియమించినట్లు ఆ చెల్లింపుల్లో ఉంది. ఇది చదవండి: యస్ బ్యాంక్ నష్టం, ఎన్ని కోట్లంటే.. గతేడాది జులైలో యస్ బ్యాంక్ మోసాలు.. మనీలాండరింగ్ కేసులో రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఎటాచ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో లండన్‌లోని రాణా కపూర్‌కు చెందిన 127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కూడా ఈ మధ్యే ఎటాచ్ చేసింది. ఇక పోయినవారం రానా కపూర్‌ను వారం కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టును కోరిన విషయం తెలిసిందే. కపూర్, ఆయన భార్య బిందు, అవంత రియాలిటీ లిమిటెడ్ గౌతమ్ థారప్లు.. 685 కోట్ల ఆస్తుల్ని కేవలం 375 కోట్ల ఆస్తుల ట్రాన్జాక్షన్ చూపించడాన్ని ఇల్లీగల్‌గా పేర్కొంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. రాణా కపూర్‌తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై ప్రస్తుతం మనీలాండరింగ్ కేసు నడుస్తోంది. -
Yes Bank: యస్ బ్యాంక్ నష్టం 3,790 కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఏకంగా రూ. 3,790 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. ఆదాయం క్షీణించడం, మొండిబాకీలకు ప్రొవిజనింగ్ భారీగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,665 కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను యస్ బ్యాంక్ నికర నష్టాలు రూ. 16,432 కోట్ల నుంచి రూ. 3,488 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పునర్వ్యవస్థీకరించే అవకాశమున్న రుణాల కోసం కూడా ముందుగా ప్రొవిజనింగ్ చేసినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో మొండిబాకీలకు ప్రొవిజనింగ్ రూ. 5,239 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 4,872 కోట్లుగా ఉంది. మరో రూ.5,000 కోట్ల రికవరీ లక్ష్యం..: అసెట్ క్వాలిటీపరమైన సమస్యలు ఇక ముగిసినట్లేనని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కనీసం రూ. 5,000 కోట్లు రికవరీ చేయాలని నిర్దేశించుకున్నట్లు కుమార్ వివరించారు. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోను 15% పెంచుకోవాలని, రిటైల్ రుణాలను 20% పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో రిటైల్, చిన్న రుణాల వాటా 51% దాకా ఉంది. క్రమంగా మళ్లీ కార్పొరేట్ రుణాలను ఇవ్వనున్నట్లు, ఈ విభాగంలో 10% వృద్ధి అంచనా వేస్తున్నట్లు కుమార్ తెలిపారు. మార్చి క్వార్టర్లో రూ. 3,500 కోట్ల కొత్త రుణాలిచ్చినట్లు పేర్కొన్నారు. అటు స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం 16.80% నుంచి 15.41%కి తగ్గాయి. జూన్ క్వార్టర్లో రూ. 2,500 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నట్లు.. వీటిలో సింహభాగం కార్పొరేట్ విభాగానివే ఉండొచ్చని కుమార్ తెలిపారు. -
అంబానీ కీలక నిర్ణయం: షేరు జంప్
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని విక్రయించారు. ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు. బ్యాంక్‌కి బకాయి పడిన కోట్ల రూపాయల అప్పుని తీర్చేందుకు ముంబైలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్‌ను ’ను విక్రయించారు.ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం ఎగియడం విశేషం. రిలయన్స్ ఇన్ఫ్రా మార్కెట్ సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది. యస్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ లావాదేవీ విలువ రూ .1200 కోట్లు అని తెలిపింది. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్‌ని తన కార్పోరేట్ హెడ్‌క్వార్డర్స్‌గా మార్చుకోనుంది. కాగా 2021 జనవరిలోనే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ (3,600 కోట్ల రూపాయలకు) పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ (900 కోట్ల రూపాయల) అమ్మిన సంగతి తెలిసిందే. (పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు!) చదవండి : కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా? -
రాణా కపూర్ రూ.127 కోట్ల ఫ్లాట్... ఈడీ జప్తు
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసు విచారణలో భాగంగా యస్‌బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు శుక్రవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లండన్‌లో ఉన్న రూ.127 కోట్లు (13.5 మిలియన్ పౌండ్లు) విలువచేసే ఫ్లాట్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మరోవైపు పలు కీలక లావాదేవీల విషయాన్ని వెల్లడించనందుకుగాను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రాణా కపూర్‌కు రూ.కోటి జరిమానా విధించింది. ఈడీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లండన్, 77 సౌత్ ఆడ్లీలో అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ ఉంది. డీఓఐటీ క్రియేషన్స్ జర్సీ లిమిటెడ్ పేరుతో 2017లో రూ.93 కోట్లకు (9.9 మిలియన్ పౌండ్లు) రాణా కపూర్ ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్‌బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. దీని ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. రాణా కపూర్‌తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై మనీలాండరింగ్ కేసు నమోదయ్యింది. ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.2,011 కోట్లు. సెబీ జరిమానా ఎందుకంటే..: రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ (ఇప్పుడు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్) నుంచి యస్‌బ్యాంక్ అన్‌లిస్టెడ్ ప్రమోటర్ సంస్థ అయిన మోర్గాన్ క్రెడిట్స్ రూ.950 కోట్లను సమీకరించింది. 2018లో అన్‌లిస్టెడ్ జీరో కూపన్ నాన్–కన్వెర్టబుల్ డిబెంచర్ల ద్వారా ఈ నిధుల సమీకరణ జరిగింది. యస్‌బ్యాంక్ ప్రమోటర్ కూడా అయిన కపూర్, గ్యారంటార్‌గా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే ఈ లావాదేవీకి సంబంధించి పూర్తి వివరాలు బ్యాంక్ డైరెక్టర్లకు తెలియజేయలేదు. ఈ వ్యవహారం మార్కెట్ క్యాపిటలైజేషన్కు సంబంధించి యస్‌బ్యాంక్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. నంజున్‌దయా ఆయన కుటుంబ సభ్యుల రూ.255.17 కోట్ల ఆస్తులపైనా కొరడా... కాగా, ఇన్వెస్టర్లను భారీగా మోసం చేసిన కేసులో కన్వా గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడు ఎన్ నంజున్‌దయా ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.255.17 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం విడుదల చేసిన మరో ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలోని స్థిరాస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. బెంగళూరులోని కార్పొరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ తాజా చర్యలు తీసుకుంది. శ్రీ కన్వా సౌహార్థ సహకార క్రెడిట్ లిమిటెడ్ ద్వారా అధిక వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి రూ.650 కోట్లు వసూళ్లు జరిపారని, ఈ విషయంలో నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఆగస్టు 25న నంజున్‌దయా అరెస్టయ్యారు. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిందితుడు రూ.120 కోట్ల రుణాలను పొందినట్లు కూడా కేసు నమోదయ్యింది. -
యస్ బ్యాంక్: 900 కోట్లను అటాచ్ చేసిన ఈడీ..
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ స్కామ్‌లో దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అటాచ్ చేసింది. ముంబైలోని రూ.127కోట్ల విలువైన ఇల్లును ఈడీ అటాచ్ చేసింది. మొత్తం రూ.900 కోట్ల విలువైన ఆస్తులును ఈడీ అధికారులు అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దర్యాప్తు అధికారులు ఇటీవల రాణా కపూర్‌తో సహా డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఈడీ రూ.2,203 కోట్ల రూపాయలని అటాచ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో రాణి కపూర్‌కు విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని పేర్కొంది. (చదవండి: ఓ మై గాడ్... వెంకన్న రక్షించాడు) -
యస్ బ్యాంకు స్కాం: వాధవాన్ సోదరులకు బెయిల్
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో వాధవాన్ సోదరులకు బెయిల్ లభించింది. కోట్ల రూపాయల మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లకు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 60 రోజుల వ్యవధిలో చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనపై జస్టిస్ భారతి డాంగ్రే సానుకూలంగా స్పందించారు. అయితే ఒక్కొక్కరూ లక్ష రూపాయలు సెక్యూరిటీగా జమ చేయడంతోపాటు పాస్‌పోర్టులను అప్పగించాలని వీరిద్దరిని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై వీరిని మే 14 న ఈడీ అరెస్టు చేసింది. అయితే జూలై 15 న వాధవన్స్, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్, అతని భార్య బిందు కపూర్, కుమార్తెలు రోష్ని, రేఖ, వారి చార్టర్డ్ అకౌంటెంట్ దులరేష్ కె జైన్‌తో పాటు సహచరులపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. 'క్విడ్ ప్రో క్వో' కు సంబంధించి సీబీఐ 2020 మార్చి 7న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత ఈడీ ఈ కేసులో విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో వీరిద్దరూ జైలులో ఉండాల్సి ఉంటుంది. -
దిలీప్ బిల్డ్‌కాన్- యస్ బ్యాంక్.. భల్లేభల్లే
వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 192 పాయింట్లు పెరిగి 38,721కు చేరగా.. 47 పాయింట్లు బలపడిన నిఫ్టీ 11,432 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ దిలీప్ బిల్డ్‌కాన్, ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. దిలీప్ బిల్డ్‌కాన్ పీఎస్‌యూ.. రైల్ వికాస్ నిగమ్ నుంచి ఉత్తరాఖండ్‌లో ప్రాజెక్టును గెలుపొందినట్లు దిలీప్ బిల్డ్‌కాన్ తాజాగా పేర్కొంది. రూ. 1335 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టులో భాగంగా రిషీకేష్- కరణ్ప్రయాగ్ల మధ్య 125 కిలోమీటర్ల పరిధిలో సొరంగాలు, బ్రిడ్జిల నిర్మాణంసహా వివిధ పనులు చేపట్టవలసి ఉన్నట్లు వెల్లడించింది. 50 నెలల్లో పూర్తి చేయవలసిన ఈ ఆర్డర్‌ను హెచ్సీసీతో ఏర్పాటు చేసిన జేవీ ద్వారా సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దిలీప్ బిల్డ్‌కాన్ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 409 వద్ద ట్రేడవుతోంది. యస్ బ్యాంక్ ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందిన రూ. 50,000 కోట్లలో రూ. 35,000 కోట్లను తిరిగి చెల్లించినట్లు యస్ బ్యాంక్ చైర్మన్ సునీల్ మెహతా తాజాగా వెల్లడించారు. మధ్యంతర మద్దతుకింద ఎస్ఎల్ఎఫ్ ద్వారా పొందిన నిధుల్లో రూ. 35,000 కోట్లను తాజాగా తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని సైతం ఆర్బీఐ విధించిన గడువులోగా చెల్లించివేయనున్నట్లు వివరించారు. పునర్వ్యవస్థీకరణ తదుపరి ఎఫ్‌పీవో ద్వారా రూ. 15,000 కోట్లను విజయవంతంగా సమీకరించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 16 సమీపంలో ఫ్రీజయ్యింది. గత రెండు వారాల్లో ఈ షేరు 30 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
యస్ బ్యాంకు స్వాధీనంలోకి అనిల్ అంబానీ కార్యాలయం
ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. బ్యాంకుకు రూ.2,892 కోట్లు బాకీ పడడమే ఇందుకు కారణం. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌లోని (అడాగ్) దాదాపు అన్ని ప్రధాన కంపెనీల కార్యకలాపాలు ఈ రిలయన్స్ సెంటర్ నుంచే సాగుతున్నాయి. బాకీలను చెల్లించేందుకై 21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ ఆఫీసును లీజుకు ఇవ్వాలని కంపెనీ గతేడాది ప్రయత్నించింది. రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన రెండు ఫ్లాట్స్‌ను సైతం యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. -
రిలయన్స్ ఇన్ఫ్రాకు యస్ బ్యాంక్ నోటీసులు
రుణాల రికవరీ బాటలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీన పరచుకునేందుకు వీలుగా యస్ బ్యాంక్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని శాంతాక్రజ్‌లోగల ప్రధాన కార్యాలయంతోపాటు.. మరో ఇతర రెండు ఆఫీసులను దాఖలు పరచమంటూ నోటీసులు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 2892 కోట్ల రుణాల రికవరీ కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు యస్ బ్యాంక్ నోటీసులో పేర్కొంది. వీటిలో భాగంగా నాగిన్ మహల్‌లోని రెండు ఫ్లోర్లను యస్ బ్యాంక్ సొంతం చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొండిబకాయిల సమస్యలతో కొద్ది రోజులక్రితం యస్ బ్యాంక్ దివాళా పరిస్థితికి చేరిన విషయం విదితమే. తదుపరి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా యస్ బ్యాంకులో మెజారిటీ వాటాను పొందింది. తద్వారా యస్ బ్యాంక్ కార్యకలాపాలను ఎస్బీఐ తిరిగి గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. అనిల్ అంబానీ గ్రూప్‌నకు యస్ బ్యాంక్ సుమారు రూ. 12,000 కోట్ల రుణాలు అందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాయి. బీఎస్ఈఎస్ నుంచి శాంతాక్రజ్‌లోని ప్రధాన కార్యాలయాన్ని బీఎస్ఈఎస్ నుంచి రెండు దశాబ్దాల క్రితం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొంతం చేసుకుంది. బీఎస్‌ఈఎస్‌ను అనిల్ గ్రూప్ కొనుగోలు చేశాక రిలయన్స్ ఎనర్జీగా మార్పుచేసి తదుపరి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విలీనం చేసినట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. 2018లో ముంబైలోని ప్రధాన కార్యాలయానికి అనిల్ అంబానీ గ్రూప్ తరలివెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. గ్రూప్‌లోని ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించిన రిలయన్స్ క్యాపిటల్, హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. జనరల్ ఇన్సూరెన్స్ తదితర వివిధ విభాగాలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఇటీవల పలు కార్యాలయాలను ఏకంచేయడం ద్వారా కార్యకలాపాలను నార్త్ వింగ్‌లో కన్సాలిడేట్ చేసినట్లు మీడియా పేర్కొంది. కాగా.. మే 5న రుణాలను చెల్లించమంటూ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రెండు నెలల గడువుతో యస్ బ్యాంక్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ రుణ చెల్లింపులను చేపట్టకపోవడంతో ఆస్తులను సొంతం చేసుకునే సన్నాహాలు యస్ బ్యాంక్ చేస్తున్నట్లు మీడియా తెలియజేసింది. -
ఆగని యస్‌బ్యాంక్ పతనం
యస్‌బ్యాంక్ షేరు పతనం ఆగట్లేదు. గత కొన్నిరోజుల వరుస పతనాన్ని కొనసాగిస్తూ మంగళవారం మరో 3శాతం నష్టపోయింది. ఈ క్రమంలో ఇటీవల బ్యాంక్ జారీ చేసిన ఫాలో ఆన్ పబ్లిక్(ఎఫ్ఓపీ)ఆఫర్ ఇష్యూ ధర రూ.12 కంటే దిగువకు చేరుకుంది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు 9.75శాతం నష్టంతో రూ.11.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు మార్కెట్ ముగిసే సరికి రూ.3.25శాతం నష్టంతో రూ.11.95వద్ద స్థిరపడింది. యస్‌బ్యాంక్ షేరు వారం రోజుల్లో 41శాతం, నెలలో 57శాతం, ఏడాదిలో 75శాతం నష్టాన్ని చవిచూశాయి. యస్‌బ్యాంక్‌లో తగ్గిన ఎస్బీఐ వాటా యస్‌బ్యాంక్ ఎఫ్‌పీఓ ఇష్యూ తర్వాత బ్యాంక్‌లో తమ వాటా తగ్గినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. యస్ బ్యాంక్ ఫాలోఆన్పబ్లిక్ ఆఫర్ ఇష్యూ ఈ జూలై 17న ముగిసింది. ఈ ఇష్యూ ద్వారా బ్యాంక్ మొత్తం రూ.15వేల కోట్లను సమీకరించింది. ఈ ఇష్యూలో జారీ చేయబడిన షేరు ఈ సోమవారం నుంచి ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐ వాటా మొత్తం వాటా 48.21శాతం నుంచి 30శాతానికి పరిమితమైంది. -
యస్‌బ్యాంక్ షేరు 20శాతం క్రాష్..!
ప్రైవేట్ రంగ దిగ్గజం యస్‌బ్యాంక్ షేరు గురువారం ట్రేడింగ్‌లో 20శాతం నష్టపోయింది. ఈ షేరుకు ఇది వరుసగా 4రోజూ నష్టాల ట్రేడింగ్ కావడం విశేషం. మార్కెట్ ప్రారంభం నుంచే ఈ షేరు కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో 20శాతంనష్టంతో రూ.14.60 వద్ద ప్రారంభమైంది. ఏకంగా 20శాతం నష్టంతో షేరు లోయర్ సర్కూ్యట్ వద్ద ఫ్రిజ్ అయ్యింది. అనంతరం రిలీజైన్ షేరుకు ఎలాంటి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఇటీవల యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) పద్దతిలో రూ.15,000 కోట్లు సమీకరించిన్పటి నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. నిధుల సమీకరణపై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ సానుకూల వ్యాఖ్యాలు షేరు పతనాన్ని ఆపలేకపోయాయి. నిధుల విజయవంతం కావడంతో బ్యాంకు క్రిడెట్ రేటింగ్ మరింత మెరుగుపడుతుందని, రుణదాతల డిఫాల్ట్ నష్టాలను తగ్గిస్తుందని మూడీస్ రేటింగ్ తన నివేదికలో పేర్కోంది. మిడ్‌సెషన్ సమయానికి యస్‌బ్యాంక్ షేరు 15శాతం నష్టంతో రూ.15.50 వద్ద ట్రేడ్ అవుతోంది. గడచిన 2వారాల్లో షేరు 45శాతం నష్టాన్నిచవిచూసింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.5.55, రూ.98.65గా ఉన్నాయి. -
ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ వారంలో 3 ఇష్యూలు
ఈ వారం మూడు ఇష్యూలతో ప్రైమరీ, సెండరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. నేటి నుంచి స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 423-425కాగా.. ఇష్యూ బుధవారం(15న) ముగియనుంది. తద్వారా రూ. 496 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇక మంగళవారం(14) నుంచి భారత్ బాండ్ ఈటీఎఫ్ రెండో దశ మొదలుకానుంది. పీఎస్‌యూ కంపెనీల బాండ్లలో ప్రధానంగా పెట్టుబడులుంటాయి. ప్రభుత్వం తరఫున ఎడిల్వీజ్ మ్యూచువల్ ఫండ్ వీటిని చేపడుతోంది. 17న ముగియనున్న ఇష్యూ ద్వారా కనిష్టంగా(బేస్ పరిమాణం) రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రూ. 11,000 కోట్లవరకూ గ్రీన్‌షూ ఆప్షన్ ఉంది. అంటే ఇష్యూకి అధిక స్పందన వస్తే.. ఇందుకు వీలుగా యూనిట్లను విక్రయించనుంది. ఇంతక్రితం 2019 డిసెంబర్లో తొలిసారి ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. ఇక మరోవైపు ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ 15న ప్రారంభమై 17న ముగియనుంది. యస్ బ్యాంక్ షేరు పతనం మార్కెట్ ధరతో పోలిస్తే ఎఫ్‌పీవోకు యస్ బ్యాంక్ షేరుకి రూ. 12 ధరను నిర్ణయించింది. ఇది 55 శాతం తక్కువకావడంతో వరుసగా రెండో రోజు యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ వారం మార్కెట్లలో ఇన్వెస్టర్లకు లభిస్తున్న పెట్టుబడి మార్గాలు మూడూ విభిన్నమైనవని విశ్లేషకులు చెబుతున్నారు. రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకాగా.. భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు స్థిరపెట్టుబడి మార్గమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధర ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్ కార్యకలాపాలపట్ల కొంతమేర ఆందోళనలున్నట్లు తెలియజేశారు. భారత్ బాండ్ భేష్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఆప్షన్లలోనూ ఒక పెట్టుబడి మార్గాన్నే ఎంచుకోవలసి వస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్ మేలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణిస్తే..దీర్ఘకాలిక దృష్టితో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం లాభించగలదని రెలిగేర్ బ్రోకింగ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొంటున్నారు. వీటిలో పెట్టుబడులపై రిటర్నులను అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. తొలి దశలో వచ్చిన బాండ్లు వార్షికంగా 14-18 శాతం రిటర్నులను అందించినట్లు తెలియజేశారు. దీనికితోడు భారత్ బాండ్ ఈటీఎఫ్నకు ఉత్తమ క్రెడిట్ రేటింగ్ ఉన్నట్లు తెలియజేశారు. రుణ మార్కెట్లో పెట్టుబడులకు ఇవి వీలుకల్పిస్తున్నట్లు వివరించారు. ప్రీమియంలో.. పలు ప్రొడక్టులతో పటిష్ట పోర్ట్‌ఫోలియోను కలిగిన రోజారీ బయోటెక్ డైవర్సిఫైడ్ కంపెనీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. అయితే ప్రీమియం ధరలో కంపెనీ ఐపీవో చేపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో తొలి రెండు రోజులూ ఇష్యూకి స్పందన ఎలా ఉందన్న అంశాన్ని గమనించడం మేలు చేయగలదని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. తద్వారా ఇష్యూకి కనిపిస్తున్న డిమాండ్ ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇక యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. గత సమస్యలు బ్యాంక్‌కు భవిష్యత్‌లో సవాళ్లు విసరవచ్చన్న ఆందోళనలున్నట్లు తెలియజేశారు. ఇదే అభిప్రాయాన్ని పిక్రైట్ టెక్నాలజీస్ కీలక వ్యూహాల అధికారి(సీఎస్‌వో) సిద్ధార్ధ్ పంజ్వానీ కూడా వ్యక్తం చేశారు. ఇక ప్రత్యర్ధి సంస్థలు వినతీ, అతుల్, ఫైన్ ఆర్గానిక్స్‌తో పోలిస్తే ఐపీవో ద్వారా రోజారీ బయోటెక్ కొంతమేర ప్రీమియంను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆదాయం, నికర లాభాల్లో వృద్ధిరీత్యా ఇది కొంతమేర సమంజసమేనని అభిప్రాయపడ్డారు. భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు అంటే బాండ్లలో ఇన్వెస్ట్ చేయడమేనని.. ఒకస్థాయి దాటి రిటర్నులు అందుకునే వీలుండదని వివరించారు. రిస్క్ తక్కువ పెట్టుబడులుగా వీటిని భావించవచ్చని తెలియజేశారు. దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే శామ్కో సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ నిపుణులు నీరాలీ షా సైతం వెల్లడించడం గమనార్హం! అధిక రిస్క్‌ను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రిటర్నులు ఆశించే ఇన్వెస్టర్లు రోజారీ బయోటెక్ లేదా.. యస్ బ్యాంక్ ఇష్యూవైపు దృష్టిసారించవచ్చని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యస్ బ్యాంక్ కౌంటర్ భవిష్యత్‌లో పలు ఆటుపోట్లను చవిచూసే వీలున్నదని భావిస్తున్నారు. -
రాణా కపూర్‌కు ఈడీ భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: యస్ బ్యాంకు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్ , ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. వీటి విలువ 2,203 కోట్ల రూపాయలని గురువారం అధికారులు ప్రకటించారు. ఇందులో రాణా కపూర్ విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలిపారు. (యస్ బ్యాంక్ కేసు : వాధవాన్ సోదరుల అరెస్ట్) మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్ఏ)చట్టం ప్రకారం ముంబైలోని పెద్దార్ రోడ్లో ఉన్న ఒక బంగ్లా, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్ వద్ద ఉన్న 48 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటితోపాటు న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్‌లో రెండు కమర్షియల్ ప్రాపర్టీస్‌తోపాటు ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. కాగా యస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి రాణా కపూర్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులను నమోదు చేశాయి. కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులు 4,300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది. రాణా కపూర్ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. మార్చిలో అరెస్టు అయిన కపూర్, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
యస్ బ్యాంకు కుంభకోణం : ఈడీ దాడులు
సాక్షి, ముంబై : యస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు సోమవారం భారీ తనిఖీలు నిర్వహించారు. మనీలాండరింగ్ ఆరోపణల కేసులో దర్యాప్తునకు సంబంధించి ముంబైలోని గ్లోబల్ టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ కు సంబంధమున్న ఐదు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. ఈ సంగతిని ధృవీకరించిన సీనియర్ అధికారి దాడులు కొనసాగుతున్నాయనీ చెప్పారు. కాక్స్ అండ్ కింగ్స్ ప్రమోటర్ పీటర్ కెర్కర్‌కు మార్చిలోనే నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. (మరోసారి ఈడీ ముందుకు..) మాజీ యస్ బ్యాంక్ సీఈవో రవ్ నీత్ గిల్‌ను ఉటంకిస్తూ కాక్స్ అండ్ కింగ్స్, అడాగ్ గ్రూప్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్సెల్ గ్రూప్, కాక్స్ అండ్ కింగ్స్, ఓంకార్ గ్రూప్, రేడియస్ డెవలపర్, సహానా డెవలపర్స్, అవంత గ్రూప్ వంటి సంస్థల రుణాలతో భారీ ఒత్తిడి పెరిగిందని ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్లో ఈడీ వెల్లడించింది. 2019 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి స్వల్పకాలిక స్లిప్పేజీలకు గురయ్యే ఖాతాదారుల పేర్లతో క్రెడిట్ వాచ్ జాబితాను బ్యాంక్ వెల్లడించినట్టు ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. డీహెచ్ఎఫ్ఎల్ తరువాత సుమారు 2,267 కోట్ల రూపాయల రుణాలతో కాక్స్ అండ్ కింగ్స్ రెండవ రుణ గ్రహీతగా ఉన్న సంగతి తెలిసిందే. (యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు) కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద బ్యాంక్ మాజీ సీఎండీ రానా కపూర్, భార్య, కుమార్తెలు రాఖీ, రోష్ని పై ఇప్పటికే ఈడీ కేసులు నమోదు చేసింది. వీరితోపాటు కుంభకోణంతో సంబంధముందన్న ఆరోపణలతో మోర్గాన్ క్రెడిట్స్, రాబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, యెస్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేర్లను కూడా చార్జిషీట్ లో చేర్చింది. (వాధవాన్ సోదరుల అరెస్ట్) -
ఉద్యోగుల వేతనాల్లో యస్ బ్యాంక్ మార్పులు
ముంబై: కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాలలో కోతలు విధిస్తున్నాయి. తాజాగా ప్రయివేట్ దిగ్గజ బ్యాంక్(యెస్ బ్యాంక్) ఉద్యోగుల వేతనాల్లో మార్పులను చేస్తున్నట్లు తెలిపింది. సీనియర్ ఉద్యోగులకు వేతన మార్పు వర్తిస్తుందని తెలిపింది. ఉద్యోగుల వార్షిక వేతనంలో మూడో వంతు వాటాను వేరిమబుల్ పేకు చేర్చినట్లు ప్రకటించింది. 2020-21 సంవత్సరం సీనియర్ ఉద్యోగులకు 30 శాతం వాటా మార్పు వర్తిస్తుందని పేర్కొంది. సాధారణంగా సంస్థ వృద్ధి సాధించినప్పుడు ఉద్యోగులకు ఇచ్చే మొత్తాన్ని వేరియబుల్ పే అంటారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కంపెనీ వృద్ధి చెందడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న నూతన సంస్కరణలను అధ్యయనం చేస్తున్నామని.. ప్రజలకు మరింత సులభతరంగా సేవలందించేందుకు నూతన సాంకేతికతను అధ్యయనం చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: ఆస్తుల అమ్మకానికి రాణా స్కెచ్.. -
యస్ బ్యాంక్ కేసు : వాధవాన్ సోదరుల అరెస్ట్
ముంబై : యస్ బ్యాంక్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవాన్, ధీరజ్ వాధవాన్లను ఈడీ గురువారం అరెస్ట్ చేసింది. వీరిని మనీల్యాండరింగ్ నిరోధక (పీఎంఎల్ఏ) న్యాయస్ధానం ఎదుట హాజరుపరచగా కోర్టు పదిరోజుల కస్టడీకి తరలించింది. యస్ బ్యాంక్ కేసులో ఏప్రిల్ 26న మహాబలేశ్వర్‌లో వాధవాన్ సోదరులను సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు మరో 12 మందితో కలిసి ఖండాలా నుంచి మహాబలేశ్వర్కు ప్రయాణించడం కలకలం రేపింది. లాక్డౌన్ ఉల్లంఘనల కింద వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్లో ఉంచిన అనంతరం సీబీఐ వారిని కస్టడీలోకి తీసుకుంది. ఇక వాధవాన్ సోదరులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు యస్ బ్యాంక్ కేసులో ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. చదవండి : యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం -
30న ఈడీ ముందుకు అనిల్ అంబానీ..
సాక్షి, న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ రుణాల వ్యవహారంలో గురువారం ఈడీ ఎదుట హాజరైన రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ ఈనెల 30న మరోసారి దర్యాప్తు అధికారుల ఎదుట హాజరుకానున్నారు. యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ సంస్ధలు భారీగా రుణాలు పొందిన క్రమంలో వీటిపై ఈడీ అధికారులు మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆయనను మరోసారి ప్రశ్నించనున్నారు. మార్చి 30న మరోసారి తమ ఎదుట హాజరు కావాలని అనిల్ అంబానీని ఈడీ కోరింది. యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌పై దాఖలైన మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అంబానీని ఈడీ గురువారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించి కీలకమైన పలు వివరాలను అంబానీ నుంచి ఈడీ అధికారులు రాబట్టారు. అనిల్ అంబానీకి చెందిన అడాగ్ యస్ బ్యాంక్ నుంచి రూ 13,000 కోట్ల రుణాలను రాబట్టింది. విచారణలో భాగంగా యస్ బ్యాంక్ నుంచి పొందిన రుణాలను గ్రూప్ కంపెనీలు ఖర్చు చేసిన తీరు, యస్ బ్యాంక్‌తో అడాగ్ ఒప్పందం గురించి ఈడీ అధికారులు అంబానీని ప్రశ్నించారు. కాగా, రాణాకపూర్, ఆయన భార్య, కుమార్తెలు లేదా వారి కంపెనీల్లో రిలయన్స్ గ్రూప్ ఎలాంటి చెల్లింపులూ జరపలేదని అంబానీ స్పష్టం చేసినట్టు సమాచారం. చదవండి : యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు -
యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు
న్యూఢిల్లీ: మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిపై యస్ బ్యాంక్ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్బీఐ ఇదే తరహా రుణ సదుపాయం కల్పించింది. అటుపై 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. అప్పట్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా విత్‌డ్రాయల్స్ కన్నా డిపాజిట్లే అధికంగా ఉన్నాయని, యస్ బ్యాంక్ ఇప్పటిదాకానైతే రుణ సదుపాయం వినియోగించుకోలేదని .. అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ మరోసారి భరోసానిచ్చారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బైటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణ వితరణలో లొసుగులు, మొండిబాకీలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై మార్చి 5న ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్ బ్యాంక్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. పూరి జగన్నాథుని డిపాజిట్లు ఎస్బీఐలోకి మళ్లింపు.. పూరి జగన్నాథస్వామి ఆలయానికి చెందిన రూ. 389 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాను ఎస్బీఐకి బదలాయించినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. ఈ ఎఫ్డీపై రూ. 8.23 కోట్ల మేర వడ్డీ జమైనట్లు వివరించింది. మరో రూ. 156 కోట్ల రెండు ఎఫ్డీలను ఈ నెలాఖరులోగా బదలాయించనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్‌కు యస్ బ్యాంక్ లేఖ రాసింది. ఈడీ విచారణకు అనిల్ అంబానీ.. యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ తదితరులపై మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినట్లు. ఈ నెల 30న మరోసారి హాజరు కావాలని సూచించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ. 12,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. బడా కార్పొరేట్లకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,300 కోట్ల పైగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రకు ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. -
యస్ బ్యాంక్: ఈడీ విచారణకు అనిల్ అంబానీ
మొంబై: యస్ బ్యాంక్ సంబంధించిన కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరెట్) ఎదుట మొంబైలో విచారణకు హాజరయ్యారు. అనిల్ అంబానీకి చెందిన 9 కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ.12,800 కోట్లు రుణాలు పొందాయి. అయితే కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయని ఈడీ పేర్కొంది. ఇప్పటికే యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మణీ లాండరింగ్ కేసులో అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. నిరర్థక ఆస్తులు ఎక్కువైన కారణంగానే యస్ బ్యాంక్ సంక్షోభంలోకి వెళ్లిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: అయ్యో.. అ‘నిల్’! -
యస్పై మారటోరియం ఎత్తివేత
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే శాఖలు తెరుచుకుంటాయి. సీనియర్ సిటిజన్ ఖాతాదారుల కోసం మార్చి 19 నుంచి 27 దాకా సాయంత్రం 4.30 గం.ల నుంచి 5.30 గం.ల దాకా సేవలు అందిస్తాయి. అయితే, సేవలు పునరుద్ధరించిన కాస్సేపటికే మొబైల్ యాప్ క్రాష్ కావడం, వెబ్సైట్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో బ్యాŠంక్ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యలిక పడలేమని, తాము డిపాజిట్లను మరో బ్యాంకుకు మార్చేసుకుంటామని సూచిస్తూ పలువురు పోస్ట్ చేశారు. దీంతో ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి యస్ బ్యాంక్ క్షమాపణలు కోరింది. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని పేర్కొంది. మార్చి 5 నుంచి నెలరోజులపాటు యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించడం, ఈ వ్యవధిలో రూ. 50,000కు దాటకుండా విత్డ్రాయల్స్పై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎస్బీఐ సహా ఇతరత్రా బ్యాంకులు.. యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడంతో మారటోరియం తొలగింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై మనీ లాండరింగ్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలను ఇందుకు కారణంగా వారు చూపారు. ఇండస్ఇండ్ బ్యాంకు పటిష్టంగానే ఉంది బ్యాంకు యాజమాన్యం ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థికంగా బలమైన స్థితిలో, తగినన్ని నిధులతో, లాభాలతో, బలమైన నిర్వహణతో నడుస్తున్నట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. యస్ బ్యాంకు సంక్షోభం అనంతరం ఇండస్ఇండ్ బ్యాంకు ఆర్థిక సామర్థ్యంపై పెద్ద స్థాయిలో మార్కెట్ వదంతులు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2.18%గా ఉన్నాయని, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఇది తక్కువగా ఉందని తెలిపింది. ‘‘క్రితం త్రైమాసికం స్థాయిలోనే స్థూల ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలోనూ ఉండొచ్చు. అలాగే, క్రితం త్రైమాసికం నాటికి 1.05%ఉన్న నికర ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలో 1%లోపునకు తగ్గనున్నాయి’’ అని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఫిబ్రవరి నాటికి వాణిజ్య, నివాస రియల్టీ, జెమ్స్, జ్యుయలరీ రంగాలకు ఎక్స్పోజర్ లేదని స్పష్టం చేసింది. -
రాణా కపూర్‌పై కొత్తగా మరో కేసు..
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్యపై ఈడీ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. అవంతా రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు గాను .. వారు రూ. 307 కోట్ల మేర ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక బంగ్లాను మార్కెట్ రేటులో సగం ధరకే దక్కించుకోవడం ద్వారా వారు లబ్ధి పొందినట్లు ఈసీఐఆర్‌లో ఈడీ పేర్కొంది. మొండిబాకీల వసూలు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించినందుకు గాను కొన్ని బడా కార్పొరేట్ల నుంచి కపూర్‌కు ముడుపులు ముట్టాయంటూ ఈడీ ఇప్పటికే ఒక కేసు నమోదు చేసింది. ఈడీ విచారణకు హాజరు కాని వాధ్వాన్ సోదరులు.. యస్ బ్యాంక్ ప్రమోటరు రాణా కపూర్‌పై మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినప్పటికీ.. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లయిన వాధ్వాన్ సోదరులు (కపిల్, ధీరజ్) మాత్రం హాజరు కాలేదు. దీంతో కొత్తగా సమన్లు జారీ చేయడంతో పాటు, మరో కేసులో కపిల్ వాధ్వాన్‌కి ఇచ్చిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ కోర్టును ఈడీ కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యస్ బ్యాంక్ నుంచి డీహెచ్ఎఫ్ఎల్ తీసుకున్న రూ. 3,700 కోట్లు ప్రస్తుతం మొండిబాకీలుగా మారాయి. కార్పొరేట్లకు యస్ బ్యాంకు నుంచి రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్ రూ. 4,300 కోట్ల మేర ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
నిధుల సమస్య నో!!
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నేటి సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనుంది. నిధులపరమైన సమస్యలేమీ లేవని, బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయని సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ప్రశాంత్ కుమార్ తెలిపారు. ‘అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకున్నాం. మా ఏటీఎంలలో పుష్కలంగా నగదు నిల్వలు ఉంచాం. అలాగే, శాఖలన్నింటికీ తగినంత స్థాయిలో నగదు సరఫరా ఉంది. కనుక.. బ్యాంక్‌కు సంబంధించి నిధులపరంగా ఎలాంటి సమస్యా లేదు. ఇతరత్రా బైటి నుంచి సమీకరించాల్సిన అవసరమైతే లేదు. కానీ ఒకవేళ అవసరమైనా కూడా తక్షణం తగినంత స్థాయిలో నిధులను సమకూర్చుకోగలిగే మార్గాలు ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం మారటోరియం ఎత్తివేశాక.. ఖాతాదారులు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో నిర్దిష్ట పరిమితి రూ. 50,000 స్థాయిలో విత్‌డ్రా చేసుకున్న వారి సంఖ్య.. మొత్తం ఖాతాదారుల్లో మూడో వంతు మాత్రమే ఉండవచ్చని కుమార్ చెప్పారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసిన ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ చీఫ్ అశుతోష్ ఖజూరియాతో పాటు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. 13 రోజుల్లోనే పరిష్కారం.. యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల తోడ్పాటుతో 13 రోజుల్లోనే సంక్షోభం పరిష్కారమైనట్లు కుమార్ చెప్పారు. యస్ బ్యాంక్‌ను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి 5న సుమారు నెల రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటరుగా ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. మరోవైపు, బ్యాంకులోకి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు తీసుకుంది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం ఎనిమిది బ్యాంకులు యస్ బ్యాంక్‌లో రూ. 10,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అత్యధికంగా రూ. 6,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రికవరీపై ఆశలు... ముందు జాగ్రత్త చర్యగా సందేహాస్పద ఖాతాలన్నింటినీ క్యూ3 ఆర్థిక ఫలితాల్లో పొందుపర్చినందున యస్ బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కుమార్ చెప్పారు. మొండిబాకీలకు సంబంధించి ప్రొవిజనింగ్‌ను 42 శాతం నుంచి పెంచి.. 72 శాతం పైగా చేశామని, మార్చి త్రైమాసికంలో రూ. 8,500–10,000 కోట్ల దాకా రికవరీలు అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. డిపాజిట్లు, రుణాల్లో 60 శాతం వాటాను రిటైల్ విభాగం నుంచి రాబట్టాలంటూ తమ సిబ్బందికి సూచించినట్లు ప్రశాంత్ తెలిపారు. యస్ బ్యాంక్‌కు ప్రస్తుతమున్న మొండిబాకీల్లో 90 శాతం పైగా బాకీలు డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో జతయినవే కావడం గమనార్హం. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 36,764 కోట్ల మేర మొండిబాకీలు పెరిగాయి. డిసెంబర్ క్వార్టర్లో స్థూల మొండిబాకీలు రూ. 40,709 కోట్లకు, ప్రొవిజనింగ్ రూ. 29,594 కోట్లకు పెరిగాయి. మరోవైపు, షేర్లపై లాకిన్ విధించడాన్ని సవాలు చేస్తూ రిటైల్ ఇన్వెస్టర్లు యస్ బ్యాంకు, ఆర్బీఐలపై కోర్టుకు వెళ్లనున్నారన్న వార్తలపై రజనీష్, ప్రశాంత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అలాగే ఇకపైనా పొదుపు ఖాతాలపై అధిక స్థాయిలో వడ్డీ చెల్లిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమివ్వకుండా దాటవేశారు. మరోపక్క, యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో 7.97% వాటా కొనుగోలు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ 7.97%, యాక్సిస్ 4.78 %, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.98 శాతం, ఫెడరల్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్ చెరి 2.39%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 1.99% వాటాలు కొనుగోలు చేశాయి. ఒక్క షేరూ విక్రయించం: రజనీష్ మూడేళ్ల లాకిన్ వ్యవధి పూర్తి కాకుండా యస్ బ్యాంకులో ఒక్క షేరు కూడా విక్రయించబోమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 42 శాతం వాటాలు తీసుకున్నామని, రెండో విడత ఫండింగ్‌లో దీన్ని 49 శాతానికి పెంచుకోనున్నామని ఆయన చెప్పారు. మూడో రోజూ షేరు జోరు... యస్ బ్యాంక్ షేర్ జోరు కొనసాగుతోంది. బ్యాంక్ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మూడీస్ అప్‌గ్రేడ్ చేయడంతో మంగళవారం యస్ బ్యాంక్ షేర్ 58% లాభంతో రూ.58.65కు చేరింది. ఇంట్రాడేలో 73% లాభంతో రూ.64కు ఎగసింది. 3 రోజుల్లో 134%లాభపడింది. -
‘యస్’ షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్‌పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్‌పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్‌ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్‌టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి. 19నే సూచీల నుంచి నిష్క్రమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్‌ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్ఎస్ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది. 18 నుంచి పూర్తి సేవలు: ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్‌డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్లకు ఈడీ సమన్లు.. యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు. యస్ బ్యాంక్ అప్‌గ్రేడ్ .. తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్‌ను సానుకూల అంచనాలతో అప్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. బోర్డు పునర్వ్యవస్థీకరణకు ఓకే .. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. -
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
ముంబై : యస్ బ్యాంక్ వ్యవహారంలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ కేసులో తమ ముందు హాజరు కావాలని అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ రూ 12,800 కోట్లు రుణాలు పొందింది. ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు. కాగా అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, వొడాఫోన్ తదితర కంపెనీలకు యస్ బ్యాంక్ ఇంచిన రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 6న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌లో పెట్టుబడులకు పలు ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలు ముందుకురావడంతో పునరుద్ధరణ ప్రణాళిక ఊపందుకుంది. యస్ బ్యాంక్ షేర్ సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో ఏకంగా 33 శాతం మేర పెరిగింది. చదవండి : అంబానీ వద్ద చిల్లి గవ్వ లేదా?! -
‘యస్’పై 18న మారటోరియం ఎత్తివేత
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు. మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. ‘ప్రణాళిక అమల్లోకి తెచ్చిన మూడో పని దినం సాయంత్రం 6 గం.లకు మారటోరియం తొలగిపోతుంది. ఆ పైన 7 రోజుల తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుంది’ అని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎన్పీఏల ఒత్తిడి కొనసాగుతుంది.. మొండిబాకీలు తీవ్రం కావడంతో భారీనష్టాలు ప్రకటించిన యస్ బ్యాంక్ .. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పరమైన ఒత్తిడి కొనసాగుతుందని పేర్కొంది. అయితే, కొత్తగా వచ్చే రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంక్ నిలదొక్కుకోగలదని, సమస్యలను అధిగమించగలదని ప్రశాంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేర్లకు మూడేళ్ల లాకిన్.. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49 శాతం దాకా వాటాలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వచ్చే మూడేళ్లలో తన వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోవడానికి వీల్లేదు. ఇతర ఇన్వెస్టర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల పెట్టుబడుల్లో 75 శాతం షేర్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తమ దగ్గరున్న మొత్తం షేర్లలో 25 శాతానికి మించి విక్రయించుకోవడానికి వీలు ఉండదు. అయితే, 100 లోపు షేర్లు ఉన్న వారికి ఈ లాకిన్ పీరియడ్ వర్తించదు. నోటిఫికేషన్ ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49% వాటాలు తీసుకునే ఎస్బీఐ.. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఒకరు లేదా అదనంగా మరింత మంది డైరెక్టర్లను నియమించవచ్చు. ఎస్బీఐ మినహా 15 శాతం వోటింగ్ హక్కులు ఉన్న ఇతర ఇన్వెస్టర్లు ఒక్కొక్క డైరెక్టరు చొప్పున యస్ బ్యాంక్ బోర్డుకు నామినేట్ చేయొచ్చు. పునరుదద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్ అధీకృత మూలధనం రూ. 6,200 కోట్లుగా ఉంటుంది. యస్ బ్యాంక్ ఉద్యోగులు గత జీతభత్యాలు, సర్వీస్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. అయితే ‘మేనేజ్మెంట్లో కీలక ఉద్యోగుల’ సేవలను కొత్త బోర్డు ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది. క్యూ3 నష్టాలు రూ.18,654 కోట్లు భారీగా పెరిగిన మొండి భారం ముంబై: కష్టాల్లో కూరుకుపోయిన యస్ బ్యాంక్ ను తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మరింత నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2019–20, క్యూ3)లో రూ.18,654 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,009 కోట్ల నికర లాభం నమోదైంది. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో కేటాయింపులు కూడా బాగా పెరగడం, డిపాజిట్లు తరిగిపోవడంతో నికర నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయి. కాగా ఈ ఏడాది క్యూ2లో నష్టాలు రూ.600 కోట్లు. స్థూల మొండి బాకీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.40,709 కోట్లకు(18.87 శాతం) ఎగిశాయి. నికర మొండి బకాయిలు 5.97 శాతానికి చేరాయి. -
యస్ బ్యాంకు : మరో రూ. 600 కోట్లు
సాక్షి, ముంబై: మూలధన సంక్షోభం పడిన యస్‌బ్యాంకునకు పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ఆర్బీఐ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. అంతేకాదు బ్యాంకునకు అందించే అధీకృత మూలధనాన్ని రూ. 6200 కోట్లకు పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుఎస్‌బీఐ 49 శాతం ఈక్విటీ కొనుగోలు ద్వారా రూ.7250 కోట్ల నిధులను యస్ బ్యాంకునకు అందించనుంది. దీంతో యస్ బ్యాంకులో పెట్టుబడులకు దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు పెట్టుబడులను ప్రకటించగా శనివారం బంధన్ బ్యాంక్ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. రూ.2 ముఖ విలువున్న షేరును (రూ.8 ప్రీమియంతో) రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. నగదు రూపేణా ఈ లావాదేవీ జరుగుతుంది. తాజాగా ఫెడరల్ బ్యాంకు కూడా యస్ బ్యాంకులో రూ .300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. 30 కోట్ల ఈక్విటీ షేర్లను ఈక్విటీ షేరుకు 10 రూపాయల చొప్పున కొనుగోలు ద్వారా రూ. 300 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. (యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ) ఇప్పటివరకూ యస్ బ్యాంకులో ప్రైవేటుబ్యాంకుల పెట్టుబడులు ఐసీఐసీఐ బ్యాంక్ రూ .1000 కోట్లు హెచ్డీఎఫ్సీ రూ. 1,000 కోట్లు యాక్సిస్ రూ.600 కోట్లు కోటక్ మహీంద్రా రూ.500 కోట్లు బంధన్ బ్యాంకు రూ.రూ. 300 కోట్లు ఫెడరల్ బ్యాంకు రూ. 300 కోట్లు కాగా సమస్యాత్మక ప్రైవేట్ బ్యాంకు యస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో బ్యాంకు, ఖాతాదారులు నగదు ఉపసంహరణపై తాత్కాలిక నిషేధాన్ని మార్చి 18 న ఎత్తివేయనున్న సంగతి తెలిసిందే. -
యస్ బ్యాంకు : సత్వర చర్యలు, కస్టమర్లకు ఊరట
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకులో పునరుద్ధరణ చర్యలు చకా చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్ర కేబినెట్ తదుపరి చర్యల్ని కూడా అంతే వేగంగా పూర్తి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్‌ను సీఈవో, ఎండీగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం (మార్చి 14)న వెల్లడించింది. అంతేకాదు శుక్రవారం రాత్రి జారీ చేసిన నోటిషికేషన్ ప్రకారం పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్చి 18, సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలిక నిషేధం రద్దు అవుతుంది. అంటే యస్ బ్యాంకు ఖాతాదారుడు రూ. 50వేల కు మించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటు కలుగుతుంది. పీఎన్బీ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా యస్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భేడా నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెర్టర్లుగా వ్యవహరించ నున్నారు. ఇదివరకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దాని ప్రకారం యస్ బ్యాంక్‌పై ప్రస్తుతం అమలు చేస్తున్ననిషేధాన్ని(మారటోరియం)ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించ నున్నారు. తద్వారా యస్ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కానుంది. కాగా యస్ బ్యాంక్‌పై ఆంక్షలతోపాటు, ఖాతాదారుల నగదు ఉపసంహరణపై నెల రోజుల పాటు నిషేధాన్ని ఆర్బీఐ విధించింది. అలాగే స్టేట్ బ్యాంక్ మాజీ సీఎఫ్‌వో, డిప్యూటీ ఎండీగా పనిచేసిన ప్రశాంత్‌ను యస్ బ్యాంక్ పాలనాధికారిగా రిజర్వ్ బ్యాంక్ నియమించిన సంగతి తెలిసిందే. -
‘యస్’ ప్రణాళికకు కేంద్రం ఓకే..
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ‘ఆర్బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, యస్ బ్యాంక్‌ను స్థిరపర్చేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది‘ అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)..49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారని ఆమె చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్ తప్పుకుంటారన్నారు. ఎస్బీఐ వాటాలకు సంబంధించి 26%కి మాత్రమే మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుం దని, మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ఇక, పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ పెట్టుబడులు.. యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ఇది 5 శాతం పైగా వాటాలకు సమానమవుతుంది. అయితే, పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం తుది వాటాల సంగతి వెల్లడవుతుందని పేర్కొంది. అటు రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ కూడా రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్ సైతం రూ. 600 కోట్లతో 60 కోట్ల దాకా షేర్లు కొనుగోలు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లతో 50 కోట్ల షేర్లు తీసుకోనున్నట్లు క్సే ్చంజీలకు తెలిపింది. రాణా కపూర్‌పై మరో సీబీఐ కేసు.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్య బిందుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అవంత రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించి, రాణా కపూర్ ప్రతిఫలంగా ఢిల్లీలోని ఓ భవంతిని అత్యంత చౌకగా తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే.. అవంత సంస్థలకు రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు ప్రతిగా బ్లిస్ అబోడ్ అనే సంస్థ ద్వారా ఢిల్లీలోని బంగళాను రూ. 378 కోట్లకు కపూర్ కొనుగోలు చేశారు. ఈ బ్లిస్ అబోడ్ అనే సంస్థ ఇద్దరు డైరెక్టర్లలో బిందు కూడా ఒకరు. బంగళాను కొన్న వెంటనే రాణా కపూర్ .. దాన్ని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి రూ. 685 కోట్లు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బ్లిస్ అబోడ్, అవంత రియల్టీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తమ కార్యాలయాల్లో సోదాల వార్తలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తోసిపుచ్చింది. అస్థిరతల కట్టడికి చర్యలు: సెబీ న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు సెబీ, కేంద్రం చొరవ తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ ప్రకటించింది. తీవ్ర అమ్మకాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 10 శాతం కుప్పకూలడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక మందగమనం, చమురు ధరల పతనంపై ఆందోళనలతో గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా చలిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు సెబీ, స్టాక్ ఎక్సేంజ్‌లు సన్నద్ధంగా ఉన్నాయి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమలకు ఉపశమనం కల్పిస్తాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను ప్రభుత్వం, ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమలకు ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వంలోని భిన్న శాఖలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ఎదురైన సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రంగాలతో నేను సమావేశం నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఆయా పరిశ్రమలు సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తాము ఎంత మేరకు మెరుగ్గా సాయం అందించొచ్చన్న దానిపై ప్రతి శాఖా ఎంతో సమయం వెచ్చిస్తోంది’’ అని మంత్రి వివరించారు. -
రాణా, ఆయన భార్యకు సీబీఐ మరో షాక్
సాక్షి, ముంబై : యస్ బ్యాంకు ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం శరవేగంగా పథకాన్ని అమలు చేయనుండగా, యస్ బ్యాంకు కో ఫౌండర్ రాణా కపూర్‌కు సీబీఐ మరో షాక్ ఇచ్చింది. రాణా కపూర్, అతని భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్ గౌతమ్ థాపర్ లపై తాజాగా మరో కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్లిస్ అబోడ్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన ఉన్న బిందుతో పాటు, మిగిలిన వారిపై మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం కేసు నమోదు చేసినట్టు సీబీఐ తెలిపింది. ఈ కేసు ఢిల్లీలోని అమృత షెర్గిల్ బంగ్లా ఒప్పందానికి సంబంధించిందనీ, థాపర్ కంపెనీలకు రూ .2,000 కోట్లకు పైగా రుణాలకు సంబంధించి రూ.307 కోట్ల లంచం తీసుకున్నట్టుగా అనుమానాలున్నాయని అధికారులు తెలిపారు. అమృతా షెర్గిల్ మార్గ్‌లోని 1.2 ఎకరాల బంగ్లాకొనుగోలకు కపూర్‌కు బ్లిస్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లంచం ముట్టినట్టు చెప్పారు. దీంతో బ్లిస్ అబోడ్ కార్యాలయంతోపాటు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన ఢిల్లీ,ముంబైలో అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ వెల్లడించింది. చదవండి : యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ -
యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ
సాక్షి, ముంబై : యస్ బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పునర్నిర్మాణ చర్యల్ని ఆర్బీఐ, కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆర్బీఐ ప్రతిపాదించిన బ్యాంకు రికన్స్ట్రక్షన్ స్కీమునకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. యస్ బ్యాంకు షేరు రూ.10 చొప్పున 725 కోట్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడులకు ఎస్బీఐ నిర్ణయించింది. అలాగే ప్రైవేటుబ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ కూడా రూ. 1,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. 100 కోట్ల ఈక్విటీ షేర్లను షేరుకు రూ. 10 చొప్పున కొనుగోలు చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐపెట్టబడుల ప్రకటన తరువాత వరుసగా ప్రైవేటు బ్యాంకులు యస్‌బ్యాంకు వాటాల కొనుగోలుకు క్యూ కట్టాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ ,కోటక్ మహీంద్ర బ్యాంకు బోర్డులు ఈపెట్టుబడులకు ఆమోదం తెలిపాయి. ప్రైవేటుబ్యాంకు యాక్సిస్ బ్యాంకు కూడా రూ. 600 కోట్లు పెట్టుబడికి అంగకీరించింది. ఐసీఐసీఐ తరువాత, యాక్సిస్ బ్యాంక్ ఈ పెట్టుబడులను ప్రకటించింది. శుక్రవారం జరిగిన యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో 60 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల కొనుగోలుకు రూ. 600 కోట్ల (రూ.ఆరు వందల కోట్లు మాత్రమే) పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇచ్చిందని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం యస్ బ్యాంక్ పునర్నిర్మాణం ప్రతిపాదిత ప్రణాళికలోఈక్విటీ షేరుకు రూ .2 (రూ.8 ప్రీమియంతో)కు కొనుగోలు చేయనున్నామని యాక్సిస్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ కూడా వెయ్యికోట్ల రూపాయల పెట్టుడిని యస్‌బ్యాంకుకు సమకూర్చనుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ .10 చొప్పున 50 కోట్ల యస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. (రాణా, ఆయన భార్యకు సీబీఐ మరో షాక్) చదవండి : ‘యస్’ పునర్నిర్మాణ పథకం, త్వరలోనే ఆంక్షలు ఎత్తివేత -
‘యస్’ పునర్నిర్మాణ పథకం, త్వరలోనే ఆంక్షలు ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో పడిన ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తక్షణ మూలధన అవసరాల నిమిత్తం రూ. 1100 కోట్ల నుంచి రూ. 6200 కోట్లకు పెంచినట్టు ఆమె ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో బ్యాంక్ పునర్నిర్మాణ పథకాన్ని ఆమోదించామనీ, ప్రధానంగా డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్బీఐ 49 శాతం ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎస్బీఐ షేర్లకు 26 శాతం చొప్పున మూడేళ్ల లాక్ ఇన్ వ్యవధి ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుల 75 శాతం పెట్టుబడులకు మూడేళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంటుందని చెప్పారు. ఇతర పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆర్బీఐ ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందన్నారు. నోటిఫికేషన్ వచ్చిన మూడు రోజుల (వర్కింగ్) తరువాత మారటోరియం ఎత్తివేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడిన 7 రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. అలాగే బోర్డులో కనీసం ఇద్దర డైరెక్టర్లు ఎస్బీఐకి చెందినవారు వుంటారు. మరోవైపు యస్ బ్యాంక్ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సుమారు 1.35 బిలియన్ షేర్లను రూ .10 చొప్పున కొనుగోలు చేయనుంది. అలాగే ఈక్విటీ ద్వారా రూ .1000 కోట్ల పెట్టబడులను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఆమోదించింది. -
‘యస్’బీఐ ప్రణాళికకు ఓకే..
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు తమ ఈసీసీబీ నుంచి అనుమతి వచ్చినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంక్‌లో ఎస్బీఐ 725 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున మొత్తం రూ. 7,250 కోట్లు చెల్లించనుంది. యస్ బ్యాంక్ పెయిడప్ క్యాపిటల్‌లో 49 శాతం లోపే ఎస్బీఐ వాటా ఉండనుంది. ‘నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి యస్ బ్యాంక్‌లో రూ. 7,250 కోట్లతో 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు (ఈసీసీబీ) ఆమోదముద్ర వేసింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎస్బీఐ తెలియజేసింది. ఆర్బీఐ రూపొందించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక ముసాయిదా ప్రకారం వ్యూహాత్మక ఇన్వెస్టర్లు బ్యాంకులో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సింటుంది. ఆ తర్వాత మూడేళ్ల లోపు దీన్ని 26 శాతానికి లోపు తగ్గించుకోవడానికి ఉండదు. మొండిబాకీలు, గవర్నెన్స్ లోపాలు, నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంకుపై ఏప్రిల్ 3 దాకా ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మరింత మంది ఇన్వెస్టర్ల ఆసక్తి .. యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు దేశీ సంపన్నులు (హెచ్ఎన్ఐ), ప్రముఖ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలిపారు. షేరు ధర రూ. 26 స్థాయికి చేరి, వాస్తవ విలువ వెల్లడి కావడంతో ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నట్లు ఐఐఎఫ్‌ల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ తెలిపారు. స్థానిక ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఏఎంసీలు, రాధాకిషన్ దమానీ (డీమార్ట్), రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వంటి హెచ్ఎన్ఐలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ వంటి ఆర్థిక సంస్థలు వీటిలో కూడా ఉన్నాయన్నారు. పెట్టుబడుల కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామంటూ యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ శనివారం వెల్లడి కానున్న యస్ బ్యాంక్ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై అందరి దృష్టి ఉంది. క్యూ3లో రూ. 1,000 కోట్ల నష్టాల అంచనా.. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు సుమారు రూ. 1,000 కోట్ల నష్టాన్ని నమోదు చేయొచ్చని ఒక అనలిస్టు అంచనా వేశారు. మరోవైపు, అడాగ్ ఎన్‌బీఎఫ్‌సీతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ ఖాతాలు భారీ మొండిబాకీలుగా మారడం, నిరర్థక ఆస్థులకు మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రానుండటం వంటి అంశాలతో డిసెంబర్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ సుమారు రూ. 778 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. ఎస్బీఐ యా ంకర్ ఇన్వెస్టరుగా ఉండటం వల్ల తదుపరి మరింతగా పెట్టుబడులు సమీకరించేందుకు కూడా సుల టభం కావొచ్చని వివరించింది. అలాగే ఎస్బీఐకి వాటాలు ఉండటం సైతం డిపాజిటర్లకు కాస్త ఊరటనిస్తుందని తెలిపింది. -
పునరుద్ధరణ ప్రణాళిక ‘యస్’!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌ను పునరుద్ధరించే ప్రణాళికను రిజర్వ్ బ్యాంక్ ఖరారు చేసింది. మారటోరియం ఎత్తివేసినా నిధుల లభ్యతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు పరిష్కారమార్గాలు ఇందులో పొందుపర్చింది. ప్రణాళిక ప్రకారం.. ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వ రంగ ఎస్బీఐతో పాటు ఇతరత్రా బ్యాంకుల నుంచి తుది మాట తీసుకున్నాక.. ఆర్బీఐ ముందుగా ఒక ప్రకటన చేయనుంది. ప్రకటన వచ్చిన రెండో రోజున బ్యాంకులు దాదాపు రూ. 20,000 కోట్ల నిధులను ఈక్విటీ కింద సమకూరుస్తాయి. మూడో రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు... సుమారు రూ. 30,000 కోట్ల మొత్తాన్ని యస్ బ్యాంక్ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీ)లో ఇన్వెస్ట్ చేస్తాయి. నాలుగో రోజున మారటోరియం తొలగిస్తారు. ఇన్వెస్ట్ చేస్తున్న బ్యాంకుల నుంచి హామీ వచ్చాక ఆర్బీఐ సత్వరమే ప్రణాళికను ప్రకటించనుంది. ప్రైవేట్ బ్యాంకులు కూడా రంగంలోకి.. ఎస్బీఐతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ దిగ్గజాలు కూడా యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. తద్వారా యస్ బ్యాంకు సామర్థ్యంపై నమ్మకం పెరిగి, ఇతర బ్యాంకులు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావచ్చని భావిస్తున్నారు. యస్ బ్యాంక్ సీడీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసే పెట్టుబడులు.. వాటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోల్లో భాగంగా మారతాయి. కొత్తగా జారీ చేసే ఈక్విటీలో రూ. 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే బ్యాంకులకు యస్ బ్యాంకులో 75 శాతం వాటాలు దక్కుతాయి. షేర్ల పరిమాణం భారీగా పెరగడంతో ప్రస్తుతమున్న షేర్‌హోల్డర్ల వాటా నాలుగో వంతుకు తగ్గుతుంది. మొండిబాకీలు, నిధుల కొరత, గవర్నెన్స్ లోపాలతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌ను పునరుద్ధరించే క్రమంలో ఆర్బీఐ మారటోరియం విధించడం, బ్యాంక్ బోర్డును రద్దు చేయడం తెలిసిందే. ఇన్వార్డ్ ఆర్టీజీఎస్ సేవల పునరుద్ధరణ.. ఇన్వార్డ్ ఆర్టీజీఎస్ సేవలను కూడా యస్ బ్యాంక్ పునరుద్ధరించింది. దీంతో యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించి రూ. 2 లక్షలకు పైగా జరపాల్సిన చెల్లింపులను ఇతర బ్యాంకు ఖాతాల నుంచి చెల్లించవచ్చని బ్యాంక్ తెలిపింది. తమ బ్యాంకులో కరెంటు ఖాతాలున్న సంస్థలు.. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని వివరించింది. అయితే మారటోరియం ఎత్తివేసే దాకా యస్ బ్యాంక్ ఖాతాల నుంచి ఇతరత్రా ఆన్లైన్లో జరపాల్సిన చెల్లింపులపై ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. మరోవైపు, మార్చి 14న (శనివారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు యస్ బ్యాంక్ తెలియజేసింది. యస్ బ్యాంక్ ఖాతాలపై ఐసీఏఐ సమీక్ష.. 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి యస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలను తమ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ) సమీక్షించనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. ఒకవేళ ఏవైనా అవకతవకలు ఉన్నాయని తేలిన పక్షంలో ఆడిటర్లపై చర్యలు తీసుకునేలా డైరెక్టరుకు సిఫార్సు చేయనున్నట్లు పేర్కొంది. ఇక, అన్సెక్యూర్డ్ పెట్టుబడుల రద్దు విషయానికొస్తే.. ముందుగా ఈక్విటీ ఇన్వెస్టర్లు, ప్రిఫరెన్స్ షేర్‌హోల్డర్ల తర్వాతే అదనపు టియర్ 1 బాండ్ల విషయం పరిశీలించాలని సెబీ, ఆర్బీఐలను కోరినట్లు మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు. రుణాలు పూర్తిగా చెల్లిస్తాం: అడాగ్ వ్యాపార అవసరాల కోసం యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలన్నింటికీ పూర్తి పూచీకత్తు ఉందని, మొత్తం చెల్లించేస్తామని అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్) వెల్లడించింది. రాణా కపూర్, ఆయన కుటుంబసభ్యులతో ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపింది. అడాగ్‌లో భాగమైన తొమ్మిది సంస్థలు యస్ బ్యాంక్‌కు రూ. 12,800 కోట్ల దాకా రుణాలు చెల్లించాల్సి ఉంది. షేరు జూమ్.. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బుధవారం యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో ఏకంగా 35 శాతం పెరిగి రూ. 28.80 వద్ద క్లోజయ్యింది. రుణాలివ్వాలంటూ కపూర్ ఒత్తిళ్లు: రవ్నీత్ గిల్ యస్ బ్యాంక్‌లో కీలక హోదా నుంచి రిజర్వ్ బ్యాంక్ తప్పించినా వ్యవస్థాపకుడు రాణా కపూర్ పలు మార్లు తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేశారు. నిష్క్రమణ తర్వాత కూడా అనేక కార్పొరేట్ సంస్థలకు భారీగా రుణాలిచ్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో యస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రవ్నీత్ గిల్ ఈ విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాత్రమే కాకుండా ఇతరత్రా కంపెనీలకు కూడా యస్ బ్యాంక్ ఇచ్చిన రుణాల గురించి ప్రశ్నించేందుకు ఈడీ ఆయన్ను పిలిపించింది. ఈ సందర్భంగా కపూర్ ఒత్తిళ్ల గురించి గిల్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ సంస్థలకు యస్ బ్యాంక్ జారీ చేసిన రుణాలకు ప్రతిగా కపూర్, ఆయన కుటుంబానికి దాదాపు రూ. 4,500 కోట్ల ముడుపులు లభించాయని ఆరోపణలు ఉన్నాయి. మిషన్ కపూర్.. రాణా కపూర్ అరెస్టు, యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎస్బీఐని రంగంలోకి దింపడం తదితర పరిణామాల వెనుక చాలా వ్యవహారమే నడిచింది. ఓవైపు యస్ బ్యాంక్ సంక్షోభం నుంచి బైటపడటం కోసం నిధులు సమీకరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు స్వయంగా వ్యవస్థాపకుడు రాణా కపూరే వాటికి గండి కొడుతూ వచ్చారు. ప్రయత్నాలన్నీ విఫలమైతే ఆర్బీఐ చివరికి మళ్లీ తననే పిలిచి బాధ్యతలు అప్పగిస్తుందనే ఆశతో ఆయన ఇదంతా చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లంతా ఆఖరు దశలో తప్పుకుంటూ ఉండటంపై సందేహం వచ్చిన ఆర్బీఐ కూపీ లాగితే ఈ విషయాలు వెల్లడయ్యాయి. సంబంధిత వర్గాల కథనం ప్రకారం .. డీల్ కుదుర్చుకునేందుకు వచ్చిన ఇన్వెస్టర్ల దగ్గరకు కపూర్ అనుయాయులు వెళ్లి, ఏదో రకంగా దాన్ని చెడగొట్టేవారు. ఇదంతా గ్రహించిన ఆర్బీఐ .. యస్ బ్యాంక్‌ను మళ్లీ ఆయనకే అప్పగించేందుకు తాము సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపి లండన్ నుంచి భారత్ రప్పించింది. ఆయన రాగానే వివిధ దర్యాప్తు ఏజెన్సీలు కపూర్‌పై అనుక్షణం నిఘా పెట్టాయి. కానీ ఆర్బీఐ, ప్రభుత్వం ఉద్దేశాలు కనిపెట్టిన కపూర్ మళ్లీ లండన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ముందు కపూర్‌ను అరెస్ట్ చేయాలా లేక బ్యాంకు పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలా? అన్న మీమాంస తలెత్తింది. కపూర్‌ను అరెస్ట్ చేసిన పక్షంలో బ్యాంక్‌పై కస్టమర్ల నమ్మకం సడలి.. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తే ముప్పుందని ప్రభుత్వం ఆలోచనలో పడిం ది. చివరికి సమయం మించిపోతుండటంతో.. ధైర్యం చేసి అన్ని చర్యలు ఒకేసారి తీసుకుంది. బ్యాంకుపై మారటోరియం, పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల ప్రకటనతో పాటు కపూర్‌ను అరెస్ట్ కూడా చేశారు. ఈనెల 16 దాకా ఈడీ కస్టడీలో కపూర్.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని మరో అయిదు రోజులు పొడిగిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. మూడు రోజుల కస్టడీ అనంతరం బుధవారం ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపర్చింది. విచారణ సందర్భంగా మార్చి 16 దాకా కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. -
ఆస్తుల అమ్మకానికి రాణా స్కెచ్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో తమకున్న రూ 1000 కోట్ల విలువైన ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలన్న యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. యస్ బ్యాంక్ కేసులో దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న రాణా కపూర్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న క్రమంలో దేశ రాజధానిలో తన భార్య బిందూ కపూర్ పేరిట ఉన్న మూడు విలాసవంతమైన భవనాలను విక్రయించేందుకు రాణా కపూర్ ప్రయత్నాలు చేశారని తెలిసింది. రూ 4300 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగిన యస్ బ్యాంక్ వ్యవహారంలో బిందూ కపూర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ప్రైమ్ లొకాలిటీలో 40, అమృత షెర్గిల్ మార్గ్‌లోని భవంతిని బిందు బ్లిస్ అడోబ్ సంస్థ పేరిట కొనుగోలు చేశారు. బ్లిస్ విల్లా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఢిల్లీలోనే మరో రెండు ఆస్తులను కొనుగోలు చేశారు. రూ 1000 కోట్ల విలువైన ఈ భవంతులను విక్రయించేందుకు తగిన పార్టీలను అన్వేషించాలని ఢిల్లీలోని కొందరు ప్రాపర్టీ డీలర్లను రాణా కపూర్ సంప్రదించినట్టు సమాచారం. తనపై ఈడీ దర్యాప్తు సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ, ముంబైలోని ఆస్తులను అమ్మి అమెరికా కాకుంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్‌కు మకాం మార్చాలని రాణా కపూర్ యోచించారని తెలిసింది. దేశాన్ని విడిచేలోగా భారత్‌లో తనకున్న ఆస్తులను అన్నింటినీ విక్రయించాలన్నది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. మరోవైపు అవంత రియల్టీ యస్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన రుణం బకాయి పడటంతో అదే సంస్థకు చెందిన అమృత షెర్గిల్ మార్గ్‌లోని విలాసవంతమైన భవనాన్ని బిందు కపూర్ బ్లిస్ అడోబ్ కంపెనీ పేరిట కొనుగోలు చేయడం గమనార్హం. అవంత రియల్టీకి యస్ బ్యాంక్ రూ 500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇక రుణ మొత్తాన్ని రికవర్ చేసేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించని యస్ బ్యాంక్ బ్లిస్ అడోబ్‌కు కేవలం రూ 380 కోట్లకే కట్టబెట్టింది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన అమృత షెర్గిల్ మార్గ్‌లోని ఈ భవంతి విలువ రూ 450 కోట్లు పలుకుతుందని భావిస్తున్నారు.. ఢిల్లీలో రాణా కపూర్‌కు చెందిన మూడు ఆస్తుల విలువ దాదాపు రూ 1000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆస్తుల విక్రయానికి కపూర్ చేసిన ప్రయత్నాలకు ఈడీ చెక్ పెట్టింది. చదవండి : కో–ఆపరేటివ్‌లకూ యస్ బ్యాంక్ కష్టాలు -
యస్ బ్యాంక్ కస్టమర్లకు ఊరట
-
యస్ ఖాతాదారులకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: మారటోరియం వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని సర్వీసులను యస్ బ్యాంక్ క్రమంగా పునరుద్ధరిస్తోంది. తాజాగా ఇన్వార్డ్ ఐఎంపీఎస్, నెఫ్ట్ సర్వీసులను పునరుద్ధరించినట్లు మంగళవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో వెల్లడించింది. దీంతో యస్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులు, రుణాలు తీసుకున్న వారు ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం తమ ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ఇతర ఏటీఎంల నుంచి కూడా నిర్దిష్ట స్థాయిలో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ యస్ బ్యాంక్ తెలిపింది. సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల మారటోరియం విధించడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది. నగదు విత్‌డ్రాయల్‌పై ఆంక్షలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా డిజిటల్ పేమెంట్స్ సేవలు కూడా నిల్చిపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఫారెక్స్ సర్వీసులు, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడింది. యస్ బ్యాంక్‌లో టియర్ 1 బాండ్లేమీ లేవు: శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌లో తమకు టియర్ 1 స్థాయి బాండ్లేమీ లేవని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ (ఎస్టీఎఫ్సీ) సంస్థ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. అప్పర్ టియర్ 2 స్థాయి బాండ్లలో 2010లో ఇన్వెస్ట్ చేసిన రూ. 50 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని పేర్కొంది. ఆర్బీఐ రూపొందించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం.. సుమా రు రూ. 10,800 కోట్ల టియర్ 1 బాండ్ల చెల్లింపులు రద్దు కానున్న సంగతి తెలిసిందే. మరో వైపు, 2006లో జారీ చేసిన వారంట్లకు సంబ ంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమపై రూ. 5 కోట్ల జరిమానా విధించినట్లు ఎస్టీఎఫ్సీ తెలిపింది. ప్రస్తుతం తమ గ్రూప్‌లో భాగమైన శ్రీరామ్ హోల్డింగ్స్ (మద్రాస్) (ఎస్‌హెచ్‌ఎంపీఎల్) అప్పట్లో రూ. 244 కోట్ల సమీకరణ కింద ఒక ప్రవాస భారతీయ వ్యక్తి నుంచి కూడా నిధులు సమీకరించినట్లు వివరించింది. ఈ లావాదేవీలో విదేశీ మారక నిర్వహణ (ఫెమా) చట్టాల ఉల్లంఘన జరిగింద న్న ఆరోపణలతో ఈడీ తాజా జరిమానా విధిం చినట్లు ఎస్టీఎఫ్సీ తెలిపింది. -
కో–ఆపరేటివ్‌లకూ యస్ బ్యాంక్ కష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభం ప్రభావం దేశంలోని పట్టణ సహకార బ్యాంక్‌ల మీద పడింది. యస్ బ్యాంక్ మారటోరియం నేపథ్యంలో యస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్న అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (యూసీ బీ) చెక్ ట్రన్కేషన్ సిస్టమ్ (సీటీఎస్)లను ఆర్బీఐ రద్దు చేసింది. దేశవ్యాప్తంగా సీటీఎస్‌ల లావాదేవీల కోసం 54 యూసీబీలు యస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొమ్మిది బ్యాంక్‌లున్నాయి. చెక్ డిపాజిట్స్, విత్‌డ్రా సేవలు నిలిచిపోవటంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ సీటీఎస్ క్లియరెన్స్‌లు జరగవని ఆర్బీఐ తెలిపింది. లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌ల ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. స్థానిక కమ్యూనిటీలు, వర్కింగ్ గ్రూప్‌లకు, చిన్న తరహా వ్యాపారస్తులకు, వ్యవసాయ రుణాలను అందించడమే కో–ఆప్ బ్యాంక్‌ల ప్రధాన లక్ష్యం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశంలో 1,544 అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు, 11,115 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.4,84,315 కోట్లుగా, అడ్వాన్స్‌లు రూ.3,03,017 కోట్లుగా ఉన్నాయి. 54 యూసీబీల సీటీఎస్‌ల రద్దు.. దేశవ్యాప్తంగా 54 కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లకు యస్ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్‌గా ఉంది. వీటి సీటీఎస్ క్లియరెన్స్‌లను రద్దు చేస్తూ గత శుక్రవారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క చెక్ క్లియరెన్స్ కోసం స్పాన్సర్ బ్యాంక్‌కు ఒప్పంద యూసీబీ బ్యాంక్‌లు 50 పైసల నుంచి రూపాయి వరకు చార్జీల రూపంలో చెల్లిస్తుంటాయి. వారం రోజులు గా 54 పట్టణ సహకార బ్యాంక్‌లలో సీటీఎస్ క్లియరెన్స్ జరగడం లేదని.. వీటి విలువ రూ.200 కోట్లుంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు.. కస్టమర్ల ఆందోళన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది యస్ బ్యాంక్ ఒప్పందం కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు సీటీఎస్ క్లియరెన్స్ కోసం హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యాక్సిస్ వంటి ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా పోచంపల్లి కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో సీటీఎస్ క్లియరెన్స్‌లు జరగడం లేదని ఆ బ్యాంక్ సీఈఓ సీతా శ్రీనివాస్ తెలిపారు. కస్టమర్లకు ఆందోళన వద్దని, కొద్ది రోజుల పాటు చెక్ విత్‌డ్రా, డిపాజిట్ వంటి లావాదేవీలను వాయిదా వేసుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నామని చెప్పారు. అత్యవసరమైతే నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలని కస్టమర్లకు మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్ ద్వారా సందేశాలను పంపిస్తున్నామన్నారు. పోచంపల్లి కో–ఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్‌కు పోచంపల్లి, చౌటుప్పల్, దేవరకొండ, నల్లగొండ, హాలియా, చందూర్, సూర్యా పేట 7 బ్రాంచీల్లో 50 వేల మంది కస్టమర్లు, రూ.60 కోట్ల అడ్వాన్స్‌లు, రూ.100 కోట్ల డిపాజిట్లున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో రోజుకు రూ.10 లక్షల వరకు చెక్ లావాదేవీలు జరుగుతుంటాయని బ్యాంక్ ఎండీ చెన్న వెంకటేశం తెలిపారు. సీటీఎస్ క్లియరెన్స్‌కు హెచ్‌డీఎఫ్‌సీతో చర్చలు జరుపుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులివే... సీటీఎస్ క్లియరెన్స్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి యస్ బ్యాంక్‌తో తొమ్మిది అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ నుంచి పోచంపల్లి, సెవెన్ హిల్స్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్, వరంగల్ అర్బన్, భద్రాద్రి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ది సంగమిత్ర కో–ఆప్ అర్బన్ బ్యాంక్‌లున్నాయి. ది తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాం క్, ది గుంటూరు కో–ఆపరేటివ్ బ్యాంక్, ది హిందుస్తాన్ షిప్‌యార్డ్ స్టాఫ్ కో–ఆప్ బ్యాంక్‌లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. ‘‘ఏపీలో 47 యూసీబీలు, 230 బ్రాంచీలున్నాయి. వీటి డిపాజిట్లు రూ.9,040 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.6,230 కోట్లు. తెలంగాణలో 51 యూసీబీలు, 211 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.7,517 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.5,592 కోట్లు. -
'కమాన్ చంద్రబాబూ.. ఇక తేల్చుకో'
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన అన్నారు. అయితే, దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో తేల్చుకోవాలంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 'సీఎం జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణతిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ.. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: 'వారిపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా' మనీ లాండరింగ్ ఆరోపణలపై యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను(62) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. యస్ బ్యాంక్‌లో అక్రమ ఆర్థిక లావాదేవీల విషయంలో మార్చి 11 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. 'రాణా కపూర్‌ను ఈడీ అరెస్టు చేసింది. యస్ బ్యాంకు అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి. సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టింది కచ్చితంగా బయటపడుతుంది. తమ దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటని ఎల్లో మీడియా విలవిల్లాడుతోంది' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: 'కుల మేధావి కిరసనాయిలు సలహా తీసుకో' కాగా మరో ట్వీట్లో.. 'చంద్రబాబు పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికులు అప్రమత్తంగా ఉండాలి. సఎం జగన్ గారిపై బురద చల్లడానికి దేనికైనా తెగిస్తారు. ఎల్లో మీడియా గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తోంది. తనే డబ్బు, మద్యం పంపిణీ చేయించి మన మీదకు నెట్టడానికి బాబు కుట్రలు పన్నుతాడంటూ' విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చదవండి: 'యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు' -
కస్టమర్లకు యస్ బ్యాంక్ ఊరట
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మంగళవారం కస్టమర్లకు ఊరట కల్పించింది. ఖాతాదారులు నెఫ్ట్‌తో పాటు ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా చెల్లింపులు చేపట్టవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు బకాయిలను, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొంది. యస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ ఇటీవల రద్దు చేసి, బ్యాంకు నుంచి విత్‌డ్రాయల్స్‌కు పరిమితులు విధించిన సంగీతి తెలిసిందే. ఆర్బీఐ నియంత్రణతో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా ఎస్బీఐ యస్ బ్యాంక్ వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం, క్రమంగా బ్యాంకు లావాదేవీలపై నియంత్రణలను సడలిస్తుండటంతో ఖాతాదారుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.మరోవైపు బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించాయి. చదవండి :యస్ బ్యాంక్ స్కామ్‌పై సీబీ‘ఐ’ -
ఎస్ బ్యాంకు కుంభకోణంలో బాబు హస్తం ఉంది
-
యస్ బ్యాంక్ స్కామ్‌పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ కుంభకోణం కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ నుంచి యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబానికి రూ. 600 కోట్లు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సోమవారం 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో అయిదు కంపెనీలు, రాణా కపూర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు (రోష్ని, రాఖీ, రాధ) సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటరు కపిల్ వాధ్వాన్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ డైరెక్టర్ ధీరజ్ రాజేష్ కుమార్ వాధ్వాన్లు వీరిలో ఉన్నారు. ఇక, కంపెనీల విషయానికొస్తే.. డీహెచ్ఎఫ్ఎల్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్, కపూర్ కుటుంబ సారథ్యంలోని డూఇట్ అర్బన్ వెంచర్స్, బిందు కపూర్ డైరెక్టరుగా ఉన్న ఆర్ఏబీ ఎంటర్ప్రైజెస్, రాణా కపూర్ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్న మోర్గాన్ క్రెడిట్స్ సంస్థలు ఉన్నాయి. ముంబైలోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశం విడిచి వెళ్లిపోకుండా.. వారిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయినట్లు పేర్కొన్నాయి. అటు యస్ బ్యాంక్ జారీ చేసిన భారీ రుణాలు మొండిబాకీలుగా మారడంపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది. డీహెచ్ఎఫ్ఎల్కి మాత్రమే పరిమితం కాకుండా రుణాలు తీసుకున్న ఇతర కంపెనీల నుంచి కూడా కపూర్ కుటుంబానికి ముడుపులేమైనా వచ్చాయేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. అటు యస్ బ్యాంక్ సీఈవో రవ్నీత్ గిల్‌ను కూడా ఈడీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిధులు మళ్లించారిలా .. డీహెచ్ఎఫ్ఎల్కు యస్ బ్యాంక్ ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని కపిల్ వాధ్వాన్‌తో కలిసి రాణా కపూర్ దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 ఏప్రిల్ – జూన్ మధ్యకాలంలో డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన షార్ట్ టర్మ్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో పాటు డీహెచ్ఎఫ్ఎల్ గ్రూప్ సంస్థ అయిన ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్‌కు రూ. 750 కోట్లు రుణం ఇచ్చింది. అయితే, నిర్దేశిత ప్రాజెక్టులో పైసా కూడా పెట్టకుండా ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ మొత్తం రుణం నిధులను డీహెచ్ఎఫ్ఎల్కు బదలాయించింది. యస్ బ్యాంక్ నుంచి రుణం లభించినందుకు ప్రతిగా కపూర్ కుమార్తెలకు చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్‌లో వాధ్వాన్ దాదాపు రూ. 600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది ఓ రకంగా కపూర్‌కు ముడుపులివ్వడమేనన్నది సీబీఐ ఆరోపణ. సుమారు రూ. 97,000 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సుమారు రూ.31,000 కోట్ల నిధులు దారి మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల బాండ్లలో రూ. 93,000 కోట్ల పెట్టుబడులు.. దేశీ బ్యాంకులు జారీ చేసిన అదనపు టియర్ 1 బాండ్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 93,669 కోట్లు ఇన్వెస్ట్ చేశారని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. యస్ బ్యాంక్ గానీ దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు బాండ్లను పూర్తిగా రైటాఫ్ చేసిన పక్షంలో ఇన్వెస్టర్లు ఇకపై రిస్కులు తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చని పేర్కొంది. మరోవైపు, యస్ బ్యాంక్ సమస్యకు సత్వర పరిష్కారం అమలు చేయడంతో.. సంక్షోభం బ్యాంకింగ్ రంగం అంతటా విస్తరించకుండా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. ముందే పసిగట్టారా!! యస్ బ్యాంక్ పరిస్థితి నానాటికీ దిగజారుతుండటాన్ని ముందుగానే పసిగట్టినట్లుగా పలువురు ఖాతాదారులు గతేడాది మార్చి–సెప్టెంబర్ మధ్య కాలంలో భారీగా విత్‌డ్రా చేసుకున్నారు. ఈ వ్యవధిలో ఏకంగా రూ. 18,100 కోట్ల మేర విత్‌డ్రాయల్ లావాదేవీలు నమోదయ్యాయి. మరోవైపు, డిపాజిట్లపై బీమా పరిమాణాన్ని పెంచిన నేపథ్యంలో తమ సొమ్ముకేమీ కాదని భావిస్తున్నట్లు కొందరు డిపాజిటర్లు తెలిపారు. అటు, మరో రెండు మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. తమ స్కీమ్‌ల నుంచి యస్ బ్యాంక్ పెట్టుబడులను పక్కకు పెట్టాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్, బరోడా ఎంఎఫ్ వీటిలో ఉన్నాయి. యస్ బ్యాంక్ డెట్ సాధనాలను రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ‘డి’ స్థాయికి కుదించడం ఇందుకు కారణం. ఈ వారంలోనే మారటోరియం ఎత్తేయొచ్చు: అడ్మినిస్ట్రేటర్ కుమార్ పరిస్థితులు చక్కబడితే ఈ వారంలోనే మారటోరియం ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ నియమించిన యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎస్బీఐ పెట్టుబడుల ప్రణాళికకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేస్తే.. యస్ బ్యాంక్ మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటికి రాగలదన్నారు. డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు నిధుల సమీకరణ కూడా తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని కుమార్ చెప్పారు. బ్యాంకింగ్ సేవలన్నీ సాధ్యమైనంత త్వరగా పునరుధ్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా విత్‌డ్రాయల్ సదుపాయం అందుబాటులోకి తేగలిగినట్లు చెప్పారు. డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మార్చి 14న ప్రకటిస్తామని కుమార్ తెలిపారు. -
కరకట్ట బంగ్లాలోనే కుంభకోణాల మూలాలు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు, ఈడీ దాడులు జరిగినా వాటి మూలాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరకట్ట నివాసంలో బయట పడుతున్నాయని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో దోచుకున్న సొమ్మును దాచుకుని దేశం దాటించేందుకు ఎస్ బ్యాంక్‌ను వాడుకున్నారని ఆరోపించారు. ఆ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు దగ్గర తేలుతున్నాయన్నారు. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో కలసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారన్నారు. టిట్కో ద్వారా చదరపు అడుగుకు రూ.1,100 చొప్పున నిర్మించాల్సిన పేదల ఇళ్లకు రూ.2,400 ప్రకారం చెల్లించి చంద్రబాబు రూ.వేల కోట్ల ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఆ సొమ్ము ఎస్ బ్యాంకు ద్వారా విదేశాలకు హవాలా రూపంలో తరలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. - బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసిన చంద్రబాబు ఓట్ల కోసం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. - స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరపున 34 శాతం సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించాకే గత్యంతరం లేక చంద్రబాబు అదే దారి అనుసరించారు. - తిరుమల శ్రీవారి సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఎస్ బ్యాంక్‌లో రూ.1,300 కోట్లు డిపాజిట్ చేయించారు. - ఢిల్లీలో ఎస్ బ్యాంక్‌తో కలిసి చంద్రబాబు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ నిర్వహిస్తే పెట్టుబడులు రాలేదు. టూరిజం మిషన్ డాక్యుమెంట్ తయారీకి రూ.లక్షల్లో ఫీజు చెల్లించారు. - ఇవన్నీ చాలా చిన్నవి. చంద్రబాబు ఐదేళ్లలో దోచుకున్న మొత్తాన్ని దేశం బయటకు తరలించేందుకు ఎస్ బ్యాంక్‌ను వాడుకున్నారు. - ఆర్థిక నేరగాడు రాణాకపూర్ నెలకోసారి చంద్రబాబు వద్దకు వచ్చి రాత్రంతా కరకట్ట బంగ్లాలో గడిపేవారు. - తనకు నోటీసులు వస్తాయని భయపడుతున్న చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని పెద్ద లాయర్లతో చర్చిస్తున్నారు. - పవన్ రోజుకో మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలను మోసగించడం మానుకోవాలి. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ ట్రేడ్‌వార్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్ యెన్ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు. ♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. ♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్ యెన్ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది. ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. క్రూడ్(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్‌బ్యాంక్ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి. ఆరంభంలోనే భారీ నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందని, మన మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు. పతనానికి పంచ కారణాలు... ♦ చమురు ధరల పతనం... చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. కోవిడ్–19 విలయం భారత్‌లో కోవిడ్–19 (వైరస్) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు... కరోనా కల్లోలానికి సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. యస్ బ్యాంక్ సంక్షోభం .. భారత బ్యాంకింగ్ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్‌ను పలు రేటింగ్ సంస్థలు డౌన్‌గ్రేడ్ చేశాయి. మరోవైపు బాసెల్ టూ, టైర్–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్ బ్యాంక్ విఫలమైంది. మొత్తం మీద యస్ బ్యాంక్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ట్రేడింగ్‌ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్ 1,794 పాయింట్లు, నాస్డాక్ 500 పాయింట్ల నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్‌కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది. షేర్లు కకావికలం... ♦ ఓఎన్జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ రెండో స్థానానికి రిలయన్స్ చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్ షేర్‌కు దక్కింది. ♦ యస్ బ్యాంక్ జోరు... ఎస్బీఐ బేజారు.... సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్బీఐ షేర్ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్ బ్యాంక్ షేర్ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది. ♦ చమురు షేర్లు రయ్... ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్ షేర్ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్ షేర్ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి. ♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు... దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బీఎస్ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. -
రాణాకపూర్ అక్రమాలు, బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ సంక్షోహంలో ఫౌండర్ రాణా కపూర్ చుట్టూ ఆర్థిక అవకతవకల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను ఈడీ అదుపులోకి తీసుకోగా మనీలాండరింగ్ కేసులో రాణా కపూర్‌తో పాటు మరికొందరిపై నమోదైన కేసులపై ఈడీ చర్యలు చేపట్టింది. తాజాగా సీబీఐ కూడాసీరియస్‌గా స్పందిస్తోంది. ఆయన నిసావాసాల్లో పలుమార్లు సోదాలు నిర్వహిచిన సీబీఐ రాణాకపూర్ కుటుంబంతోపాటు, డీహెచ్ఎఫ్ఎల్ పై కూడా కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణాల విషయంలో రాణాకపూర్ క్విడ్ ప్రోకు పాల్పడినట్టు ఆరోపించింది. రాణా కపూర్ కు రూ. 600కోట్ల లాభం చేకూరిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తన స్థానాన్ని ఉపయోగించుకుని యస్ బ్యాంకులో భారీ స్కాం పాల్పడ్డాడని పేర్కొంది. ఈ కుంభకోణంలో రాణా కపూర్ కుమార్తెలు రాఖీ, రోషిణి, రాధాలు లబ్ది పొందినట్లు తెలిపింది. అలాగే ఇలాంటివి మరిన్ని ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. రాణా కపూర్ కుటుబం (భార్య బిందు, ముగ్గురు కుమార్తెలు రోషిణి, రాఖీ, రాధా) మొత్తాన్ని సీబీఐ బుక్ చేసింది. అలాగే డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాద్వాన్, ఆర్హెచ్డబ్ల్యు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ధీరజ్ రాజేష్ కుమార్ వాద్వాన్‌తో పాటు అయిదు కంపెనీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ రెండు సంస్థలతో పాటు కపూర్ కుటుంబం నియంత్రణలో ఉన్న డాల్ట్ అర్బన్ వెంచర్స్, ఆర్ఏబీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, డిహెచ్ఎఫ్ఎల్తో అనుసంధానమైన సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఏడుగురు నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. కాగా ఈ కంపెనీల్లో బిందు రానా కపూర్ డైరెక్టర్‌గా ఉన్నారు. మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రాణా కపూర్ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్నారని సమాచారం. సోమవారం కూడా అధికారిక నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న ఏడు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా ముడుపులు అందాయన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. -
చంద్రబాబు యస్ బ్యాంక్‌తో చేతులు కలిపారు
సాక్షి, తాడేపల్లి: యస్ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు నాయుడు దగ్గర తేలుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో కలిసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారని వ్యాఖ్యానించారు. కరకట్ట మీద ఉన్న బాబు నివాసంలో రాణా కపూర్ ఒకరోజు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. సోమవారం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడ ఆర్థిక అవకతవకలు జరిగినా విజయవాడ కరకట్ట మీద అక్రమ బంగళాలో తేలుతుంది. రాణా కపూర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నది కరకట్టకు లింక్ అవుతోంది. చంద్రబాబు దోచుకున్న సొమ్ము కాంగ్రెస్ పార్టీకి హవాలా రూపంలో పంపారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి చెందిన రూ.1300 కోట్లు యస్ బ్యాకులో డిపాజిట్ చేశారు. అంతేకాక ఢిల్లీలో యస్ బ్యాంక్‌తో కలిసి పారిశ్రామిక సదస్సు నిర్వహించారు. రాణా కపూర్‌తో కలిసి హవాలా వ్యాపారం చేసిన బాబు.. తన హవాలా సొమ్మును యస్ బ్యాంక్ ద్వారా విదేశాలకు మళ్లించారు. దీనిపై ఈడీ పూర్తిస్థాయిలో విచారణ జరపాలి’ అని కోరారు. (యస్ బ్యాంక్ కేసు: ఏడు చోట్ల సీబీఐ దాడులు) పవన్.. సినిమాలు తీసుకోకుండా ఏంటీ గోల? ‘చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. బీసీలు జడ్జీలుగా పనికి రారని లేఖలు రాశారు. బీసీ రిజర్వేషన్లు సైతం అడ్డుకున్నారు. 10 శాతం బీసీల రిజర్వేషన్లు పార్టీ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్తాననగానే బాబు కూడా ఇస్తానంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ 60 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు స్థానం కల్పించారు. సీఎం జగన్ బాగా పరిపాలన చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటానన్నాడు. మరి సినిమాలు తీసుకోకుండా ఈ మేనిఫెస్టో గోల ఏమిటి? బాబు గురించి మళ్లీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారా? పవన్ ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలి’ అని పేర్ని నాని హితవు పలికారు. (యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!!) -
యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంతో ఆందోళనలో పడిన బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట కలగనుంది. నగదు ఉపసంహరణకు సంబంధించి ఇటీవల ఆర్బీఐ విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తివేయ నుంది. యస్‌బ్యాంకు ఖాతాదారులు ఈ వారాంతానికే ఎలాంటి పరిమితి లేకుండా తమ నగదును విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు కలగనుంది. ఈ విత్‌డ్రాయల్‌ను మార్చి 15 వరకే పరిమితం చేసి తర్వాత ఎత్తివేసే అవకాశం ఉందని కొత్తగా నియమితులైన యస్‌బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ఎస్బీఐమాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సోమవారం ప్రకటించారు. మొదట రూ.50,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం నెలరోజులు కాలపరిమితిగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం దానిని మార్చి 15వరకే పరిమితం చేయనున్నారు. ఆ తర్వాత ఖాతాదారులు తమ అకౌంట్లలోని నగదును ఎంతకావాలంటే అంత మొత్తం నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. యస్‌బ్యాంక్ కార్యకలాపాలను ఏప్రిల్ 3నాటికి పునరుద్దరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంకా యస్‌బ్యాంక్‌ను ఎస్బీఐలో విలీనం చేస్తారనే ఊహాగానాల్లో వాస్తవం లేదని, యస్ బ్యాంక్ స్వంతంత్రంగానే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మూలధనం సమకూర్చలేనప్పుడు మాత్రమే విలీనం అవసరమేర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరాలన్నింటిని మార్చి 14న వెల్లడిస్తామని తెలిపారు. అటు యస్ బ్యాంకులో 49 శాతంవాటాల కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ ఆమోదం తెలిపింది. తొలి దశలో భాగంగా ఎస్బీఐ రూ. 2450 కోట్లను యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం భారీ పతనంలో కూడా యస్ బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు పెట్టుబడి దారులు ఆసక్తి చూపారు. దీంతో 32 శాతం ఎగిసిన యస్ బ్యాంకు షేరు 21.35 వద్ద ముగిసింది. కాగా యస్‌బ్యాంక్‌లో అక్రమాలు నేపథ్యంలో ఆర్బీఐ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. బ్యాంకు లావాదేవీలపై నెల రోజుల పాటుమారటోరియం విధించింది. కేవలం రూ.50వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఆంక్షలు విధించింది. మరోవైపు యస్‌బ్యాంక్ పునరుద్ధరణకు ఆర్బీఐ సత్వర చర్యలు ప్రక్రియను వేగవంతం చేసింది. చదవండి: యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!! -
యస్ బ్యాంక్ కేసు: ఏడు చోట్ల సీబీఐ దాడులు
ముంబై : యస్ బ్యాంక్ కేసుకు సంబంధించి ముంబైలో బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్, ఇతరులకు సంబంధించిన ఏడు చోట్ల సీబీఐ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. రాణా కపూర్, డీహెచ్ఎఫ్ఎల్, ఆరేకేడబ్ల్యూ డెవలపర్స్, దోయిత్ అర్బన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిడెట్, డీహెచ్ఎఫ్ఎల్ బాంద్రా కార్యాలయ ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. యస్ బ్యాంక్ సంక్షోభానికి సంబందించి సీబీఐ ఈనెల ఏడున యస్ బ్యాంక్ మాజీ చీఫ్ రాణా కపూర్, ఆయన కుటుంబానికి చెందిన దోయిత్ అర్బన్ వెంచర్, డీహెచ్ఎఫ్ఎల్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ తదితరులపై నేరపూరిత కుట్ర, 420 సహా పలు సెక్షన్ల కింద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి : రంగంలోకి సీబీఐ యస్ బ్యాంక్ అక్రమంగా డీహెచ్ఎఫ్ఎల్కు ఆర్థిక సాయం చేసేందుకు కపిల్ వాద్వాన్ ఇతరులతో కలిసి రాణా కపూర్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, ప్రతిగా తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు బారీ లబ్ధి పొందారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. కాగా సీబీఐ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో గతంలోనే ఈడీ దాడులు చేపట్టింది. యస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మరోవైపు రాణా కపూర్‌ను ముంబై కోర్టు ఈనెల 11 వరకూ ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి : ముడుపుల కోసం షెల్ కంపెనీలు.. -
బ్లాక్‌మండే : సెన్సెక్స్ 2000 పాయింట్లు పతనం
ముంబై : స్టాక్మార్కెట్లో బ్లాక్ మండే నమోదైంది. యస్ బ్యాంక్ పరిణామాలతో పాటు కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలతో స్టాక్‌మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. కరోనా వైరస్ ప్రపంచంలో సగం దేశాలకు వ్యాపించడం, కొత్త కేసుల నమోదుతో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. స్టాక్‌మార్కెట్ భారీ నష్టంతో రూ 5 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైంది. అమ్మకాల వెల్లువతో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల నష్టంతో 35,573 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 531 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,457 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.ఇక ఓఎన్జీసీ, రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. చదవండి : ఎగిసి‘పడిన’ స్టాక్ మార్కెట్లు -
కోవిడ్ పరిణామాలే నడిపిస్తాయ్..
న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడమా లేదంటే.. మరింత పతనం కావడమా అనే కీలక అంశం ఆధారపడి ఉందని దలాల్ స్ట్రీట్ పండితులు విశ్లేషిస్తున్నారు. వైరస్ భయాలతో.. మార్కెట్లో చురుగ్గా పాల్గొనే ఇన్వెస్టర్లు గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాల్యూమ్స్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఎకాన మీపై ఈ మహమ్మారి ప్రభావం ఎంత మేర ఉండనుందనే అంశం ఆధారంగానే ఈ వారంలో సూచీలు కోలుకుంటాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. యస్ బ్యాంక్ పరిణామాలు కీలకం గతవారంలో యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత దెబ్బతింది. కరోనా వైరస్ వ్యాప్తికి తోడు బ్యాంక్‌పై ఆంక్షలతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టస్థాయికి పడిపోయింది. ఇక ఈ వారంలో కూడా యస్ బ్యాంక్ పరిణామాలు కీలకంకానున్నాయని జిమీత్ మోడీ అన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అరెస్ట్ చేయగా.. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై కనిపించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యస్ బ్యాంక్‌లో కేవలం వాటాను మాత్రమే కొనుగోలు చేశామని, విలీనం ప్రసక్తి ఇప్పటికి లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ తాజా పరిణామాలు, వైరస్ వ్యాప్తి ఆధారంగా ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం క్లిష్టతరమేనని షేర్‌ఖాన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ దువా అన్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. హోలీ సందర్భంగా మంగళవారం (10న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఆర్థికాంశాల ప్రభావం.. జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం డేటా గురువారం వెల్లడికానున్నాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ నెల్లో రూ. 13,157 కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో రూ. 13,157 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–6 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 8,997 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ. 4,160 కోట్లను వెనక్కు తీసుకున్నారు. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని గ్రోవ్ సహ వ్యవస్థాపకులు హర్‡్ష జైన్ విశ్లేషించారు. -
యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను (62) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. మార్చి 11 దాకా ఆయన్ను ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెడితే .. యస్ బ్యాంక్‌లో ఆర్థిక అవకతవకలు, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్)కు రుణాలిచ్చినందుకు ప్రతిగా దాదాపు రూ. 600 కోట్ల ముడుపులు అందుకున్నారని కూడా రాణా కపూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన్ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదనే కారణంతో ఆదివారం ఉదయం సుమారు 3 గం.ల ప్రాంతంలో కపూర్‌ను అదుపులోకి తీసుకుంది. న్యాయస్థానంలో హాజరుపర్చగా ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవహారాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా లాంఛనంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్కామ్ సంబంధ పత్రాలను అధికారులు సేకరిస్తున్నట్లు వివరించాయి. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి కోణాల్లో దర్యాప్తుపై సీబీఐ దృష్టి పెట్టినట్లు సమాచారం. మొండి బాకీలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలతో కుదేలైన యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 30 రోజుల పాటు రూ. 50,000కు మించి విత్‌డ్రాయల్స్ జరపడానికి లేకుండా మారటోరియం కూడా విధించింది. దీనితో ఆ బ్యాంకు జారీ చేసిన ఫారెక్స్ కార్డులు పనిచేయక, వాటిని తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్బీఐ తప్పుడు విశ్లేషణలు చూసి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ మరోసారి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని బ్యాంకులను సునిశితంగా పరిశీలిస్తూనే ఉన్నామని, డిపాజిట్ల భద్రతకు ఢోకా ఉండదని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆర్బీఐ ట్వీట్ చేసింది. మార్కెట్ క్యాప్ ఆధారంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఉండదని తెలిపింది. అటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. బ్యాంకుల్లో సొమ్ము భద్రతను అంచనా వేసేందుకు వాటి మార్కెట్ క్యాప్ సరైన కొలమానం కాదని స్పష్టం చేశారు. మాకు రూ. 662 కోట్లు రావాలి: ఇండియాబుల్స్ హౌసింగ్ యస్ బ్యాంక్ నుంచి తమకు రూ. 662 కోట్లు రావాల్సి ఉందని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. బ్యాంక్ బాండ్లలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశామని, టర్మ్ లోన్ల రూపంలో బకాయిలేమీ లేవని పేర్కొంది. బ్యాంకు విలువ 10 బిలియన్ డాలర్ల పైగా ఉన్నప్పుడు.. 2017లో అదనపు టియర్ 1 (ఏటీ–1) బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. డొల్ల కంపెనీలతో ముడుపుల మళ్లింపు... రుణాల మంజూరుకు ప్రతిగా లభించిన ముడుపులను డజను పైగా డొల్ల కంపెనీల ద్వారా రాణా కపూర్ కుటుంబం దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు, అత్యంత ఖరీదైన 44 పెయింటింగ్స్.. వాటి వెనుక ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూపీ లాగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ వర్గాల కథనం ప్రకారం .. డీహెచ్ఎఫ్ఎల్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ క్రమంలో కపూర్ కుటుంబానికి చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్ అనే సంస్థలోకి డీహెచ్ఎఫ్ఎల్ నుంచి దాదాపు రూ. 600 కోట్లు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్కు రుణాలిచ్చినందుకు గాను కపూర్ కుటుంబానికి ఇవి ముడుపుల రూపంలో లభించి ఉంటాయని అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటినీ ధృవీకరించుకోవడానికి కపూర్ కుటుంబ సభ్యులను కూడా విచారణ చేయాల్సి ఉందంటూ న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ అయినప్పటికీ.. రుణాలను రాబట్టుకోవడానికి యస్ బ్యాంక్ చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు ఊతమిస్తోందని పేర్కొంది. అయితే, తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని.. కావాలనే కపూర్‌ను టార్గెట్ చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. డూఇట్ కంపెనీ తన ఇద్దరు కుమార్తెల పేరు మీద ఉందని కపూర్ తెలిపారు. డీహెచ్ఎఫ్ఎల్కు ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నప్పుడు యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు రుణమిచ్చిందని, ఆ తర్వాత దాన్నుంచి డూఇట్ కంపెనీ రూ. 600 కోట్లు రుణం రూపంలో తీసుకుందని వివరించారు. ఇప్పటికీ డూఇట్ సంస్థ రుణాలను చెల్లిస్తూనే ఉందని, డిఫాల్ట్ కాలేదని చెప్పారు. -
రాణా కపూర్ కుమార్తెకు షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్న బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ కుమార్తె రోష్ని కపూర్ లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై విమానాశ్రయంలో అధికారులు అడ్డగించారు. ఈ కేసులో రోష్ని కపూర్ సహా రాణా కపూర్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా లుక్అవుట్ నోటీస్ జారీ అయిన నేపథ్యంలో ఆమెను విమానాశ్రయంలో అధికారులు దేశం విడిచివెళ్లకుండా నిలువరించారు. ఈ కేసులో ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ అయిన రాణా కపూర్‌ను మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబైలోని కపూర్, ఆయన కుమార్తెల నివాసాలపై ఈడీ దాడుల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. దివాలా తీసిన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా రాణా కపూర్ ప్రోద్బలంతో పెద్దమొత్తంలో రుణాలు జారీ అయ్యాయని, అందుకు ప్రతిగా ఆయా కంపెనీల నుంచి రూ కోట్లు ముడుపులు కపూర్‌కు ముట్టాయని వెల్లడైంది. ఈ ముడుపులు స్వీకరించేందుకు కపూర్, ఆయన కుటుంబ సభ్యులు 20కిపైగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని ఈడీ గుర్తించింది. చదవండి : ఈడీ కస్టడీకి రాణా కపూర్ -
ఖాతాదారులకు ఆర్బీఐ భరోసా
యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఖాతాదారుల నమ్మకాన్ని పెంచే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. ఆర్బీఐ ఆదివారం ట్విటర్ వేదికగా ఖాతాదారులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఓ బ్యాంకు ఆర్థిక స్థితిని సీఆర్ఏఆర్(క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ ఎస్సెట్స్) ఆధారంగా అంచనా వేయాలి. ఇది మార్కెట్ విలువపై ఆధారపడి ఉండదని ట్విటర్లో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఆదేశాలతో యస్ బ్యాంకును ఆదుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకు నుంచి తీసుకునే సొమ్మును రూ. 50,000కు పరిమితం చేస్తూ రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకున్న విషయం విదితమే. Concern has been raised in certain sections of media about safety of deposits of certain banks. This concern is based on analysis which is flawed. Solvency of banks is internationally based on Capital to Risk Weighted Assets (CRAR) and not on market cap. (1/2) — ReserveBankOfIndia (@RBI) March 8, 2020 -
పేటీఎంకు రివర్స్ పంచ్ ఇచ్చిన ఫోన్‌పే
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారిటోరియం విధించి, ఒక్కో వినియోగదారుడు నెలకు రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇబ్బందుల్లో పడింది. ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ ఫోన్‌ఫేను తన యూపీఐ ప్లాట్ఫామ్లోకి ఆహ్వానిస్తు.. తన సేవలను వినియోగించుకోవాలని, ఫోన్‌పే అవసరాలకు అనుగుణంగా తమ సేవలను విస్తరించగలమంటూ పేటీఎమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు దీటుగా ఫోన్‌పే బదులిస్తు మీరు చెబుతున్నట్టు మీ సేవల సామర్థ్యాన్ని విస్తరించడం సాధ్యమనుకుంటే ముందుగానే మీమ్మల్ని సంప్రదించే వాళ్లమని పేటీఎమ్‌కు గట్టి పంచ్ ఇచ్చింది. ఫార్మ్ అనేది శాశ్వతం కాదని..కానీ క్లాస్ అనేది ఎప్పటికి శాశ్వతం అని ఫోన్‌పేకు పేటీఎమ్ దీటుగా తమ వాదన వినిపించింది. Dear @PhonePe_ , Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business. Let’s get you back up, fast! — Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 Dear @PaytmBank Inviting you to consider that if your #UPI platform was so 'seamlessly scalable', we'd have called you ourselves. No point getting back up faster, if we have to desert our long term partners when they're down. Form is temporary, class is permanent. — PhonePe (@PhonePe_) March 6, 2020 -
ముడుపుల కోసం షెల్ కంపెనీలు..
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ వ్యవహారంలో బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందిన కంపెనీల నుంచి ముడుపులు పొందేందుకు రాణా కపూర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు 20 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ గుర్తించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఆదివారం రాణా కపూర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కపూర్ అరెస్ట్‌తో ఆయన అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. దివాలా తీసిన హౌసింగ్ ఫైనాన్స్‌కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్కు యస్ బ్యాంక్ రూ 3700 కోట్లు రుణం ఇవ్వగా ఈ మొత్తం అంతా నిరర్ధక ఆస్తులుగా మారింది. ఇంత మొత్తం రుణం పొందిన డీహెచ్ఎఫ్ఎల్ కపూర్ కుటుంబానికి రూ 600 కోట్లు ముట్టచెప్పింది. డీహెచ్ఎఫ్ఎల్ తరహాలో యస్ బ్యాంక్ నుంచి అక్రమంగా రుణాలు పొందిన కార్పొరేట్ సంస్థలు కపూర్ కుటుంబానికి చెందిన షెల్ కంపెనీల్లోకి ముడుపులను తరలించాయి. అక్రమ మార్గాల్లో నిధులు స్వీకరించిన కపూర్ కుటుంబం రూ 2000 కోట్ల వరకూ వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ఈ ఆస్తుల విలువ రూ 5000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్రిటన్‌లోనూ కపూర్ కుటుంబం రెండు ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. మరోవైపు యస్ బ్యాంక్ వ్యవహారంపై సీబీఐ సైతం దర్యాప్తును చేపట్టింది. ఈడీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐతో సీబీఐ ఈ దిశగా సంప్రదింపులు చేపట్టింది. చదవండి : ఈడీ కస్టడీకి రాణా కపూర్ -
ఈడీ కస్టడీకి రాణా కపూర్
ముంబై : యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌ను మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ మాజీ చీఫ్ రాణా కపూర్‌ను దాదాపు 30 గంటల ఇంటరాగేషన్ అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అధికారులు శనివారం రాణా కపూర్‌ను మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆదివారం కపూర్ భార్యను సైతం ఈడీ కార్యాలయానికి రప్పించిన అధికారులు ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు. ముంబైలోని వొర్లి ప్రాంతంలో కపూర్ నివాసం సముద్ర మహల్‌లోనూ ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. కపూర్ నేతృత్వంలో యస్ బ్యాంక్ పెద్ద మొత్తంలో డీహెచ్ఎఫ్ఎల్కు జారీ చేసిన రుణాలు నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మారాయని ఈడీ ఆరోపిస్తోంది. కాగా యస్ బ్యాంక్ ఖాతాదారులకు ఊరటగా కస్టమర్లు తమ డెబిట్ కార్డును ఉపయోగించి ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని యస్ బ్యాంక్ ట్వీట్ చేసింది. మరోవైపు సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌లో ఎస్బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. యస్ బ్యాంక్ ఉద్దీపన ప్రణాళిక కింద ఎస్బీఐ తన నివేదికను సోమవారం ఆర్బీఐకి సమర్పించనుంది చదవండి : ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం కాదు: రజనీష్. -
యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రానాకపూర్ అరెస్ట్
-
ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం కాదు: రజనీష్
న్యూఢిల్లీ: ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం ప్రసక్తే లేదని, కేవలం దాంట్లో వాటాను కొంటామని ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ స్కీంపై స్పందించేందుకు తమకు సోమవారం వరకు గడువుందన్నారు. మెండిబకాయిలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాప్ట్ స్కీంపై తమ బ్యాంక్ న్యాయబృందం పనిచేస్తోందన్నారు. ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం ఎట్టిపరిస్థితుల్లో ఉండదని స్పష్టంచేశారు. ‘యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను ఎస్బీఐ కొనుగోలు చేస్తే రూ.2,400కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది. పెట్టుబడి పథకాన్ని చూశాక 23 మంది ఇన్వెస్టర్లు ఎస్బీఐని సంప్రదించారు’ అని చెప్పారు. ‘యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐ 49 శాతం కొంటుందా? లేక 26 శాతం తీసుకుంటుందా? అనేది ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మరికొందరు ఇన్వెస్టర్ల నుండి వచ్చిన ఆసక్తిని పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
యస్ బ్యాంక్ పరిణామాలపై చిదంబరం విమర్శలు
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఎస్బీఐ రూ.2450 కోట్ల పెట్టుబడితో.. 49శాతం వాటా కలిగి, ఒక్కో షేర్‌కు రూ.10 కన్న తక్కువ పొందడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఎలాగైతే ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభాన్ని ఎల్ఐసీ పరిష్కరించలేదో అలాగే యస్ బ్యాంక్ సంక్షోభాన్ని ఎస్బీఐ పరిష్కరించదని పేర్కొన్నారు. కొన్ని సార్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు వింటుంటే తాను ఆర్థిక మంత్రిగా, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు అనిపిస్తుందని చిదంబరం ఎద్దేవా చేశారు. 2014లో యస్ బ్యాంక్‌కు రుణాలు విడుదల చేసేటప్పుడు ఆర్బీఐ యస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఆర్థిక సంస్థల నిర్వహణలో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చిదంబరం అన్నారు. చదవండి: స్టాక్‌మార్కెట్‌కు వైరస్, యస్ బ్యాంక్ షాక్.. -
‘యస్ బ్యాంక్’ అసలు ఏం జరిగింది?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఐదవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ ‘యస్’ బ్యాంక్ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం గురువారం తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశంలో బ్యాంకుల కార్యకలాపాలను క్రమబద్ధీకరించే భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగి ‘యస్’ బ్యాంక్ నిర్వహణా బోర్డును రద్దు చేయడంతోపాటు కొత్త సీఈవోను నియమించింది. డిపాజిట్‌దారుల విత్డ్రాయల్స్పై ఆంక్షలు విధించింది. వైద్యం ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులకు మినహా నెలవారిగా ఖాతాదారులు 50 వేల రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ('యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు') నిరర్థక ఆస్తులు పెరగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతున్న యస్ బ్యాంక్ రక్షణకు ఆర్బీఐ శుక్రవారం ఓ వ్యూహాన్ని ప్రకటించింది. ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ‘ఎస్బీఐ’ కొనుగోలు చేయడమే ఆ వ్యూహం. దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా కుదేలైన నేటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్నాయి. అందుకనే ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటినీ విలీనం చేయాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. (యస్ బ్యాంకు సంక్షోభం) ఎస్బీఐ నుంచి 11,760 కోట్లు యస్ బ్యాంక్‌లో పది రూపాయలకు ఓ షేర్ చొప్పునా 49 శాతం షేర్లు కొనాలంటే ఎస్బీఐకి 11,760 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ అది ప్రభుత్వరంగ బ్యాంక్ అనిపించుకోదు. బ్యాంక్‌లో షేర్ హోల్డర్లకు వాటాను 11 శాతానికి పరిమితం చేస్తామని, మిగతా నలభై శాతం షేర్లు సంస్థల చేతుల్లో ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఓ సంస్థగా ఎల్ఐసీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. (‘యస్’బీఐ..!) 2004లో ప్రారంభమైన బ్యాంక్... 2004లో ప్రారంభమైన యస్ బ్యాంక్ పారిశ్రామికవేత్తలకు ఉదారంగా అప్పులు ఇవ్వడం ద్వారా అనతికాలంలోనే అభివద్ధి చెందింది. 2008లో బ్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు మరణించడం, బ్యాంక్ ప్రమోటర్‌గా రాణా కపూర్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బ్యాంక్ పతనం ప్రారంభమైందని ఆర్థిక నిపుణుల అంచనా. ఏ ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు పుట్టని పారిశ్రామిక సంస్థలు చాలా సులభంగా ఈ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాయి. ఆ సంస్థలో సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంక్ నిరర్థక ఆస్తులు 7.4 శాతానికి చేరుకున్నాయి. (రాణా కపూర్ నివాసంలో ఈడీ సోదాలు) యస్ బ్యాంక్ నుంచి కేఫ్ కాఫీడే, సీజీ పవర్, జెట్ ఏర్వేస్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, అనిల్ అంబానీ రిలయెన్స్ ఇన్ఫ్రా, సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్ భారీ ఎత్తున రుణాలు తీసుకన్నాయి. ఫిబ్రవరి ఒకటవ తేదీలోగా ఈ సంస్థలు బ్యాంక్‌కు వడ్డీ చెల్లించాల్సి ఉండగా దాదాపు అన్నీ విఫలమయ్యాయి. ఒక అంబానీ కంపెనీయే 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదని తెల్సింది. దేశ ప్రధానికి అంబానీ, సుభాష్ చంద్రలు మంచి మిత్రులనే ప్రచారం పారిశ్రామిక వర్గాల్లో ఉందన్న విషయం తెల్సిందే. (ఆర్థికమంత్రి భరోసా : షేరు రికవరీ) యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేకపోయినా 2015లో రఫేల్ జెట్ యుద్ధ విమానాల సరఫరాకు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో కలసి ఉమ్మడిగా అనిల్ అంబానీ కాంట్రాక్ట్ పొందిన విషయం తెల్సిందే. ఈ దశలో యస్ బ్యాంక్ మూత పడినా, పారిశ్రామికవేత్తల ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ చేసినా వారు, వారి సంస్థలు కోలుకోవడం కష్టం. బ్యాంకులో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ, కెనడాకు చెందిన అత్యంత ధనవంతుడు ఎర్విన్ సింగ్ బ్రాయిచ్ ముందుకు వచ్చారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. వారెవ్వరు ముందుకు రానప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్న? (‘యస్’ వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం) -
'యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు'
సాక్షి, అమరావతి: యస్ బ్యాంక్ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడు. రూ.1,300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యస్ బ్యాంక్‌కు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా దోచిపెట్టాడు. ఇంకెన్ని ఉన్నాయో?' అంటూ ధ్వజమెత్తారు. ఇందుకు ఆధారంగా ఆయన యస్ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. (చదవండి: స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు!) చంద్రబాబు Yes Bankను అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల TTD నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు.ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని ఉన్నాయో? pic.twitter.com/HBUALmyJGK — Vijayasai Reddy V (@VSReddy_MP) March 7, 2020 -
‘యస్’ వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం
సాక్షి, ముంబై: యస్ సంక్షోభం, ఆర్బీఐ డ్రాప్ట్ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్బీఐ వద్దకు చేరిందని తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ బృందం కృషి చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైనల్ నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల కాలానికి తమ రూ.5500 కోట్లుగా (26 శాతం) వుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడుల నిమిత్తం దేశీయ, అంతర్జాతీయంగా 23 మంది పెట్టుబడిదారులు తమను సంప్రదించారని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్బీఐ ముందు ఉంచుతామని చైర్మన్ చెప్పారు. 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకు 24 గంటలూ పని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు పూర్తి భద్రంగా వుంటుందని యస్ బ్యాంకు కస్టమర్లు, డిపాజిట్‌దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు. అలాగే ఎస్బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం వుండబోదమని ఆయన స్పష్టం చేశారు. చదవండి : ‘యస్’ సంక్షోభం : రాణా కపూర్‌కు లుక్ అవుట్ నోటీసు -
‘యస్’ సంక్షోభం: రాణా కపూర్ ఇంట్లో సోదాలు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మాజీ సీఎండీ రాణా కపూర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా ముంబై వర్లిలోని ఆయన ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. రాణాకపూర్ దేశం విడిచిపోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. కాగా 2015లో 80 నకిలీ సంస్థలకు రూ. 12,733 కోట్లు నిధులను మళ్లించినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. అలాగే దివాలా కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ (దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) కు భారీ ఎత్తున నిధులను మళ్లించబడినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. దీనికి బదులుగా భారీ ఎత్తున నగదు రాణా కపూర్ భార్య ఖాతాలో జమ అయ్యాయి. ఈ రుణాల స్వభావాన్ని, వాటి మంజూరులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారిస్తున్నట్టు చెప్పారు. యస్ బ్యాంకు సంక్షోభంపై ఆర్బీఐ రంగంలోకి దిగిన అనంతరం ఈడీ విచారణను వేగంతం చేసింది. మరోవైపు యస్‌బ్యాంకును స్వాధీనంలోకి చేసుకున్న ఆర్బీఐ 30 రోజులపాటు మారటోరియం విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అలాగే పునర్మిర్మాణ ప్రణాళికలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రాణా కపూర్ నివాసంలో ఈడీ సోదాలు
ముంబై: మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో (ముంబై) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని అవకతవకలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. -
కరోనా.. టెర్రర్!
కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలం కారణంగా ప్రపంచం మాంద్యంలోకి జారిపోతోందనే ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో శుక్రవారం మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం 74 స్థాయికి చేరువ కావడం, ముడి చమురు ధరలు 2.5 శాతం మేర క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 1,459 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్ చివరకు 894 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 1,014 పాయింట్లు కోల్పోయి 27,801 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 2.3 శాతం, నిఫ్టీ 2.4 శాతం, బ్యాంక్ నిఫ్టీ 3.5 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్టానికి, బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 721 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయాయి. చివర్లో తగ్గిన నష్టాలు.... గురువారం అమెరికా మార్కెట్, శుక్రవారం ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్ 857 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,460 పాయింట్లు, నిఫ్టీ 442 పాయింట్ల మేర క్షీణించాయి. చివర్లో నష్టాలు కొంత తగ్గాయి. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ తీసుకున్న చర్యల నేపథ్యంలో బ్యాంక్ షేర్లు బేర్మన్నాయి. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో విమానయాన, లోహ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం, యూరప్ మార్కెట్లు 3–4 శాతం రేంజ్లో క్షీణించగా, అమెరికా సూచీలు 2–3 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్‌లో వాటాను ఎస్బీఐ కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 6 శాతం నష్టంతో రూ.270 వద్దకు చేరింది. ► చైనాలో రిటైల్ అమ్మకాలు 85 శాతం తగ్గడంతో టాటా మోటార్స్ షేర్ 9% నష్టంతో రూ.114 వద్ద ముగిసింది. ► దాదాపు 600కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, పీఎన్బీ, ఇండిగో, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మొత్తం ఐదు షేర్లు సెన్సెక్స్‌ను 510 పాయింట్ల మేర పడగొట్టాయి. సెన్సెక్స్ నష్టాల్లో హెచ్డీఎఫ్సీ వాటా 140 పాయింట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 125 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 113 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 68 పాయింట్లు, ఎస్బీఐ వాటా 64 పాయింట్లుగా ఉన్నాయి. ► దాదాపు 400 మేర షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. కార్పొరేషన్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.3.30 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.29 లక్షల కోట్లు తగ్గి రూ.144.3 లక్షల కోట్లకు పడిపోయింది. -
యస్ బ్యాంకు సంక్షోభం
దేశవ్యాప్తంగా వేలాది శాఖలు, లక్షలాదిమంది డిపాజిటర్లు ఉన్న యస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయింది. పర్యవసానంగా ఆ సంస్థ బోర్డును రద్దు చేయడంతోపాటు ఖాతాదారులు బ్యాంకు నుంచి తీసుకునే సొమ్మును రూ. 50,000కు పరిమితం చేస్తూ రిజర్వ్‌బ్యాంకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతానికైతే ఇది నెలరోజులు అమల్లో వుంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఆ తర్వాతైనా పరిస్థితి చక్కబడుతుందో లేదో చూడాల్సివుంది. భారీ స్కాంతో పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ)బ్యాంకు కుప్పకూలి ఆర్నెల్లు దాటకుండానే ఒక పెద్ద బ్యాంకు చతికిలబడటం సాధారణ పౌరులకు బ్యాంకింగ్ రంగంపైనే సందేహాలు తలెత్తేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రకటన వెలువడింది మొదలుకొని దేశవ్యాప్తంగా యస్ బ్యాంకు శాఖల ముందు వేలాదిమంది క్యూ కట్టారు. నెలంతా శ్రమించి, బ్యాంకులో పడే జీతం డబ్బులు అందుకోవడానికి సిద్ధపడుతున్న వేతన జీవులకు ఇదొక షాక్. ప్రాణావసరమైన వైద్యం కోసమో, పిల్లల ఉన్నత చదువుల కోసమో, బిడ్డ పెళ్లి చేయడానికో బ్యాంకులో పొదుపు చేసుకుంటూ వస్తున్న మధ్య తరగతి డిపాజిటర్లందరికీ ఇది ఊహించని పరిణామం. ఏ రంగంలోనైనా ప్రైవేటు నిర్వహణలో వుండే సంస్థలు సమర్థ వంతంగా పనిచేస్తాయని, ప్రభుత్వ రంగ సంస్థల్లో అసమర్థత రాజ్యమేలుతుందని కొందరు నిపుణులు చేసే వాదనల్లో హేతుబద్ధత లేదని తాజా సంక్షోభం మరోసారి నిరూపించింది. యస్ బ్యాంకు సంక్షోభాన్ని గమనించి, అందులోని డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు చర్యలు మొదలుపెట్టడం సంతోషించదగ్గదే అయినా, పరిస్థితి ఇంతగా దిగజారేవరకూ పర్యవేక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతుంది. పీఎంసీ సంక్షోభంతో ఖాతాదారులు రూ. 11,617 మేర డిపాజిట్లు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ దాంతో పోలిస్తే యస్ బ్యాంకు విస్తృతి చాలా ఎక్కువ. ఇంత పెద్ద బ్యాంకు ఉన్నట్టుండి చేతులెత్తేస్తే వ్యక్తులు మాత్రమే కాదు... దాంతో ఆర్థిక లావాదేవీలు సాగిస్తున్న అనేకానేక బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా సంక్షోభంలో పడతాయి. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఆదేశాలతో ఈ నష్టజాతక బ్యాంకును ఆదుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లు రంగంలోకి దిగుతున్నాయంటున్నారు. సంక్షోభాలు తలెత్తినప్పుడు డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం అవసరమే. అటు ఎస్బీఐ, ఇటు ఎల్ఐసీ పచ్చగా కళకళ్లాడుతున్నాయి గనుక ఈ బాపతు సంస్థల్ని ఆదుకోవడం వాటికి పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. యస్ బ్యాంకు చిక్కుల్లో పడింది కార్పొరేట్ నిర్వహణ సక్రమంగా లేకేనని, దాన్ని సరిచేస్తే చక్కబడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అది మళ్లీ పట్టాలెక్కితే ఇప్పుడు పెట్టుబడిపెట్టే సంస్థలకు లాభాల పంట పండుతుందంటున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ అసలే అంతంత మాత్రంగా ఉన్న వర్తమాన ఆర్థిక మందగమనంలో అనుకోనిదేమైనా జరిగి, ఆ పెట్టుబడులు కాస్తా ఆవిరైతే? ఆ సంస్థలు పెట్టే పెట్టుబడులు కూడా ఎక్కడినుంచో ఊడిపడవు. సాధారణ డిపాజిటర్లు, పాలసీదారులు పొదుపు చేసే సొమ్ము నుంచే అవి పెట్టుబడులు పెట్టాలి. నష్టపోతే ఆ డిపాజిటర్ల, పాలసీదారుల హక్కుల్ని రక్షించేదెవరు? కనుకనే పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని రకాల ఆర్థిక సంస్థలపైనా పటిష్టమైన నిఘా వుండాలి. నిర్వాహకులు వాటిని సమర్థవంతంగా నడుపుతున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు కనిపెడుతూ వుండాలి. యస్ బ్యాంకు డైరెక్టర్ల బోర్డులో ఆర్బీఐ ప్రతినిధి కూడా వుంటారు. ఆ బ్యాంకు నిర్వహణ సక్రమంగా లేదని రెండేళ్లక్రితమే బయటపడినప్పుడు, సంస్థలో వరస రాజీ నామాలు జరుగుతున్నప్పుడు ఆర్బీఐ నిర్ణయాత్మకంగా ఎందుకు వ్యవహరించలేకపోయింది? దాన్ని పట్టాలెక్కించడానికి ఇన్నాళ్లుగా అది తీసుకున్న చర్యలేమిటి? విఫలమైవుంటే అందుకు బాధ్యులెవరు? రుణ వసూళ్లలో యస్ బ్యాంకు విఫలమవుతున్నదని, అందులో నిర్వహణపరమైన లోపాలు కొల్లలుగా వున్నాయని తేలినా, అది కొత్తగా రుణాలివ్వడాన్ని ఆర్బీఐ ఎందుకు నివారించ లేకపోయింది? గత నాలుగైదేళ్లుగా బ్యాంకులిచ్చే రుణాలపై ఆర్బీఐ కఠినమైన నిబంధనలు విధించింది. సక్రమంగా, సమర్థవంతంగా బకాయిలను వసూలు చేయగలిగితేనే కొత్త రుణాల మంజూరుకు అనుమతినిస్తామని చెప్పింది. ఆ నిబంధనలతో ఇతర బ్యాంకులన్నీ సగటున 9 శాతం మించి కొత్త రుణాలివ్వలేదని గణాంకాలు చెబుతున్నాయి. కానీ యస్ బ్యాంకు మాత్రం 30 శాతం మేర రుణాలెలా ఇవ్వగలిగిందన్నది కీలకమైన ప్రశ్న. ఈ బ్యాంకు సంక్షోభం మూలాలు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే వున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట వాస్త వమే కావొచ్చు. కానీ తర్వాతైనా యస్ బ్యాంకుపై పర్యవేక్షణలో లోపాలెందుకు చోటుచేసుకు న్నాయో, అందుకు బాధ్యులెవరో ప్రభుత్వం తేల్చాలి. యస్ బ్యాంకు సంక్షోభం పర్యవసానంగానైనా మన ఆర్థిర రంగ సంస్కరణలకు చర్యలు ప్రారంభించాలి. ఇంతక్రితం గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుతో మొదలెట్టి పలు బ్యాంకులు ఈ మాదిరిగానే సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయినా వాటినుంచి మనం గుణపాఠాలు నేర్వలేదు. దానికి బదులు లాభాల్లో నడిచే సంస్థల నుంచి పెట్టుబడులు పెట్టించి తాత్కాలికంగా గండం నుంచి గట్టెక్కే మార్గాలు వెదకడం అలవాటైంది. ప్రభుత్వ రంగ సంస్థలు తమకేది ప్రయోజనమో, ఎక్కడ లాభా లొస్తాయో తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం కాక, ఇలా పాలకులు చెప్పినట్టు చేయాల్సివస్తే అవి కూడా క్రమేపీ చిక్కుల్లో పడటం ఖాయం. సాధారణ పౌరుల్లో బ్యాంకింగ్ రంగంపై అవిశ్వాసం తలెత్తితే వాటిల్లో పొదుపు చేయడానికి వెనకాడతారు. అంతిమంగా ఇది ఆర్థికరంగ అవ్యవస్థకు దారితీస్తుంది. కనుక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. -
స్టాక్‌మార్కెట్‌కు వైరస్, యస్ బ్యాంక్ షాక్..
ముంబై : స్టాక్‌మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. కరోనా వైరస్ భయాలకు తోడు యస్ బ్యాంక్ సంక్షోభంతో శుక్రవారం మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్ ఏకంగా 85 శాతం నష్టపోయింది. బ్యాంక్‌ను కాపాడేందుకు చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇవ్వడంతో యస్ బ్యాంక్ షేర్ కొద్దిగా కోలుకున్నా 56 శాతం నష్టంతో ముగిసింది. ఇతర బ్యాంకింగ్ రంగ షేర్లూ నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడితో అన్ని రంగాల షేర్లూ నష్టాలు మూటగట్టుకున్నాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 894 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో 10,988 పాయింట్ల వద్ద క్లోజయింది. చదవండి : ‘యస్ బ్యాంక్‌ను నిలబెడతాం’ -
యస్ పరిణామాలపై మాజీ ఎండీ స్పందన
ప్రస్తుతం యస్ బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలు తనకు తెలియదని యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రానా కపూర్ తెలిపారు. రానా కపూర్ మాట్లాడుతూ..యస్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిషేదం విధించడానికి గల కారణాలు తనకు తెలియదని అన్నారు. గత 13 నెలలుగా తాను బ్యాంక్ వ్యవహారాలతో దూరంగా ఉన్నానని అన్నారు. గతంలో యస్ బ్యాంక్‌కు ఎండీగా సేవలు అందించానని.. 2019లో తన వాటాను ప్రయివేటు రుణదాతలకు విక్రయించానని కపూర్ తెలిపారు. యెస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ కూడా అదే సమయంలో తమ వాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. గతంలో ఎస్ బ్యాంక్‌కు రూ.3.4 లక్షల కోట్ల లాభాలను అర్జించడానికి కపూర్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. చదవండి: యస్‌లో పరిస్థితులు బాలేవు -
‘యస్ బ్యాంక్‌ను నిలబెడతాం’
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ హామీ ఇచ్చిందని, ఈ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్బీఐ అంగీకరించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్, వొడాఫోన్ వంటి కంపెనీలకు యస్ బ్యాంక్ భారీ రుణాలిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.యస్ బ్యాంక్‌లో ఇంతటి భారీస్ధాయిలో సమస్యలకు దారితీసిన పరిస్ధితులు, బాధ్యులెవరనే దానిపై ఆర్బీఐ నిగ్గుతేల్చాలని, వారిపై సత్వర చర్యలు చేపట్టేందుకు కేంద్ర బ్యాంక్ యస్ బ్యాంక్ పరిస్ధితులను తక్షణం మదింపు చేయాలని ఆమె పేర్కొన్నారు. యస్ బ్యాంకు ఆస్తులు, అప్పులు..ఉద్యోగులు వారి వేతనాలపై సంక్షోభ ప్రభావం ఉండబోదని మంత్రి భరోసా ఇచ్చారు. కనీసం ఏడాది వరకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అన్నారు. చదవండి : ఆర్థికమంత్రి భరోసా : షేరు రికవరీ -
‘ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ సర్కార్ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ‘యస్ బ్యాంక్ కాదు..మోదీ ఆయన ఆలోచనా విధానాలు ఆర్థిక వ్యవస్థను పతనం బాటన పయనింపచేస్తున్నాయ’ని ఆరోపించారు. యస్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ మారటోరియం, నెలకు ప్రతి ఖాతాకూ రూ 50,000 వరకూ విత్‌డ్రాయల్ పరిమితి విధించడం వంటి ఆంక్షల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యస్ బ్యాంక్ నిర్వాకంతో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక సంస్థలను ఎలా నియంత్రిస్తున్నదో తేటతెల్లమైందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. మొదట పీఎంసీ బ్యాంక్...ఇప్పుడు యస్ బ్యాంక్ రేపు మూడో బ్యాంక్ సంక్షోభానికి సిద్ధంగా ఉందా అని వరుస ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందా..? ఇంత జరిగినా మోదీ సర్కార్ ఏమైనా పట్టించుకుంటోందా..? అంటూ చిదంబరం నిలదీశారు. చదవండి : ఫోన్ పే సేవలకు యస్ బ్యాంకు సెగ -
ఆర్థికమంత్రి భరోసా : షేరు రికవరీ
సాక్షి, న్యూఢిల్లీ: యస్‌బ్యాంకు సంక్షోభంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. ఆర్బీఐ ఆంక్షలు, డిపాజిటట్‌దారుల ఆందోళన నేపథ్యంలోశుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆర్థికమంత్రి డిపాజిట్ దారుల సొమ్ముఎక్కడికీ పోదనీ, పూర్తి భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. ప్రతి డిపాజిటర్ డబ్బు సురక్షితంగా ఉందనీ, ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తో తాను నిరంతరం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. యస్ బ్యాంకు విషయంలో ఆర్బీఐ సరియైన పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరంగా తీసుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముందుస్తు పరిష్కారంకోసం బ్యాంకింగ్ రెగ్యులేటరీ చాలా త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్థికమంత్రి హామీతో యస్ బ్యాంకు షేరు భారీగా కోలుకుంది. ఉదయం ట్రేడింగ్‌లో 85 శాతం కుప్పకూలి రూ.5.65 వద్ద 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం పుంజుకుని ప్రస్తుతం రూ. 17 వద్ద కొనసాగుతోంది. చదవండి : చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు -
టీటీడీ చైర్మన్ ముందుచూపుతో తప్పిన ప్రమాదం
-
చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఆర్థిక వ్యవస్థ భద్రతే లక్ష్యంగా యస్ బ్యాంకు ఆంక్షల నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. అతి తొందరలోనే నెలరోజుల గడువు లోపే యస్‌బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. యస్ బ్యాంకు కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, వారి సొమ్ము భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. డిపాజిట్‌దారుల భద్రతకోసం ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మరోవైపు ఆర్బీఐ సరియైన సరైన నిర్ణయం తీసుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్రం,ఆర్బీఐ కృషిచేస్తోందన్నారు. యస్ బ్యాంకునకు విలువైన ఆస్తులున్నాయనీ ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాన్ని అన్వేషిస్తుందని భరోసా ఇచ్చారు. డిపాజిట్ దారులు ఆందోళన చెండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆస్తుల పరంగా ఒకపుడు దేశంలో నాలుగవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్నయస్ బ్యాంకు గత ఏడాది కాలంలో ఆర్థిక ఇబ్బందులు, మూల కొరతతో ఇబ్బందులకుతోడు ఆర్బీఐ తాజా నిర్ణయంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన మారటోరియం, విత్ డ్రా ఆంక్షలతో స్టాక్‌మార్కట్లో యస్‌బ్యాంకు లో షేర్లలో అమ్మకాల వెల్లువెత్తింది. ఎస్బీఐ యస్‌బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయనుందనే వార్తలతో నిన్న 30 శాతం పైగా ఎగియగా, ఇవాళ ఆ లాభాలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. 75 శాతం క్షీణించి 9 స్థాయికి పడిపోయింది. 84.93 శాతం క్షీణించి ఆల్ టైం కనిష్టానికి చేరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నెల రోజుల పాటు యస్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం (మారటోరియం) విధించింది. బ్యాంక్ బోర్డ్‌ను కూడా రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకుంది. ముఖ్యంగా యస్ బ్యాంక్ డిపాజిటర్లు రూ. 50 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే ఆంక్షలు విదించింది. ప్రత్యేక అవసరాలు (పెళ్లి, ఆరోగ్యం, తదితర) సందర్భంలో మాత్రం రూ.50వేలకు మించి పొందే అవకాశం ఉంది. దీంతో ఆందోళనలో పడిపోయిన ఖాతాదారులు తమ సొమ్ము కోసం దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. అటు యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నట్టు జేపీ మోర్గాన్ ప్రకటించింది. చదవండి : ఫోన్ పే సేవలకు యస్ బ్యాంకు సెగ -
ఎస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మానిటోరియం
-
ఫోన్ పే సేవలకు యస్ బ్యాంకు సెగ
సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు సంక్షోభం డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేను చుట్టుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫోన్‌పే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అటు యస్ బ్యాంకు ఖాతాదారుల్లోను, ఫోన్ పే యూజర్లలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై ఫోన్ పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. దీర్ఘకాలిక అంతరాయానికి చింతిస్తున్నామన్నారు. తమ బ్యాంకింగ్ భాగస్వామి యస్ బ్యాంకుపై ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించడంతో ఫోన్ పే సేవలు ప్రభావితమయ్యాయని వివరించారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సమ్యను పరిష్కరిస్తామని ఆయన తన కస్టమర్లకు హామీ ఇచ్చారు. తాత్కాలిక నిషేధ నిబంధనల ప్రకారం కరెంట్ అకౌంట్లతో కలుపుకొని ఖాతాదారులంతా కూడా ఏప్రిల్ 3 దాకా రూ. 50 వేలకు మించి నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు భారీ నష్టాలను మూటగట్టుకుంది. దాదాపు 89 శాతం కుప్పకూలి ఆల్ టైం కనిష్టానికి చేరింది. (చదవండి: ఓ మై గాడ్... వెంకన్నే రక్షించాడు!) కాగా రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’! చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు భగ్గుమన్న బంగారం -
ఓ మై గాడ్... వెంకన్నే రక్షించాడు!
సాక్షి, అమరావతి: టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంపై భక్తులు, టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ నుంచి కొద్ది నెలల క్రితమే రూ.1,300 కోట్ల విలువైన డిపాజిట్లను ఉపసంహరించుకొని వాటిని ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి మరలించారు. యస్ బ్యాంక్‌లో ఖాతాదారులు రూ.50,000 మించి తీసుకోవడానికి వీలు లేదంటూ ఆర్బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. గత ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన విషయం తెలియడంతో చైర్మన్ ఆ మొత్తాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులోకి తరలించారు. డిపాజిట్లు ఉపసంహరించుకోవద్దంటూ తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో యస్ బ్యాంకు నుంచి రూ.1,300 కోట్లు ఉపసంహరించుకున్నారు. చదవండి : విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’! -
విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’!
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్డ్రాయల్స్పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుంది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే.. మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, రేటింగ్ డౌన్‌గ్రేడ్స్ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్ బ్యాంక్ మేనేజ్మెంట్కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం. తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్ బ్యాంక్ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది. ఎస్బీఐ చేతికి..? ఎల్ఐసీతో కలిసి టేకోవర్ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘యస్’ నుంచి ‘నో’ వరకూ...! ► జూన్ 12, 2018: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం ► సెప్టెంబర్ 19, 2018: రాణా కపూర్ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ► సెప్టెంబర్ 21, 2018: యస్ బ్యాంక్ షేర్ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి ► సెప్టెంబర్ 28, 2018: ప్రమోటర్ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్ ప్రకటన. యస్ బ్యాంక్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్ వాచ్ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్ రేటింగ్స్ వెల్లడి ► అక్టోబర్ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం ► అక్టోబర్ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్‌టు మార్కెట్ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది. ► నవంబర్ 14, 2018: చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన వసంత్ గుజరాతీ ► నవంబర్ 19, 2018: మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా ► నవంబర్ 27, 2018: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్‌చేసిన మూడీస్ సంస్థ. ► మార్చి 1, 2019: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్నీత్ గిల్. 3 శాతం ఎగసిన షేర్ ధర ► మార్చి 5, 2019: స్విఫ్ట్ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్బీఐ ► ఏప్రిల్ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు ► ఏప్రిల్ 29, 2019: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్ సంస్థ. ► ఏప్రిల్ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్ ► మే 9, 2019: యస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ రేటింగ్‌ను ప్రధాన రేటింగ్ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్ గ్రేడ్ చేశాయి. ► మే 15, 2019: యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నియామకం ► జూలై 18, 2019: రాణా కపూర్ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్ షేర్ ► ఆగస్టు 10, 2019: సీఎఫ్ఓగా అనురాగ్ అద్లాఖ నియామకం ► సెప్టెంబర్ 21, 2019: యస్ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్. 6.89 శాతానికి తగ్గిన వాటా ► అక్టోబర్ 3, 2019: యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా ► నవంబర్ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్ల నష్టాలు ► డిసెంబర్ 6, 2019: యస్ బ్యాంక్‌కు నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్. 9 శాతానికి పైగా పతనమైన షేర్ ధర ► డిసెంబర్ 17, 2019: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యస్ బ్యాంక్ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు ► జనవరి 10, 2020: కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్ మెంటర్ ఉత్తమ్ ప్రకాశ్ రాజీనామా ► జనవరి 13, 2020: ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్. 6 శాతం పతనమైన షేర్ ధర ► మార్చి 5, 2020: ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్... యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్. షేరు టార్గెట్ @ రూ. 1 అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, జేపీ మోర్గాన్ యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్ వివరించింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్ బ్యాంక్ షేరు.. ఆ తర్వాత టేకోవర్ వార్తలతో బీఎస్ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది. -
ఓ మై గాడ్... వెంకన్న రక్షించాడు
సాక్షి, తిరుపతి: యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో ఇప్పటికే ఆర్బీఐ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తాజాగా యస్ బ్యాంక్ పరిస్థితిపై ప్రమాద ఘంటికలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ముందస్తుగానే గుర్తించింది. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొన్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్లను ఉపసంహరణ చేశారు. గత టీడీపీ హయాంలో యస్ బ్యాంకు సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు ఉన్న విషయం తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ కాగానే డిపాజిట్ల వ్యవహారంపై దృష్టి సారించారు. నాలుగు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకుని పరిశీలించారు. (యస్‌లో పరిస్థితులు బాలేవు) యస్ బ్యాంకు పరిస్థితులపై ప్రమాదకర ఘంటికలను టీటీడీ ముందుగానే గుర్తించి.. డిపాజిట్లను వెంటనే రిటర్న్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్లను ఉపసంహరించుకోవద్దని యస్ బ్యాంక్ టీటీడీపై ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖాతరు చేయలేదు. అదే విధగంగా ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సుబ్బారెడ్డి సూచనలు చేశారు. చివరకు యస్ బ్యాంకు నుంచి రూ.1300 కోట్ల డిపాజిట్లను టీటీడీ ఉపసంహరణ చేసుకుంది. -
యస్ బ్యాంకుపై ఎస్బీఐ చీఫ్ కీలకవ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వివాదాలు, సమస్యలసుడిగుండంలో చిక్కుకున్న ప్రయివేటు బ్యాంకు యస్‌బ్యాంకుపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు కొన్ని పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయంటూ సానుకూల సంకేతాలిచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యస్‌బ్యాంకును కుప్పకూలనివ్వమని, ఏదో ఒక పరిష్కారం తప్పక లభిస్తుందని వ్యాఖ్యానించారు. మూలధన సమీకరణ కోసం యస్‌బ్యాంక్ విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్బీఐ ఛీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్బీఐని కోరవచ్చన్న అంచనాలకు రజనీశ్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్‌తో మార్కెట్లో కీలకమైన బ్యాంకుగా ఉన్న యస్‌బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. అంతేకాదు యస్‌బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదంటూ రజనీశ్ పేర్కొనడం గమనార్హం. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రజనీశ్ వ్యాఖ్యల నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది. కాగా గత నెల్లో యస్‌బ్యాంకును బయటపడేసేందుకు ఎస్బీఐ ఎలాంటి ప్రయత్నం చేయదని రజనీశ్ వెల్లడించడం గమనార్హం. కేవలం నెలరోజుల్లోనే ఆయన అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రమోటర్ రానా కపూర్ ఆకస్మికంగా నిష్క్రమించిన తరువాత బ్యాంకు తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది. ఆస్తి నాణ్యత క్షీణించడం, ఎన్పిఏ, మూలధన పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో గత సంవత్సరంలో యస్ బ్యాంకు 80 శాతానికి పైగా పడిపోయాయి. జనవరి 10 న జరిగిన బోర్డు సమావేశం రుణదాత అర్హత కలిగిన సంస్థాగత నియామకం (క్యూఐపి) లేదా, ఏదైనా ఇతర ప్రైవేటు ఈక్విటీ లేదా అప్పు ద్వారా రూ .10,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ నిధుల సేకరణపై చర్చించడానికి, అంతకుముందు రూ .800 కోట్లుగా ఉన్న అధికారిక మూలదనాన్ని రూ .1,100 కోట్లకు విస్తరించేందుకుగాను, ఫిబ్రవరి 7 న తన వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. -
యస్‌లో పరిస్థితులు బాలేవు
న్యూఢిల్లీ: యస్ బ్యాంకులో పద్ధతులు, వ్యవహారాలు దిగజారిపోతున్నాయంటూ స్వతంత్ర డైరెక్టర్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ బాంబు పేల్చారు. ఈ విషయమై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ‘‘యస్ బ్యాంకు ఇండిపెండెంట్ డైరెక్టర్, ఆడిట్ కమిటీ చైర్మన్ పదవులతో పాటు, బోర్డుకు సంబంధించిన అన్ని కమిటీల్లో సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నా’’ అంటూ బ్యాంకు తాత్కాలిక చైర్మన్ బ్రహ్మ్‌దత్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో అగర్వాల్ పేర్కొన్నారు. కార్పొరేట్ పాలనా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, నిబంధనల అమలులో వైఫల్యం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు.. ముఖ్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్ గిల్, సీనియర్ గ్రూపు ప్రెసిడెంట్ రాజీవ్ ఉబోయ్, లీగల్ హెడ్ సంజయ్ నంబియార్ బ్యాంకును నిర్వహిస్తున్న తీరు పట్ల ఆయన తన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యస్ బ్యాంకు, లక్షలాది డిపాజిటర్లు, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కీలక అం శాల పట్ల ఎప్పటికప్పుడు ఆందోళనలు వ్యక్తం చేశాను. నా విధుల నిర్వహణలో వీటి పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నించా. నా రాజీనామాతో సంబంధం లేకుండా, బ్యాంకు కుదుటపడి, భాగస్వాములు, వాటాదారుల ప్రయోజనాలను మీ నాయకత్వంలో కాపాడుతుందని ఆశిస్తున్నాను’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. తక్షణం జోక్యం చేసుకోవాలి. ఇవే అంశాలపై సెబీ చైర్మన్ అజయ్ త్యాగికి ఈ నెల 9న అగర్వాల్ ఓ లేఖ రాశారు. తక్షణమే సెబీ జోక్యం చేసుకోవాలని కోరారు. బ్యాంకు సీఈవో, ఎండీ రవనీత్ గిల్ గతేడాది అక్టోబర్ 31న బ్యాంకు 1.2 బిలియన్ పెట్టుబడుల ఆఫర్‌ను అందుకుందని మౌఖింగా చెప్పినట్టు లేఖలో పేర్కొన్నారు. అగర్వాల్ అర్హతపై సమీక్ష.. స్వంతంత్ర డైరెక్టర్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ రాజీనామా పై యస్ బ్యాంకు స్పందించింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆదేశాల మేరకు అగర్వాల్ ‘ఫిట్ అండ్ ప్రాపర్’ అర్హత ప్రమాణాలకు తగిన వారా, కాదా? అన్న దానిపై బోర్డు చర్చించడానికి ముందుగా ఆయన రాజీనామా సమర్పించినట్టు యస్ బ్యాంకు పేర్కొంది. బ్యాంకు నిర్వహణపై అగర్వాల్ లేవనెత్తిన అభ్యంతరాలను బ్యాంకు బోర్డు తప్పకుండా పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. అగర్వాల్ గతంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా, సత్యం కంప్యూటర్స్ అకౌంటింగ్ స్కామ్‌లో ఆడిటర్ల పాత్రను నిగ్గుతేల్చే కమిటీలో పనిచేశారు. రూ.10వేల కోట్ల సమీకరణకు యస్‌బ్యాంకు నిర్ణయం ముంబై: యస్ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించాలని శుక్రవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అర్హులైన సంస్థాగత మదుపరులకు (క్యూఐపీ) లేదా ఏడీఆర్, జీడీఆర్, ఎఫ్‌సీసీబీ తదితర మార్గాల్లో ఈ నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించింది. దీనిపై వాటాదారుల అనుమతి కోరనున్నట్టు బ్యాంకు ప్రకటించింది. కెనడాకు చెందిన ఎర్విన్‌సింగ్ బ్రెయిచ్ 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆఫర్‌ను తిరస్కరించింది. ఎర్విన్‌సింగ్ బ్రెయిచ్ నుంచి నవీకరించబడిన ప్రతిపాదన వచ్చిందని, అయితే, ఆ ఆఫర్ విషయంలో ముందుకు వెళ్లరాదని నిర్ణయించినట్టు యస్ బ్యాంకు తెలిపింది. అలాగే, సిటాక్స్ హోల్డింగ్స్, సిటాక్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు నుంచి వచ్చిన 500 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నామని స్పష్టం చేస్తూ.. తదుపరి బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
కోటక్ ఖాతాలో యస్ బ్యాంక్!
ముంబై: యస్ బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి కోటక్ మహీంద్రా బ్యాంకే కరెక్టని ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. అయితే విలీన ప్రయత్నాలు లేవని యస్‌బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు స్పష్టం చేశాయి. కోటక్‌కే ఆ సత్తా... యస్‌బ్యాంక్‌ను కొనుగోలు చేయగల సత్తా ఉదయ్ కోటక్‌కే ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. యస్‌బ్యాంక్‌ను టేకోవర్ చేయడానికి భారీగా నిధులు అవసరమని, ఆ సత్తా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కే ఉందని వివరించారు. ఇక్కడ జరిగిన టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. కాగా ఇదే అభిప్రాయాన్ని యాక్సిస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ అమితాబ్ చౌధురి వ్యక్తం చేశారు. తమ బ్యాంక్ ఇప్పటికింకా చిన్నదేనని, పెద్ద బ్యాంక్‌గా వృద్ధి చెందే ప్రయత్నాలు చేస్తున్నామని, పెద్ద బ్యాంక్‌గా మారినప్పుడే ఇతర బ్యాంక్‌లను కొనుగోలు చేయగలమని ఆయన పేర్కొన్నారు. ఊసుపోని ఊహాగానాలు... ఈ కొనుగోలు వార్తలు ఊసుపోని ఊహాగానాలని యస్ బ్యాంక్ చీఫ్ రవ్నీత్ గిల్ కొట్టిపడేశారు. విలీనప్రయత్నాలు ఏమీ లేవని తెగేసి చెప్పారు. కాగా విలీన వ్యాఖ్యలు ఆయా వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమేనని, తమకెలాంటి సంబంధం లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ రోహిత్ రావు పేర్కొన్నారు. యస్‌బ్యాంక్ చీఫ్‌గా రవ్నీత్ గిల్ పగ్గాలు చేపట్టి మొండి బకాయిల గుర్తిపు ప్రక్రియను మరింత వేగిరం చేశారు. మరోవైపు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలప్రదం కావడం లేదు. దీంతో ఈ బ్యాంక్‌ను చేజిక్కించుకోనే యత్నాలు ఊపందుకుంటున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక, పుష్కలమైన నిధులతో పటిష్టంగా ఉన్న కోటక్ బ్యాంక్... చిన్న బ్యాంక్‌లను టేకోవర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. బలమైన బ్యాంకులే నిలుస్తాయ్ బలమైన బ్యాంక్‌లే నిలబడగలుగుతాయని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. బలం ఉన్న జీవులే మనగలుగుతాయని చార్లెస్ డారి్వన్ పేర్కొన్నారని, ఈ సిద్ధాంతం ఇప్పుడు భారత్ బ్యాంకులకూ వర్తిస్తుందని వివరించారు. బలహీనమైన కంపెనీలను బలమైన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయని, వివిధ రంగాల్లో విలీనాల జోరు పెరుగుతోందని పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్న ప్రైవేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో విలీనమైన దృష్టాంతాలు గతంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. -
యస్ బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి
ముంబై: యస్ బ్యాంక్‌లో పెట్టుబడుల ప్రతిపాదనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని భావించగా, కేవలం 50 కోట్ల డాలర్లకే బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. సైటాక్స్ హోల్డింగ్స్, సైటాక్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ప్రతిపాదించిన ఈ ఆఫర్ విషయంలో సానుకూలంగా ఉన్నామని మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం యస్ బ్యాంక్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని తదుపరి బోర్డ్ సమావేశంలో తీసుకుంటామని వెల్లడించింది. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ ప్రతిపాదించిన 120 కోట్ల బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆఫర్‌పై డైరెక్టర్ల బోర్డు ఇంకా పరిశీలన జరుపుతోందని పేర్కొంది. 200 కోట్ల డాలర్ల దాకా పెట్టుబడులు సమీకరించే దిశగా ఇతరత్రా ఇన్వెస్టర్ల ప్రతిపాదనలపై కసరత్తును కొనసాగిస్తున్నట్లు యస్ బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు 2018 ఆగస్టులో ప్రమోటరు, సీఈవో రాణా కపూర్ నిష్క్రమించినప్పట్నుంచి యస్ బ్యాంక్ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్న సంగతి తెలిసిందే. మొండిబాకీల భారం, మూలధనంపరమైన సమస్యల కారణంగా రుణ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఇన్వెస్టర్ల నుంచి 200 కోట్ల డాలర్ల దాకా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు యస్ బ్యాంక్ గత నెలలో వెల్లడించింది. వీటినే ప్రస్తుతం మదింపు చేస్తోంది. తాజా వార్తల నేపథ్యంలో యస్‌బ్యాంక్ షేర్ 10 శాతం నష్టంతో రూ.50.55 వద్ద ముగిసింది. -
కాఫీడే టెక్ పార్క్ విక్రయానికి యస్ బ్యాంకు బ్రేక్!
బెంగళూరు: కాఫీడే ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్ పార్క్– బ్లాక్‌స్టోన్ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ నడుస్తోంది. ఈ కంపెనీ యస్ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600– 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్ బైండింగ్ ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో బీఎస్ఈలో కాఫీడే షేరు సోమవారం 9 శాతం నష్టంతో రూ.43.85 వద్ద క్లోజయింది. -
2 బిలియన్ డాలర్ల సమీకరణలో యస్ బ్యాంక్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా 2 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. శుక్రవారం బోర్డు సమావేశం అనంతరం స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ (ఇంకా చర్చలు జరుగుతున్నాయి) 1,200 మిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థ 120 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఇతరత్రా కార్పొరేట్ల కుటుంబ కార్యాలయాలకు సంబంధించి సిటాక్స్ హోల్డింగ్స్ ఫ్యామిలీ ఆఫీస్ 500 మిలియన్ డాలర్లు, జీఎంఆర్ గ్రూప్ అండ్ అసోసియేట్స్ 50 మిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా ఫ్యామిలీ ఆఫీస్ 25 మిలియన్ డాలర్లు, ప్రముఖ ఇన్వెస్టరు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా 25 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశారు. 2 వారాలు లేదా 26 వారాల స్టాక్ సగటు ధర (ఏది ఎక్కువైతే అది) ప్రాతిపదికన షేర్ల కేటాయింపు ఉండనుంది. దీనిపై డిసెంబర్ 10న యస్ బ్యాంక్ బోర్డు మరోసారి భేటీ కానుంది. శుక్రవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు.. 2.5% క్షీణించి రూ. 68.30 వద్ద ముగిసింది. -
డిసెంబర్ ఆఖరుకల్లా నిధుల సమీకరణ
ముంబై: నిధుల వేటలో ఉన్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్.. ప్రతిపాదిత రూ. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,462 కోట్లు) పెట్టుబడుల సమీకరణ ప్రక్రియను డిసెంబర్ ఆఖరునాటికల్లా పూర్తి చేయనుంది. అలాగే, కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో కూడా స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 21,156 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని యస్ బ్యాంక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నార్త్ అమెరికన్ ఫ్యామిలీ ఆఫీస్’ ఇప్పటికే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆఫర్ ఇచి్చంది. దీనిపై నవంబర్ ఆఖరులోగా ఆ సంస్థకు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుందని విలేకరులకు యస్ బ్యాంక్ సీఈవో రవ్నీత్ గిల్ తెలిపారు. ఆ సంస్థ నుంచి లేదా పలువురు ఇన్వెస్టర్లందరి నుంచి కలిపి డిసెంబర్ ఆఖరు నాటికి నిధుల సమీకరణ జరపగలమని పేర్కొన్నారు. రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవాలని నిర్దేశించుకున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్ల అవసరాలకు ఈ నిధులు సరిపోగలవని గిల్ చెప్పారు. మరోవైపు, సింగపూర్ సంస్థ డీబీఎస్.. తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉందంటూ వచి్చన వార్తలను గిల్ కొట్టిపారేశారు. అటు డీబీఎస్ కూడా ఈ వార్తలను ఖండించింది. -
యస్ బ్యాంక్ నష్టం రూ.629 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.629 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్ల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి చూస్తే ఇది ఈ బ్యాంక్‌కు రెండో త్రైమాసిక నష్టం. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.951 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రూ.96 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించింది. గత క్యూ2లో రూ.8,714 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.8,348 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 3.3%గా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 2.7%కి తగ్గింది. గత క్యూ2లో 1.60 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.39 శాతానికి ఎగిశాయి. అలాగే నికర మొండి బకాయిలు 0.84% నుంచి 4.35% చేరాయి. తాజా మొండి బకాయిలు రూ.5,950 కోట్లు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.943 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు పెరిగాయి. ►ఆర్థిక ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేర్ 5.4 శాతం నష్టంతో రూ.66.6 వద్ద ముగిసింది. -
నిధుల వేటలో సక్సె(య)స్!
న్యూఢిల్లీ: నిధుల కొరత, మొండిపద్దులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు భారీ ఊరట లభించింది. 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,500 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఓ ఇన్వెస్టర్ ముందుకొచ్చారు. కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకి ప్రతిగా ఈ మేరకు ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్ నుంచి ఆఫర్ వచ్చినట్లు యస్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. బ్యాంకు బోర్డు, నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులకు లోబడి తాజా పెట్టుబడులు ఉంటాయని తెలిపింది. ‘మరిన్ని పెట్టుబడుల కోసం ఇతర దేశ, విదేశ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు కొనసాగుతాయి‘ అంటూ బ్యాంకు వివరించింది. వ్యాపార వృద్ధికి దోహదపడేలా మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తున్నామని, పలు విదేశీ సంస్థలతో పాటు దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని యస్ బ్యాంకు గత నెలలో స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఆగస్టులో యస్ బ్యాంక్ రూ. 1,930 కోట్లు సమీకరించింది. నియంత్రణ సంస్థ ఏం చేస్తుందో.. పెట్టుబడుల వార్త వెల్లడి కావడానికి ముందు యస్ బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వద్ద తిరుగాడింది. ఆ ప్రకారం చూస్తే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి చాలా భారీ మొత్తమే కానుంది. సంస్థ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకమున్నందుకే ఇన్వెస్టర్లు కాస్త ఎక్కువ రేటు ఇచ్చేందుకు కూడా సిద్ధపడి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రూ. 100 వద్ద షేరు కేటాయించిన పక్షంలో విదేశీ ఇన్వెస్టరుకు 25 శాతం వాటా లభించవచ్చు. అంతకు మించి 26 శాతం వాటా తీసుకున్న పక్షంలో మైనారిటీ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మొత్తం వ్యవహారం జటిలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో ఏ ఒక్క ఇన్వెస్టరుకు 10 శాతానికి మించి వాటాలు తీసుకోవడానికి లేదు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సడలించే అంశాన్ని పరిశీలించవచ్చని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం యస్ బ్యాంకు దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో క్యాథలిక్ సిరియన్ బ్యాంకులో ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా ఇదే తరహాలో మెజారిటీ వాటాలు తీసుకునేందుకు అంగీకరించినందున.. తాజాగా అదే తరహా యస్ బ్యాంకు డీల్ విషయంలో ఆర్బీఐ కాదనకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. 24 శాతం ఎగిసిన షేరు.. విదేశీ ఇన్వెస్టరు పెట్టుబడుల వార్తలతో గురువారం యస్ బ్యాంక్ షేరు భారీగా ఎగిసింది. బీఎస్ఈలో ఒక దశలో ఏకంగా 35% పెరిగి రూ.76.65 స్థాయిని తాకింది. చివరికి 24% పెరిగి రూ. 70.45 వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో 39% (రూ.78.70కి) ఎగిసిన షేరు ఆ తర్వాత సుమారు 24 శాతం లాభంతో రూ.70.30 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3,500 కోట్లు ఎగిసి రూ.17,967 కోట్లకు చేరింది. -
మైక్రోసాఫ్ట్‌కు ‘యస్’..?
న్యూఢిల్లీ: తాజాగా పెట్టుబడులు సమకూర్చుకోవడం, డిజిటల్ కార్యకలాపాల జోరును మరింత పెంచుకోవడం లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామి కోసం యస్ బ్యాంక్ అన్వేషిస్తోందని సమాచారం. దీంట్లో భాగంగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌తో పాటు మరో రెండు అగ్రశ్రేణి దిగ్గజ కంపెనీలతో ఈ బ్యాంక్ సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడు వారాల క్రితం మొదలైన ఈ చర్చలు ఫలప్రదమైతే, 15 శాతం వాటాకు సమానమైన తాజా ఈక్విటీ షేర్లను ఆయా కంపెనీలకు యెస్ బ్యాంక్ జారీ చేస్తుంది. మైక్రోసాఫ్ట్‌తో యస్‌బ్యాంక్ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అన్నీ అనుకూలిస్తే, యెస్ బ్యాంక్‌లో మైక్రోసాఫ్ట్ రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. మైక్రోసాఫ్ట్ ముందుకు వస్తే, ఈ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్, పేమెంట్ సిస్టమ్ ప్రణాళికలకు కూడా మరింత జోష్ వస్తుంది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్‌కు ఒక డైరెక్టర్ పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ వాటా విక్రయానికి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌ను కూడా యస్ బ్యాంక్ నియమించిందని, ఈ విషయాలన్నీ ఆర్బీఐకు తెలిసే జరుగుతున్నాయని సమాచారం. కాగా ఈ విషయమై తామేమీ వ్యాఖ్యానించలేమని మైక్రోసాఫ్ట్, యస్ బ్యాంక్ ప్రతినిధులు స్పష్టం చేశారు. నిధుల సమీకరణ సాధారణ విషయమే... కాగా వ్యాపార అవసరాలకు కావలసిన మూలధనం సమీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని యస్ బ్యాంక్ సోమవారం తెలిపింది. సెక్యూరిటీల జారీ ద్వారా ఇన్వెస్టర్లు, సంస్థల నుంచి మూలధనాన్ని సమీకరించడం సాధారణ విషయమేనని పేర్కొంది. వ్యాపార అవసరాలు, నియంత్రణ సంస్థల నిబంధనల పాటింపు కోసం నిధులు అవసరమని వివరించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ బ్యాంక్ వివరణ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్, పీఈ సంస్థల నుంచి నిధుల సమీకరించడానికి యస్ బ్యాంక్ సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యెస్ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. నిధుల సమీకరణ కోసం వివిధ సంస్థలతో సంప్రదింపుల జరపడం సాధారణ విషయమేనని యస్ బ్యాంక్ పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్న వార్తలు తమకు తెలియవని వివరించింది. ఇలాంటి వార్తలపై వ్యాఖ్యానించడం తమ విధానం కాదని పేర్కొంది. కొన్ని పీఈ(ప్రైవేట్ ఈక్విటీ) సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. టీపీజీ, కార్లైల్ గ్రూప్, ఫరలూన్ క్యాపిటల్ సంస్థలు యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుత ధర వద్ద యస్ బ్యాంక్ ఆకర్షణీయంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఇటీవలనే ఈ బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) విధానంలో రూ.1,930 కోట్ల నిధులు సమీకరించింది. షేరు జోరు.. నిధుల కోసం మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తల కారణంగా యస్ బ్యాంక్ షేర్ సోమవారం కూడా జోరుగా పెరిగింది. స్టాక్ మార్కెట్ నష్టపోయినా ఈ షేర్ 8 శాతం లాభంతో రూ. 45.60 వద్ద ముగిసింది. కాగా, గత రెండు రోజుల్లో షేరు 40 శాతం మేర ఎగబాకడం గమనార్హం. గతేడాది ఆగస్టులో రూ.404గా ఉన్న షేర్ ధర ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం పతనమై తాజాగా 29 కనిష్టాన్ని కూడా తాకింది. మొండి బకాయిలు భారీగా పెరగడం, ఇతర పాలనాపరమైన సమస్యలు బ్యాంక్‌పై ప్రభావం చూపుతున్నాయి. -
యస్ బ్యాంకునకు ఊరట : షేరు జంప్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణదాత యస్‌బ్యాంకునకు భారీ ఊరట లభించింది. ఇటీవల పాతాళానికి పడిపోయిన బ్యాంకు షేరు గురువారం నాటి ట్రేడింగ్ ఆరంభంలోనే ఏకంగా 20శాతం ఎగిసింది. తద్వారా వరుస ఐదు రోజుల పతనానికి చెక్ పెట్టింది. బ్యాంక్ ఫైనాన్షియల్, నిర్వహణ, అంతర్గత పరిస్థితులు పటిష్టంగా ఉన్నట్లు యస్ బ్యాంక్ యాజమాన్యం తాజాగా పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లిక్విడిటీ పరిస్థితులు సైతం మెరుగ్గా ఉన్నాయని స్టాక్ ఎక్చ్సేంజీ సమాచారంలో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లతో భారీగా లాభపడింది. దాదాపు ఎనిమిది నెలల్లో ఇది అతిపెద్ద లాభం. ప్రమోటర్ రాణాకపూర్, తదితరులు 2.16 శాతం వాటాను విక్రయించడంతో బ్యాంకులో వాటా 4.72 శాతానికి పరిమితమైనట్లు యస్ బ్యాంక్ ఇప్పటికే తెలిపింది. రాణా కపూర్ తనఖా పెట్టిన 10 కోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు యస్‌బ్యాంక్ తెలిపింది. ఇప్పటికి తమ బ్యాంకు ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. డిపాజిట్లు, నిధుల లభ్యతపై కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు ఉద్దేశ్యం పూర్తిగా తెరపైకి వచ్చాయని, కనీస మూలధన పరిమితికి మించి తమ వద్ద నిధుల లభ్యత ఉన్నట్లు తెలిపింది. షేర్ల పతనానికి అడ్డుకట్ల వేసేందుకు తక్షణ చర్యలు ప్రారంభిస్తామని ఎక్చ్సేంజీలకు ఇచ్చిన వివరణలో పేర్కొంది. మరోవైపు బ్యాంక్‌ను కష్టాల కడలి నుంచి గట్టేక్కించే అంశంలో మేనేజ్మెంట్పై తమ పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటర్ అశోక్ కపూర్ , ఆమె కుమార్తె షాగున్ గొగోయ్ ప్రకటించడం ఇన్వస్టెర్లకు మరింత ఊతమిచ్చింది మరోవైపు బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా చేసినట్లు సీఈవో రవ్నీత్ గిల్ గురువారం ప్రకటించారు. 2004లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్యాంకులో చేరిన మోంగా తదనంతరకాలంలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగారు. కాగా మంగళవారం తనఖా షేర్లను ఇన్స్టిట్యూషన్స్ విక్రయించడంతో దాదాపు 30 శాతం పడిపోయింది. రూ. 29 వద్ద షేరు ఒక దశాబ్దం కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
యస్ బ్యాంక్‌లో కపూర్
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్‌లో ప్రమోటర్ సంస్థ, మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎమ్‌సీపీఎల్) 2.3 శాతం వాటాకు సమానమైన 5.8 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.58.1 ధరకు విక్రయించింది. వీటి విలువ రూ.334 కోట్లు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్(ఆర్‌నామ్) ఎన్‌సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్బీఐ నిబంధనల ప్రకారం యస్‌బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే క్రమంలో భాగంగా మోర్గాన్ క్రెడిట్స్ ఈ షేర్లను విక్రయించింది. యస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు చెందిన ముగ్గురు కూతుళ్లు ఈ ఎమ్‌సీపీఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వాటా విక్రయంతో రాణా కపూర్ కుటుంబం వాటా యస్ బ్యాంక్‌లో 7.4 శాతానికి తగ్గుతుంది. యస్ బ్యాంక్ 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టిందని, గత 15 ఏళ్లలో మంచి వృద్ధిని సాధించామని రాణా తెలిపారు. మోర్గాన్ క్రెడిట్స్ కంపెనీ 2018 ఏప్రిల్‌లో ఆర్‌నామ్)కి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ)జారీ చేసి రూ.1,160 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లు 2021, ఏప్రిల్‌లో మెచ్యూర్ అవుతాయి. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను స్టార్టప్ బిజినెస్‌ల కోసం మోర్గాన్ క్రెడిట్స్ వినియోగించింది. ఈ బాండ్లకు సంబంధించి ముందస్తుగా చెల్లించాల్సిన(వడ్డీతో కలుపుకొని) మొత్తం ఇప్పటిదాకా రూ.722 కోట్లుగా ఉంది. యస్‌బ్యాంక్‌లో విక్రయించిన వాటా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్‌నామ్ ఎన్‌సీడీలకు చెల్లింపులు జరపడానికి మోర్గాన్ క్రెడిట్స్ ఉపయోగించనున్నది. -
యస్ బ్యాంకు షేరు ఎందుకు కుప్పకూలింది?
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు మరోసారి భారీ అమ్మకాల సెగ తగిలింది. దీంతో గురువారం 52 వారాల కనిస్టానికి పతనమైంది. ప్రధానంగా ప్రమోటర్ గ్రూప్ కంపెనీకి చెందిన మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్సీడీల) రేటింగ్‌ను..కేర్ డౌన్‌గ్రేడ్ చేసిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఆ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా అయిదు నెలల్లో ఎన్నడూ లేనంతగా అతిభారీ పతనాన్ని నమోదు చేసింది. ప్రమోటర్ గ్రూప్‌లోని మోర్గాన్ క్రెడిట్స్ రూ. 800 కోట్ల జారీ అనంతరం ఎన్సీడీల రేటింగ్‌ను ఏ- నుంచి కేర్ రేటింగ్స్ తాజాగా బీబీబీకు సవరించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో మోర్గాన్ క్రెడిట్స్ 3.03 శాతం వాటాను కలిగి ఉంది. బ్యాంకు షేర్ల ధరలు పతనమైన నేపథ్యంలో ఎంసీపీఎల్, తదితర ప్రమోటర్ల వద్ద గల వాటా విలువ పడిపోవడంతో రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేపట్టినట్లు కేర్ రేటింగ్స్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో ఎన్ఎస్ఈలో 17 శాతం కుప్పకూలి రూ. 54 వద్ద ముగిసింది. -
పేటీఎమ్ ‘యస్’ డీల్!
న్యూఢిల్లీ/ముంబై: యస్ బ్యాంక్‌లో కొంత వాటాను డిజిటల్ చెల్లింపుల దిగ్గజ సంస్థ, పేటీఎమ్ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు సంబంధించిన సంస్థలకు యస్‌బ్యాంక్‌లో 9.6 శాతం మేర వాటా ఉంది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి పేటీఎమ్ యాజమాన్య సంస్థ, వన్97 కమ్యూనికేషన్స్ చర్చలు జరుపుతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆర్బీఐ ఆమోదాన్ని బట్టి ఒప్పందం స్వరూపం ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేటీఎమ్ వ్యవస్థాపకులు విజయ్ శేఖర శర్మకు ఇప్పటికే పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లో వాటా ఉండటంతో ఆర్బీఐ ఆమోదాన్ని బట్టి డీల్ స్వరూపం ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతానికైతే, సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక బ్యాంక్‌లో 5 శాతం మేర ఇన్వెస్ట్ చేయవచ్చు. కాగా ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి పేటీఎమ్, యస్‌బ్యాంక్‌లు నిరాకరించగా, రాణా కపూర్ అందుబాటులో లేరు. యస్ బ్యాంక్ ఇటీవలనే క్యూఐపీ(క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్) ద్వారా రూ.1,930 కోట్ల నిధులు సమీకరించింది. మరిన్ని పెట్టుబడులు సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో యస్ బ్యాంక్‌కు రూ.1,507 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బ్యాంక్ చరిత్రలో ఇవే అత్యధిక నష్టాలు. మొండిబకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.114 కోట్ల నికర లాభం సాధించింది. టెక్ కంపెనీకి వాటా యస్ బ్యాంక్‌లో మైనారిటీ వాటా విక్రయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థకు విక్రయించే ఒప్పందం దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ డీల్‌లో భాగంగా 10 శాతం కంటే తక్కువ వాటాను ప్రపంచంలోనే టాప్ త్రీ టెక్నాలజీ కంపెనీల్లో ఒకదానికి విక్రయించనున్నామని యస్ బ్యాంక్ సీఈఓ, ఎమ్డీ రవ్నీత్ గిల్ పేర్కొన్నారు. ఆ సంస్థ ఇంతవరకూ భారత్‌లోని ఏ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయలేదని కూడా ఆయన తెలిపారు. సంస్థ పేరును ఆయన వెల్లడించలేదు. ఈ టెక్నాలజీ కంపెనీ పెట్టుబడుల వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ సంస్థతో పాటు మరో రెండు మూడు సంస్థలు 20 కోట్ల డాలర్ల నుంచి 25 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు. యస్ బ్యాంక్ షేర్ సోమవారం బీఎస్ఈలో 4.5 శాతం లాభపడి రూ.63.10 వద్ద ముగిసింది. పేటీఎమ్ నష్టాలు రూ.4,217 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ నష్టాలు భారీగా పెరిగాయి. 2019, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పేటీఎమ్ నష్టాలు 193 శాతం ఎగసి రూ.4,217 కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.1.604 కోట్లుగా ఉన్నాయి. ఇక ఆదాయం రూ.3,052 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,232 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.4,864 కోట్ల నుంచి 60 శాతం ఎగసి రూ.7,730 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు పంపిన వార్షిక నివేదికలో ఈ వివరాలను పేటీఎమ్ వెల్లడించింది. కాగా ఈ వివరాలకు సంబంధించిన కాపీని పేటీఎమ్ ఇంకా కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించలేదు. వ్యాపార విస్తరణ కోసం గత రెండేళ్లలో రూ.14,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, రానున్న రెండేళ్లలో రూ.21,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని ఇటీవలే పేటీఎమ్ వెల్లడించింది. -
ఉద్దీపనలు బాగున్నా.. వృద్ధి అంతంతే!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రస్తుతం తీవ్రంగా ఉన్నాయని పలు విశ్లేషణా, రేటింగ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటు దేశీయ అటు అంతర్జాతీయ ప్రతికూలతలు దీనికి కారణమన్నది ప్రధాన విశ్లేషణ. ఈ నెలాఖరున ఏప్రిల్–జూన్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక గణాంకాలు వెల్లడవుతుండడం దీనికి నేపథ్యం. ముఖ్యాంశాలను పరిశీలిస్తే... వృద్ధి 6.4 శాతమే!: మూడీస్ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఇటీవల ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన చర్యలు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగుకు మద్దతునిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ విశ్లేషించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి మాత్రం 6.4 మాత్రమే ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సోమవారం అంచనావేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక ప్రతికూల అంశాలు దీనికి కారణమని పేర్కొంది. మూడీస్ (సావరిన్ రిస్క్ గ్రూప్) వైస్ ప్రెసిడెంట్ విలియమ్ ఫాస్టెర్ మాట్లాడుతూ, ‘‘2019–20లో వృద్ధి 6.4 శాతంగానే ఉన్నా, 2020–2021లో ఈ రేటు 6.8 శాతానికి పెరిగే అవకాశం ఉంది. పన్ను రాయితీలు, వివిధ రంగాల్లో సంస్కరణలు ఆర్థిక వృద్ధి మెరుగుకు దీర్ఘకాలంలో దోహదపడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పెంపు ద్రవ్య లభ్యతకు దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో దఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్యూ1లో 5.5 శాతమే: యస్‌బ్యాంక్ యస్‌బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ సుభద్రా రావు కూడా భారత్ ఆర్థిక వ్యవస్థపై నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 5.5 శాతంగానే ఉంటుందని వివరించారు. మూలధనం పెంపుతో తక్షణ ప్రయోజనం ఉండదు: ఎస్అండ్పీ ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా బ్యాంకింగ్‌కు తాజాగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.70,000 కోట్ల మూలధన కల్పన వల్ల తక్షణ ప్రయోజనం ఏదీ ఒనగూరకపోవచ్చునని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అంచనావేస్తోంది. కార్పొరేట్స్ నుంచి బలహీన రుణ డిమాండ్, ఎన్‌బీఎఫ్‌సీల రుణ సంక్షోభ పరిస్థితులు దీనికి కారణంగా ఎస్అండ్పీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుకు మరికొన్ని సంవత్సరాలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 7 శాతంపైన ప్రస్తుతం వృద్ధి రేటు కష్టమని పేర్కొంది. ఇప్పుడప్పుడే వృద్ధి ‘టర్నెరౌండ్’ కష్టం: డీఅండ్‌బీ దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊపందుకోవడం తక్షణం కష్టమని ఆర్థిక విశ్లేషణ సంస్థ– డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ భారత్ వ్యవహారాల చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ తెలిపారు. పైగా మరింత దిగజారే అవకాశమూ ఉందని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంస్థాగత సవాళ్లకు తగిన పరిష్కార మార్గాన్ని ఇంకా కనుగొనక పోవడమే దీనికి కారణంగా వివరించారు. ప్రస్తుతం దేశంలో పారిశ్రామిక రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 66 శాతం వాటా కలిగిన తయారీ రంగం కోలుకునే పరిస్థితి లేకపోవడమే డీఅండ్‌బీ ఎకానమీ అబ్జర్వర్ విశ్లేషణకు కారణంగా పేర్కొన్నారు. ఆర్బీఐ నుంచి భారీ నిధులు ప్రయోజనమే! ఇదిలావుండగా ఆర్బీఐ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి అందుతున్న రూ. 1,76,051 కోట్లు వృద్ధిబాటలో తగిన సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్న విశ్లేషణ పలు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మందగమనంపై పోరు, బ్యాంకులకు తాజా మూలధన కల్పన వంటి అవసరాలకు కేంద్రం ఈ నిధులను వెచ్చిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నిధుల్లో అధిక మొత్తం మౌలిక రంగంపైనే ప్రభుత్వం వెచ్చిస్తుందన్న అభిప్రాయాన్ని బ్రోకరేజ్ సంస్థ.. ఎమ్కే పరిశోధనా నివేదిక తెలిపింది. కాగా బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధన ప్రకటన విషయాన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ ప్రస్తావిస్తూ, ఆర్బీఐ నుంచి అందుతున్న నిధుల్లో కొంత భాగాన్ని కేంద్రం సంబంధిత మూలధన కల్పనకు వినియోగిస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019–20 ఏడాదికి కేంద్ర 3.38 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాలను చేరుకోవడంలో ఆర్బీఐ నిధుల బదలాయింపు కీలకమవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ సమీర్ నారంగ్ పేర్కొన్నారు. -
యస్ బ్యాంకుతో బుక్‌మైఫారెక్స్ జోడి
గుర్గావ్: ఫారెన్ ఎక్స్చేంజ్, రెమిటెన్స్‌ల మార్కెట్‌ప్లేస్ బుక్‌మైఫారెక్స్.కామ్ తాజాగా యస్ బ్యాంక్‌తో జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి వీసా నెట్‌వర్క్‌పై మల్టీ కరెన్సీ ఫారెక్స్ ట్రావెల్ కార్డ్‌ను ప్రవేశపెట్టాయి. బుక్‌మైఫారెక్స్ పోర్టల్‌లో కస్టమర్లు ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఇంటర్–బ్యాంక్ రేట్స్ మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌కు అనువుగా కార్డును రూపొందించామని బుక్‌మైఫారెక్స్ ఫౌండర్ సుదర్శన్ మోత్వానీ తెలిపారు. -
‘యస్’ ఓవర్‌నైట్ ఫండ్
న్యూఢిల్లీ: యస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా ఓవర్‌నైట్ ఫండ్ పేరుతో మరో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా సమీకరించిన నిధులను ఒక్క రోజు వ్యవధి ఉండే టీఆర్ఈపీఎస్, ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్ తదితర సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందులో తక్కువ రిస్కు, అధిక లిక్విడిటీ వెసులుబాటు ఉంటుంది. తదనుగుణంగానే రాబడులు కూడా ఉంటాయి. ఆగస్టు 23తో ఈ న్యూ ఫండ్ ఆఫర్ ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1,000. ఎంట్రీ,ఎగ్జిట్ లోడ్ లేదు. డెట్ స్కీమ్– ఓవర్‌నైట్ ఫండ్ విభాగంలో ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. -
యస్ బ్యాంక్ లాభాలకు గండి !
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ ఆస్తి, అప్పుల పట్టీ (బ్యాలన్స్ షీట్) ప్రక్షాళన ఆ బ్యాంక్ లాభదాయకతపై తీవ్రంగానే ప్రభావం చూపనున్నదని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఈ ప్రభావం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకూ ఉంటుందని పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న రుణాలు బ్యాంక్ వద్ద దాదాపు 8 శాతంగా ఉన్నాయని, వీటికి కేటాయింపుల కారణంగా 12–18 నెలల పాటు బ్యాంక్ లాభదాయకతపై ప్రభావం పడుతుందని వివరించింది. తొలి త్రైమాసిక నష్టాలు... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ బ్యాంక్ ఇటీవలే వెల్లడించింది. గత క్యూ4లో ఈ బ్యాంక్‌కు రూ.1,507 కోట్ల నికర నష్టాలొచ్చాయి. బ్యాంక్ ఆరంభమైన 2004 నుంచి చూస్తే, ఇదే తొలి త్రైమాసిక నష్టం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే బ్యాంక్‌కు లాభాలే వచ్చాయి. రిటర్న్ ఆన్ అసెట్ మాత్రం 1.4 శాతం నుంచి 0,5 శాతానికి తగ్గింది. సమీప భవిష్యత్తులో బలహీనతలున్నప్పటికీ, కొత్త అధినేత నాయకత్వం బ్యాంక్‌కు సానుకూలాంశమేనని మూడీస్ పేర్కొంది. గతంలో బ్యాంక్ రుణ వృద్ధి సగటున 34 శాతంగా ఉందని, అయితే రానున్న మూడేళ్లలో ఈ బ్యాంక్ రుణ వృద్ధి 20 – 25 శాతం రేంజ్‌లోనే ఉండగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. రిటైల్ రుణాలు, ఎస్ఎమ్ఈ సెగ్మెంట్ రుణాలపై ఈ బ్యాంక్ మరింతగా దృష్టిసారించాలని సూచించింది. అలాగే కార్పొరేట్ రుణాలను తగ్గించుకోవాలని కూడా పేర్కొంది. ఫలితాలు నిరాశపరచడంతో యస్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో 29 శాతం నష్టంతో రూ.168 వద్ద ముగిసింది. -
ఫలితాల దెబ్బ : ఎస్‌బ్యాంకు షేరు పతనం
సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంకునకు ఫలితాల సెగ భారీగా తాకింది. మార్చి30తో ముగిసిన గత ఏడాది నాలుగవ త్రైమాసిక ఫలితాలు ప్రకటనతో ఎస్ బ్యాంకు కౌంటర్లో అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో ఏకంగా షేరు 30శాతం కుప్పకూలింది. 2005 తర్వాత ఎస్ బ్యాంక్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. బ్యాడ్లోన్ల బెడదతో త్రైమాసికంలో 1506 కోట్ల రూపాయలను నికర నష్టాలను చవి చూసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 16.29శాతం పుంజుకుని రూ. 2505 కోట్లు సాధించింది. ప్రొవిజన్లు 9 రెట్లు ఎగబాకి రూ.3661 కోట్లగా ఉన్నాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.399 కోట్లు మాత్రమే. -
యస్ బ్యాంక్‌కు రూ.1,506 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్‌బ్యాంక్‌కు నాలుగో క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ4లో రూ.1,507 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యస్ బ్యాంక్ తెలిపింది. 2017–18 క్యూ4లో రూ.1,179 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు భారీగా పెరగడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. రద్దు చేసిన రూ.831 కోట్ల రుణాలను పరిగణనలోకి తీసుకుంటే నష్టాలు మరింతగా పెరిగేవి. ఇవి సీఈఓగా రాణా కపూర్ నిష్క్రమణ, కొత్త సీఈఓగా రవ్నీత్ గిల్ పగ్గాలు చేపట్టిన తర్వాత వెలువడిన తొలి ఫలితాలు. 16 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం... గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.2,506 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 63 శాతం పతనమై రూ.538 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం 38 శాతం తగ్గి రూ.1,323 కోట్లకు పరిమితమైంది. నికర నష్టాలు వచ్చినా, మొత్తం ఆదాయం మాత్రం పెరిగిందని పేర్కొంది. 2017–18 క్యూ4లో రూ.7,164 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.8,388 కోట్లకు పెరిగింది. రూ.2,100 కోట్ల కంటింజెన్సీ రిజర్వ్‌లను కూడా కలుపుకుంటే గత క్యూ4లో కేటాయింపులు పదిరెట్లు పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.399 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,661 కోట్లకు ఎగబాకాయి. వివిధ రంగాల్లో ఒత్తిడి రుణాలు రూ.10,000 కోట్ల మేర ఉంటాయని, వీటి కోసం భారీగా కేటాయింపులు జరిపాల్సి వచ్చిందని తెలిపింది. భారీ నష్టాలు ఉన్నప్పటికీ, ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను బ్యాంక్ ఇవ్వనున్నది. క్షీణించిన రుణ నాణ్యత.... బ్యాంక్ రుణ నాణ్యత బాగా క్షీణించింది. స్థూల మొండి బకాయిలు 1.28 శాతం నుంచి దాదాపు రెట్టింపై 3.22 శాతానికి ఎగిశాయి. నికర మొండి బకాయిలు 0.64 శాతం నుంచి 1.86 శాతానికి పెరిగాయి. తాజా మొండి బకాయిలు రూ.3.481 కోట్లుగా ఉన్నాయి. వీటిల్లో జెట్ ఎయిర్వేస్ బకాయిలు రూ.552 కోట్లు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బకాయిలు రూ.529 కోట్లు. గత క్యూ4లో భారీగా నికర నష్టాలు రావడం పూర్తి ఆర్థిక సంవత్సరం బ్యాంక్ నికర లాభంపై తీవ్రంగా ప్రభావం చూపించింది. 2017–18లో రూ.4,224 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.1,720 కోట్లకే పరిమితమైంది. ఈ ఏడాది మార్చినాటికి క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.5 శాతంగా ఉంది. నికర వడ్డీ ఆదాయం రూ.5,742 కోట్ల నుంచి రూ.7,857 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి ముగిసిన సంవత్సరానికి రుణాలు 19 శాతం వృద్ధితో రూ.2,41,500 కోట్లకు, డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.2,27,610 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 50 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది. వంద కోట్ల డాలర్ల నిధుల సమీకరణ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–18 శాతం రేంజ్లో రుణ వృద్ధి సాధించడంపైన దృష్టి కేంద్రీకరిస్తున్నామని సీఈఓ రవ్నీత్ గిల్ చెప్పారు. దీనిని క్రమంగా 22–24 శాతానికి పెంచుతామని, గతంలో సాధించిన 40 శాతం రుణ వృద్ధి కోసం పరుగులు పెట్టబోమని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ స్థాయిల్లో భారీ మార్పులు ఉండవని, బ్యాంక్‌లో గవర్నెన్స్ సమర్థంగా ఉండాలని భావిస్తున్నామని, ఈ దిశగా కొన్ని నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. రుణ మార్గంలో రూ.20,000 కోట్లు, ఈక్విటీల జారీ ద్వారా వంద కోట్ల డాలర్ల నిధులు సమీకరించడానికి బోర్డ్ ఆమోదం తెలిపింది. -
ఐదు బ్యాంకులపై రూ. 10 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్– ఆర్బీఐ ఐదు బ్యాంకులపై రూ.10 కోట్ల జరిమానా విధించింది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నోస్ట్రో ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంవల్ల ఆర్బీఐ అలహాబాద్ బ్యాంక్‌పై జరిమానా విధించింది. ఒక బ్యాంక్ వేరే బ్యాంక్‌లో విదేశీ కరెన్సీలో నిర్వహించే ఖాతాను నోస్ట్రో ఖాతాగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ మెసేజింగ్ సాఫ్ట్వేర్..స్విఫ్ట్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకుగాను ఈ రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ చెరో కోటి రూపాయలు జరిమానా విధించింది. -
యస్ బ్యాంక్ ఎండీగా రవ్నీత్ గిల్ బాధ్యతలు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రవ్నీత్ గిల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బ్యాంక్ సహ–వ్యవస్థాపకుడు రాణా కపూర్ స్థానంలో ఆయన నియమితులైన సంగతి తెలిసిందే. గిల్ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ఇప్పటిదాకా జర్మనీ బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భారత విభాగానికి గిల్ సారథ్యం వహించారు. నిర్దిష్ట కారణాలు బహిరంగంగా వెల్లడించనప్పటికీ .. రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించడానికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోవడంతో కొత్త ఎండీ నియామకం తప్పనిసరైన సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్ దాకా కపూర్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ యస్ బ్యాంక్ కోరినప్పటికీ ఆర్బీఐ నిరాకరించింది. యస్ బ్యాంక్‌లో గవర్నెన్స్, నిబంధనల అమలుపరమైన లోపాల ఆరోపణలే రాణా కపూర్ ఉద్వాసనకు కారణమై ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక, తాత్కాలిక ఎండీగా ఇప్పటిదాకా విధులు నిర్వర్తించిన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్.. ఇకపై అదే హోదాలో కొనసాగుతారు. పార్ట్ టైమ్ చైర్మన్ బ్రహ్మదత్, స్వతంత్ర డైరెక్టరు ముకేష్ సబర్వాల్, నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సుభాష్ చందర్ కాలియా, స్వతంత్ర డైరెక్టర్ ప్రతిమా షోరే.. బోర్డు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు అదనంగా నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు బోర్డులో ఉంటారు. ఎండీ, సీఈవోగా గిల్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 2.68 శాతం పెరిగి రూ. 237.40 వద్ద క్లోజయ్యింది. -
నిబంధనల ప్రకారమే సమాచారం వెల్లడించాం
న్యూఢిల్లీ: మొండిబాకీల లెక్కల్లో వ్యత్యాసాల్లేవన్న (డైవర్జెన్స్) ప్రకటనపై రిజర్వ్ బ్యాంక్ అక్షింతలు వేసిన నేపథ్యంలో యస్ బ్యాంక్ వివరణనిచ్చింది. నిబంధనల ప్రకారమే ‘నిల్ డైవర్జెన్స్’ గురించి వెల్లడించామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఆర్బీఐ పంపిన రిస్కుల మదింపు నివేదిక (ఆర్ఏఆర్)లోని డైవర్జెన్స్ వివరాలు లీకవడం లేదా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నందున వార్షిక ఫలితాలను ప్రకటించే దాకా ఆగకుండా సత్వరం వెల్లడించినట్లు వివరించింది. ఎక్సే్చంజీలు, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే ఎలాంటి చర్యలకూ పాల్పడలేదని స్పష్టం చేసింది. 2017–18లో మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో ముందుగా భావించినట్లు వ్యత్యాసాలేమీ లేవని రిజర్వ్ బ్యాంక్ తేల్చిందంటూ యస్ బ్యాంక్ గత వారంలో ప్రకటించడం, దీంతో షేరు ఒక్కసారిగా ఎగియడం తెలిసిందే. విశ్వసనీయమైన నివేదికను బహిరంగపర్చినందుకు చర్యలు ఉంటాయంటూ ఆర్బీఐ హెచ్చరించడంతో బ్యాంక్ తాజా వివరణనిచ్చింది. -
యస్‌బ్యాంకుకు ఆర్బీఐ షాక్ : షేరు పతనం
సాక్షి, ముంబై: మొండి బకాయిలు, ప్రొవిజనింగ్ అంశాలలో వివరాలను బహిర్గతం చేయడంపై ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో యస్ బ్యాంకు కౌంటర్లో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. డైవర్జెన్స్ నివేదికను వెల్లడి చేయడంపై గోప్యతా నిబంధన ఉల్లంఘన కింద చర్యలకు ఆర్బీఐ బ్యాంకును హెచ్చరించింది. ఆర్బీఐ యస్‌బ్యాంకుకు భారీగా జరిమానా విధించనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ట్రేడింగ్ ఆరంభంలోనే దాదాపు 8 శాతానికి పైగా కుప్పకూలింది. ప్రస్తుతం స్వల్పంగా పుంజుకున్నా 3.5శాతం నష్టాలతో కొనసాగుతోంది. మరోవైపు స్వల్ప లాభాలతో ప్రారంభమమైన స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. ఇన్వెస్లర్ల అమ్మకాలతో సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా పతనమైంది. కాగా మొండిబకాయిలు, ప్రొవిజనింగ్ అంశాలలో రిజర్వ్ బ్యాంకునుంచి క్లియరెన్స్ లభించిందని ఇటీవల మార్కెట్ రెగ్యులేటరీ సమాచారంలోయస్ బ్యాంకు వెల్లడించింది. గతేడాది(2017-18) ఆస్తుల(రుణాలు) క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్ వంటి అంశాలలో ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించిన అంశాన్ని ఆర్బీఐ ధృవీకరించిందని దీంతో ఆర్బీఐ నుంచి రిస్క్ అసెస్మెంట్ నివేదికను పొందినట్లు ప్రకటించింది. -
ఆర్బీఐ క్లీన్ చిట్ : యస్ బ్యాంకు జోరు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లో యస్‌బ్యాంకు షేరు మళ్లీ ఫాంలోకి వచ్చేసింది. తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా యస్‌బ్యాంకుకు క్లీన్ చిట్ ఇవ్వడంతో లాభాల మెరుపులు మెరిపిస్తోంది. దాదాపు 30శాతానికి పైగా ఎగిసి ఇన్వెస్టర్లను మురిపిస్తోంది. మొండిబకాయిలు, ప్రొవిజనింగ్ అంశాలలో యస్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ నుంచి క్లియరెన్స్ లభించడంతో ఈ కౌంటర్ ఒక్కసారిగా జోరందుకుంది. గతేడాది(2017-18) ఆస్తుల(రుణాలు) క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్ వంటి అంశాలలో ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించిన అంశాన్ని ఆర్బీఐ ధృవీకరించిందని మార్కెట్ రెగ్యులేటరీ సమాచారంలో యస్ బ్యాంకు వెల్లడించింంది. దీంతో ఆర్బీఐ నుంచి రిస్క్ అసెస్మెంట్ నివేదికను పొందినట్లు తెలిపింది. -
‘యస్’ బాస్.. రవ్నీత్ సింగ్ గిల్!
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ నెల 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్ స్థానంలో రవ్నీత్ సింగ్ గిల్ రానున్నారు. ప్రస్తుతం ఆయన డాయిష్ బ్యాంక్ ఇండియా అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవ్నీత్ సింగ్ గిల్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని, మార్చి 1వ తేదీకి ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని యస్ బ్యాంక్ తెలిపింది. 29న బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం జరుగుతుందని పేర్కొంది. 28 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం... 2012, ఆగస్టు నుంచి రవ్నీత్ సింగ్ గిల్ డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది. యస్ బ్యాంక్ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌ను సీఈఓ, ఎమ్డీ పదవి నుంచి వైదొలగాలని గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆర్బీఐ ఆదేశించింది. కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించాలన్న బోర్డ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనికి గల కారణాలను ఆర్బీఐ వెల్లడించకపోయినప్పటికీ, కపూర్ హయాంలో మొండి బకాయిల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకే ఆర్బీఐ ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర మూడింట రెండొంతులకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంక్ సీఈఓ విషయమై అనిశ్చితి తొలగిపోవడంతో యస్ బ్యాంక్ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో 8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 19% ఎగసి రూ.235ను తాకింది. షేర్ జోరు కారణంగా యస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒకేరోజు రూ.3,839 కోట్లు పెరిగి రూ.49,460 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్... యస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 7 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,077 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,002 కోట్లకు తగ్గిందని యస్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం 7 శాతం ఎగసి రూ.3,557 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ప్రస్తుత సీఈఓ రాణా కపూర్ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరిగి రూ.2,666 కోట్లకు చేరింది. 42 శాతం వృద్ధితో రుణాలు రూ.2,43,885 కోట్లకు, డిపాజిట్లు 30 శాతం వృద్ధి చెంది రూ.2.22,758 కోట్లకు చేరాయి. గత క్యూ3లో 3.5 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 3.3 శాతానికి తగ్గిందని వెల్లడించారు. తగ్గిన రుణ నాణ్యత.. యస్ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ3లో 1.72%గా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ3లో 2.1 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.93% నుంచి 1.18%కి చేరాయి. తప్పని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సెగ ! ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఒక మౌలిక రంగ దిగ్గజ గ్రూప్ కంపెనీలకు(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌గా అంచనా) రూ.571 కోట్ల మేర రుణాలిచ్చామని, అందుకని నికర కేటాయింపులు రూ.550 కోట్లకు పెరిగాయని రాణా కపూర్ పేర్కొన్నారు. -
యస్ బ్యాంక్ చీఫ్ పదవికి షార్ట్‌లిస్ట్ సిద్ధం
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ ఈ నెలాఖరులో తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నియమించే అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఖ రారు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. కొత్త సీఈవో, ఎండీ నియామకానికి గురువారం ఆర్బీఐ ఆమోదం కోరనున్నట్లు వివరించింది. అయితే, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. రాణా సారథ్యంలో యస్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఆయన్ను మరో దఫా ఎండీ, సీఈవోగా కొనసాగించడానికి రిజర్వ్ బ్యాంక్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 31తో ఆయన తప్పుకోవాల్సి వస్తోంది. -
యస్ బ్యాంక్ చైర్మన్‌గా బ్రహ్మ్‌దత్!
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ చైర్మన్‌గా డైరెక్టర్లలో ఒకరైన బ్రహ్మ్ దత్ పేరును రిజర్వు బ్యాంకుకు యస్‌బ్యాంక్ సిఫారసు చేసినట్లు తెలియవచ్చింది. గత నెలలో చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. యస్ బ్యాంక్ ఈ పదవికి బ్రహ్మ్‌దత్‌ను ఎంపిక చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దత్ ఇప్పటికే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనకు బ్యాంక్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన ఉందని, అందుకే చైర్మన్ పదవికి ఆయనను బ్యాంక్ ఎంపిక చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైరైన దత్ ప్రస్తుతం యస్ బ్యాంక్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం సీఈఓగా, ఎమ్‌డీగా ఉన్న రాణా కపూర్ పదవీ కాలాన్ని వచ్చే నెల 31 తర్వాత పొడిగించడానికి ఆర్బీఐ అంగీకరించలేదు. వచ్చే నెల 9న జరిగే బోర్డ్ సమావేశంలో రాణా కపూర్ వారసుడిని ఎంపిక చేస్తామని యస్ బ్యాంక్ వెల్లడించింది .ఫోర్టిస్‌లో 2 శాతం వాటా విక్రయం ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 2 శాతం వాటాను విక్రయించామని యస్ బ్యాంక్ తెలిపింది. 2.13 శాతం వాటాకు సమానమైన 1,23,37,323 షేర్లను దశల వారీగా విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో యస్ బ్యాంక్‌కు 9.33 శాతం వాటా ఉంది. -
దూకుడుగా మార్కెట్లు : ఎస్ బ్యాంకు షేరు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెంచరీ కొట్టిన కీలక సూచీ సెన్సెక్స్ మిడ్ సెషన్ తరువాత మరింత ఊపందుకుంది. ప్రస్తుతం 250 పాయింట్లు ఎగసి 35,762వద్ద. నిఫ్టీ 56 పాయింట్లు పుంజుకుని 10,741 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడుతుండగా రియల్టీ నష్టపోతోంది. టైటన్, హీరోమోటో, ఆర్ఐఎల్, యూపీఎల్, పవర్‌గ్రిడ్, గెయిల్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, ఎస్‌బ్యాంక్ 7శాతం కుదేలైంది. ఐవోసీ, బీపీసీఎల్, ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, ఐబీ హౌసింగ్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్, ఎన్టీపీసీ, ఎయిర్టెల్ తదితరాలు నష్టపోతున్నాయి. ఐటీలో ఇన్ఫోసిస్, నిట్ టెక్, టీసీఎస్, టాటా ఎలక్సీ, ఒరాకిల్, మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ 3.25-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. మీడియా కౌంటర్లలో జీ, యుఫో, ఐనాక్స్ లీజర్, టీవీ18, నెట్వర్క్18, జీమీడియా, పీవీఆర్ 3-1 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, సన్‌టెక్, డీఎల్ఎఫ్, శోభా, బ్రిగేడ్ బలహీనంగా ఉన్నాయి. -
పేటీఎం ఆఫర్లు: ఐఫోన్లపై క్యాష్‌బ్యాక్
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పేటిఎం మాల్ ఐఫోన్లపై డిస్కౌంట్ని ప్రకటించింది. దాదాపు 20 డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందనున్నారు. మోడల్‌ను బట్టి రూ.4000 నుంచి 8000ల వరకూ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదనంగా ఎస్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తే మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లు ప్రధానంగా... ఐఫోన్ 7ప్లస్ 128 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7 32జీబీ రూ. 6750 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7 128 జీబీ రూ. 6500 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7ప్లస్ 32 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్ దీంతోపాటు మరి కొన్ని స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే ఎస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్ బ్యాక్‌ను లభ్యం. మరింత సమాచారం కోసం పేటీఎం మాల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. -
యస్ బ్యాంక్ చీఫ్ రేసులో 10 మంది బ్యాంకర్లు..
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ కొత్త సీఈవో పదవి రేసులో దాదాపు 5–10 మంది బ్యాంకర్లున్న ట్లు తెలుస్తోంది. సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన సెర్చి కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన వారిలో ఒక విదేశీ బ్యాంక్ (ఎంఎన్సీ) చీఫ్‌తో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంక్ అధిపతి, మరికొన్ని ప్రైవేట్ బ్యాంకుల హెడ్స్ ఉన్నట్లు సమాచారం. లిస్టులో 5–10 మంది బ్యాంకర్ల పేర్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అంతిమంగా షార్ట్‌లిస్ట్‌లో అయిదుగురే ఉంటారని పేర్కొన్నాయి. వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో రాణా కపూర్ స్థానంలో కొత్త సీఈవో పేరును.. డిసెంబర్ మూడో వారంనాటికే ఖరారు చేసే అవకాశం ఉందని వివరించాయి. రిజర్వ్ బ్యాంక్ ఇందుకు జనవరి 31దాకా గడువిచ్చింది. బయటి వారినే కాకుండా యస్ బ్యాంక్‌లో అంతర్గతంగా సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్స్ అయిన రజత్ మోంగా, ప్రళయ్ మండల్ పేర్లను కూడా సెర్చి కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. వీరినింకా ఇంటర్వ్యూ చేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెర్చి కమిటీ నుంచి ఎస్బీఐ మాజీ చీఫ్ ఓపీ భట్ తప్పుకోవడంపై వివరణనిచ్చాయి. లిస్టులోని ఓ బ్యాంకరుకు చెందిన విదేశీ బ్యాంకుకు భట్ గతంలో సలహాదారుగా సేవలందించారని తెలిపాయి. దీంతో సీఈవో ఎంపిక నిర్ణయంపై తన ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో సెర్చి కమిటీ నుంచి భట్ తప్పుకున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కాంపిటీషన్ కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ చావ్లా, ఓపీ భట్ల నిష్క్రమణతో సెర్చి కమిటీలో ఒక్కరు మాత్రమే బయటి సభ్యుడు (బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ చీఫ్ టీఎస్ విజయన్) మిగిలారని సంబంధిత వర్గాలు వివరించాయి. ♦ కాగా యస్ బ్యాంక్ నష్టాలు కొనసాగాయి. రాణా కపూర్ స్థానంలో సీఈఓను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి ఎస్బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్ రాజీనామా చేయడంతో ఈ షేర్ 7.1 శాతం నష్ట పోయి రూ.191 వద్దకు చేరింది. విజయ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన కేసు విషయంలో సీబీఐ చార్జ్‌షీట్‌లో పేరు ఉండటంతో భట్ రాజీనామా చేశారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా కారణంగా ఈ షేర్ గురువారం కూడా 7 శాతం నష్టపోయింది. -
యస్ బ్యాంక్ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్ వసంత్ గుజరాతి కూడా రాజీనామా చేసినట్లు యస్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అయిదేళ్ల పాటు అదనపు డైరెక్టర్ (స్వతంత్ర)గా ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. -
నిరాశపరిచిన యస్ బ్యాంకు
ముంబై: ఇంతకాలం పనితీరు పరంగా చక్కని ఫలితాలతో ముందుండే యస్ బ్యాంకు... ఒక్కసారిగా సెప్టెంబర్ త్రైమాసికంలో నిరాశ పరిచింది. బ్యాంకు నికర లాభం 3.8 శాతం తగ్గి రూ.964.7 కోట్లుగా నమోదైంది. ఆర్బీఐ ఎన్పీఏల గుర్తింపు కార్యక్రమం తర్వాత బ్యాంకు నికర లాభం తగ్గడం ఇదే ప్రథమం. కిందటేడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.1,003 కోట్లుగా ఉంది. ఎన్పీఏలను యస్ బ్యాంకు రూ.10,000 కోట్ల మేర తక్కువ చేసి చూపించిందని ఆర్బీఐ ఆడిట్లో గుర్తించడం... తర్వాత పరిణామాల్లో యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా రాణా కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లకు పొడిగించడానికి అనుమతివ్వకుండా, వచ్చే జనవరి 31 తర్వాత దిగిపోవాలని ఆదేశించడం తెలిసిందే. బ్యాంకు మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,048 కోట్ల నుంచి రూ.8,704 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ.2,417 కోట్లకు చేరుకుంది. మార్జిన్లు స్థిరంగా 3.3%గా ఉన్నాయి. వడ్డీయేతర ఆదాయం 18% పెరిగి రూ.1,473 కోట్లుగా నమోదైంది. కాసా డిపాజిట్ల వాటా 33.8%కి తగ్గింది. ఆస్తుల నాణ్యత క్షీణత కార్పొరేట్ బాండ్లపై పెట్టుబడులకు సంబంధించి నష్టాలకు చేసిన కేటాయింపులే నికర లాభం తగ్గేలా చేశాయి. స్థూల ఎన్పీఏల రేషియో 1.6 శాతానికి పెరిగింది. జూన్ క్వార్టర్లో ఇది 1.31 శాతం కావడం గమనార్హం. నికర ఎన్పీఏలు సైతం జూన్ క్వార్టర్లో ఉన్న 0.59 శాతం నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 0.84 శాతానికి చేరాయి. బ్యాంకు రుణాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1.48 లక్షల కోట్ల నుంచి రూ.2.39 లక్షల కోట్లకు పెరిగాయి. రిటైల్ రుణాలు సైతం వార్షికంగా చూస్తే 103 శాతం పెరిగాయి. డిపాజిట్లలో వృద్ధి 41 శాతంగా ఉంది. తాజాగా రూ.1,631 కోట్ల ఎన్పీఏలు ఓ డైవర్సిఫైడ్ ఖాతాకు సంబంధించి జతయ్యాయి. ఓ సిమెంట్ కంపెనీ ఖాతా కూడా ఎన్పీఏగా మారింది. బ్యాంకు ప్రొవిజన్లు రూ.940 కోట్లకు పెరిగాయి. రూ. 631 కోట్లు రికవరీకి అవకాశం అయితే, ఒక ఖాతాకు సంబంధించి రూ.631 కోట్ల ఎన్పీఏ తదుపరి త్రైమాసికంలో రికవరీ అవుతుందని యస్‌బ్యాంకు సీనియర్ గ్రూపు ప్రెసిడెంట్ రజత్ మోంగా తెలిపారు. డైవర్సిఫైడ్ ఖాతాకు సంబంధించి ఆస్తుల విక్రయం మొదలైందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో వసూలు అవుతాయని చెప్పారు. కొంత చెల్లింపులు ఇప్పటికే సెప్టెంబర్ 30 తర్వాత వచ్చినట్టు తెలిపారు. రాణాకపూర్ తర్వాత బ్యాంకుకు సారథ్యం వహించనున్నట్టు వినిపిస్తున్న పేర్లలో రజత్ మోంగా కూడా ఉండటం గమనార్హం. కార్పొరేట్ బాండ్ల పోర్ట్‌ఫోలియోకు సంబంధించి రూ.252 కోట్లను ఎంటీఎం రూపంలో పక్కన పెట్టినట్టు మోంగా తెలిపారు. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ తరఫున రిస్క్ ఆధారిత పర్యవేక్షణ జరగాల్సి ఉంది. ఇందులో ఏవైనా అంతరాలు పేర్కొంటే, నిర్ణీత పరిమితిని మించితే వాటిని వెల్లడించాల్సి ఉంది’’ అని మోంగా తెలిపారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు సంస్థలకు సంబంధించి బ్యాంకుకు రూ.2,600 కోట్ల ఎక్స్పోజర్ ఉందని, వీటికి ఎటువంటి కేటాయింపులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. -
రాణా కపూర్‌కు ఆర్బీఐ నో
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిరాకరించింది. కొత్త చీఫ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా నియమించాలని బ్యాంకు బోర్డును ఆదేశించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలకు యస్ బ్యాంక్ బుధవారం ఈ విషయాలను తెలియజేసింది. ‘యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రాణా కపూర్ వారసుడిని 2019 ఫిబ్రవరి 1లోగా ఎంపిక చేయాలని రిజర్వ్ బ్యాంక్ పునరుద్ఘాటించింది‘ అని వివరించింది. దాదాపు రూ.10,000 కోట్ల మేర మొండిబాకీలను పద్దుల్లో సరిగ్గా చూపలేదని ఆడిట్లో తేలిన నేపథ్యంలో మరో విడత సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇదివరకే నిరాకరించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పదవీకాలాన్ని 2019 జనవరి 31 దాకా ఆర్బీఐ కుదించింది. అప్పటికల్లా కొత్త సీఈవోను నియమించాలంటూ ఆదేశించింది. దీంతో కొత్త సీఈవో అన్వేషణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన బ్యాంక్.. కపూర్ పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది. ఈ ప్రతిపాదననే ఆర్బీఐ తాజాగా తోసిపుచ్చింది. 2004లో యస్ బ్యాంక్ ప్రారంభమైనప్పట్నుంచీ రాణా కపూర్ ఎండీ, సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయనకు బ్యాంక్‌లో 10.66 శాతం వాటాలు ఉన్నాయి. బుధవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 6.85 శాతం క్షీణించి రూ. 231.75 వద్ద క్లోజయ్యింది. -
రాణాకు నో చెప్పిన ఆర్బీఐ
సాక్షి,ముంబై: సీఎండీ నియామకం అంశంలో ప్రయివేటురంగ బ్యాంకు ఎస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. తాను ముందు ఆదేశించినట్టుగానే సీఈవో, ఎండీగా రాణా కపూర్ పదవి నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1నాటికి బ్యాంకు కొత్త సీఎండీ నియామాకం చేపట్టాలని పేర్కొంది. ఆర్బీఐ మరోసారి తన నిర్ణయాన్ని దృఢంగా ప్రకటించడంతో బ్యాంకు సీఎండీ మరింత కాలం కొనసాగాలని భావించిన రాణా కపూర్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. బ్యాంకు ఉన్నతాధికారిగా కపూర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని గతంలోనే వాటాదారులు కోరినప్పటికి ఆర్బీఐ ఆర్బీఐ నిరాకరించింది. 2019, జనవరి 31నాటికి కొత్త సీఎండీని ఎంపిక చేయాలని సెప్టెంబరు24న ఆదేశించింది. అయితే రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని , ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి మరింత సమయం కావాలని ఆర్బీఐని ఎస్‌బ్యాంకు కోరింది. అలాగే కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. తాజాగా ఈ అభ్యర్థనను కూడా ఆర్బిఐ తిరస్కరించింది. -
మొండిబాకీలు తగ్గాయ్..
ముంబై: గడిచిన ఏడాది కాలంగా మొండిబాకీలు గణనీయంగా తగ్గాయని, అసెట్ క్వాలిటీ అంచనాలు స్థిర స్థాయిలోనే ఉన్నాయని ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వెల్లడించింది. ‘గడిచిన కొద్ది రోజులుగా బ్యాంకు అసెట్ క్వాలిటీ గురించి కొన్ని నిరాధార ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చిన సంగతి మేనేజ్మెంట్ దృష్టికి వచ్చింది. అయితే, అలాంటి పరిస్థితేమీ లేదని అసెట్ క్వాలిటీ స్థిరంగానే ఉందని యాజమాన్యం స్పష్టం చేయదల్చుకుంది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు తెలియజేసింది. ఇక లిక్విడిటీ కూడా తగినంత స్థాయిలోనే ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి 101 శాతంగా ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి స్థూల మొండిబాకీలు 1.82 శాతం నుంచి 1.35 శాతానికి తగ్గినట్లు వివరించింది. అదే సమయంలో రుణాలు 61.5 శాతం వృద్ధితో రూ. 2.40 లక్షల కోట్లకు చేరినట్లు, డిపాజిట్లు 41 శాతం పెరుగుదలతో రూ. 2.23 లక్షల కోట్లకు పెరిగినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. వరుసగా రెండేళ్ల పాటు దాదాపు రూ.10,000 కోట్ల మొండిబాకీలను (ఎన్పీఏ) వెల్లడించకుండా కప్పిపెట్టి ఉంచిందంటూ యస్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆక్షేపించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీ కాలాన్ని 2019 జనవరికి మాత్రమే కుదించింది. ఈ పరిణామాల దరిమిలా బ్యాంకు షేరు దాదాపు 40 శాతం మేర పతనమైంది. అటు యస్ బ్యాంక్ డెట్ సాధనాలను ప్రత్యేక పరిశీలనలో ఉంచినట్లు కేర్ రేటింగ్స్ వెల్లడించింది. త్వరలోనే సెర్చి కమిటీ... రాణా కపూర్ స్థానంలో కొత్త సీఈవోను అన్వేషించేందుకు ఏర్పాటు చేస్తున్న సెర్చి(అన్వేషణ) కమిటీలో ఇద్దరు బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారని, అక్టోబర్ 7 నాటికల్లా వీరిని ఖరారు చేయడం జరుగుతుందని యస్ బ్యాంక్ వెల్లడించింది. అంతర్జాతీయ లీడర్షిప్ అడ్వైజరీ సంస్థ ఈ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తుందనికూడా పేర్కొంది. సంస్థలో ఉద్యోగులతో పాటు బయటి వారిని కూడా సీఈవో పదవి కోసం పరిశీలించనున్నట్లు బ్యాంకు తెలియజేసింది. దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికను సిద్ధం చేసుకునే క్రమంలో బ్యాంక్ ఇప్పటికే ఇద్దరు సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్స్ రజత్ మోంగా, ప్రళయ్ మోండాల్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రమోట్ చేసింది. ఇందుకోసం ఆర్బీఐ అనుమతులు కోరినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. కాగా, సోమవారం యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో దాదాపు 9.68 శాతం పెరిగి రూ.201.20 వద్ద ముగిసింది. -
ఈ షేర్లు వజ్రాల్లాంటివి
ముంబై: యస్ బ్యాంక్ షేర్లు వజ్రాల్లాంటివని ఆ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. యస్ బ్యాంక్‌లో తనకున్న వాటాను విక్రయించబోనని స్పష్టంచేశారు. ఎండీ, సీఈఓగా ఈ బ్యాంక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఎప్పటికీ, ఈ షేర్లను అమ్మే ప్రశ్నే లేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ షేర్లు అమూల్యం... రాణా కపూర్ పదవీ కాలాన్ని ఆర్బీఐ కుదించిన నేపథ్యంలో గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో యస్‌బ్యాంక్ షేర్ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ‘‘యస్ బ్యాంకులో ప్రమోటర్‌గా నాకున్న షేర్లు అమూల్యమైనవి. నా వాటాను నా ముగ్గురు కుమార్తెలకూ అందజేస్తా.ఈ షేర్లలో ఏ ఒక్క షేర్‌నూ విక్రయించకూడదని వీలునామాలో నా కుమార్తెలను కోరుతా’’ అని వివరించారు. కాగా ప్రమోటర్లలో ఒకరైన దివంగత అశోక్ కపూర్ భార్య మధు కపూర్ 0.04 శాతం వాటాకు సమానమైన ఏడు లక్షల షేర్లను విక్రయించారు. ఈ నెల 21న ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా ఈ షేర్లను అమె అమ్మే శారు. ఈ వాటా విక్రయం కారణంగా మధు కపూర్ వాటా 9.28 శాతానికి తగ్గింది. మరోవైపు రాణా కపూర్ వాటా 10.66 శాతంగా ఉంది. -
మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలు లేవు
ముంబై: మొండి బకాయిల విషయమై ఎలాంటి అవక తవక లకు పాల్పడలేదని యస్‌బ్యాంక్ స్పష్టం చేసిం ది. మొండి బకాయిలను కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అని ఇటీవలనే నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) యస్‌బ్యాంక్‌ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా యస్‌బ్యాంక్ ఈ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి తమ స్థూల మొండి బకాయిలు 1.3 శాతంగా, నికర మొండి బకాయిలు 0.59 శాతంగా ఉన్నా యని పేర్కొంది. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తమ మొండి బకాయిల గణాంకాలు అత్యుత్తమైనవని వివరించింది. కాగా బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ పదవీ కాలాన్ని ఈ ఏడాది జనవరి వరకూ ఆర్బీఐ కుదించిన విషయం తెలిసిందే. -
కపూర్ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించండి
ముంబై: యస్ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని ఆర్బీఐని కోరాలని యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కంపెనీ కీలకమైన బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు వెల్లడించింది. మరోవైపు కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికలో భాగంగా సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్స్, రజత్ మోంగా, ప్రలయ్ మండల్‌లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించాలని కూడా బోర్డ్ నిర్ణయం తీసుకుంది. రాణా కపూర్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కుదిస్తూ ఆర్బీఐ ఇటీవలే ఆదేశాలిచ్చింది. షెడ్యూల్ ప్రకారమైతే, ఆయన పదవీ కాలం 2021, సెప్టెంబర్ వరకూ ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని కుదించడానికి గల కారణాలను ఆర్బీఐ వెల్లడించింది. కాగా యస్ బ్యాంక్‌ను 2004లో స్థాపించినప్పటి నుంచి రాణా కపూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నారని, ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయడానికి చాలా సమయం పడుతుందని యస్ బ్యాంక్ పేర్కొంది. -
ఘోరంగా పడిపోయిన యస్ బ్యాంక్ షేరు
ముంబై : ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ నేటి ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. దలాల్ స్ట్రీట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే యస్ బ్యాంక్ షేరు 30 శాతానికి పైగా కుప్పకూలింది. 2008 జనవరి తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. బ్యాంక్ సీఈవో, ఎండీ రానా కపూర్ పదవీ కాలాన్ని కుదించి, ఆయన్ని 2019 జనవరి వరకు తన పదవి నుంచి దిగిపోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించడం షేరును అతలాకుతలం చేసింది. 2004లో బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా కపూరే ఉన్నారు. మూడేళ్ల పాటు అంటే 2021 ఆగస్టు 31 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని బ్యాంక్ షేర్ హోల్డర్స్ కోరారు. అయితే ఆ అభ్యర్థనను రెగ్యులేటర్ కొట్టివేసింది. 2019 జనవరి వరకు కపూర్ స్థానంలో బ్యాంక్‌కు కొత్త సీఈవో, ఎండీ రావాల్సిందేనని తెలిపింది. ఈ ఏడాది జూన్‌లోనే కపూర్‌ను మరో మూడేళ్ల పాటు రీ-అపాయింట్మెంట్ చేస్తూ యస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అంగీకరించారు. అది తుది ఆమోదం కోసం ఆర్బీఐ వద్దకు వెళ్లింది. కానీ ఆర్బీఐ మాత్రం మరో మూడేళ్ల పొడిగింపుపై ససేమీరా అనేసింది. ప్రస్తుతం పదవి కాలం ఆగస్టు 31తో ముగిసింది. తుదుపరి నోటీసులు పంపే వరకు ఆ పదవిలో కపూర్ కొనసాగనున్నారు. కపూర్, 2008లో చనిపోయిన అశోక్ కపూర్లు ఇద్దరూ యస్ బ్యాంక్ వ్యవస్థాపక టీమ్‌లో సభ్యులు. ప్రమోటర్‌గా, కపూర్, ఆయన కుటుంబానికి బ్యాంక్‌లో 10.66 శాతం వాటా ఉంది. కాగా ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 శాతం మేర నష్టపోయిన యస్ బ్యాంక్షేరు రూ.287.30గా నమోదైంది. ఆ అనంతరం అర్థగంటకి మరింత కుదేలై రూ.218.10కి చేరింది. నష్టాలను కొంతమేర తగ్గించుకున్న యస్ బ్యాంక్, ప్రస్తుతం 17.48 శాతం నష్టంలో రూ.263.40 వద్ద ట్రేడవుతోంది.