రూ. 1000 కరెన్సీ నోట్లు మళ్లీ వస్తున్నాయా? | Is There A Plan To Bring Back Rs 1000 Notes? Check How RBI Governor Reacted On This Rumours - Sakshi
Sakshi News home page

Rs 1000 Notes Coming Back: రూ. 1000 నోట్లు మళ్లీ వస్తున్నాయా?

Published Fri, Oct 20 2023 3:15 PM | Last Updated on Fri, Oct 20 2023 3:42 PM

Is there a plan to bring back Rs 1000 notes Here is the truth - Sakshi

Re-introduction of Rs 1000 notes: కేంద్రం ప్రభుత్వం  ఇటీవల  అతిపెద్ద  కరెన్సీ నోటు  రెండు వేల  రూపాయల  నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాత పెద్ద నోట్లు తిరిగి చలామణిలోకి రానున్నాయని  ఊహాగానాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.  పెద్ద నోట్లు లేని కారణంగా గతంలో రద్దు చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టనున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ వుతున్నాయి.  

దీంతో  కేంద్ర బ్యాంకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా సష్టత నిచ్చినట్టు తెలుస్తోంది. రూ. 1,000 కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేదని  సోర్సెస్‌ని ఉటంకిస్తూ ఏఎన్‌ఐ రిపోర్ట్‌ చేసింది. మరోవైపు  ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చారు.

 కాగా 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.   ప్రజలు తమ ఉద్ద  ఉన్న ఈ నోట్ల మార్పిడికి కొంత సమయాన్ని కూడా ఇచ్చింది ప్రభుత్వం.  అప్పట్లో ఈ  అనూహ్య ప్రకటనతో యావద్దేశం దిగ్భ్రాంతికి లోనైంది. అనంతరం  పాత నోట్ల స్థానంలో  కొత్త రూ. 500 నోట్లతోపాటు, కొత్త రూ.2000 కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. అయితే  క్లీన్ నోట్ పాలసీలో భాగంగా  ఇటీవల రూ 2వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంది. అలాగే రూ. 2వేల నోట్ల మార్పిడికి కూడా కొంత గడువు ఇచ్చింది.  దీన్ని తొలుత సెప్టెంబర్ 30 వరకు నిర్ణయించింది.  ఆ తర్వాత అక్టోబర్ 7, 2023 వరకు  అవకాశాన్ని పొడిగించింది.  అక్టోబర్ 7 తరువాత కూడా ఇంకా ఎవరిదగ్గరైనా  రూ. 2000 నోట్లు ఉంటే ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్పు చేసుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement