వందేళ్ల వృద్ధురాలు.. సంక్షేమ పథకాలకు అనర్హురాలు
వందేళ్ల నిరుపేద వృద్ధురాలు.. కన్న కొడకులు లేరు, కళ్లు కనబడవు, చెవులు వినబడవు.. కాళ్లు చేతులు సరిగా పనిచేయవు, కూర్చునచోటే కూర్చోవాలి, పడుకున్నచోటే పడుకోవాలి ఇన్ని అగచాట్లు పడుతున్న వృద్ధురాలిని అధికారులు కరుణించకపోవడంతో ఆమె సంక్షేమ పథకాలకు అనర్హురాలిగా మారింది.
వందేళ్ల నిరుపేద వృద్ధురాలు.. కన్న కొడకులు లేరు, కళ్లు కనబడవు, చెవులు వినబడవు.. కాళ్లు చేతులు సరిగా పనిచేయవు, కూర్చునచోటే కూర్చోవాలి, పడుకున్నచోటే పడుకోవాలి ఇన్ని అగచాట్లు పడుతున్న వృద్ధురాలిని అధికారులు కరుణించకపోవడంతో ఆమె సంక్షేమ పథకాలకు అనర్హురాలిగా మారింది. బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన దాసరి మద్దమ్మకు చెందిన ఇద్దరు కుమారులు మరణించడంతో ఆమె మనవళు్ల కూలీ పనులు చేస్తూ ఆమె ఆలనా పాలనా చూసుకుంటున్నారు. 2014 వరకు అప్పటి ప్రభుత్వం ఇచ్చే రూ. 200 పింఛన్ ఆమెకు అందేది. ప్రస్తుతం పింఛన్‌కు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లింక్ పెట్టడంతో ఆమె అనర్హురాలిగా మిగిలిపోయింది. ఆధార్ కార్డు కోసం వెలితే వేలి ముద్రలు, కళ్లకు సంబంధించిన ఐరీస్ ఫొటోలు తీసుకోవడం లేదు. దీంతో ఆధార్‌కార్డు లేదనే సాకుతో అధికారులు పింఛన్, రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. కనిపించిన వారికల్లా వృద్ధురాలు దండం పెట్టి తనకు పింఛను, రేషన్ బియ్యం ఇప్పించాలని వేడుకుంటుంది.
- బేతంచెర్ల