Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Waqf Amendment Bill: Asaduddin Owaisi Fire On Chandrababu1
మోసం చేశావ్‌ చంద్రబాబూ.. అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: వక్ఫ్‌ బిల్లును అడ్డుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే రకం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. గుజరాత్‌ అల్లర్ల సమయంలోనూ బాబు ముస్లింలను మోసం చేశారు’’ అని అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు.‘‘ఆ తర్వాత పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దురమయ్యాడు. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు.. ఆయనకు భవిష్యత్‌ లేదు. చంద్రబాబు పాపాలకు లోకేష్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు.కాగా, సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు.

YSRCP Leader Pratap Reddy Injured In Attack Nandyal2
వైఎస్సార్‌సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి

నంద్యాల: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాలు వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలోప్రతాప్ రెడ్డి గుడిలో ఉండగా దాడికి దిగారు. శనివారం జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రతాప్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించడం కూడా దాడికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే కనిపిస్తోందని బ్రిజేంద్రారెడ్డి మండిపడ్డారు.ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయని వైఎస్సార్ సీపీ మండిపడింది చంద్రబాబు పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగవిప్పుతోందని, ప్రతాప్ రెడ్డిపై దాడి చేసిన వారంత టీడీపీ కార్యకర్తలేనని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. గతంలో ప్రతాప్ రెడ్డి అన్న, బావమరిదిని హత్య చేసిన నిందితులే మళ్లీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేశారని మండిపడుతోంది.

Cm Revanth Reddy Is Serious About Ai Fake Videos3
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్‌ వీడియోలపై సీఎం రేవంత్‌ సీరియస్‌

సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రేవంత్‌ సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేసింది.కంచ గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్ లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్‌లను నిర్మించారని.. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వచ్చారు.అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు సీఎంకి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు.ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందని చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు

Woman drags mother in law by hair, beats up husband4
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి

గ్వాలియర్: ఇది భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న రగడ. అత్తను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయమని డిమాండ్ చేస్తోంది కోడలు. అందుకు కొడుకు ఒప్పుకోవడం లేదు. అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయడమేంటని పట్టుపట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని భార్యకు తేల్చిచెప్పాడు. ఇది గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. తన మాట విననందుకు కుటుంబ సభ్యుల్ని పిలిపించింది భార్య. ఈ విషయంలో భర్తతో అమీతుమీ తేల్చుకోవడాని సిద్ధమైంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో ఆమె భర్త గొడవపడ్డాడు.. అయితే భర్తపై భార్య తరఫు బంధువులు దాడికి దిగారు. తన కొడుకును ఒక్కడిని చేసి దాడి చేస్తున్నారని తల్లి పరుగెత్తుకొచ్చింది. కొడుకును రక్షించాలని తాపత్రాయపడింది. మరి కోడలు ఊరుకుంటుందా.. అత్తను జట్టు పట్టుకుని కిందకు పడేసింది. పడిపోయిన అత్తపై మళ్లీ మళ్లీ దాడి చేసింది సదరు కోడలు.వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ కు చెందిన విశాల్ బత్రా, నీలిక భార్యా భర్తలు. వీరితో కలిసి విశాల్ తల్లి ఉంటోంది. 70 ఏళ్లు పైబడ్డ వయుసులో కొడుకును ఆశ్రయించింది. తన తల్లిని చూసుకోవాలనే బాధ్యతను గ్రహించిన విశాల్.. తల్లిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అయితే కోడలు ఊరుకోలేదు. ఎంతకాలం ఈ ముసలామెను ఇంట్లో ఉంచుతావంటూ భర్తతో పదే పదే గొడవ పడేది. ఇలా ఏడాదికి పైగానే గడిచింది. ఎంతకాలమైనా తన వద్దే తల్లి ఉంటుందని భర్త తెగేసి చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య.. తన బంధువుల్ని గొడవకు పురామాయించింది. ఎలాగైనా సరే అత్తను ఇంట్లో నుంచి పంపించాలని భీష్మించుకుని కూర్చొంది. విశాల్ ఇంటికి వచ్చిన ‘పెద్దలు’( భార్య తరప/ బంధువులు) అతనిపై దాడికి పూనుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి విశాల్ పై దాడికి దిగారు. దీన్ని చూసిన విశాల్ తల్లి దాన్ని ఆపడానికి యత్నించింది. ఇక్కడ కోడలు అమాంతం అత్త మీదకు దూకి ఆ పెద్దామెను జట్టు పట్టుకుని ఈడ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె కిందపడిపోయినా మళ్లీ మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనను ఇండియన్‌ ప్రైవేట్‌ న్యూస్‌ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌ తో సహా పలు జాతీయ చానళ్లు వెలుగులోకి తెచ్చాయి.Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr— IANS (@ians_india) April 4, 2025 నా భార్య వేధిస్తోంది.. చివరకు దాడి చేసింది..దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విశాల్.. బయట మీడియాతో మాట్లాడారు. ‘ నేను నా ఇంటిలో దాడికి గురయ్యాను. సుమారు 10 నుంచి 15 మంది వరకూ నా ఇంటికి వచ్చి నన్ను, మా అమ్మపై దాడి చేశారు. నా తల్లిని బయటకు పంపేయమని నా భార్య వేధిస్తోంది. దీన్ని నేను కాదనడంతో నాపై దాడికి చేయించింది. నీలిక సోదరుడు, తండ్రి కలిసి మమ్మల్ని దారుణంగా కొట్టారు. ఈ విషయంలో భార్య నీలిక నన్ను రోజూ తీవ్రంగా తిడుతూ ఉంటోంది. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ ఆఫీస్ కు వచ్చాను’ అని విశాల్ తెలిపాడు.

