రాణా కపూర్(ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : యస్ బ్యాంకు ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం శరవేగంగా పథకాన్ని అమలు చేయనుండగా, యస్ బ్యాంకు కో ఫౌండర్ రాణా కపూర్‌కు సీబీఐ మరో షాక్ ఇచ్చింది. రాణా కపూర్, అతని భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్ గౌతమ్ థాపర్ లపై తాజాగా మరో కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్లిస్ అబోడ్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన ఉన్న బిందుతో పాటు, మిగిలిన వారిపై మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం కేసు నమోదు చేసినట్టు సీబీఐ తెలిపింది. ఈ కేసు ఢిల్లీలోని అమృత షెర్గిల్ బంగ్లా ఒప్పందానికి సంబంధించిందనీ, థాపర్ కంపెనీలకు రూ .2,000 కోట్లకు పైగా రుణాలకు సంబంధించి రూ.307 కోట్ల లంచం తీసుకున్నట్టుగా అనుమానాలున్నాయని అధికారులు తెలిపారు. అమృతా షెర్గిల్ మార్గ్‌లోని 1.2 ఎకరాల బంగ్లాకొనుగోలకు కపూర్‌కు బ్లిస్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లంచం ముట్టినట్టు చెప్పారు. దీంతో బ్లిస్ అబోడ్ కార్యాలయంతోపాటు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన ఢిల్లీ,ముంబైలో అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ వెల్లడించింది.
చదవండి : యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment