సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన అన్నారు. అయితే, దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో తేల్చుకోవాలంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 'సీఎం జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణతిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ.. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: 'వారిపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా'
మనీ లాండరింగ్ ఆరోపణలపై యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను(62) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. యస్ బ్యాంక్‌లో అక్రమ ఆర్థిక లావాదేవీల విషయంలో మార్చి 11 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. 'రాణా కపూర్‌ను ఈడీ అరెస్టు చేసింది. యస్ బ్యాంకు అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి. సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టింది కచ్చితంగా బయటపడుతుంది. తమ దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటని ఎల్లో మీడియా విలవిల్లాడుతోంది' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: 'కుల మేధావి కిరసనాయిలు సలహా తీసుకో'
కాగా మరో ట్వీట్‌లో.. 'చంద్రబాబు పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికులు అప్రమత్తంగా ఉండాలి. సఎం జగన్ గారిపై బురద చల్లడానికి దేనికైనా తెగిస్తారు. ఎల్లో మీడియా గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తోంది. తనే డబ్బు, మద్యం పంపిణీ చేయించి మన మీదకు నెట్టడానికి బాబు కుట్రలు పన్నుతాడంటూ' విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చదవండి: 'యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు'
Comments
Please login to add a commentAdd a comment