ముంబై: యస్ బ్యాంక్ షేర్లు వజ్రాల్లాంటివని ఆ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. యస్ బ్యాంక్‌లో తనకున్న వాటాను విక్రయించబోనని స్పష్టంచేశారు. ఎండీ, సీఈఓగా ఈ బ్యాంక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఎప్పటికీ, ఈ షేర్లను అమ్మే ప్రశ్నే లేదని ఆయన ట్వీట్ చేశారు.
ఈ షేర్లు అమూల్యం...
రాణా కపూర్ పదవీ కాలాన్ని ఆర్‌బీఐ కుదించిన నేపథ్యంలో గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో యస్‌బ్యాంక్ షేర్ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ‘‘యస్ బ్యాంకులో ప్రమోటర్‌గా నాకున్న షేర్లు అమూల్యమైనవి. నా వాటాను నా ముగ్గురు కుమార్తెలకూ అందజేస్తా.ఈ షేర్లలో ఏ ఒక్క షేర్‌నూ విక్రయించకూడదని వీలునామాలో నా కుమార్తెలను కోరుతా’’ అని వివరించారు.
కాగా ప్రమోటర్లలో ఒకరైన దివంగత అశోక్ కపూర్ భార్య మధు కపూర్ 0.04 శాతం వాటాకు సమానమైన ఏడు లక్షల షేర్లను విక్రయించారు. ఈ నెల 21న ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా ఈ షేర్లను అమె అమ్మే శారు. ఈ వాటా విక్రయం కారణంగా మధు కపూర్ వాటా 9.28 శాతానికి తగ్గింది. మరోవైపు రాణా కపూర్ వాటా 10.66 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment