తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేనిఫెస్టో అమలు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు.
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేనిఫెస్టో అమలు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. నగరంలోని డీసీసీ కార్యాల యంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుంద ని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎల్‌పీ నాయకుడిగా ఎన్నికైన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో, జిల్లాలో కేసీఆర్ పర్యటనతో ఆ పార్టీకి ఊపొచ్చిందన్నారు. గెలుపోటములు ప్రజాజీవితంలో సాధారణమేనని తాము పడిలేచిన కెరటంలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
తెలంగాణ సాధన కోసం పోరాడినప్పటికీ ప్రజ లు ఆదరించకపోవడం బాధకరమన్నారు. తనకు సహకరించిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓడిపోయిన తాను ప్రజా సేవలోనే కొనసాగుతానని ఎలాంటి సమస్య వచ్చిన 9849004868 సెల్ నంబర్‌లో తనను సంప్రదించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిందనే ఆక్రోశంతో సీమాం ధ్రలో కాంగ్రెస్‌ను ఓడించారని, తెలంగాణలో ఆదరించకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
పొన్నం ప్రభాకర్ వంటి ఉద్యమకారుడు కూడా ఓడిపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో చల్మెడ లక్ష్మీనర్సిం హారావు, కేతిరి సుదర్శన్‌రెడ్డి, డి.శంకర్, వై.సునీల్‌రావు, కన్న కృష్ణ, ఆమ ఆనంద్, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మల్లికార్జున రాజేందర్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి, ఎస్.ఎ.మోసిన్, గందె మహేశ్, వీర దేవేందర్, వేల్పుల వెంకటేశ్, వేదాద్రి, కట్ట సత్తయ్య పాల్గొన్నారు.