అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణ భార్య గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. నారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.