పొలంలోని చెత్తను తగలబెడుతూ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఓ రైతు సజీవ దహనమయ్యాడు.
కరీంనగర్ : పొలంలోని చెత్తను తగలబెడుతూ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన అశీర్వాదం(60) పొలంలో చెత్తను తగలబెడుతుండగా నిప్పుంటుకుని అక్కడికక్కడే సజీవ దహన మయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(వీణవంక)