Hrithik Roshan: My Favourite Co Star is Jr NTR, Feeling Nervous to Dance With him5
జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్‌ రోషన్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ 'డ్రాగన్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ 'వార్‌ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్‌ 2 ఈవెంట్‌లో హృతిక్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్‌ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్‌ సినిమా సీక్వెల్‌ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.ఎన్టీఆర్‌తో డ్యాన్స్‌..జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ కోస్టార్‌. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్‌ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్‌ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్‌ 2 విషయానికి వస్తే.. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో తారక్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇకపై డైరెక్టర్‌గానూ..హృతిక్‌ రోషన్‌ నెక్స్ట్‌ 'క్రిష్‌ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్‌ తండ్రి రాకేశ్‌ ఇటీవల సోషల్‌ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.చదవండి: జైలు నుంచి విడుదల, మహేశ్‌ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్‌.. వీడియో వైరల్‌

IPL 2025 CSK vs DC: Toss Playing XIs Scores Updates And Highlights6
CSK vs DC: సీఎస్‌కేపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం

IPL 2025 CSK vs DC Updates: ఐపీఎల్‌-2025లో భాగంగా శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ అప్‌డేట్స్‌ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యంచెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 25 ప‌రుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. 184 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో విజ‌య్ శంక‌ర్ 69 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్‌) ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో విప్ర‌జ్ నిగ‌మ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ముఖేష్ కుమార్‌, కుల్దీప్ యాద‌వ్‌, స్టార్క్ త‌లా వికెట్ సాధించారు.ఓట‌మి దిశ‌గా సీఎస్‌కే..17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 5 వికెట్ల న‌ష్టానికి 117 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే విజ‌యానికి 18 బంతుల్లో 67 ప‌రుగులు కావాలి. క్రీజులో విజ‌య్ శంక‌ర్‌(51), ధోని(13) ఉన్నారు.సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్‌ర‌వీంద్ర జ‌డేజా రూపంలో సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 2 ప‌రుగులు చేసిన జ‌డేజా.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 5 వికెట్ల న‌ష్టానికి 80 ప‌రుగులు చేసింది. క్రీజులో ధోని(4), విజ‌య్ శంక‌ర్‌(26) ఉన్నారు.నాలుగో వికెట్‌ డౌన్‌శివం దూబే (15 బంతుల్లో 18) రూపంలో చెన్నై నాలుగో వికెట్‌ కోల్పోయింది. విప్రాజ్‌ బౌలింగ్‌లో దబే స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 65/4 (9.2). జడేజా క్రీజులోకి వచ్చాడు. శంకర్‌ 17 పరుగులతో ఉన్నాడు. పవర్‌ ప్లేలో చెన్నై స్కోరు: 46/3 (6)దూబే 5, శంకర్‌ 11 రన్స్‌తో ఉన్నారు.మూడో వికెట్‌ కోల్పోయిన చెన్నై5.3: విప్రాజ్‌ నిగమ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (13) అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెన్నై మూడో వికెట్‌ కోల్పోయింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా శివం దూబే క్రీజులోకి వచ్చీ రాగానే ఫోర్‌ బాదాడు. విజయ్‌ శంకర్‌ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45/3 (5.4) రెండో వికెట్‌ కోల్పోయిన చెన్నై2.3: కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో మెగర్క్‌కు క్యాచ్‌ ఇచ్చి రుతు 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. విజయ్‌ శంకర్‌ క్రీజులోకి వచ్చాడు. కాన్వే 5 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 20/2 (2.3)తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే1.5: ముకేశ్‌ కమార్‌ బౌలింగ్‌ రచిన్‌ రవీంద్ర బౌల్డ్‌ అయ్యాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేవలం మూడు పరుగులు చేసి నిష్క్రమించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ క్రీజులోకి రాగా కాన్వే ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 15-1(2)ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు.. ఢిల్లీ స్కోరెంతంటే?చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మెరుగైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అక్షర్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కాగా తొలి ఓవర్లోనే ఓపెనర్‌ మెగర్క్‌ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టును ఆదుకున్నాడు.Kamaal KL! 😎🏏KL Rahul brings up a sublime fifty as he leads the charge for #DC, eyeing a historic win at Chepauk, their first since 2010! Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW #IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar pic.twitter.com/bSx5mXAuoh— Star Sports (@StarSportsIndia) April 5, 2025వన్‌డౌన్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ (20 బంతుల్లో 33) ఆది నుంచే దంచికొట్టగా.. రాహుల్‌ మాత్రం తొలుత ఆచితూచి ఆడాడు. అనంతరం కాస్త స్పీడు పెంచిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో.. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.మిగతా వాళ్లలో కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (14 బంతుల్లో 21) , సమీర్‌ రిజ్వీ (15 బంతుల్లో 21), ఆఖర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (12 బంతుల్లో 24 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ఇక సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్‌ అహ్మద్‌, మతీషా పతిరణ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు19.2:పతిరణ బౌలింగ్‌లో రాహుల్‌ (77) వికెట్‌ కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.ధోని మ్యాజిక్‌.. ఐదో వికెట్‌ డౌన్‌19.3: పతిరణ బౌలింగ్‌లో అశుతోశ్‌ శర్మ (1) రనౌట్‌ అయ్యాడు. స్టబ్స్‌తో కలిసి పరుగు పూర్తి చేసుకున్న అశుతోశ్‌ను.. వికెట్ల వెనుక వేగంగా కదిలిన ధోని అద్బుత రీతిలో రనౌట్‌ చేసి వెనక్కి పంపాడు. నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ16.1: ఖలీల్‌ అహ్మద్‌ మరోసారి అద్భుతం చేశాడు. తొలి ఓవర్లో మేగర్క్‌ రూపంలో కీలక వికెట్‌ తీసిన ఈ పేస్‌ బౌలర్‌.. తాజాగా సమీర్‌ రిజ్వీని వెనక్కి పంపాడు.అహ్మద్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిజ్వీ పెవిలియన్‌ చేరాడు. అతడి స్థానంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 148/4 (16.2)15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 138/3 (15)కేఎల్‌ రాహుల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది 38వ ఫిఫ్టీ. మరోవైపు సమీర్‌ రిజ్వీ నిలకడగానే ఆడుతున్నాడు. పదిహేను ఓవర్లు ముగిసే సరికి రాహుల్‌ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేయగా.. రిజ్వీ 13 బంతుల్లో 19 రన్స్‌ చేశాడు.10.4: మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీఅక్షర్‌ పటేల్‌ రూపంలో ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అక్షర్‌ బౌల్డ్‌ అయ్యాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్‌ 21 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 90/3 (10.4). సమీర్‌ రిజ్వీ క్రీజులోకి వచ్చాడు.10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 82/2 అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌ నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి అక్షర్‌ 12 బంతుల్లో 20, రాహుల్‌ 23 బంతుల్లో 29 రన్స్‌తో ఉన్నారు. రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ6.5: జోరు మీదున్న పోరెల్‌కు జడేజా చెక్‌ పెట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్‌ ఇచ్చి అతడు 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అక్షర్‌ పటేల్‌ క్రీజులోకి రాగా.. రాహుల్‌ 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 54/2 (6.5) పవర్‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 51/1 (6)పోరెల్‌ 32, రాహుల్‌ 19 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 32/1రాహుల్‌ 8, పోరెల్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 20/1 (2) ముకేశ్‌ బౌలింగ్‌లో చితక్కొట్టిన అభిషేక్‌ పోరెల్‌. 0,4, 6, 4, 4, 1. రాహుల్‌ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తొలి ఓవర్లో ఒక్క పరుగు.. ఒక వికెట్‌ఖలీల్‌ అహ్మద్‌ చెన్నై బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులను డాట్‌ చేసిన ఖలీల్‌... ఐదో బంతికి మెగర్క్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి అభిషేక్‌ పోరెల్‌ ఒక పరుగు చేశాడు. ఢిల్లీ స్కోరు: 1-1 (1)రుతు సారథ్యంలోనేఈ మ్యాచ్‌కు చెన్నై రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ దూరమయ్యాడని.. అతడి స్థానంలో మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని నాయకుడిగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, గాయం నుంచి కోలుకున్న రుతు మైదానంలో అడుగుపెట్టడం గమనార్హం.ఫాఫ్‌ లేడుమరోవైపు.. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌.. తొలుత బ్యాటింగ్‌ చేయనున్నట్లు తెలిపాడు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ వికెట్‌ స్లోగా మారే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో కూడా తాము ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తూ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఫిట్‌గా లేడని.. అందుకే అతడి స్థానంలో సమీర్‌ రిజ్వీ తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.తుదిజట్లుచెన్నైరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముకేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌శివం దూబే, జేమీ ఓవర్టన్‌, షేక్‌ రషీద్‌, కమలేశ్‌ నాగర్‌కోటిఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌ముకేశ్‌ కుమార్‌, కరుణ్‌ నాయర్‌, దర్శన్‌ నాల్కండే, డొనోవాన్‌ ఫెరీరా, త్రిపురాణ విజయ్‌

We Are Doomed For Life Bengal Teachers 7
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే

ఇది ఏ ఒక్కరి పరిస్థితో కాదు.. సుమారు 25 వేల మందికిపైగా ఉద్యోగస్తుల పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. 2016 టీచర్ల నియమాకాల రద్దు టాపిక్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఎంతో హాయిగా తమ జీవితాల్లోకి వెలుగొచ్చిందని అనుకుంటుండగానే వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. టీచర్లగా ఉద్యోగాలు చేస్తూ సంఘంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను కారు మబ్బు అలుముకుంది. తమ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీచర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇలా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీచర్ల కుటుంబాల్లో కన్నీటి వరదలే తారసపడుతున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు ఇవ్వడంపై ఆ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమాకాలు కలిపి 25 వేల 753 పోస్టులను చెల్లవంటూ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ఇంతేనా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకిలా జరిగింది.. మాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ మౌనంగా రోదిస్తున్నారు.2016లో టీచర్ గా నియమించబడ్డ రజత్ హల్దార్ మాట్లాడుతూ.. ‘ మాకు మాటలు రావడం లేదు. మేము అర్హత సాధించిన టీచర్లం. మాకు ఎటువంటి ఆరోపణలు లేవు. సుమారు 19 వేల మంది టీచింగ్ స్టాఫ్ పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ మమ్మల్ని వారు అనర్హులు అంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో మాకు ఏమీ చెప్పుకోవాలో.. ఎవరి చెప్పుకోవాలో తెలయని స్థితిలో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగింది. ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. ఏ దర్యాప్తు సంస్థలు కూడా మా నియామకం చట్టబద్ధతలో జరగలేదని చెప్పలేదు. మేము ఎటువంటి తప్పు చేయలేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు.కాగా, వెస్ట్‌ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం మమతా సర్కారు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.

US President Donald Trump Says This Is A Great Time To Get Rich As The Dow Jones Crash Sparks Recession Fears Amid Tariffs8
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్

ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' సుంకాలను ప్రకటించిన తరువాత.. యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. రెండు సెషన్లలలోనే ఇన్వెస్టర్లు ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టపోయారు. కరోనా మహమ్మారి తరువాత స్టాక్ మార్కెట్లు ఇంతలా పతనమవ్వడం ఇదే మొదటిసారి. అయితే ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.ట్రంప్ పరస్పర సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి వెళ్తాయనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జీడీపీ తగ్గుతుందని, ఉద్యోగాలు కూడా ఉండవని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ సమయంలో కూడా అమెరికా అధ్యక్షుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో ఆర్ధిక మాంద్యం వస్తుందని అందరూ భయపడుతుంటే.. ట్రంప్ మాత్రం ఇన్వెస్టర్లు ధనవంతులు అవ్వడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది సువర్ణావకాశమని, చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వారు ధనవంతులు అవుతారని ఆయన అన్నారు.పెద్ద కంపెనీలు లేదా పెద్ద వ్యాపార సంస్థలు ఎప్పుడూ టారీఫ్స్ గురించి ఆందోళన చెందవు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. మరింత పెద్ద డీల్స్ మీద ఫోకస్ చేస్తాయి. ఇవే దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తాయి.. సూపర్ ఛార్జ్ మాదిరిగా పనిచేస్తాయని అన్నారు.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉద్యోగాలుండవు'.. నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే?విదేశీ వస్తువులను వినియోగించడం తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులపై ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సుంకాలను ప్రవేశపెట్టారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చి వేయడం మాత్రమే కాకుండా.. దేశంలో ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని డొనాల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు.

Many Suspicions Are Being Raised In The Rajahmundry Naganjali Case9
రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్‌ 10 ఎంజీ ఇంజక్షన్‌ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది.

IAF PilotSiddharth YadavFiancee Breaks Down Next To His Coffin10
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్‌ భార్య

జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్‌ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్‌ యాదవ్‌కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్‌ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్‌లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్‌తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్‌జెట్‌ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్‌ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్‌మెంట్‌, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్‌కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement