పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీదేవి ...
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ పురోగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్‌లతో సమీక్షించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన కాలపరిమితిలోపు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన చోట జీఓ 123 ప్రకారం భూమిని తీసుకోవాలని, ముందుకు రాని చోట భూమిని సేకరించాలని సూచించారు. ఆర్డీఓలు దేవెందర్‌రెడ్డి, రాంచందర్, హన్మంతరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ట్వింకిల్ జాయ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈఈలు కోటేశ్వర్‌రావు, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.