Top Stories
ప్రధాన వార్తలు

Intelligence alert: అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం.

‘కూటమి’ డైవర్ట్ పాలిటిక్స్.. వైఎస్ జగన్‌పై పెద్ద కుట్రే జరుగుతుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద కుట్ర జరుగుతోందా? లేక ఏపీ ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చి డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందా? వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతులు కవర్ చేసిన తీరు చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు. హోంశాఖ మంత్రి అనిత, టీడీపీ లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయళ్ల వ్యాఖ్యలు అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉంటున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య బీసీ వర్గపు నేత. ఆ ప్రాంతంలో ఈ వర్గానికి మంచి పట్టే ఉంది. హత్య వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గానికి చెందిన కొందరు ఉన్నారన్నది అభియోగం. మొత్తం ఇరవై మందిపై ఫిర్యాదు చేస్తే ఇద్దరిపైనే కేసు పెట్టారట. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడానికి సిద్దమైన రోజు నుంచి పరిటాల సునీత ఆయనపై పలు విమర్శలు చేశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు.దానికి అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అనుకుంటే, దానిని హోం మంత్రి రాష్ట్రస్థాయి వివాదంగా మార్చితే, టీడీపీ ఎంపీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లే యత్నం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆయన లేఖ రాసిన తీరు, అందులో ప్రస్తావించిన అంశాలు అన్ని కూడా జగన్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న సందేహం వస్తుంది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు పల్నాడు ప్రాంతంలో కక్షల రాజకీయాలను ఎగదోసేలా వ్యాఖ్యలు చేసినప్పుడు , ఆయా చోట్ల పోలీసులపై దూషణలకు దిగినప్పుడు ఇదే లావు శ్రీకృష్ణదేవ రాయలు వైసీపీ ఎంపి. టీడీపీ నేతలపై ఆయన కూడా విమర్శలు చేసే ఉంటారు కదా! అదే రాయలును ప్రయోగించి టీడీపీ నాయకత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయించింది. నిజానికి జగన్ టూర్ సందర్భంగా జరిగిన ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేయవలసినంత పరిస్థితి ఏమిటో అర్థం కాదు. పైగా అందులో కేవలం రాప్తాడు అంశంతో ఆపకుండా, గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి ఆరోపణలన్నిటిని కలగలిపి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. అవసరం రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం పొత్తుకు సిద్దమైంది తప్ప, ఆయనపై నమ్మకం, విశ్వాసంతో కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను చంద్రబాబు ఎంతగా దూషించింది వారికి తెలియదా? జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నడూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ పెద్దలు కూడా జగన్ పై ఆ గౌరవం చూపుతూ వచ్చారు.ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్ పై వారికి ఉన్న సదభిప్రాయాన్ని చెడగొట్టి, ఏదో రకంగా కేసులు పెట్టించి రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో ఇలా లేఖలు రాయిస్తున్నట్లు కనబడుతుంది. జగన్ ప్రజలలో తిరుగుతుంటే వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు ఖంగు తింటున్నారు. జగన్‌ది నిజంగానే కుట్ర స్వభావమై ఉంటే, అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీ పంచన చేరే అవకాశం ఎందుకు రానిస్తారు? ఆయనే ఎన్డీయే కూటమిలో చేరి ఉండేవారు కదా! కాని ఒక సిద్దాంతానికి కట్టుబడి ఆయన అందులో చేరలేదు. అంశాల వారిగా మద్దతు ఇవ్వడం లేదా, వ్యతిరేకించడం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు వక్ఫ్ బిల్లుపై వైసీపీ స్పష్టంగా వ్యతిరేకిస్తే, దానిని కూడా వక్రీకరించడానికి టీడీపీ మీడియా ఎన్ని పాట్లు పడింది చూశాం. అదే చంద్రబాబు గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ట్రిపుల్ తలాఖ్, ముస్లింలకు సంబంధించిన ఇతర అంశాల్లోనూ బీజేపీని, మోడీని ఎంతో ఘాటుగా విమర్శించారు. కాని ఇప్పుడు ఎన్డీయేతో కలిసి, కిక్కురుమనకుండా కేంద్రానికి మద్దతు ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో ముస్లిం వర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.జగన్ పై 11 సీబీఐ కేసులు, 9 ఈడి కేసులు ఉన్నాయని రాయలు ఇప్పుడు ఆ లేఖలో పేర్కొనడమే కుట్ర. అన్ని కేసులు ఉన్నప్పుడే వైసీపీలో చేరి ఈయన ఎంపీ అయ్యారు కదా! అసలు ఆ కేసులన్నీ కక్ష పూరితమని బీజేపీ నేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులోనే చెప్పిన విషయం ఈయనకు తెలియదా? జగన్‌ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ రాసిన లేఖపై కృష్ణదేవరాయలు సంతకం చేశారంటే ఆయనకు ఆత్మ అనేది ఉందా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్ని కుట్రలు చేసిందీ... ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలోనే ఉన్నాయి కదా? సొంత మామను పదవి నుంచి తోసేసి ఎలాంటి కుట్రలేదని తన తండ్రి రత్తయ్యతో చెప్పించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన 1996లో లక్ష్మీపార్వతి ఆధ్వర్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేశారు. లావుకు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తూ చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయని, ఆయన కూడా బెయిల్ పై ఉన్నారని, కనుక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. ఎంత దుర్మార్గపు ఆరోపణ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మతం పేరుతో, కులం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన రాజకీయం చేసింది లావుకు తెలియదా? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబందించి కూడా జగన్‌పై నీచంగా లేఖలో ప్రస్తావించడం ద్వారా టీడీపీ ఏదో కుట్ర చేస్తోందన్న అనుమానం కలగదా? విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లు ఏ మాదిరిగా పోలీసులను తిట్టింది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయే. పోలీసులను జగన్ కక్ష సాధింపులకు వాడుకున్నారట. ఆ పని నిజంగా చేసిఉంటే చంద్రబాబు, లోకేశ్ పవన్ కళ్యాణ్‌లపై అప్పట్లో ఎన్ని కేసులు వచ్చి ఉండాలి? ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలను గమనిస్తే జగన్ టైమ్‌లో ఎక్కడైనా ఒకటి, అరా జరిగాయేమో తప్ప, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అయినా కార్యకర్తలను రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోవాలని సూచించింది చంద్రబాబు, లోకేశ్‌లు కాదా? ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తానని ఆఫర్ చేసింది వారు కాదా? ఐదేళ్ల క్రితం ఏదో అన్నారనో, లేక ఏదో జరిగిందని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు పెట్టడాన్ని కక్ష రాజకీయాలు అంటారా? లేక అలాంటి కేసులే పెట్టని జగన్ పాలనను కక్ష పూరిత పాలన అంటారా? జగన్ భద్రతకు సంబంధించి లావుతో పాటు మంత్రి అనిత కూడా ఏదో వాదన చేశారు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పగలరా? 250 మంది పోలీసులు జగన్ హెలికాఫ్టర్ వద్ద నిజంగా ఉండి ఉంటే, అక్కడ చేరిన వంద మంది,లేదా రెండు వందల మందిని వెనక్కి పంపించలేకపోయారా? వారిని అక్కడకు రాకుండా ఆపలేకపోయారా? ఏపీ పోలీసులు అంత అసమర్థులని వీరు చెబుతున్నారా? హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంతో వీఐపీలను తీసుకువెళ్లడం రిస్కు అని పైలట్ అన్నారే తప్ప, తాము వెళ్లలేమని ఎక్కడైనా చెప్పారా? ఇంతకు ముందు కూడా జగన్ ఆయా చోట్లకు హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు కదా? అక్కడ కూడా ఇలాగే జరిగిందా? లేదే! జగన్ పోలీసులందరిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో భూకంపం వచ్చేసినట్లుగా దీనికి కవరేజీ ఇస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసులను ఉద్దేశించి జగన్ అన్నారు. మరి చంద్రబాబు, లోకేశ్‌లు పోలీసు అధికారులను అంతకన్నా దారుణంగా దూషించిన వీడియోలు కనబడుతున్నాయి కదా?పోలీసు అధికారుల సంఘం కూడా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ నే విమర్శించారు తప్ప, అంతకు ముందు చంద్రబాబు దూషణల గురించి మాట్లాడడం లేదే! హోం మంత్రి అనిత అయితే ఏకంగా టీడీపీని భుజాన వేసుకుని మోస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎస్.ఐ.ని దమ్మున్నోడు అని ప్రశంసించారంటే ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఏమి ఉంటుంది? అసలు హోం శాఖలో ఏమి జరుగుతోందో అమెకు తెలుసా అన్నది ఒక సందేహం. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో మొత్తం హోం శాఖను నడుపుతున్నది లోకేశే అని అంతా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు వ్యవస్థను పాడుచేసేలా ఒక మంత్రే మాట్లాడిన తీరు చూస్తే తెలుగు దేశం ఆధ్వర్యంలో వ్యవస్థలు ఎంతగా దిగజారాయో అవగతం అవుతుంది. పనిలో పని లావు కృష్ణదేవ రాయలు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అమిత్ షా కు తెలియచేసి ఆయన మెప్పు పొందగలిగితే బాగుండేది కదా? ఒక వైపు చంద్రబాబు ఆయా స్కామ్ లలో నిందితుడుగా ఉన్నారు. ఆయన కూడా బెయిల్ పైనే ఉన్న విషయం జనం మర్చిపోయారన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఆయా స్కాములను నీరుకార్చే పనిలో ఉండి ఉండవచ్చు. వాటన్నిని కప్పిపుచ్చి జగన్ పై తట్టెడు బురద వేయడం ద్వారా వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటే అది అంత తేలిక కాదు. సూపర్ సిక్స్ గురించి కాని, కక్ష రాజకీయాల గురించి కాని ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల ఏహ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త కుట్రలకు ఎల్లో మీడియాతో కలిసి కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ తరహా వ్యూహాలలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే మరెవ్వరైనా ఉన్నారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant). ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌ను దక్కించుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. మెగా వేలంలో ఇతర జట్లతో పోటీపడి మరీ లక్నో యాజమాన్యం పంత్‌ను భారీ ధరకు దక్కించుకుంది.ఐపీఎల్-2025లో కెప్టెన్‌గా పంత్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, సారథిగా ఫర్వాలేదనిపిస్తున్న ఈ టీమిండియా స్టార్.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో అతడి కెప్టెన్సీలో లక్నో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది.19 పరుగులుఇక బ్యాటర్‌గా రిషభ్ పంత్ చేసిన పరుగులు మొత్తం కలిపి కేవలం 19. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్నో జట్టు శనివారం సొంత మైదానం ఏకనా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా పంత్ బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రిషభ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రైస్ ట్యాగ్’ పంత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందా? అన్న నెటిజన్ల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే.. నా జీవితంలో ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదు.కాబట్టి.. అతడిపై ఒత్తిడి ఉంటుందో లేదో నేను అంచనా వేయలేను. అయితే, ఓ ఆటగాడిపై ఇలాంటివి కచ్చితంగా ప్రభావం చూపుతాయా? అంటే అవుననీ చెప్పవచ్చు. డబ్బు (ప్రైస్ ట్యాగ్) లేదంటే కెప్టెన్సీ భారం అతడిపై ఒత్తిడి పెంచుతుండవచ్చు. కారణం ఏదైనా పంత్ దానిని అధిగమించాలి.. గానీ తప్పించుకోకూడదు. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?గత మ్యాచ్‌లో పంత్ బ్యాటింగ్‌కు వెళ్లకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీజులోకి వెళ్తేనే కదా.. పరుగులు వస్తాయో.. రావో తెలిసేది. కనీస ప్రయత్నానికి కూడా వెనుకాడితే ఎలా?.. అతడు బ్యాటింగ్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం ఎంతమాత్రం సరికాదు’’ అని ఆకాశ్ చోప్రా విమర్శించాడు.కాగా గత మ్యాచ్‌లో లక్నో జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య కేకేఆర్.. పంత్ సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (28 బంతుల్లో 47), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81) దంచికొట్టగా.. నికోలస్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్ (36 బంతుల్లో 87 నాటౌట్) ఆడాడు.అయితే, మిడిలార్డర్లో వచ్చే పంత్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. నాలుగో స్థానంలో అబ్దుల్ సమద్ (6).. ఐదో స్థానంలో డేవిడ్ మిల్లర్ (4 నాటౌట్)ను ఆడించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో 238 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ 234 రన్స్‌కే పరిమితం కావడంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పంత్ సేన జయభేరి మోగించింది. చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం

సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో ?
రుచికరమైన వంటకాలు, కబుర్లు ,కాకర కాయలతో ఇంతకాలం అలరించిన ‘‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’’కు శుభం కార్డు పడింది. తమ అభిమాన ఓటీటీ తారలు ఈ సిరీస్‌లో పాక నిపుణులుగా రూపాంతరం చెందడాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు. ఫరా ఖాన్, వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్ న్యాయ నిర్ణేతలుగా ఉన్న సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 11న గ్రాండ్‌గా జరిగింది. ఇంతకీ ఈ షో విజేత ఎవరు, ప్రైజ్‌మనీ ఎంత? ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి!ప్రముఖ టెలివిజన్ నటుడు, అనుపమ పాత్రతో పాపులర్ గౌరవ్ ఖన్నా ఈ షో విజేతగా నిలిచాడు. సీజన్‌తో తనదైన శైలితో ఆకట్టుకున్న గౌరవ్ చివరి ధశలో కూడా న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నాడు. సిగ్నేచర్ డిష్‌లు, రుచులు, స్టైల్తోమాత్రమే కాకుండా, కాన్పూర్ నుంచి ముంబై దాకా సాగిన భావోద్వేగ ప్రయాణం గురించి పంచుకున్న కథ కూడా అటు ప్రేక్షకులను, ఇటు న్యాయనిర్ణేతల హృదయాలనూ కదిలించింది. దీంతో ఫలితాలు ప్రకటిస్తూ గౌరవ్‌ను వారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నలుగురు హేమాహేమీలను ఓడించి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని దక్కించుకున్నాడు గౌరవ్. ఫలితంగా రూ. 20 లక్షల నగదు బహుమతి, ప్రీమియం కిచెన్ ఉపకరణాలను గెలుచుకున్నాడు.నెమ్మదిగా ప్రారంభించి, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన వంటకాలను నేర్చుకుని అందించి ఈ రోజు ఈ స్థానానికి చేరుకున్నాడు.ఇది నా మొదటి రియాలిటీ షో" నేను ఎప్పుడూ కెమెరా ముందు ఏడవలేదు, అంటూ కన్నీళ్లతో తన కథను చెప్పి అందరిచేత కన్నీళ్లు పెట్టించాడు. ఈ సందర్బంగా ఫినాలేలో అతిథిగా వచ్చిన చెఫ్ సంజీవ్ కపూర్, మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎమోషన్స్‌కి దూరంగా పారిపోతూ ఇక్కడి దాకా వచ్చి వుంటావ్... ఇపుడిక భావోద్వాగాల్ని కూడా మిళితం చేస్తూ కొత్త జీవితాన్ని మొదలు పెట్టు ("అబ్ తక్ షాయద్ ఎమోషన్స్ సే భాగ్ కర్ యహాన్ తక్ పోహ్చే హో. ఆజ్ సే జిందగీ షురూ కరో, ఎమోషన్స్ సే జుడ్ కే") అని సలహా ఇచ్చారు.తీవ్రమైన పోటీ మధ్య గౌరవ్ తన ఆవిష్కరణ, సాంకేతికత , నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచారు. సాంకేతిక సవాళ్లను నేర్చుకోవడం నుండి ప్రస్తుతం వైరల్‌గా మారిన హనీకాంబ్ పావ్లోవా వంటి క్లిష్టమైన డెజర్ట్‌లను తయారు చేయడం వరకు, గౌరవ్ అతని పాక నైపుణ్యం, ప్రయాణం విశేషంగా నిలిచింది. అతని నటనా చాతుర్యంతోపాటు, వంటగదిలో నైపుణ్యం, ప్రావీణ్యం ఆశ్చర్యకరమైన ప్రతిభ, అభిమానులు . ఆహార విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.స్టార్-స్టడెడ్ పోటీదారుల జాబితాలో ఆయేషా జుల్కా, అభిజీత్ సావంత్, ఉషా నద్కర్ణి, అర్చన గౌతమ్, చందన్ ప్రభాకర్, కబితా సింగ్, దీపికా కాకర్ తదితరులు ఉన్నారు.కాగా సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తొలి సీజన్ ఈ ఏడాది జనవరి 27న మొదలైంది. ఏప్రిల్ 11న ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలేలో, నిక్కీ తంబోలిని తొలిరన్నరప్‌గా నిలవగా, తేజస్వి ప్రకాష్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫైసల్ షేక్ , రాజీవ్ అడాటియా మొదటి ఐదుగురు ఫైనలిస్టుల జాబితాలో నిలిచారు. ఈ ఫైనల్‌కు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.సెలబ్రిటీ చెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్‌లతో కలిసి ఫైనలిస్టుల తుది వంటకాలను రుచి చూసి,విజేతలను ఎంపిక చేశారు. ఫరా ఖాన్ హోస్ట్ చేసిన ఈ షో కామెడీ, వంటల మేళవింపుతో మధురక్షణాలతో రోలర్‌కోస్టర్‌గా సాగింది.

రామయ్య హరిత యజ్ఞం, ఎంత మేలు చేసిందో తెలుసా?
వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే వనజీవి రామయ్య జీవిత సారాంశం. చెట్ల ఆవశ్యకత చెప్పిన నిజమైన పర్యావరణ యోధుడాయన. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ కూడా. ఇంతకీ ఆయన ఏళ్ల తరబడి కొనసాగించిన హరిత యజ్ఞతం భవిష్యత్తు తరాలకు ఎంత మేలు అందించిందో తెలుసా?చిన్నప్పుడు బడిలో సర్ చెప్పిన పాఠాలే దరిపల్లి రామయ్య ఆకుపచ్చ కలకు స్ఫూర్తినిచ్చాయి. దశాబ్దాల పాటు శ్రమించి కోటికి పైగా మొక్కలు నాటేలా చేశాయి. ఇన్నేళ్లలో ఆయన నాటిన ఎన్నో వేల, లక్షల మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. స్వయంగా ఆయన నాటివే కాకుండా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరెందరో మొక్కలు నాటి ఈ మహా యజ్ఞంలో భాగం అయ్యారు.చెట్లు కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని తెలిసిందే. గాల్లోని హానికారక సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లనూ ఫిల్టర్ చేస్తుంటాయి. కడదాకా ఆయన కొనసాగించిన హరిత యజ్ఞంతో.. కాలుష్యం తగ్గి గాలి స్వచ్ఛత పెరిగింది.ఏడాదిలో ఒక చెట్టు సగటున 48 పౌండ్ల(22 కేజీలు) కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ఏడాదికి ఇద్దరికి సరిపడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. రామయ్య నాటింది కోటి మొక్కలకు పైనే. అంటే.. 218 మిలియన్ కేజీల Co2ను పీల్చుకునే అవకాశం ఉంది. ఏడాదికి 47 వేల కార్లు రోడ్డు మీద తిరిగితే వెలువడే కాలుష్యానికి ఇది సమానం. పోనీ కోటికి పైగా మొక్కల్లో లక్షల, వేల మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఉన్నా.. ఆ మహానుభావుడి కృషి భావితరాల్లో ఎంత మందికి ప్రాణవాయువు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్ నుంచి పాస్టర్ బైక్ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్ కుమార్ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్ బంకులలో యూపీఐ పేమెంట్స్ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు.

మూడు నెలల్లో తేల్చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శనివారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్ ఇయర్లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤పైన కనిపిస్తున్న లింక్‌లపై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు లాస్ట్‌ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ఇక.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో లాస్ట్ ప్లేస్‌లో సీఎం సొంతజిల్లా చిత్తూరు నిలవడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది.

యూపీఐ సేవల్లో అంతరాయం: స్పందించిన ఎన్పీసీఐ
దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వినియోగదారులు యూపీఐ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సుమారు 79 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నారు. 19 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారు. మరో 2 శాతం ఫిర్యాదులు UPI ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను నివేదించారు.యూపీఐ సేవల్లో అంతరాయాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 26న, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి.టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యూపీఐ సేవల్లో అంతరాయం జరిగినట్లు అప్పుడు ఎన్పీసీఐ వెల్లడించింది. కాగా ఇప్పుడు మరోమారు ఈ సమస్య తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్సీటీసీ క్లారిటీస్పందించిన ఎన్పీసీఐకొన్ని సాంకేతిక సమస్యల కారణంగా లావాదేవీలకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని ఎన్పీసీఐ ట్వీట్ చేసింది.NPCI is currently facing intermittent technical issues, leading to partial UPI transaction declines. We are working to resolve the issue, and will keep you updated. We regret the inconvenience caused.— NPCI (@NPCI_NPCI) April 12, 2025

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్‌లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్‌రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌కి ఎదిగిపోయిన సందీప్... అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్‌లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ ఎఎ22ఎక్స్ఎ6 పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్ పెంచిన డైరెక్టర్జవాన్ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్‌గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్, రూ. 55–65 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
బండి సంజయ్ -రాజాసింగ్ భేటీపై ఉత్కంఠ
LSG VS GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. స్టార్ ప్లేయర్ దూరం
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో ?
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ రాజీనామా
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
వాస్తవాలు తెలుసుకో లోకేష్: మేరుగు నాగార్జున
జట్టు గెలుపు కోసం ప్రముఖ ఆలయంలో 'ప్రీతి జింటా' పూజలు
విదేశీ కంపెనీలకు ఆహ్వానం
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
తిరుమలలో మరో అపచారం
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్‌పై ఫ్యాన్స్ ఫైర్
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్‌పోర్ట్‌లు
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
ఖజానాకు భూమ్
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
అప్పు చేసి ఫీజులు
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
2035 కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు
కిలో మీటర్‌కు రూ.64.01 కోట్లు
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
బట్టతల పర్లేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
తెలంగాణ పంటల విధానం మారాలి!
ఇక చంద్రుడే కనిపిస్తాడు!
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
CSK Vs KKR: చెపాక్‌లో చెన్నై చిత్తుగా...
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
బండి సంజయ్ -రాజాసింగ్ భేటీపై ఉత్కంఠ
LSG VS GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. స్టార్ ప్లేయర్ దూరం
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో ?
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ రాజీనామా
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
వాస్తవాలు తెలుసుకో లోకేష్: మేరుగు నాగార్జున
జట్టు గెలుపు కోసం ప్రముఖ ఆలయంలో 'ప్రీతి జింటా' పూజలు
విదేశీ కంపెనీలకు ఆహ్వానం
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
తిరుమలలో మరో అపచారం
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్‌పై ఫ్యాన్స్ ఫైర్
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్‌పోర్ట్‌లు
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
ఖజానాకు భూమ్
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
అప్పు చేసి ఫీజులు
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
2035 కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు
కిలో మీటర్‌కు రూ.64.01 కోట్లు
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
బట్టతల పర్లేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
తెలంగాణ పంటల విధానం మారాలి!
ఇక చంద్రుడే కనిపిస్తాడు!
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
CSK Vs KKR: చెపాక్‌లో చెన్నై చిత్తుగా...
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
సినిమా

మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన 'క'(KA Movie) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'క' చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సైకలాజికల్ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

శ్రీరాముడి గొప్పతనం చాటి చెప్తున్న 'విశ్వంభర' సాంగ్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) నటించిన ‘విశ్వంభర’(Vishwambhara) నుంచి రాములోరి సాంగ్ విడుదలైంది. ఈ సినిమాలోని తొలిపాటను నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. శ్రీరాముడు, సీతమ్మల గొప్పతనం చెబుతూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అందుకు ఎమ్ఎమ్ కీరవాణి(MM Keeravaani) మధురమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈ పాటను శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు.ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ ఓ లీడ్ రోల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటించారని తెలుస్తోంది. నిమాను జూలై 24న విడుదల చేస్తారని సమాచారం.

మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
శివకార్తికేయన్( Sivakarthikeyan).. ఈ పేరు ఇప్పుడు విజయాలకు కేరాఫ్‌గా మారిందనే చెప్పాలి. అయిలాన్, మావీరన్, అమరన్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి మదరాసి. తమిళంలో కొంత గ్యాప్ తరువాత దర్శకుడు ఏఆర్.మురుగదాస్( A.R. Murugadoss) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఇందులో విద్యుత్ జమ్వాల్, విక్రాంత్, షబీర్, బిజూ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలో దర్శకుడు మురుగదాస్ హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా సికిందర్ చిత్రాన్ని చేసే అవకాశం రావడంతో మదరాసి చిత్ర షూటింగ్లో జాప్యం జరిగిందనే ప్రచారం జరిగింది. కాగా సికిందర్ చిత్రం ఇటీవల తెరపైకి రావడంతో దర్శకుడు మురుగదాస్ మదరాసి చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. సెపె్టంబర్ 5న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. శివకార్తికేయన్ ఇంతకుముందు నటించిన సూపర్‌హిట్ చిత్రం అమరన్ తరువాత మదరాసి చిత్రం తెరపైకి రానుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సహజమే. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

థియేటర్లలో ఆల్కహాల్ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు!
థియేటర్లో పాపకార్న్, ఫ్రాంకీస్, కూల్‌డ్రింక్స్ ఎవరైనా అమ్ముతారు. అదే ఆల్కహాల్ అమ్మితే ఎలా ఉంటుంది? అని ఆలోచించింది ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox). సినిమాలో దమ్మున్నా, లేకపోయినా మందు కోసమైనా జనాలు రాకపోరా? అని యోచిస్తోంది. అసలే జనాలు ఓటీటీకి బాగా అలవాటుపడిపోయారు.జనాల్ని రప్పించడం కోసం..అందులోనూ ఏ సినిమా అయిని 8 వారాలు తిరిగేసరికి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని తెలిసి చాలామంది థియేటర్‌కు వెళ్లడమే మానేశారు. వాళ్లను తిరిగి థియేటర్‌కు తీసుకురావాలంటే ఇలా ఏదో ఒక కొత్త ప్లాన్ అమలు చేయాల్సిందే అని పీవీఆర్ బలంగా ఫిక్సయింది. దీనివల్ల ప్రేక్షకులకు ఏదో ఒకలా కిక్కు ఎక్కించాలని నిర్ణయించుకుందన్నమాట! అందుకే బెంగళూరు, గుర్గావ్లో మద్యం లైసెన్సు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.ఇబ్బందులు తప్పవా?అటు ఆదాయం పెంచుకోవడంతోపాటు ఇటు సినీప్రియులకు అద్భుతమైన అనుభూతిని కల్పించేందుకు ఇలాంటి ఐడియాతో ముందుకు వస్తోందన్నమాట! కానీ, ఇది అమలు చేస్తే సినిమా చూసేందుకు వచ్చే జనాల కంటే మందు తాగేందుకు బారులు తీరేవారే ఎక్కువవతారని అంటున్నారు. అలాగే ఆడవారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇది కొత్తేమీ కాదుథియేటర్లలో మద్యం అమ్మకాలు అన్న మాట కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది మన దేశంలో కొత్తేమీ కాదు. ఆల్రెడీ రెండుచోట్ల ఇది అమలవుతూనే ఉంది. న్యూఢిల్లీలోని డైరెక్టర్స్ కట్, ముంబైలోని మైసన్ ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లోని లాంజ్ ఏరియాలో మద్యం అమ్ముతున్నారు. సినిమా ప్రారంభానికి ముందు, అయిపోయాక లాంజ్‌లో కూర్చుని కావాల్సినంత మద్యం కొనుక్కుని తాగొచ్చు. కానీ మందు తాగుతూ సినిమా చూసేందుకు మాత్రం అవకాశం లేదు.చదవండి: ఓటీటీలో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే?
న్యూస్ పాడ్‌కాస్ట్

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు
క్రీడలు

IPL 2025: అప్పుడే అంతా అయిపోలేదు.. వరుస ఓటములు ఎదురవుతున్నా సీఎస్కే కోచ్ ధీమా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌లో వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్లో సీఎస్కే మరో 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని సొంత అభిమానులకే ఆశ లేదు.సొంత మైదానంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడే అంతా అయిపోలేదు. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యే సరికి కనీసం నాలుగో స్థానంతోనైనా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాము. ఐపీఎల్ సుదీర్ఘంగా సాగే టోర్నీ. ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాము. ఒక్కసారి ఊపు అందుకున్నామంటే తిరిగి వెనక్కు చూడము.ప్రస్తుతానికి మేము మంచి క్రికెట్ ఆడటం లేదు. అయితే పరిస్థితులు త్వరలోనే మారతాయి. ఇందు కోసం చాలా కష్టపడుతున్నాము. పరాజయాల బాట వీడి ఒక్క విజయం సాధించినా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్లేఆఫ్స్ సమయం వచ్చేసరికి చివరి స్థానాల్లో ఏదో ఒకదాన్ని చేరుకోగలము. ఇలా చేయగలమని ఇప్పటికీ నమ్ముతున్నాను. సత్ఫలితాలు సాధించాలంటే సమూహంగా రాణించాలి. జట్టులో ప్రతి ఒక్కరూ పాటు పడాలి.వరుసగా ఓడిపోతున్నామని ఆటగాళ్లను వారి సహజ శైలికి భిన్నంగా ఆడమని చెప్పలేము. వారు సొంత శైలిలో అద్భుతంగా ఆడారు కాబట్టే ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం పొందారు. పరిస్థితులు మెరుగుపడటానికి ముందు అధ్వానంగా మారతాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అనుభవజ్ఞులకే పెద్ద పీట వేస్తున్నామనడం వాస్తవం కాదు. జట్టు అవసరాల దృష్ట్యా అప్పటికి ఎవరు అవసరమో వారినే తుది జట్టులోకి తీసుకుంటాము. కఠిన సమయాల్లో అభిమానులందరూ మద్దతుగా ఉండాలి. ఇప్పటికీ ఏమీ మించి పోలేదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సత్తా మాకు ఉందని హస్సీ అన్నాడు.కాగా, సొంత మైదానం చెపాక్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కేకేఆర్ ఆడుతూపాడుతూ 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (2 వికెట్లు కోల్పోయి). ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. కెప్టెన్‌గా ధోని వ్యూహాలు ఈ మ్యాచ్‌లో పని చేయలేదు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 14న లక్నో హోం గ్రౌండ్లో జరుగనుంది.

ఉప్పల్ పిచ్ ఆటకు అనుకూలమే.. ఓటములకు నిరాశ పడొద్దు
శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ ఆటకు అనుకూలంగానే ఉంటుందని ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని టీబీసీ సెలూన్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రికెట్, ఇతర ఆటల పోటీల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. రేపటి ఐపీఎల్ మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్నామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఓడిపోతున్నామని నిరాశ పడవద్దని, ఇప్పటి వరకూ ఆడిన ఆటతీరుతో ఎస్ఆర్హెచ్తో ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. రెండు రోజుల గ్యాప్ ఉందని తనను ఇక్కడికి ఇన్వైట్ చేశారని, తాను ప్రారంభించిన స్టోర్‌లో తన అభిమానులు విజిట్ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనను అభిమానిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు కతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేశా.. తాను క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతానో.. నగరంలోని బిర్యానీని అంతగా ఇష్టపడతానని, అందుకే హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేశానని నితీష్ తెలిపారు. దీంతో పాటు నగరంలోని క్రికెట్ పిచ్ కూడా అంతే ఇష్టమని స్పష్టం చేశారు. ఎస్ఆర్హెచ్ క్రికెటర్ల సందడి.. నల్లగండ్ల టీబీసీ సెలూన్ ప్రారంభానికి నితీష్ కుమార్‌రెడ్డితోపాటు ఎస్ఆర్హెచ్ క్రికెటర్లు మ్కాస్ స్టోయినిస్, ఇషాన్‌కిషన్, అభిõÙక్ శర్మ, జావియర్ బార్లెట్, అరోన్ హర్డీ వంటి క్రికెటర్లు కూడా హాజరై సందడి చేశారు. క్రికెటర్లను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు డైనమిక్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ న్యూజిలాండ్ క్రికెటర్ స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో సత్తా చాటిన గ్లెన్ ఫిలిఫ్స్ మెగా వేలంలోకి రాగా.. గుజరాత్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇంత వరకు ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.గాయపడిన ఫిలిప్స్ఈ క్రమంలో గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (GT vs SRH)తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు ఫిలిప్స్. కానీ దురదృష్టవశాత్తూ అతడు గాయపడ్డాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంతిని పాయింట్ వైపు తరలించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ బాల్‌ను ఆపబోయి గాయపడ్డాడు.ఈ క్రమంలో ఫిజియో వచ్చి అతడిని బయటకు తీసుకువెళ్లాడు. అయితే, గజ్జల్లో నొప్పి తీవ్రం కావడంతో సీజన్ మొత్తానికి ఫిలిప్స్ దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి టైటాన్స్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సీజన్ మొత్తానికి దూరం‘‘ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా గ్లెన్ ఫిలిప్స్ గాయపడ్డాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు తిరిగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. గ్లెన్ త్వరగా కోలుకోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఆకాంక్షిస్తోంది’’ అని టైటాన్స్ యాజమాన్యం పేర్కొంది. కాగా 28 ఏళ్ల గ్లెన్ ఫిలిఫ్స్ ప్రపంచంలోని ఉత్తమ ఫీ ల్డ ర్లలో ఒకడు. తనదైన రోజున లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌తోనూ చెలరేగగలడు. అతడు దూరం కావడం టైటాన్స్‌కు ఓ రకంగా ఎదురుదెబ్బ లాంటిదే.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన గ్లెన్ ఫిలిప్స్.. కుడిచేతి వాటం బ్యాటర్. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 65 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. క్యాష్‌రిచ్ లీగ్‌లో చివరగా 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు బరిలోకి దిగాడు.జోరు మీదున్న గిల్ సేనఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిన శుబ్‌మన్ గిల్ సేన.. ఆ తర్వాత ఊహించని విధంగా పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టైటాన్స్.. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఇక శనివారం (ఏప్రిల్ 12) నాటి మ్యాచ్‌లో టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఇందుకు లక్నోలోని ఏకనా స్టేడియం వేదిక.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!

PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2025 సీజన్ శుక్రవారం (ఏప్రిల్ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ (ISU)- లాహోర్ ఖలందర్స్ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఇస్లామాబాద్ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, ఓపెనర్లు ఫఖర్ జమాన్ (1), మహ్మద్ నయీమ్ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్ రజా (23) రాణించాడు.చెలరేగిన జేసన్ హోల్డర్అయితే, డారిల్ మిచెల్ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్ జట్టు ఆలౌట్ అయింది. ఇస్లామాబాద్ బౌలర్లలో పేసర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జేసన్ హోల్డర్ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆండ్రీ గౌస్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపుఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ మున్రో, సల్మాన్ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్ టార్గెట్ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఐపీఎల్‌తో ఢీ!కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్ఎల్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్ 11- మే 18 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడే నిమిత్తం పీఎస్ఎల్ నుంచి తప్పుకొన్నారు.చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్ఎల్ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. పీఎస్ఎల్ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.పీఎస్ఎల్-2025: ఇస్లామాబాద్ వర్సెస్ లాహోర్ స్కోర్లులాహోర్: 139 (19.2)ఇస్లామాబాద్: 143/2 (17.4)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. విదేశీ క్రికెటర్లు వీరే Agha goes BOOM! That’s a clean strike clearing the boundary! 🤩#HBLPSLX l #ApnaXHai l #IUvLQ pic.twitter.com/khDjmxyB57— PakistanSuperLeague (@thePSLt20) April 11, 2025
బిజినెస్

