saktikanth das
-
భారత్, ఇండొనేసియా మధ్య స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం
ముంబై: ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలోనే నిర్వహించుకోవడంపై భారత్, ఇండొనేíసియా దృష్టి పెట్టాయి. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేసియా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేసియా గవర్నర్ పెర్రీ వార్జియో దీనిపై సంతకాలు చేశారు. సీమాంతర లావాదేవీలను భారతీయ రూపాయి (ఐఎన్ఆర్), ఇండొనేషియా రూపియా (ఐడీఆర్) మారకంలో నిర్వహించడాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ఇది ఉపయోగ పడనుంది. -
రూ. 1000 కరెన్సీ నోట్లు మళ్లీ వస్తున్నాయా?
Re-introduction of Rs 1000 notes: కేంద్రం ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాత పెద్ద నోట్లు తిరిగి చలామణిలోకి రానున్నాయని ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. పెద్ద నోట్లు లేని కారణంగా గతంలో రద్దు చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ వుతున్నాయి. దీంతో కేంద్ర బ్యాంకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా సష్టత నిచ్చినట్టు తెలుస్తోంది. రూ. 1,000 కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేదని సోర్సెస్‌ని ఉటంకిస్తూ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కాగా 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజలు తమ ఉద్ద ఉన్న ఈ నోట్ల మార్పిడికి కొంత సమయాన్ని కూడా ఇచ్చింది ప్రభుత్వం. అప్పట్లో ఈ అనూహ్య ప్రకటనతో యావద్దేశం దిగ్భ్రాంతికి లోనైంది. అనంతరం పాత నోట్ల స్థానంలో కొత్త రూ. 500 నోట్లతోపాటు, కొత్త రూ.2000 కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. అయితే క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఇటీవల రూ 2వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంది. అలాగే రూ. 2వేల నోట్ల మార్పిడికి కూడా కొంత గడువు ఇచ్చింది. దీన్ని తొలుత సెప్టెంబర్ 30 వరకు నిర్ణయించింది. ఆ తర్వాత అక్టోబర్ 7, 2023 వరకు అవకాశాన్ని పొడిగించింది. అక్టోబర్ 7 తరువాత కూడా ఇంకా ఎవరిదగ్గరైనా రూ. 2000 నోట్లు ఉంటే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్పు చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. kuch aur expect bhi nahi kar saktey. 😂 pic.twitter.com/lwMBl2tUQh — चयन 🇮🇳 (@Tweet2Chayan) October 20, 2023 -
అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ
న్యూఢిల్లీ: గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు తీవ్రంగా నగదు కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు డిజిటెల్ లావాదేవీలకు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ, అదే స్థాయిలో 100,500, 2000 నోట్లతోనూ లావాదేవీలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల దేశ ప్రజలకి షాక్కిస్తూ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్న ఆర్బీఐ ప్రకటించింది. దీంతో నోట్ల రద్దు అంశానికి సంబంధించి పలు రకాల వార్తలు వినపడుతున్నాయి. తాజాగా కేంద్ర బ్యాంకులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్..నోట్ల రద్దు అంశంపై పలు విషయాలను వెల్లడించారు. 2వేల నోట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఆర్బీఐ గవర్నర్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో.. 2వేల నోట్లను ఉపసంహరించిన నేపథ్యంలో.. ఆ వత్తిడిని తట్టుకునేందుకు రూ.1000 నోట్లను ప్రవేశపెడుతారా అని ప్రశ్నించారు. అందుకు శక్తికాంత్ దాస్ బదులిస్తూ.. రూ.1000 నోటును పున ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు. అది ఊహాజనితమేనని, అలాంటి ప్రతిపాదనే లేదని స్పష్టం చేశారు. వీటితో పాటు అకస్మికంగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్మెంట్ చర్యల్లో భాగమేనని, క్లీన్ నోట్ పాలసీ అనే ప్రక్రియ ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో 2 వేల నోట్ల విలువ కేవలం 10.8 శాతం మాత్రమే అని, కనుక ప్రస్తుత ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా స్వల్ప స్థాయిలో ప్రభావం ఉంటుందన్నారు. రూ. 2,000 నోటు నవంబర్ 2016లో ప్రవేశపెట్టిన ఆర్బీఐ.. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరిత పద్ధతిలో తీర్చేందుకు రూ.2000 నోటు చలామణిలోకి తీసుకొచ్చింది. చదవండి: విచిత్రం.. కేరళలో కిలో మీటర్ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే? -
Shaktikanta Das: కోత లేదు.. పెంచేదీ లేదు!
సాక్షి, ముంబై: ఆర్థికవేత్తలు,నిపుణుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు-రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రస్తుతం రెపో 4 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో) మూడు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గు చూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారమూ ఏకగ్రీవంగా ఇదే విధానాన్ని పునరుద్ఘాటించింది. తద్వారా వృద్ధికి తగిన మద్దతు ఆర్బీఐ నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ తరువాత, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్వహించిన మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇది. ఏప్రిల్‌లో తదుపరి సమీక్ష : ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎంపీసీ 28వ తదుపరి సమావేశం జరుగుతుంది. మే నాటికి సీఆర్ఆర్ 4 శాతానికి ‘రివర్స్’ : కాగా, రెపో రేటును తగ్గించని ఆర్బీఐ పాలసీ సమీక్ష, రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను తన వద్ద డిపాజిట్ చేసినప్పుడు ఇందుకు ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా 3.35 శాతంగానే కొనసాగుతుందని తన తాజా పాలసీలో ఆర్బీఐ స్పష్టంచేసింది. ఫిబ్రవరి తర్వాత ఈ రేటు కూడా 155 పాయింట్లు తగ్గి, 4.9 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంకులు తమ నిధుల్లో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద నిర్వహించాల్సిన మొత్తం క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను మార్చి 27 నాటికి 3.5 శాతానికి, మే 22 నాటికి 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్ఆర్ 3 శాతంగా ఉంది. అంటే బ్యాంకుల వద్ద ప్రస్తుతం ఉన్న నిధుల్లో మరికొంత మొత్తం ఆర్బీఐకి చేరుతుందన్నమాట. తద్వారా తన వద్దకు తిరిగి వచ్చే ‘మరిన్ని’ నిధులను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌కు అలాగే ఇతర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) చర్యలకు సెంట్రల్ బ్యాంక్ వినియోగించ నుంది. డిసెంబర్ నాటికి 4.3 శాతానికి ద్రవ్యోల్బణం ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2021–22 ఏప్రిల్–సెప్టెంబర్) సగటున ఈ రేటు 5 శాతానికి తగ్గుతుంది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4.3 శాతానికి దిగివస్తుంది. ఇదే కారణంగా కీలక రేటు విధానం సరళతరంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. అంటే వడ్డీరేట్లు వ్యవస్థలో మరింత తగ్గడానికే అవకాశం ఉంది తప్ప, పెంచే యోచనలేదని భావించవచ్చు. ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దన్ను! భారత్ ఆర్థిక వ్యవస్థ ఒకేఒక్క దిశలో.. అదీ పురోగమన బాటలో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. 2021–22లో ఎకానమీ 10.5% వృద్ధిని (ఎకనమిక్ సర్వే 11% కన్నా తక్కువ కావడం గమనార్హం) నమోదు చేసుకుంటుందన్న భరోసాను ఆయన ఇచ్చారు. మౌలిక రంగం, ఆరోగ్యం వంటి కీలక రంగాల పునరుత్తేజానికి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తగిన చర్యలను ప్రకటించిందని తెలిపారు. ఆయా అంశాల దన్నుతో 2021–22 మొదటి ఆరు నెలల్లో వృద్ధి 26.2%–8.3% శ్రేణిలో ఉంటుందని, 3వ త్రైమాసికంలో 6% వృద్ధి నమోదవుతుందని తెలిపింది. బ్యాంకులకు నిధుల లభ్యత: అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకింగ్ ఆర్బీఐ నుంచి నిధులు పొందడానికి సంబంధించిన మార్జినల్ స్టాండింగ్ సౌలభ్యత (ఎంఎస్ఎఫ్)ను ఆర్బీఐ మరో ఆరు నెలలు పొడిగించింది. దీనివల్ల రూ.1.53 లక్షల కోట్లు బ్యాంకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చి నుంచీ ఈ పొడిగింపులను ఆర్బీఐ కొనసాగిస్తోంది. ఆలోచనాపూర్వక పాలసీ : వృద్ధికి మద్దతు, రుణ నిర్వహణ, ద్రవ్య లభ్యత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఆలోచనాపూర్వక పాలసీ ఇదీ. వృద్ధే లక్ష్యంగా రూపొందించిన 2021-22 బడ్జెట్‌తో కలిసి తాజా విధాన నిర్ణయాలు కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. - దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రియల్టీకి ప్రయోజనం.. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు తగిన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలకు టీఎల్టీఆర్ఓ ప్రయోజనాలను విస్తరించడం రియల్టీసహా ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న పలు రంగాలకు దోహదపడుతుంది. తక్కువ వడ్డీరేట్ల వల్ల హౌసింగ్ రంగంలో డిమాండ్ ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. - శశిధర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ రికవరీ పటిష్టతకు దోహదం : ఇప్పటికే ఎకానమీ రికవరీ వేగవంతమైంది. సెంట్రల్ బ్యాంక్ తాజా పాలసీ నిర్ణయాలు ఈ రికవరీ బాటను మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నాం.చిన్న పరిశ్రమలకు ద్రవ్య లభ్యతకు పాలసీ తగిన నిర్ణయాలను తీసుకోవడం హర్షణీయం. సరళ విధానాన్ని పునరుద్ఘాటించడం వృద్ధికి భరోసాను ఇచ్చే అంశం. - ఉదయ్ శంకర్, ఫిక్కీ ప్రెసిడెంట్ -
చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఆర్థిక వ్యవస్థ భద్రతే లక్ష్యంగా యస్ బ్యాంకు ఆంక్షల నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. అతి తొందరలోనే నెలరోజుల గడువు లోపే యస్‌బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. యస్ బ్యాంకు కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, వారి సొమ్ము భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. డిపాజిట్‌దారుల భద్రతకోసం ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మరోవైపు ఆర్బీఐ సరియైన సరైన నిర్ణయం తీసుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్రం,ఆర్బీఐ కృషిచేస్తోందన్నారు. యస్ బ్యాంకునకు విలువైన ఆస్తులున్నాయనీ ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాన్ని అన్వేషిస్తుందని భరోసా ఇచ్చారు. డిపాజిట్ దారులు ఆందోళన చెండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆస్తుల పరంగా ఒకపుడు దేశంలో నాలుగవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్నయస్ బ్యాంకు గత ఏడాది కాలంలో ఆర్థిక ఇబ్బందులు, మూల కొరతతో ఇబ్బందులకుతోడు ఆర్బీఐ తాజా నిర్ణయంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన మారటోరియం, విత్ డ్రా ఆంక్షలతో స్టాక్‌మార్కట్లో యస్‌బ్యాంకు లో షేర్లలో అమ్మకాల వెల్లువెత్తింది. ఎస్బీఐ యస్‌బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయనుందనే వార్తలతో నిన్న 30 శాతం పైగా ఎగియగా, ఇవాళ ఆ లాభాలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. 75 శాతం క్షీణించి 9 స్థాయికి పడిపోయింది. 84.93 శాతం క్షీణించి ఆల్ టైం కనిష్టానికి చేరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నెల రోజుల పాటు యస్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం (మారటోరియం) విధించింది. బ్యాంక్ బోర్డ్‌ను కూడా రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకుంది. ముఖ్యంగా యస్ బ్యాంక్ డిపాజిటర్లు రూ. 50 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే ఆంక్షలు విదించింది. ప్రత్యేక అవసరాలు (పెళ్లి, ఆరోగ్యం, తదితర) సందర్భంలో మాత్రం రూ.50వేలకు మించి పొందే అవకాశం ఉంది. దీంతో ఆందోళనలో పడిపోయిన ఖాతాదారులు తమ సొమ్ము కోసం దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. అటు యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నట్టు జేపీ మోర్గాన్ ప్రకటించింది. చదవండి : ఫోన్ పే సేవలకు యస్ బ్యాంకు సెగ -
బ్యాంకు వినియోగదారులకు మరో గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఛార్జీలు, ఫీజు తగ్గించే అంశంపై కసరత్తు చేస్తోంది. ఏటీఎం ఇంటర్ చార్జీలు, ఫీజు విధానాన్ని సమీక్షించేందుకు త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు గురువారం (మే 6) ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా ఆర్బీఐ ఈ సంకేతాలిచ్చింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ల ద్వారా చేపట్టే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్బీఐ ఏటీఎం చార్జీల విషయంలో కూడా బ్యాంకు ఖాతాదారులకు భారీ ఊరట నివ్వబోవడం విశేషం. ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించిన ఆర్బీఐ ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని తెలిపింది. ఇందులో స్టేక్ హోల్డర్స్‌కు చోటు కల్పిస్తామన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. తమ సూచనలను, సలహాలను తమ మొదటి సమావేశం తర్వాత, రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన సూచనలకు ఆ తర్వాత వారం రోజుల్లో విధి విధానాలను వెలురిస్తామని పేర్కొంది. కాగా పాలసీ రివ్యూలో భాగంగా రెపో రేటు పావు శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6 శాతం రెపో రేటు 5.75 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. దీంతో 2010 సెప్టెంబర్ తరువాత మళ్లీ రెపో రేటు 6 శాతం దిగువకు దిగి వచ్చింది. -
ఫిబ్రవరి 21న బ్యాంకు సీఈవోలతో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులతో త్వరలోనే సమావేశం కానున్నామని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నరు శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్బీఐ కీలక వడ్డీరేటు తగ్గింపు, ఈ ప్రయోజనాలను వినియోగాదారులకు అందించే విధంగావారితో చర్చించ నున్నామని సోమవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో ప్రకటించారు. ఫిబ్రవరి 21న ప్రభుత్వ, ప్రయివేటు సీఈవోలతో భేటి కానున్నట్టు చెప్పారు. అంతకుముందు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలను తిరిగి చేపట్టిన అరుణ్ జైట్లీ ఆర్బీఐ బోర్డునుద్దేశించి ప్రసంగించారు. ద్రవ్య విధాన నిర్ణయాలను బ్యాంకు ఖాతాదారులకు బదిలీ చేయడం ముఖ్యమని జైట్లీ వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ రంగంలో విలీనంపై వ్యాఖ్యానిస్తూ మెగా బ్యాంకులు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరమని నొక్కి చెప్పారు. కాగా గవర్నరుగా శక్తి కాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసి కమిటీ తొలిసారిగా ఈ నెలలో ప్రకటించిన పాలసీ రివ్యూలో కీలక వడ్డీరేట్లను 0.25శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు సీఈవోలతో శక్తికాంత దాస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశమయ్యారు. బ్యాంకింగ్ రంగం నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తోందో తెలియజెప్పే ఉద్దేశంతో పలు బ్యాంకుల సీఈవోలతో భేటీ అయినట్టు ఆయన వివరించారు. దీంతోపాటు ప్రస్తుత, భవిష్యత్తు అంశాలపై చర్చంచామని సమావేశం అనంతరం శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2018-19 సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక మానిటరీ పాలసి రివ్యూ ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత ఆధ్వర్యంలో ఇది మొదటి పరపతి విధాన సమీక్ష. మరోవైపు ఈ పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐసీఐసీఐ -వీడియోకాన్ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌పై కేసు నమోదు, దాదాపు సగానికిపైగా బ్యాంకులు ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల కిందికి రావడం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
రేపటినుంచి నగదు మార్పిడి రూ.2వేలు మాత్రమే
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రజలకు మరిన్నిఉపశమన చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా పెళ్ళిళ్ల సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, రైతులకు కేంద్ర నిర్ణయం ఊరటనిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం ఉదయం ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కొన్ని వెసులు బాట్లను, మరిన్ని మార్పులను వెల్లడించారు. అయితే రద్దు చేసిన రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకునే పరిమితిని రూ.4,500 నుంచి రూ.2,000కు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. మరింత మందికి పాత నోట్లను మార్చుకునే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగదు మార్పిడిలో ఈ కొత్త నిబంధన రేపటినుంచి(నవంబరు 18) అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వివిధ వర్గాలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా కుటుంబాల నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నామన్నారు. గుర్తింపు కార్డు చూపి (సెల్ఫ్ డిక్లరేషన్ల ) రూ.2.5 లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే రైతులు రుణ బీమా ప్రీమియం చెల్లింపుల గడువును 15 రోజుల పెంచారు. ఇందుకోసం ఆయా రైతులు కెవైసీ వివరాలు అందించాలి. పంటరుణాలు పొందిన రైతులు వారానికి 25 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కిసాన్ క్రెడిట్ దారులకూ ఇదే పరిమితి వర్తింస్తుందని తెలిపారు. ఏపీఎంసీ మార్కెట్ లో రిజిస్టర్ అయిన వ్యాపార్లు 50 వేలకు డ్రా చేసుకునే అవకాశం. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (అప్ టూ గ్రూప్ సీ...ఉద్యోగులు) సాలరీ అడ్వాన్స్ కింద 10 వేలకు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రకటించారు. హాస్పిటల్ గురించి ప్రశ్నించినపుడు.. నిర్ణయం తీసుకున్న తరువాత వివరాలు వెల్లడిస్తామని శక్తికాంత్ దాస్ చెప్పారు. మరోవైపు నగదు అందుబాటులో లేనందువల్లే మార్పిడి కుదింపు నిర్ణయం తీసుకన్నారా అని ప్రశ్నించినపుడు ఈ వాదనను ఆయన కొట్టి పారేశారు. ప్రభుత్వం వద్ద నగదు చాలినంత అందుబాటులోఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ సమావేశం ముఖ్యాంశాలు: వివాహ వేడుకలకు రూ.2.5 లక్షల నగదును విత్ డ్రా చేసుకోవచ్చు పంట రుణం కింద మంజూరైన, రైతుల అకౌంట్లకు క్రెడిట్ అయిన రుణం నుంచి వారానికి రూ.25,000ను రైతులు విత్‌డ్రా చేసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు ఇదే పరిమితి వర్తింపు రైతులంతా కేవైసీ వివరాలు అందించాలి ఆ అకౌంట్లు రైతు పేరు మీదనే ఉండాలి, రుణ పరిమితులకు లోబడి ఉండాలి. రుణ బీమా ప్రీమియం తేదీల గడువు 15 రోజులకు పెంపు నగదు మార్పిడి కింద ఒక్కవ్యక్తి రేపటి నుంచి డ్రా చేసుకునే మొత్తం రూ.4500 నుంచి రూ.2000లకు కుదింపు ఏపీఎంసీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లో రిజిస్ట్ర్ అయిన వారు వారానికి రూ.50వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు ఏటీఎంలో సాప్ట్ వేర్ మార్పుపై టాస్క్‌ఫోర్స్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు(అప్ టూ గ్రూప్ సీ... ఉద్యోగులు) అడ్వాన్స్ జీతం కింద రూ.10,000 నగదును ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం ప్రభుత్వం వద్ద అవసరమైనంత నగదు లభ్యత ఉంది, నగదు ఇబ్బంది లేదు -
ఇక నగదు మార్పిడి రూ.2వేలు మాత్రమే