Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

IPL 2025: Mumbai Indians Beat Chennai Super Kings At Wankhede1
IPL 2025: రోహిత్‌, సూర్యకుమార్‌ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 20) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే శివమ్‌ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్‌ రషీద్‌ 20 బంతుల్లో 19, రచిన్‌ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్‌ చాహర్‌, అశ్వనీ కుమార్‌, సాంట్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం​ ఛేదనకు దిగిన ముంబై రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (30 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్‌ శర్మ సీజన్‌లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్‌ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.

Karnatakas Former Police Chief Found Dead In Bengaluru2
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం ఆయన సొంత ఇంటిలో రక్తమడుగులో పడి ఉన్నారు. 68 ఏళ్ల ఓం ప్రకాష్.. పడి ఉన్న ఫ్లోర్ అంతా రక్తంతో నిండిపోయింది. ఆయన ఒంటిపై తీవ్ర గాయాలున్నాయని పోలీస్ అధికారి స్పష్టం చేశారు. అయితే ఓం ప్రకాష్ చనిపోయిన విషయాన్ని ఆయన భార్య పల్లవి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భార్య పల్లవిని, ఆయన కూతుర్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఇంటి నుంచి ఆయన భార్య పల్లవి తమకు సమాచారం అందించిందని, తాము అక్కడకు వెళ్లే సరికి మృతదేహం స్విమ్మింగ్ పూల్ లో ఉందని పోలీసులు తెలిపారు. ఆ పూల్ అంతా రక్తంతో నిండి ఉండగా, ఫ్లోర్ కూడా రక్తం తడిసిముద్దయ్యిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, ప్రస్తుతం ఆయన మృతికి సంబంధించి భార్య పల్లవిని, కూతుర్ని విచారిస్తున్నట్లు తెలిపారు.ఆయనకు గతంలో బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది చంపుతామనే బెదిరింపులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఒకానొక సందర్భంలో ఓమ్ ప్రకాష్ కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు.1981 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఓమ్ ప్రకాష్. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓమ్ ప్రకాష్.. జియోలజీలో ఎంఎస్సీ చేశారు. కర్ణాటక రాష్ట్ర డీజీపీగా 2015 మార్చి 1వ తేదీన నియమించబడ్డారు.

Lost Everything In One Night Ramban Residents3
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’

‍న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపానికి జమ్మూ కశ్మీర్ లోని రాంబాన్ కు చెందిన చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీ వరద నీటికి ఒక్క రాత్రిలోనే తమ జీవితం తల్లకిందులైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తులు, ఇళ్లులు అన్నీ కూడా ఆ ఘటనతో కోల్పోయమని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో ఓం సింగ్ అనే దుకాణదారుడు తన షాపు ఎలా నీటిలో కొట్టుకుపోయిందో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను అవతలి వైపు ఉంటున్నాను. కానీ అక్కడ నీటి ప్రవాహం చాలా అధికంగా ఉంది. మేము ఇక్కడకి సకాలంలో చేరుకోలేక పోయాం. నేను ఇక్కడికి చేరుకునే సరికి నా షాపు సహా మొత్తం మార్కెట్ అంతా అదృశ్యమైంది. దీనిని నేను కళ్లారా చూశాను. ఇలాంటింది చూడటం ఇదే తొలిసారి’ అని రాంబన్ నివాసి ఓమ్ సింగ్ తెలిపాడు.ఇది ఒక్క రాంబన్ పరిస్థితే కాదు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. తమ సర్వస్వం కోల్పోయామని వారు విలపిస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి కొండచరియలు విరిగిపడటమే కాదు తాము సర్వస్వం కోల్పోయామని అంటున్నారు. కొండచరియలు విరిగిపడిన కారణంగా చాలా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు కొందరు పేర్కొన్నారు.#WATCH | Ramban, J&K: Om Singh, a local, says, "I live on the other side, but even there, the flow of water was very strong, we could not make it here in time. When I reached here, I saw the whole market, including my shop, had vanished... This is the first time I am seeing… https://t.co/aPfmXKXGjZ pic.twitter.com/VjIFqY4ySd— ANI (@ANI) April 20, 2025 #WATCH | Jammu and Kashmir: Several buildings have been damaged due to a landslide following heavy rains and hailstorm in Ramban district pic.twitter.com/jx3MGycq4s— ANI (@ANI) April 20, 2025

IPL 2025, PBKS VS RCB: Virat Kohli Equals Rohit Sharma For Most Player Of The Match Awards By An Indian In IPL4
PBKS VS RCB: రోహిత్‌ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఛేదనలో అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో విరాట్‌కు ఇది మూడో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. ఓవరాల్‌గా 19వది.ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో విరాట్‌ రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్‌ కూడా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 19 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్‌, రోహిత్‌ ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్‌లో 25 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్‌ గేల్‌ (22) పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్‌, రోహిత్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్‌-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో విరాట్‌ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్‌ వార్నర్‌ పేరిట ఉంది. వార్నర్‌ 66 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్‌ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన టాప్‌-5 బ్యాటర్స్‌..విరాట్‌- 67 (59 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్‌- 66 (62, 4)శిఖర్‌ ధవన్‌- 53 (51, 2)రోహిత్‌ శర్మ- 45 (43, 2)కేఎల్‌ రాహుల్‌- 43 (39, 4)ఏబీ డివిలియర్స్‌- 43 (40, 3)ఐపీఎల్‌లో విరాట్‌ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్‌ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుం​జుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్‌ చేశారు.పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (33) టాప్‌ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్‌ ఆర్య 22, శ్రేయస్‌ అ‍య్యర్‌ 6, జోస్‌ ఇంగ్లిస్‌ 29, నేహల్‌ వధేరా 5, స్టోయినిస్‌ 1, శశాంక్‌ సింగ్‌ 31 (నాటౌట్‌), జన్సెన్‌ 25 (నాటౌట్‌) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్‌ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్‌ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్‌; సిక్స్‌) సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ (1), రజత్‌ పాటిదార్‌ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, చహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Story on IAS Smita Sabharwal Now In Controversy5
స్మిత సబర్వాల్‌ ధిక్కార స్వరం!

సాక్షి, హైదరాబాద్‌: కంచె గచ్చిబౌలి భూముల వ‍్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐతో రూపొందించిన ఓ ఫేక్‌ ఫోటోను ‘హాయ్‌ హైదరాబాద్‌’ అనే హాండిల్‌ గత మార్చి 31న సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేయగా, ఈ పోస్టును స్విత సబర్వాల్‌ షేర్‌ చేశారు.హెచ్‌సీయూలో ఉన్న మష్రూమ్‌ రాక్‌, దాని ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు నెమలి, రెండు జింకలతో ‘గిబీ‍్ల ఆర్ట్‌’ తరహాలో ఏఐతో రూపొందించిన ఆ చిత్రానికి ‘సేవ్‌ హెచ్‌సీయూ..సేవ్‌ హైదరాబాద్‌ బయోడైవర్సిటీ’ వంటి నినాదాలను జోడించి ‘హాయ్‌ హైదరాబాద్‌’ పోస్టు చేయగా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి స్మిత సబర్వాల్‌ పోస్టు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఈ వ‍్యవహారంలో గచ్చిబౌలి పోలీసులు ఆమె నుంచి వివరణ కోరుతూ ఈ నెల 12న నోటిసులు జారీ చేయగా, ఆమె తగ్గేదే లే అంటూ తన సోషల్‌ మీడియా యాక్టివిజాన్ని కొనసాగిస్తున్నారు. ‘చట్టానికి కట్టుబడి ఉండే పౌరురాలిగా గచ్చిబౌలి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాను. భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌) చట‍్టం కింద ఇచి‍్చన నోటిసులకు నా స్టేట్మెంట్‌ను ఈ రోజు ఇచ్చారు.ఆ పోస్టును 2వేల మంది షేర్‌ చేశారు. వారందరిపై ఇదే తరహాలో చర్యలకు ఉపక్రమించారా? అని స్పష్టత సైతం కోరిన. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే, కొందరిని లక్ష్యంగా చేసుకోడం ఆందోళనకలిగించే అంశం. చట్టం ముందు సమానత్వం, తటస్థట వంటి సూత్రాల విషయంలో రాజీపడినట్టు అర్థం అవుతుంది.’ అని ఆమె శనివారం ‘ఎక్స్‌’ వేదికగా కొత్త పోస్టు పెట‍్టడంతో మరింత వేడి రాజుకుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ‍్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు సంబంధించిన వార్తను సైతం కొన్ని రోజుల ముందు షేర్‌ చేశారు.‘ప్రభుత్వం ధ్వంసం చేసిన 100 ఎకరాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికతో రండి. లేకుంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదు’ అని సుప్రీం కోర్టు చేసిన తీవ్రమైన వాఖ్యాలు ఆ వార్తలో ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంలో తనకు పోలీసులు నోటిసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా కొందరు చేసిన పోస్టులను సైతం ఆమె షేర్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డిని అసభ్య పదజాలంతో ఓ వృద్ధుడు దూషిస్తున్న వీడియో పోస్టు చేసినందుకు గాను ఇటీవల అరెస్టై విడుదలైన ‘యూట్యూబ్‌’ మహిళా జర్నలిసు‍్ట రేవతి సైతం స్మిత సబర్వాల్‌కు మద్దతుగా ‘ఎక్స్‌’లో ఓ పోస్టు పెట్టగా, దానిని సైతం ఆమె షేర్‌ చేశారు. ఈ మొత్తానికి ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్‌ పంతం వీడకుండా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండడం గమనార్హం. ఆమెకు బీఆర్‌ఎస్‌ మద్ధతుదారులు మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్‌ మద్దతుదారులు తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు.వివాదాలు కొత్త కాదు... స్మితా సబర్వాల్‌ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా యాక్టివిజంతో తరుచూ వార్తల్లో ఉంటున్నారు. బిల్కీస్‌ బాను సామూహిక అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆమె చేసిన పోస్టులు వైరల్‌ అయ్యాయి. బీజేపీ మద్ధతుదారులు ఆమెకు వ్యతిరకంగా అప్పట్లో తీవ్రంగా ట్రోల్‌ చేశారు. ఇక నకిలీ వికలాంగ సర్టిఫికేట్‌తో పూజా ఖేద్కర్‌ అని యువతి ఐఏఎస్‌ కావడం ఇటీవల తీవ్ర వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారుల నియామకాల్లో వికలాంగుల కోటాను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టులను చాలా మంది తప్పుబట్టారు. ఐఏఎస్‌లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని, వికలాంగులతో సాధ్యం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయగా, వికలాంగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆమెకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేయగా, ఆమె వ‍్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యాలకు చర్యలు తీసుకోలేమని కోర్టు కొటి‍్టవేసింది.ఓడిన వారి కోసమేనా ఏడ్పు..? : సీఎం సీపీఆర్వో ప్రశ్నస్మిత సబర్వాల్‌ వ్యవహారంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్యప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్వో) బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. స్మిత సబర్వాల్‌ పేరును ప్రస్తావించకుండా ఆమె వైఖరీని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ‘ఆ ఐఏఎస్‌ అధికారి ‘దృష్టికోణం’లో మార్పు ఎందుకు వచ్చినట్టు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారోచ్చా? అప్పుడు(బీఆర్‌ఎస్‌ హయాంలో) ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికించి, వన్యప్రాణులను తరమింది వీరే.ఇప్పుడు తప్పుబట్టడంలో మర్మం ఏందో ?. అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన(బీఆర్‌ఎస్‌) వారి కోసమా?’ అని బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్‌ జరిగిన మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 25లక్షల చెట్టను నరికివేశారని, పర్యావరణ అనుమతులు లేకుండా మిషన్‌ భగీరథ పనులు చేపట్టారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా షేర్‌ చేస్తూ ఆమె ద్వంద వైఖరీని ప్రశ్నించారు. ఆమె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.-మహమ్మద్‌ ఫసియుద్దీన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, సాక్షి

When Raj Thackeray Quit Shiv Sena What He Had Responded6
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!

‘నేను పార్టీ నుంచి ఏం కోరుకున్నాను.. గౌరవం, మర్యాద కోరుకున్నాను. కానీ నాకు అవి అక్కడ దొరకలేదు. పార్టీ నుంచి ఏమీ ఆశించలేదు. చాలా అవమానించారు. మానసికంగా చాలా హింసించారు. నా బద్ధ శత్రువుకు కూడా ఇటువంటి రోజు రాకూడదు’. ఇవి ఒకనాడు రాజ్ ఠాక్రే చెప్పిన మాటలు. 20 ఏళ్ల క్రితం రాజ్ ఠాక్రే ప్రెస్ కాన్పరెన్స్ లో చెప్పిన మాటలు. శివసేన నుంచి బయటకొచ్చి ఎమ్మెన్నెస్ పార్టీ పెట్టడానికి ముందు అన్న మాటలు. 2005, డిసంబర్‌ 18వ తేదీన మీడియా సాక్షిగా రాజ్‌ ఠాక్రే అన్న మాటలివి. ఆ రోజు ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. బాలాసాహెబ్‌ ఠాక్రే కలలో కూడా ఊహించని పరిణామం. 2005లో శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్ ఠాక్రే.. మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. అప్పట్నుం‍చి ఇప్పటివరకూ శివసేనతో ఎటువంటి సంబంధాలు కొనసాగించలేదు. ‘మీరు వేరు- మేము వేరు’ అన్నట్లుగానే సాగింది ఈ ఇరు పార్టీల వైరం. కానీ ఇప్పుడు శివసేనతో కలవడానికి ఆసక్తి చూపిస్తున్న సమయంలో ఆనాడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రే కారణంగానే ఆనాడు తాను బయటకొచ్చానని రాజ్ ఠాక్రే పరోక్షంగా చెప్పారు. పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రేతో రాజ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ఎమ్మెన్నెస్ అవతరించింది. ఇన్నాళ్లకు శివసేనతో మళ్లీ జట్టు కట్టాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. మహారాష్ట్ర ప్రజల ఆశయం కోసం ముఖ్యంగా మరాఠీల రక్షణ కోసం తాము కలిసి అడుగేయాలని తాజాగా రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. దీనికి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ కూడా సానుకూలంగా స్పందించడంతో వారి బంధం రెండు దశాబ్దాల తర్వాత పట్టాలెక్కడానికి తొలి అడుగు పడింది. ఇదీ చదవండి:రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!

IPL 2025, MI VS CSK: Ayush Mhatre Became The Youngest Player To Represent CSK In IPL7
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్‌ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు

ఐపీఎల్‌ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 20) రాత్రి ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆయుశ్‌ మాత్రే సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. మాత్రే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్‌ ముకుంద్‌ పేరిట ఉండేది. ముకుంద్‌ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేశాడు.ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు17y 278d - ఆయుశ్‌ మాత్రే vs MI, వాంఖడే, 2025*18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 200819y 123d - అంకిత్ రాజ్‌పూత్ vs MI, చెన్నై, 201319y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 202220y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 16 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. అశ్వనీ కుమార్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి రచిన్‌ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్‌ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. #RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 20256.5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 57/2గా ఉంది. షేక్‌ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ (రాజస్థాన్‌ రాయల్స్‌) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్‌లో ఆయుశ్‌ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరం‍గేట్రం ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.

US Tariffs On China Imports Create Good Opportunity For Indian Toy Market8
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్​కు గోల్డెన్ ఛాన్స్!

చైనా వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో.. బొమ్మల ఎగుమతి క్షీణించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ బొమ్మల ఎగుమతిదారులు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అమెరికన్ కొనుగోలుదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నారు.అమెరికాకు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేసే దేశాల్లో చైనా అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవచ్చని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు 'అజయ్ అగర్వాల్' ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుతం, దాదాపు 20 సంస్థలు అమెరికన్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున బొమ్మల ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నాయని అగర్వాల్ అన్నారు. గత నెలలో యుఎస్ బేస్డ్ బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు మరిన్ని విచారణలు వస్తున్నాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?2024లో యూఎస్ బొమ్మల మార్కెట్ 42.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని జీఎమ్ఐ రీసర్చ్ వెల్లడించింది. 2032 నాటికి ఈ వృద్ధి 56.9 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. బొమ్మల రంగంలో భారతదేశం నుంచి ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు పెద్దమొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ బొమ్మల ఉనికిని తప్పకుండా పెంచుకోవచ్చని.. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అన్నారు. అంతే కాకుండా త్వరలోనే తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించాలని అసోసియేషన్ యోచిస్తోందని ఆయన అన్నారు.

Trisha And Kamal Haasan Interesting comments On Marriage System9
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్

నిస్సందేహంగా మన దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్‌ హాసన్‌(Kamal Haasan) ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజజీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతన్న లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2, 3 దశాబ్ధాల క్రితమే కమల్‌ చేసేశాడు..ఒక్కసారి కమల్‌ అనుబంధాలను పరిశీలిస్తే... 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్‌ చిత్రంలో కమల్‌ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డ్యాన్సర్‌ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కమల్‌ హాసన్‌ సహ నటి సారికతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శ్రుతి హాసన్‌ (ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌) జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్‌ పుట్టింది. ఈ అనుబంధం మరో పదేళ్లు పైనే కొనసాగి 2002లో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది 2004లో మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్‌ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచుగా కమల్‌ చెబుతుంటాడు. ప్రస్తుతం 7 పదుల వయస్సులో కూడా కమల్‌ పెళ్లిళ్లు ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటే... అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం.ఈ నేపధ్యంలో సీనియర్‌ స్టార్‌ కమల్‌ హాసన్, నటి త్రిష కృష్ణన్(Trisha), సిలంబరసన్‌ టిఆర్, శింబులు నటించిన, మణిరత్నం చిత్రం థగ్‌ లైఫ్‌ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్‌ సందర్భంగా మరోసారి కమల్‌ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.ప్రమోషన్‌ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్‌ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3 పదుల వయసు దాటినా, ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న త్రిష....బదులిస్తూ..‘‘ పెళ్లిపై తనకు నమ్మకం లేదు’’ అంటూ స్పష్టం చేసింది. ‘‘తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే’’ అని అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్‌ను ప్రశ్నించగా.. దశాబ్దం క్రితం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు.‘‘ఇది 10–15 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్‌ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్‌ ముందు నన్ను ‘‘ నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడివి, మరి రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు? అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి? అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే..నేను ఏ దేవుడ్నీ పూజించను. అంతేకాదు నేను రాముడి జీవనశైలిని అనుసరించను. బహుశా నేను అతని తండ్రి (దశరథ) మార్గాన్ని (ముగ్గురు భార్యలు కలిగి ఉన్న) మార్గాన్ని అనుసరిస్తాను’’ అంటూ కమల్‌ హాసన్‌ బదులిచ్చాడు. విక్రమ్‌ సినిమా సూపర్‌ హిట్‌తో మరోసారి ఊపందుకుంది కమల్‌ హాసన్‌ కెరీర్‌... తదుపరి చిత్రం, థగ్‌ లైఫ్, జూన్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Vijay Kumar Says Doubts About Praveen Pagadala Postmortem Report10
‘ప్రవీణ్‌ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’

సాక్షి, తాడేపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో పిల్ వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్‌ మార్టం రిపోర్టులో స్పష్టత లేదన్నారు. ట్రావెల్ చేసింది.. ఆగింది.. మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ కుమార్ అని ఎక్కడా నిరూపణ కాలేదు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేది తప్ప పోలీసులు చూపిన వీడియోల్లో అతను ప్రవీణ్ కుమార్ అని నిర్ధారణ కాలేదు’’ అని విజయ్‌ కుమార్‌ వివరించారు.‘‘నాకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉంది. మద్యం సేవించడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుంది. మద్యం తాగడం వల్లే చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఇంతమంది ఎలా బతికున్నారు?. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రవీణ్ కడుపులో 120 ఎంఎల్‌ ఫ్లూయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్‌లో అనుమానాస్పదమైన ఎలాంటి ఆల్కహాల్ లేదని ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన వైద్యులు.. ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని ఇవ్వడం చిత్రంగా ఉంది. ఎందుకు ఆల్కహాల్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు మొదట చెప్పిన ప్రెస్ మీట్‌లో ఎక్కడా ఆల్కహాల్ గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఒక స్టోరీని అల్లడం కోసం ఆల్కహాల్‌ను వాడుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి’’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘పనిగట్టుకుని ఆల్కహాల్ ఉందని రిపోర్టులో రాశారని అనిపిస్తోంది. మొహం రాళ్లకు గుద్దుకున్నందుకు గాయాలయ్యాయన్నారు. మరి తలవెనుక గాయం ఎలా అయ్యింది?. వెల్లకిలా పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ ఎలా పడింది?. అనేక సందేహాలున్నాయి వాటికి ఎక్కడా సమాధానం లేదు. హర్షకుమార్ అరెస్టును మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఏపీలో అసలు మానవహక్కులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు లేదా?. రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వేధించడం పద్ధతేనా?. ముందస్తు అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న కొద్ది ప్రవీణ్ కుమార్‌ది హత్యేనేమోనని అనుమానాలు బలపడుతున్నాయ్. ప్రవీణ్ మృతిపై మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ద్రోహులెవరో తెలిసిపోతారని ప్రభుత్వం ఉలిక్కిపడుతుందనే అనుమానం కలుగుతోంది. ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. పేదల ఓట్లు మీకు కావాలి?. పేదల భావాలతో మీకు పనిలేదా?’’ అంటూ విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement