
మోర్తాడ్ (బాల్కొండ)/ పెర్కిట్: నిన్నటి వరకు రాజకీయంగా బద్ధ శత్రువులైన చిన్న గడ్డం, పెద్ద గడ్డం (చంద్రబాబు, ఉత్తమ్) అధికార యావతో ఇప్పుడు ఏకమయ్యారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో ఆదివారం నిర్వహించిన గురడికాపుల ఆత్మీయసమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. బాబు పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో నయమని, ఆయన బాబు కంటే ఎంతో ఉత్తమమైన రాజకీయం చేస్తున్నారని ప్రశంసించారు.
మహా కూటమి పేరుతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుని ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి బాబు యత్నిస్తున్నారని ఆర్మూర్‌లో నిర్వహించిన రజకఆత్మీయ సమ్మేళనంలో నాయిని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే బాబు తోపాటు రేవంత్ జెలు పాలవుతారని చెప్పారు. రజకులను ఎంబీసీ జాబితాలో చేర్చి రూ.వేయి కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.