
తలసాని శ్రీనివాస యాదవ్ (పాతఫోటో)
సాక్షి, జనగామ : కొంత మంది షోకాల్డ్ నాయకులు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడంలేదని అంటున్నారు, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు ఉనికి కోసమే బస్సుయాత్రలు చేపట్టారని ఆరోపించారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ కోనసీమ లాగా అకుపచ్చ తెలంగాణగా మారుతుందన్నారు. గురుకులాలతో విద్యావ్యస్థను పటిష్టం చేస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు.