హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది.
సాక్షి, వరంగల్: హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది. స్థానిక రెడ్డి కాలనీలో ఉన్న ఏకశిల జూనియర్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక గార్డియన్ ఆస్పత్రికి తరలించారు. సింధుజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు.