ప్రకాశం బ్యారేజిపై ట్రాఫిక్ జాం
ప్రకాశం బ్యారేజి వద్ద శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఇంద్రకీలాద్రి : విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజి వద్ద శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పుష్కరాల సమయంలో ఆపి వేసిన ఫ్లై ఓవర్ పనులను శనివారం నుంచి మళ్లీ ప్రారంభించారు. దీనితో పాటు భవానీపురం నుంచి ట్రాఫిక్‌ను దుర్గగుడి వైపు మళ్లించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కృష్ణానదికి వచ్చిన వరద నీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.