పొరుగు దేశాల నుంచి సత్సంబంధాలు కోరుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కఠ్మండ్లో జరుగుతున్న ...
కఠ్మండ్ : పొరుగు దేశాల నుంచి సత్సంబంధాలు కోరుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కఠ్మండ్లో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పరస్పర సహకారంతో కలిసి నడుస్తున్న దేశాల సమాహారం సార్క్గా మోదీ అభివర్ణించారు. అభివృద్ధి ఓ చాలెంజ్ అని మోదీ వ్యాఖ్యానించారు. సహకారం పెరిగితే అభివృద్ధి సులభం అవుతుందన్నారు. ప్రాంతీయ సహకారం అవసరం ఎంతైనా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.
మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని దక్షిణాసియా దేశాలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే మరోవైపు చూడాల్సిన అవసరం రాదన్నారు. మన మధ్య రోడ్లు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాలన్నారు. విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ప్రజలు ఆశించినంతగా మనం ముందుకు వెళ్లడం లేదని ఆయన అన్నారు. యువతను మంచి దిశలో నడిపించాల్సి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రాధాన్యత అని మోదీ తెలిపారు.