
ప్రస్తుతం యస్ బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలు తనకు తెలియదని యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రానా కపూర్ తెలిపారు. రానా కపూర్ మాట్లాడుతూ..యస్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిషేదం విధించడానికి గల కారణాలు తనకు తెలియదని అన్నారు. గత 13 నెలలుగా తాను బ్యాంక్ వ్యవహారాలతో దూరంగా ఉన్నానని అన్నారు. గతంలో యస్ బ్యాంక్‌కు ఎండీగా సేవలు అందించానని.. 2019లో తన వాటాను ప్రయివేటు రుణదాతలకు విక్రయించానని కపూర్ తెలిపారు. యెస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ కూడా అదే సమయంలో తమ వాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. గతంలో ఎస్ బ్యాంక్‌కు రూ.3.4 లక్షల కోట్ల లాభాలను అర్జించడానికి కపూర్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment