
మనసుకి రిలాక్స్ కావాలన్నా.. టెన్సన్ష్‌నుంచి బయటపడాలన్నా మెడిసిన్ ఏం అక్కర్లేదు. ఆయన సినిమాలు చూస్తే చాలు. సైడ్ ట్రాక్‌లో ఉన్న హాస్యాన్ని మెయిన్ ట్రాక్‌లోకి తీసుకొచ్చిన నటుడు ఆయన. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారి... ఎన్నో విజయవంతమైన సినిమాల్లోనటించారు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించడలడని నిరూపించారు రాజేంద్రప్రసాద్. నవ్వుల రారాజు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సాక్షి.కమ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.