భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చైనా పర్యటనకు వెళ్తున్నారు.
న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చైనా పర్యటనకు వెళ్తున్నారు. శనివారం నుంచి నాలుగురోజుల పాటు ఆమె డ్రాగన్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వాంగా యితో ద్వైపాక్షిక, స్థానిక, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా, ఇండియా, చైనా సమావేశంలో కూ డా పాల్గొంటారు. కాగా, చైనాతో సరి హద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాన్పూర్‌లో పేర్కొన్నారు.