భారత్ లో కంపెనీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సైబర్ ఎటాక్ లకు లోనవుతున్నాయని ఓ సర్వే తేల్చింది. ఇప్పటి వరకు మొత్తం 72శాతం భారత కంపెనీలు సైబర్ ఎటాక్ కు గురయ్యానని, వాటి నుంచి బయటపడేందుకు అవి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఏపీఎంజీ సైబర్ క్రైం సర్వే నివేదిక-2015 తేల్చింది.
ముంబయి: భారత్ లో కంపెనీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సైబర్ ఎటాక్ లకు లోనవుతున్నాయని ఓ సర్వే తేల్చింది. ఇప్పటి వరకు మొత్తం 72శాతం భారత కంపెనీలు సైబర్ ఎటాక్ కు గురయ్యానని, వాటి నుంచి బయటపడేందుకు అవి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఏపీఎంజీ సైబర్ క్రైం సర్వే నివేదిక-2015 తేల్చింది.
ప్రతి రోజు ఏదో ఒక కంపెనీ ఈ ఎటాక్ కు గురవుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 'ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం 72శాతం కంపెనీలు సైబర్ దాడులకు గురయ్యాయి. తమ సంస్థలకు అతిపెద్ద ప్రమాదం సైబర్ దాడుల వల్లే వస్తుందని 94శాతం కంపెనీలు తెలియజేశాయి' అని సర్వే తెలిపింది.