సాక్షి, అమరావతి: యస్ బ్యాంక్ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడు. రూ.1,300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యస్ బ్యాంక్‌కు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా దోచిపెట్టాడు. ఇంకెన్ని ఉన్నాయో?' అంటూ ధ్వజమెత్తారు. ఇందుకు ఆధారంగా ఆయన యస్ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. (చదవండి: స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు!)
చంద్రబాబు Yes Bankను అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల TTD నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు.ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని ఉన్నాయో? pic.twitter.com/HBUALmyJGK
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 7, 2020
Comments
Please login to add a commentAdd a comment