సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా1250 పాయింట్లు పైగా ఎగియగా, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1172 పాయింట్లు ఎగిసి 3352 వద్ద, నిఫ్టీ 329 పాయింట్ల లాభంతో 9908 వద్ద ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్, ఆటో సెక్టార్లు , భారీగా లాభపడుతున్నాయి. ఆసియా మార్కెట్ల దన్ను, ఇటు లాక్‌డౌన్ సడలింపులతో దలాల్ స్ట్రీట్ లోనేడు (సోమవారం) స్ట్రాంగ్ ర్యాలీ కొనసాగుతోంది.
ముఖ్యంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతునిస్తున్నాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 4 శాతం లాభంతో 20 వేల మార్కును అధిగమించింది. ఐడీఎఫ్‌సీ 52 వారాల కనిష్ట స్థాయినితాకింది. పీఎన్‌బీ, ఆర్‌బీఎల్ బంధన్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీవోబీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీగా లాభపడుతున్నాయి. ఇంకా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment