ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఆర్థిక వ్యవస్థ భద్రతే లక్ష్యంగా యస్ బ్యాంకు ఆంక్షల నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు. అతి తొందరలోనే నెలరోజుల గడువు లోపే యస్‌బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. యస్ బ్యాంకు కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, వారి సొమ్ము భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. డిపాజిట్‌దారుల భద్రతకోసం ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మరోవైపు ఆర్‌బీఐ సరియైన సరైన నిర్ణయం తీసుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని పరిష‍్కరించడంలో కేంద్రం,ఆర్‌బీఐ కృషిచేస్తోందన్నారు. యస్ బ్యాంకునకు విలువైన ఆస్తులున్నాయనీ ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాన్ని అన్వేషిస్తుందని భరోసా ఇచ్చారు. డిపాజిట్ దారులు ఆందోళన చెండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఆస్తుల పరంగా ఒకపుడు దేశంలో నాలుగవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్నయస్ బ్యాంకు గత ఏడాది కాలంలో ఆర్థిక ఇబ్బందులు, మూల కొరతతో ఇబ్బందులకుతోడు ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ విధించిన మారటోరియం, విత్ డ్రా ఆంక్షలతో స్టాక్‌మార్కట్లో యస్‌బ్యాంకు లో షేర్లలో అమ్మకాల వెల్లువెత్తింది. ఎస్‌బీఐ యస్‌బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయనుందనే వార్తలతో నిన్న 30 శాతం పైగా ఎగియగా, ఇవాళ ఆ లాభాలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. 75 శాతం క్షీణించి 9 స్థాయికి పడిపోయింది. 84.93 శాతం క్షీణించి ఆల్ టైం కనిష్టానికి చేరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నెల రోజుల పాటు యస్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం (మారటోరియం) విధించింది. బ్యాంక్ బోర్డ్‌ను కూడా రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకుంది. ముఖ్యంగా యస్ బ్యాంక్ డిపాజిటర్లు రూ. 50 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే ఆంక్షలు విదించింది. ప్రత్యేక అవసరాలు (పెళ్లి, ఆరోగ్యం, తదితర) సందర్భంలో మాత్రం రూ.50వేలకు మించి పొందే అవకాశం ఉంది. దీంతో ఆందోళనలో పడిపోయిన ఖాతాదారులు తమ సొమ్ము కోసం దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. అటు యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నట్టు జేపీ మోర్గాన్ ప్రకటించింది.
చదవండి : ఫోన్ పే సేవలకు యస్ బ్యాంకు సెగ
Comments
Please login to add a commentAdd a comment