కంటికి రెప్పల కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై కన్నేశాడు.
కంటికి రెప్పల కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై కన్నేశాడు. కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఐటీసీ ఎంప్లయిస్ కాలనీకి చెందిన బంపనపోయిన పెద్దిరాజు(55) ఐటీసీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతినికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు(20) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బెదిరిపోయిన యువతి తన తల్లితో కలిసి బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.