గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి,
సాక్షి, భూపాలపల్లి : గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వింటాల్ మిర్చిని బోనస్‌తో కలిపి రూ.6250 కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించి పది రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం దారుమణమన్నారు. నాఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేపట్టే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. రెండు ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.