
ముంబై: యస్ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని ఆర్‌బీఐని కోరాలని యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కంపెనీ కీలకమైన బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు వెల్లడించింది. మరోవైపు కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది.
దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికలో భాగంగా సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్స్, రజత్ మోంగా, ప్రలయ్ మండల్‌లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించాలని కూడా బోర్డ్ నిర్ణయం తీసుకుంది. రాణా కపూర్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కుదిస్తూ ఆర్‌బీఐ ఇటీవలే ఆదేశాలిచ్చింది. షెడ్యూల్ ప్రకారమైతే, ఆయన పదవీ కాలం 2021, సెప్టెంబర్ వరకూ ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని కుదించడానికి గల కారణాలను ఆర్‌బీఐ వెల్లడించింది. కాగా యస్ బ్యాంక్‌ను 2004లో స్థాపించినప్పటి నుంచి రాణా కపూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నారని, ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయడానికి చాలా సమయం పడుతుందని యస్ బ్యాంక్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment