రాష్ట్రంలో ఎమ్మెల్యేలు స్వతంత్రంగా వ్యవహరించేలా పరిస్థితులు చక్కబడేంత వరకూ అవసరమైన పక్షంలో కనీసం మూడు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని న్యాయవాది ఆచార్య సూచించారు.
– న్యాయవాది ఆచార్య
టీనగర్: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు స్వతంత్రంగా వ్యవహరించేలా పరిస్థితులు చక్కబడేంత వరకూ అవసరమైన పక్షంలో కనీసం మూడు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని న్యాయవాది ఆచార్య సూచించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కర్నాటక ప్రభుత్వ న్యాయవాది పి.వి ఆచార్య విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడేందుకు కనీసం మూడు నెలలు పడుతుందన్నారు. రాష్ట్రపతి పాలన వల్ల ఎమ్మెల్యేలు బెదిరింపులు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే వీలుంటుందని ఆయన అన్నారు.
స్పీకర్ నిర్ణయం సరికాదు: రాందాస్
అసెంబ్లీలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు వ్యవహరిం చిన తీరు సరికాదని, దీని ద్వారా ఆ పార్టీల నిజస్వరూపాలు తెలిశాయని రాందాస్ అన్నారు. స్పీకర్, కార్యద ర్శి కుర్చీలు, మైక్‌లు ధ్వంసం చేసిన ఘటనలు ఖండిం చాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ ధనపాల్ అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించా రు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ కోరడం నేటి పరిస్థితుల్లో చక్కని పరిష్కారమని అభిప్రాయపడ్డారు.
అన్నాడీఎంకేను సాగనంపండి: అన్భలగన్
అన్నాడీఎంకే పాలనను సాగనంపేందుకు ప్రజలు ముందుకు రావాలని ప్రొఫెసర్ అన్భలగన్ కోరారు. నామక్కల్‌లో ఈస్ట్ జిల్లా డీఎంకే యువజన సంఘం, నగర డీఎంకే ఆధ్వర్యంలో స్టాలిన్ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభ శుక్రవారం రాత్రి జరిగింది. ఇందులో డీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ అన్భలగన్ పాల్గొని 1,640 మందికి సంక్షేమ సహాయకాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అ న్నాడీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలం తా పాటుపడాలని పిలుపునిచ్చారు.