
పాత నోట్లపై మళ్లీ మెలిక
పాత నోట్లతో అటు పాలకులు.. ఇటు అధికారులులను అగచాట్లు పాలు చేస్తూనే ఉన్నారు. రబీ సీజన్‌లో అష్టకష్టాలు
► కేంద్రం ప్రకటించినా..పాత నోట్లు తీసుకోని విత్తన పంపిణీ కేంద్రాలు
►జీవో రాలేదని రైతులను తిప్పి పంపిన అధికారులు
►జరుగుమల్లి విత్తన కేంద్రం వద్ద ఆందోళన
►పట్టించుకోని జిల్లా అధికారులు
ఒంగోలు టూటౌన్ : పాత నోట్లతో అటు పాలకులు.. ఇటు అధికారులు రైతులను అగచాట్లు పాలు చేస్తూనే ఉన్నారు. రబీ సీజన్‌లో అష్టకష్టాలు పడుతూనే సేద్యానికి సన్నద్ధమవుతున్న రైతులకు పాత నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నారుు. ఒక సారి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తా రు.. మరోసారి తీసుకోమని ఉత్తర్వులు ఇస్తారు. ఇలా అన్నదాతలను పాలకులు అడుకుంటున్నారు. ఇటీవల పాత నోట్లు తీసుకోవద్దని ఇచ్చిన ఆదేశాలతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం దిగొచ్చింది. వెంటనే సోమవారం రైతుల వద్ద పాత నోట్లు రూ.500, రూ.1000 తీసుకోవాలని ప్రకటిం చింది.
దీంతో ఊరట చెందిన రైతులు మంగళవారం విత్తన కేంద్రాల వద్దకు పాత నోట్లు తీసుకువెళ్లారు. అక్కడ అధికారులు పాత నోట్లు తీసుకోకపోగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వలు గాని జీవోగాని రాలేదు. మేము తీసుకోమని ఖరాఖండిగా చెప్పడంతో రైతులు ఖంగు తిన్నారు. మండల కేంద్రాల్లో విత్తన కేంద్రాల వద్ద పాత నోట్లు తీసుకోకపోవడంతో ఒంగోలులోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి కొంతమంది రైతులు వచ్చారు. జిల్లా ఏపీ సీడ్‌స మేనేజర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. పాత నోట్లు తీసుకోమని ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని రైతులకు చెప్పడంతో చేసేదేం లేక వెనుదిరగాల్సి వచ్చిందని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జరుగుమల్లిలో..
జరుగుమల్లి మండలంలోని విత్తన కేంద్రం వద్ద పాత నోట్లతో నిరసనకు దిగారు. ప్రభుత్వ పాత నోట్లు తీసుకోమని ప్రకటించినా.. అధికారులు కనికరించడం లేదని ఆందోళన చేశారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి వరం ఇవ్వలేదన్న సామెతగా పాలకుల తీరు ఉందని ఆవేదన చెందారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించ లేదని రైతు సంఘ నేతలు తెలిపారు. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల వద్ద పాత నోట్లు తీసుకోవాలని ప్రకటిస్తే.. అధికారులు ఉత్తర్వులు రాలేదని మెలిక పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అరుుతే విత్తనాలు లేకుం డా సేద్యం ఎలా చేయాలని రైతులు మండిపడుతున్నా రు. బుధవారం కూడా ఇదే పరిస్థితి రైతులకు ఎదురైతే జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు నిరసనకు దిగే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారించాలని రైతు సంఘాలు కోరుతున్నారుు.