
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెంచరీ కొట్టిన కీలక సూచీ సెన్సెక్స్ మిడ్ సెషన్ తరువాత మరింత ఊపందుకుంది. ప్రస్తుతం 250 పాయింట్లు ఎగసి 35,762వద్ద. నిఫ్టీ 56 పాయింట్లు పుంజుకుని 10,741 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడుతుండగా రియల్టీ నష్టపోతోంది.
టైటన్, హీరోమోటో, ఆర్‌ఐఎల్, యూపీఎల్, పవర్‌గ్రిడ్, గెయిల్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, ఎస్‌బ్యాంక్ 7శాతం కుదేలైంది. ఐవోసీ, బీపీసీఎల్, ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్, ఐబీ హౌసింగ్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్, ఎన్‌టీపీసీ, ఎయిర్‌టెల్ తదితరాలు నష్టపోతున్నాయి.
ఐటీలో ఇన్ఫోసిస్, నిట్ టెక్, టీసీఎస్, టాటా ఎలక్సీ, ఒరాకిల్, మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ 3.25-0.7 శాతం మధ్య లాభపడ్డాయి.
మీడియా కౌంటర్లలో జీ, యుఫో, ఐనాక్స్ లీజర్, టీవీ18, నెట్‌వర్క్18, జీమీడియా, పీవీఆర్ 3-1 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, సన్‌టెక్, డీఎల్‌ఎఫ్, శోభా, బ్రిగేడ్ బలహీనంగా ఉన్నాయి.