థియేటర్ల పంట పండుతుందిలా..
ప్రముఖ మూవీ మల్టీప్లెక్స్ పీవీఆర్ ఐనాక్స్ గురుగ్రామ్, బెంగళూరు వంటి ఎంపిక చేసిన నగరాల్లో కొత్త సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. సినిమా చేసే సమయంలో ప్రేక్షకులు థియేటర్ల్లో మద్యం సేవించడానికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. థియేటర్లలో తగ్గుతున్న ప్రేక్షకులను ఆకర్షించేందుకు, అదే సమయంలో మరింత వ్యాపారాన్ని పెంచుకునేందుకు కంపెనీ ఈమేరకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు కేవలం సినిమాలు చూడటానికి మాత్రమే వేదికలు కాదు. వినోదం, ఆతిథ్యం, రిటైల్, సాంకేతికతను మిళితం చేసి ప్రేక్షకులకు మెరుగైన సర్వీసులు అందించే డైనమిక్ వ్యాపార కేంద్రాలుగా తయారవుతున్నాయి. మల్టీప్లెక్స్‌లో ఎలాంటి వ్యాపారం సాగుతుందో కింద తెలుసుకుందాం.సినిమాయే కోర్ బిజినెస్ఏ మల్టీప్లెక్స్కైనా సినిమాలను ప్రదర్శించడమే ప్రధాన వ్యాపారం. స్టూడియోల నుంచి పంపిణీ హక్కులను పొందడం, మల్టీ స్క్రీన్లలో షోటైమ్లను షెడ్యూల్ చేయడం, ప్రేక్షకులకు టిక్కెట్లను విక్రయించడం ఇందులో భాగంగా ఉంటాయి. మల్టీప్లెక్స్‌లు హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ నుంచి చిన్న, ప్రాంతీయ సినిమాలు వరకు దాదాపు అన్ని రకాల సినిమాలను ప్రదర్శిస్తూ టికెట్ ఫేర్ ద్వారా డబ్బు సంపాదిస్తాయి.ఫుడ్ సర్వీస్సినిమా థియేటర్ ఆవరణలో కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్, ఇతర ఆహార పదార్థాలు దర్శనమిస్తాయి. మల్టీప్లెక్స్‌లో వీటి ధర కూడా సాధారణం కంటే అధికంగానే ఉంటాయి. ఈమేరకు ఆయా సంస్థలు లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుంది. స్నాక్స్, పానీయాలు, కాంబో డీల్స్ అమ్మకాలు, పిజ్జా, బర్గర్లు, సుషీ వంటి డైన్ ఇన్ సర్వీసులతో థియేటర్లు కొంత సంపాదిస్తాయి. కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో ఇన్-హౌస్ రెస్టారెంట్లు లేదా ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నేరుగా థియేటర్ యాజమాన్యమే వీటిని నిర్వహిస్తుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో థర్డ్ పార్టీ విక్రేతలకు లీజుకు ఇస్తాయి. దానివల్ల సమకూరే అద్దె లేదా ప్రాఫిట్లో భాగస్వామ్యం ద్వారా అదనపు ఆదాయంగా ఉంటుంది.లగ్జరీ ఏర్పాట్లుమల్లీప్లెక్స్లో ప్రీమియం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లు వీఐపీ ఆడిటోరియంలు, రెక్లైనర్ సీటింగ్ లేదా ప్రైవేట్ స్క్రీనింగ్ గదులు వంటి ప్రీమియం సర్వీసులు అందిస్తున్నాయి. వీటికి ప్రేక్షకులు ప్రత్యేకంగా ధర చెల్లించాల్సి ఉంటుంది.అడ్వర్టైజింగ్ అండ్ స్పాన్సర్షిప్స్మల్టీప్లెక్స్లు ప్రధాన అడ్వర్టైజింగ్ ప్లాట్ ఫామ్‌లు, ప్రీ-షో వాణిజ్య ప్రకటనలు, ఇన్-లాబీ ప్రమోషన్లు, బ్రాండింగ్ పార్ట్నర్షిప్ల కోసం కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. నేషనల్ సినీమీడియా (ఎన్సీఎం) లేదా స్క్రీన్విజన్ వంటి సంస్థలచే తరచుగా నిర్వహించబడే ప్రీ-మూవీ స్లైడ్లు, వాణిజ్య ప్రకటనలు ఆదాయ వనరుగా ఉంటున్నాయి. థియేటర్లలోని డిజిటల్ సైనేజ్, పోస్టర్లు, ఇంటరాక్టివ్ డిప్ప్లేల ద్వారా స్థానిక వ్యాపారాలు లేదా కార్పొరేట్ స్పాన్సర్లను ఆకర్షిస్తుంటారు. కస్టమర్ల బిజినెస్ విస్తరణ కోసం ఇది ఎంతో తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డాలర్‌కు ట్రంప్ గండంరిటైల్ అండ్ మర్కండైజింగ్మల్టీప్లెక్స్లు పాపులర్ సినిమాలకు సంబంధించిన దుస్తులు, బొమ్మలు, పోస్టర్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. స్టార్ వార్స్ లేదా మార్వెల్ థీమ్.. వంటి హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థలు కొన్ని సినిమాలకు చెందిన లిమిటెడ్ ఎడిషన్ వస్తువులను థియేటర్లలో విక్రయిస్తుంటాయి. అందులో నుంచి కూడా మల్టీప్లెక్స్‌కు ఆదాయం వస్తుంది.

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్సీటీసీ క్లారిటీ
ఆంగ్ల మీడియా కథనాలు ఐఆర్సీటీసీ (IRCTC) తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. వీటిని ఆధారంగా చేసుకుని మేము కూడా కథనం అందించాము. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని ఐఆర్సీటీసీ స్పష్టం చేస్తూ అధికారికంగా వెల్లడించింది.ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ సమయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి టైమింగ్ యథావిధిగానే ఉంటాయి. టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఇప్పటి వరకు ఉన్న సమయాన్నే పాటించాలి. ఆ సమయాల్లోని టికెట్స్ అందుబాటులో ఉంటాయి.Some posts are circulating on Social Media channels mentioning about different timings for Tatkal and Premium Tatkal tickets. No such change in timings is currently proposed in the Tatkal or Premium Tatkal booking timings for AC or Non-AC classes. The permitted booking… pic.twitter.com/bTsgpMVFEZ— IRCTC (@IRCTCofficial) April 11, 2025

ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు (ఏప్రిల్ 12) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 270 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,670 వద్ద నిలిచాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు కూడా రూ. 250 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 270 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,670 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,850 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 12) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు!

బజాజ్ ఆటో మాజీ వైస్ ఛైర్మన్ కన్నుమూత
బజాజ్ ఆటో మాజీ వైస్ ఛైర్మన్ మాధుర్ బజాజ్(73) మృతి చెందారు. వృద్ధాప్య కారణాల వల్ల అస్వస్థతతో ఇటీవల దక్షిణ ముంబైలో ఉన్న బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతుండగానే శుక్రవారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగా గతేడాది జనవరిలో బజాజ్ ఆటో వైస్ ఛైర్మన్ పదవికి మాధుర్ రాజీనామా చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు మాధుర్ బజాజ్. విదేశాల్లో విద్యనభ్యసించిన ఆయన గ్రూప్‌లోని పలు కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్)తో పాటు సీఐఐ, ఇతర పారిశ్రామిక సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు.ఇదీ చదవండి: డాలర్‌కు ట్రంప్ గండంకేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు భారత వృద్ధిలో భాగస్వామ్యం అయ్యారంటూ బజాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ స్నేహితుడు కన్నుమూశారని విచారం వ్యక్తం చేస్తూ భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి సంతాపం తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (వెస్ట్రన్ రీజియన్) ఛైర్మన్‌గా, చాంబర్ ఆఫ్ మరాఠ్వాడా ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడిగా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌తో భాగస్వామిగా ఆయన ఎంతో సేవలందించారని బాబా కళ్యాణి తెలిపారు.
ఫ్యామిలీ

'మనసున్న మారాజు'.. చూపులేకపోతేనేం.. సమాజానికి వెలుగు పంచుతున్నాడు..!
మనసు లేని వాళ్లు చూపు ఉన్నప్పటికీ...సమాజాన్ని చూడలేరు. మనసు ఉన్న వాళ్లు చూపు లేకపోయినప్పటికీ సమాజాన్ని చూస్తారు. సమాజానికి తమ వంతుగా తోడ్పడతారు. అలాంటి ఒక యువకుడు పంచగుడి మహేశ్... తన కళ్లే తనకు సహకరించవు. అడుగు దూరం దాటి ఏమీ చూపించవు. రెండో అడుగు నుంచి అంతా చిమ్మచీకటే. అయినా...ఏదో ‘వెలుగు’ను చేరుకోవాలన్న తపన తనను నడిపిస్తోంది. ‘నాకు చూపొక్కటే సమస్య అన్నా..’ అని సింపుల్‌గా తన అంధత్వాన్ని కొట్టిపారేస్తాడు. ‘సమస్య లేని మనిషి ఉంటడా..!’ అంటూ తన సమస్యను లైట్‌గా తీసుకోమంటాడు మహేశ్.మనసుతో చూస్తాడు!మహేశ్‌కు కంటిచూపు లేదు. అందుకే ఆయన మనసుతో చూస్తున్నాడు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి మహేశ్ తాను నెలకొల్పిన ‘దివ్యాంగశక్తి ఫౌండేషన్ ద్వారా సమాజసేవ చేస్తున్నాడు. ఇటీవల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వితంతువుకు రెండుగదుల ఇంటిని నిర్మించి ఇచ్చాడు.వాలేగాం టు నాందేడ్వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి అనూషబాయి, లక్ష్మణ్ దంపతులకు మహేశ్, శ్రీకాంత్ కుమారులు, భాగ్యశ్రీ కుమార్తె. పెద్దకొడుకైన మహేశ్‌కు అడుగు దూరం వరకు అది కూడా ఒక కన్ను ఐదు శాతమే కనిపిస్తుంది. రెండో కుమారుడు శ్రీకాంత్‌కు ఐదేళ్ల వయసులో వచ్చిన అనారోగ్య సమస్యతో రెండు కళ్లూ దెబ్బతినడంతో పూర్తిగా అంధుడయ్యాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అనూష–లక్ష్మణ్ దంపతులు తమ కొడుకులను బాగా చదివించాలనుకున్నారు. మహేశ్ మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకాలోని బొదిడి అంధుల పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. ఇంటర్, బీకామ్ డిగ్రీ నాందేడ్ జిల్లాలోనే పూర్తిచేశాడు. నాందేడ్‌లో ఉన్నప్పుడే దివ్యాంగుల కోసం ఏర్పాటైన ‘సక్షమ్’ సంస్థలో చురుకుగా పనిచేశాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు.దివ్యాంగిశక్తి ఎంటర్ప్రైజెస్నాందేడ్ నుంచి వచ్చిన మహేశ్ నిర్మల్ జిల్లాలో ‘సక్షమ్’ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాడు. మిత్రుల సూచన మేరకు బెంగళూరులో ఒకేషనల్ ట్రైనింగ్‌కు వెళ్లాడు. 2016లో తన ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ తయారు చేశాడు. తెలిసినవాళ్లకు విక్రయించాడు. మంచి స్పందన రావడంతో 2017లో ‘దివ్యాంగశక్తి ఎంటర్ప్రైజెస్’ పేరిట భైంసా మండలం మాటేగాం గ్రామంలో చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు పీఎంఈజీపీ నుంచి రూ.15 లక్షల ఆర్థికసాయం అందడం తోడైంది. ఈ యూనిట్లో ‘దివ్యాంగశక్తి’ పేరిట ఫ్లోర్‌క్లీనర్ నుంచి గ్లాస్ క్లీనర్స్ వరకు ఎన్నో తయారు చేస్తున్నాడు. వీటితో పాటు బయోడిగ్రేడబుల్ కవర్స్ విక్రయిస్తున్నాడు. నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తన ప్రొడక్ట్స్‌ను మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈ యూనిట్ ద్వారా తాను ఉపాధి పొందడంతోపాటు మరో ఆరుగురికి ఉపాధి అందిస్తున్నాడు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్, ఫొటోలు: బాతూరి కైలాష్దివ్యాంగ శక్తి... తన వ్యాపారసంస్థ ‘దివ్యాంగశక్తి’ పేరిటనే 2021లో ఫౌండేషన్ ప్రారంభించాడు మహేష్. సమాజానికి తన వంతుగా కొంత ఇవ్వాలి అనేది అతడి విధానం. తన ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, అనాథలు, వృద్ధులకు సేవలు అందిస్తున్నాడు. మూడేళ్లుగా పది, ఇంటర్ పాసైన దివ్యాంగులకు సహకారం అందిస్తున్నాడు. వారి కోసం పరీక్షలు రాసిచ్చే వారిని సన్మానిస్తున్నాడు. సర్కారు బడి పిల్లలకు ఉచితంగా బ్యాగులు అందిస్తున్నాడు. ఇటీవల చుచుంద్ గ్రామంలో రూ.30వేలు ఖర్చుచేసి వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేశాడు.(చదవండి: సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లండిలా..!)

సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీగా ఉండే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగాలంటే అంత సులభం కాదు. అయితే గంటల కొద్దీ.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా కేవలం ఒక్కరోజులోనే స్వామి దర్శనం చేసుకునేలా ఐఆర్సీటీసీ ‘గోవిందం’ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ‘గోవిందం టూర్’లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ 12734లో సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6.10గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు రాత్రి 7.38 గంటలకు చేరుతుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా ‘గోవిందం టూర్’ రైలు ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి హోటల్‌కు భక్తులు వెళ్లి చెక్ ఇన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరుతారు. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్ నెంబర్ 12733 ఎక్కుతారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, అక్కడ నుంచి లింగంపల్లికి ఉదయం 7.35గంటలకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులకు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఏసీ వాహనంలో రవాణా, హోటల్లో బసతో పాటు, వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్లో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ తరహా టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. కేటగిరీ వారిగా ధరలు..సింగిల్ షేరింగ్: 3(ఏసీ): రూ.6790లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.4940లుట్విన్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుత్రిపుల్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుపిల్లలకు బెడ్(5 నుంచి 11 ఏళ్లు)3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు పిల్లలకు బెడ్ లేకుండా3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు (చదవండి:

సూట్స్‌ని స్టైలిష్‌గా కుట్టేదాం ఇలా..!
సూట్స్ కోసం ఖరీదైన ఫ్యాబ్రిక్స్ కొనుగోలు చేయడం మాత్రమే కాదు వాటిని అంతే స్టైల్‌గా స్టిచ్ చేయడం కూడా ముఖ్యమే. ఎంత మంచి బ్రాండెడ్ క్లాత్ తీసుకున్నా స్టిచ్చింగ్ కుదరకపోతే.. ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే. ముఖ్యంగా విభిన్న హోదాల్లో ఉంటూ సూట్స్ ధరించేవారికి ఆ హోదాకు తగ్గట్టు కుట్టు కూడా కుదరాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్స్ తామే స్టిచ్చింగ్ సేవలను అందిస్తున్నాయి. ఈ విషయంలో మరొక అడుగు ముందుకేసిన.. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్. హైదరాబాద్ నగరవాసులకు ఉచితంగా స్టిచ్చింగ్ సేవల్ని పరిచయం చేస్తూ మేడ్ ఫర్ యూ స్టిచ్డ్ ఫర్ ఫ్రీ పేరిట ఓ కాన్సెప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ రిటైల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రణవ్ డేవ్ తెలిపారు. ఈ పంధాను మరిన్ని బ్రాండ్స్ అనుసరిస్తే.. వేల రూపాయలు వ్యయమయ్యే స్టిచ్చింగ్ సేవలు ఉచితంగా అందించే పరిస్థితి కనిపిస్తోంది. (చదవండి: సమ్మర్లో కాటన్ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!)

శిక్షణే వినూత్న లక్షణం..! వేసవి సెలవులను ఉపయోగించుకోండిలా..!
విద్యార్థుల చదువులు, యువత కాలేజీల పోటీ వాతావరణానికి, ఒత్తిడికి వేసవి ఒక విరామం, వినోదం. అయితే హైదరాబాద్ నగరం వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకునేందుకు అనేక సమ్మర్ క్యాంపులకు వేదికగా మారింది. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం నుంచి సృజనాత్మక రంగాల వరకూ, శారీరక దృఢత్వం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకూ విస్తరించి ఉన్న ఈ క్యాంపులు, విద్యా జీవితానికి వెలకట్టలేని అనుభవాలను అందిస్తున్నాయి. ఈ రెండు నెలల కాలాన్ని ఇంటి పట్టునే ఉండి వృథా చేయకుండా ఇటు విజ్ఞానం, అటు వినోదం సమ్మిళితంగా ఈ వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోడానికి ఈ తరం ఎక్కువ ఆసక్తి చూపిస్తోందనేది నిపుణుల మాట. ఇందులో భాగంగా వైట్ హాట్ జేఆర్, కోడింగ్ నింజాస్, హ్యాకర్ కిడ్, ఎస్పీ రోబోటిక్స్ మేకర్ ల్యాబ్ వంటి సంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్డ్స్ లెవెల్ వరకూ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ అందిస్తున్నాయి. స్పెషల్ ఇంటర్న్‌షిప్ మాడ్యూల్స్ సహా ప్రాజెక్టు ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థులకు రియల్–వరల్డ్ పరిజ్ఞానం అందిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ సంస్థల శిక్షణా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ తరం కళాత్మకం వైపే.. విద్య, వృత్తి పరమైన నైపుణ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక కళలో ప్రావీణ్యముండటం ఈ తరంలో సెలబ్రిటీ హోదాగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా వైరల్స్ పుణ్యమా అని వినూత్న వ్యక్తిత్వానికి కళలు ఒక ప్రామాణికంగా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నగరవాసుల దృష్టి కళల వైపు మళ్లిందనే చెప్పాలి. నగరంలోని రవీంద్ర భారతి అకాడమీ, శిల్పా రామం ఆర్ట్ క్యాంప్, కల్పతరు వంటి విభిన్న కళా వేదికలు, సంస్థలు.. పెయింటింగ్, సంగీతం, నృత్యం, థియేటర్ ఆర్ట్స్ వంటి రంగాల్లో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా శిల్పారామం ప్రాంగణంలో నిర్వహించే కళాకారుల వర్క్‌షాపులు, విద్యార్థులకు దేశీయ కళల పట్ల అవగాహన పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తున్నాయి. ఫిట్ అండ్ స్పోర్ట్స్.. నగర వాసుల సక్సెస్ మంత్ర ఏదైనా ఉందంటే.. అది ఆరోగ్యం, ఫిట్నెస్ అని ఠక్కున చెప్పేస్తారు. ఆరోగ్య శిక్షణ, క్రీడలు, ఫిట్నెస్ రంగాలకు నగరంలో మంచి డిమాండ్, ఆదరణ ఉంది. అంతే కాకుండా ఈ రంగాల్లోని శిక్షణా అంశాలపై హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు ఉండటం విశేషం. డెకథ్లాన్ అకాడమీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఫిట్ కిడ్స్ హైదరాబాద్ వంటి సంస్థలు స్విమ్మింగ్, యోగా, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ శిక్షణల ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, క్రమశిక్షణ, టీం వర్క్, ఫోకస్ వంటి విలువలు పెంపొందుతున్నాయి. అంతేకాకుండా కేవలం చదువులు మాత్రమే కాదు.. క్రీడలతోనూ అంతర్జాతీయ గుర్తింపు, ఉన్నత స్థాయి జీవితానికి నాంది పలకవచ్చని చెప్పడానికి పలువురు నగర క్రీడాకారులే నిదర్శనం. చేయూతనిస్తే అద్భుతాలే.. సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులు, యువత కొత్త ప్రపంచాన్ని అన్వేíÙంచే అవకాశం పొందుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ఆసక్తులను గుర్తించి, అనుగుణమైన శిక్షణలకు ప్రోత్సహించగలిగితే, వారు భవిష్యత్తులో విశ్వాసంతో ముందుకు సాగుతారని నిర్వాహకులు, నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసానికీ పెద్దపీట.. అదనపు నైపుణ్యాలను కోరుకునే నగర వాసులు ఎవరైనా సరే.. వ్యక్తిత్వ వికాస శిక్షణలో ప్రవేశించడానికే మొగ్గు చూపుతున్నారు. వీరి ఆసక్తికి అనుగుణంగా ది పర్సనాలిటీ స్కూల్, టైమ్ కిడ్స్, ఉద్భవ్ అకాడమీ వంటి ప్రత్యేక సంస్థలు కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇవి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, యువత భవిష్యత్తుకు మార్గం చూపడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగాలను పొందడంలోనూ, ఉపాధి రంగాల్లో రాణించడంలోనూ ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎంతో ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంపొందిస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న మాట. (చదవండి: సమ్మర్లో కాటన్ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!)
ఫొటోలు


సూర్య ‘రెట్రో’ మూవీ స్టిల్స్


ఒంటిమిట్ట : కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం (ఫోటోలు)


తెలంగాణ అమరనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)


హరిత యాత్రలో అలసిన వనజీవి.. రామయ్య అరుదైన చిత్రాలు


హైదరాబాద్ : ఘనంగా ఉస్మానియా మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (ఫొటోలు)


ఉప్పల్‌లో ప్రాక్టీస్ అదరగొట్టిన SRH, పంజాబ్ ప్లేయర్స్ (ఫొటోలు)


నల్లగండ్లలో సందడి చేసిన నితీష్, స్టోయినిష్ (ఫోటోలు)


రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ.. చెర్రీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ను ఇప్పుడు చూస్తే..! (ఫొటోలు)


వైట్ గౌన్ లో అందాలు ఆరబోస్తున్న నేహా శెట్టి (ఫోటోలు)


సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
అంతర్జాతీయం

భారత్‌కు వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీసమేతంగా భారత్‌కు వస్తున్నారు. భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి ఏప్రిల్ 21 నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారని సమాచారం. ఉషవి తెలుగు మూలాలున్న విషయం తెలిసిందే. అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఆమె భారత్ రానుండటం ఇదే తొలిసారి. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులతో వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్య తదితర రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా ఏప్రిల్ 21–24 తేదీల్లోనే భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్ ఉన్నతస్థాయి చర్చల్లో ఆయన కూడా భాగస్వామి కానున్నారు.తాజ్‌మహల్ సందర్శన భారత పర్యటన సందర్భంగా వాన్స్ దంపతులు తాజ్‌మహల్‌ను కూడా వీక్షించనున్నారు. ఆగ్రాతో పాటు జైపూర్‌ను కూడా వాళ్లు సందర్శిస్తారని తెలుస్తోంది.

చైనా.. తగ్గేదేలే!
బీజింగ్: అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. అయితే, ‘‘మాపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసింది. ఇంకా పెంచితే ఇక అర్థముండదు. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుంది. అమెరికా ప్రస్తుత టారిఫ్‌లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికే అసాధ్యంగా మారిపోయింది. కనుక మాపై అమెరికా టారిఫ్‌లను ఇంకా పెంచేసినా మేం మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోం’’ అని స్పష్టం చేసింది. ఈ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని అభిప్రాయపడింది. ‘‘అందుకే టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉంది. మావైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామనే ఆశిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్‌లను అమెరికా ప్రజలే విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ గురువారం స్పష్టతనిచి్చంది.ఏకాకిగా మిగులుతారు అమెరికాపై జిన్‌పింగ్ ధ్వజం కలసికట్టుగా ఎదుర్కొందాం ఈయూ దేశాలకు పిలుపుఅమెరికా టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. అవి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. ‘‘టారిఫ్‌ల యుద్ధంలో ఎవరూ గెలిచేదుండదు. ఇలా ప్రపంచం మొత్తానికీ వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదు’’ అంటూ హితవు పలికారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో శుక్రవారం బీజింగ్‌లో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్‌కు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా. మన సంయుక్త స్పందన ఇరుపక్షాలకు మాత్రమే గాక మొత్తం అంతర్జాతీయ సమాజానికీ మేలు చేస్తుంది. స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా ఏనాడూ ఇతరుల దయపై ఆధారపడలేదు. 70 ఏళ్లుగా స్వయంసమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుంది’’ అని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.

విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి. ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సి స్టం (సెవిస్) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్ఎస్ మంత్రి క్రిస్టీ నోయెమ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి. విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్ మిషెల్ డిమాండ్ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభ్యంతరకర సోషల్ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. వర్సిటీల్లోనూ ఆందోళన విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది. అరిజోనా స్టేట్ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్ ఈస్టర్న్ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్ వర్సిటీ చాన్స్‌లర్ వాపోయారు. విదేశీ విద్యార్థులే కీలకం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్ డోర్స్’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

ట్రంప్ పన్నులపై చైనా జిన్‌పింగ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపు అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివర్ణించారు. ట్రంప్ బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అలాగే, అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచినట్టు చెప్పుకొచ్చారు. చైనాపై అమెరికా భారీగా పన్నులను పెంచిన నేపథ్యలో అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ..‘ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సమంజసం కాదు. ట్రంప్ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు అధ్యక్షుడు జిన్‌పింగ్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 14 నుంచి వియత్నాం, మలేసియా, కంబోడియాలో జిన్‌పింగ్ పర్యటించనున్నారు. ఇక, డొనాల్డ్ ట్రంప్.. వియత్నాం, కంబోడియా దేశాలపై కూడా భారీగానే పన్నులు విధించారు. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్‌పింగ్ చర్చలు జరపనున్నారు.Latest UY | WorldXi Jinping’s Southeast Asia Tour: A Move Amidst U.S. Trade Storm?Chinese President Xi Jinping embarks on a pivotal journey to Vietnam, Malaysia, and Cambodia starting April 14, aiming to fortify bonds with key allies as U.S. tariffs tighten their grip. With… pic.twitter.com/IfsHmtQ4c1— UnreadWhy (@TheUnreadWhy) April 11, 2025జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్అంతకుముందు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించీ తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
జాతీయం

అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగుచూసింది. అయోధ్యలోని ఒక గెస్ట్ హౌస్‌లో బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్లో వందల వరకు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామాలయం గేట్ నంబర్-3 దగ్గరలో రాజా గెస్ట్ హౌస్ ఉంది. రామాలయం దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన వారు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే, తాజాగా వారణాసికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు. శుక్రవారం సదరు రాజా గెస్ట్‌హౌస్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో సదరు మహిళ.. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా.. గెస్ట్‌హౌస్‌లో పనిచేసే సౌరభ్ తివారీ అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. అది గమనించిన ఆమె.. ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సౌరభ్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఫోన్ తీసుకుని పరిశీలించగా.. మహిళలు స్నానం చేస్తున్న పది వీడియోలను, అనేక అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.🚨 Ayodhya | A 30-year-old female devotee was secretly filmed while bathing at Raja Guest House near Gate No. 3 of the #Ayodhya Ram Temple.Another disturbing breach of women's privacy in UP.#Ayodhya #WomenSafety #PrivacyViolation #UPNews #indtoday pic.twitter.com/uWRtfpouvV— indtoday (@ind2day) April 11, 2025ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ.. నేనుస్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లాను. బాత్రూమ్లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని తెలిపారు.

యువతీ యువకుడిపై దౌర్జన్యం.. వీడియో వైరల్
బెంగళూరు: బెంగళూరులో యువతీ యువకుడిపై దౌర్జన్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిందూ యువకుడి జతలో బైకుపై మాట్లాడుతూ కూర్చొన్న యువతిని ఐదు మంది నిందించి దాడికి యత్నించారు. ఘటనపై మైనర్ యువకుడితో పాటు మహిం, అఫ్రిది, వాసిం, అంజుంలను పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు రోజుల క్రితం తన స్నేహితుడి జతలో బుర్కా ధరించిన యువతి బైకుపై కూర్చొని మాట్లాడుతుండగా ఐదు మంది వెళ్లి దాడికి యత్నించారు. యువకుడితో అసభ్యంగా మాట్లాడారు. ఎందుకు కూర్చున్నావు, మానం, మర్యాద లేదా అంటూ ఇద్దరిని నోటికొచ్చినట్లు నిందించారు. యువతిని తల్లిదండ్రుల నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తరగతి స్నేహితుడితో మాట్లాడుతున్నా తమ తల్లిదండ్రుల నంబర్ మీకెందుకని ప్రశ్నించిన ఇద్దరిపై దాడికి యత్నించారు. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. The #BengalauruPolice arrested four individuals, including a minor, on Friday in connection with a case of moral policing reported under the Chandra Layout police station limits in #Bengaluru.The accused allegedly confronted a #Muslim woman for speaking with a youth from #Hindu… pic.twitter.com/uoyPgU6jv8— Hate Detector 🔍 (@HateDetectors) April 11, 2025

హురియత్‌పై మరో దెబ్బ.. వేర్పాటువాదానికి జేకేఎంఎం స్వస్తి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాదం తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ (ఏపీహెచ్‌సీ)కి చెందిన మరో భాగస్వామ్య సంస్థ ‘జమ్ముకశ్మీర్ మాస్ మూవ్మెంట్(Jammu and Kashmir Mass Movement)’ (జేకేఎంఎం) విద్రోహవాద, వేర్పాటువాద భావజాలానికి స్వస్తి పలికి, హురియత్‌తో సంబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించింది.ఇటీవలి కాలంలో హురియత్ నుంచి విడిపోయిన 12వ సంస్థగా ఏపీహెచ్‌సీ నిలిచింది. దీనిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) స్వాగతించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావజాలంలోని ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ దిశగా సాగిన ఒక విజయంగా అభివర్ణించారు. జమ్ముకశ్మీర్ మాస్ మూవ్మెంట్ (జేకేఎంఎం)చైర్పర్సన్ ఫరీదా బేహన్ ఒక బహిరంగ ప్రకటనలో తమ సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌లోని రెండు వర్గాలతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు స్పష్టం చేశారు. హురియత్ భావజాలం జమ్ముకశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిష్కరించడంలో విఫలమైందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జేకేఎంఎం ఇకపై భారత రాజ్యాంగానికి కట్టుబడి దేశ ఐక్యతకు పాటుపడుతున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జేకేఎంఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ‘ఎక్స్’ పోస్టులో ఇలా పేర్కొన్నారు. ‘మోదీ ప్రభుత్వం హయాంలో జమ్ముకశ్మీర్‌లో ఐక్యతా స్ఫూర్తి నడుస్తోంది. హురియత్‌తో అనుబంధం ఉన్న మరో సంస్థ జమ్ముకశ్మీర్ మాస్ మూవ్మెంట్ విద్రోహవాదాన్ని తిరస్కరించి, భారత ఐక్యతకు పూర్తి కట్టుబాటును ప్రకటించింది. వారి చర్యను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 హురియత్ అనుబంధ సంస్థలు(12 Hurriyat affiliates) వేర్పాటువాదాన్ని వీడి భారత రాజ్యాంగంపై నమ్మకాన్ని ప్రకటించాయి.2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, జమ్ముకశ్మీర్‌లో విద్రోహవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, శాంతి, అభివృద్ధి దిశగా రాష్ట్రం పురోగమిస్తోందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. 1993లో ఏర్పాటైన హురియత్ కాన్ఫరెన్స్ జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద, విద్రోహవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వస్తోంది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ ప్రభావం గణనీయంగా తగ్గింది. దీనిలో భాగస్వాములుగా ఉన్న 12 సంస్థలు వీడటం ఈ సంస్థ బలహీనపడటాన్ని తెలియజేస్తుంది. దీనికి జమ్ముకశ్మీరలో ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ విధానాలే కారణమని హోమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..

మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
కర్ణాటక: గతంలో తెరవెనుక జరిగే రొమాన్స్ నేడు వీధుల్లోకి వచ్చింది. మెట్రో రైల్వేస్టేషన్లో ఓ జంట పట్టపగలే అందరి ముందు ప్రేమ కలాపాల్లో మునిగిపోయిన వీడియో భారీ వైరల్‌గా మారింది.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ఒకటో ప్లాట్‌ఫాంలో ఓ జంట, చుట్టుపక్కల ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యం ఎవరో మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రేమికులు ప్రేమకలాపం చోటు చేసుకున్నది మెజెస్టిక్ మెట్రోస్టేషనా లేక మాదావర స్టేషన్‌లోనా అనే స్పష్టత లేనప్పటికీ అందరి ముందు ఇలా ప్రవర్తించడంపై ఆ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి ఉన్న ప్రేమికుల రొమాన్స్ వీడియోపై వేలాదిమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలు విదేశాల్లో మాత్రమే చూడవచ్చు. ఇటీవల రోజుల్లో ఇక్కడ కూడా ఇలాంటి ప్రవృత్తి పెచ్చుమీరడం మంచిది కాదని సోషల్ మీడియాలో నెటిజన్ ఒకరు తెలిపారు. this is not USA or London 🫣#Bangalore Metro station had gone wild.. no sh@me no cultures no humanity... 😰#HelicopterCrash #RoohAfza #MSDhoni #SunnyDeol #DelhiCapitals #KaranKundrra #RamCharan pic.twitter.com/NgkQM75XvD— Melawan (@melawanshwa) April 11, 2025
ఎన్ఆర్ఐ

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
క్రైమ్

యువతీ యువకుడిపై దౌర్జన్యం.. వీడియో వైరల్
బెంగళూరు: బెంగళూరులో యువతీ యువకుడిపై దౌర్జన్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిందూ యువకుడి జతలో బైకుపై మాట్లాడుతూ కూర్చొన్న యువతిని ఐదు మంది నిందించి దాడికి యత్నించారు. ఘటనపై మైనర్ యువకుడితో పాటు మహిం, అఫ్రిది, వాసిం, అంజుంలను పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు రోజుల క్రితం తన స్నేహితుడి జతలో బుర్కా ధరించిన యువతి బైకుపై కూర్చొని మాట్లాడుతుండగా ఐదు మంది వెళ్లి దాడికి యత్నించారు. యువకుడితో అసభ్యంగా మాట్లాడారు. ఎందుకు కూర్చున్నావు, మానం, మర్యాద లేదా అంటూ ఇద్దరిని నోటికొచ్చినట్లు నిందించారు. యువతిని తల్లిదండ్రుల నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తరగతి స్నేహితుడితో మాట్లాడుతున్నా తమ తల్లిదండ్రుల నంబర్ మీకెందుకని ప్రశ్నించిన ఇద్దరిపై దాడికి యత్నించారు. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. The #BengalauruPolice arrested four individuals, including a minor, on Friday in connection with a case of moral policing reported under the Chandra Layout police station limits in #Bengaluru.The accused allegedly confronted a #Muslim woman for speaking with a youth from #Hindu… pic.twitter.com/uoyPgU6jv8— Hate Detector 🔍 (@HateDetectors) April 11, 2025

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025

స్నేహంతో ‘వల’.. ఆపై వేధింపుల ‘సెగ’..!
విశాఖ సిటీ: ‘నేను చేస్తున్నట్లే... నాకూ న్యూడ్ కాల్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు.. నమ్మకం లేకపోతే అకౌంట్ నంబర్ పెట్టు.. వెంటనే డబ్బులు పంపిస్తా’.. అంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతపురం కీచక జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్రయత్నిస్తే, అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్ పొందాడు. ఈ ఉదంతంపై పోలీసుల వివరాల ప్రకారం, పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న గృహిణి ఫేస్బుక్ అకౌంట్‌కు కొన్నాళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను జైలర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు అంగీకరించడంతో, స్నేహం పేరుతో చాటింగ్ ప్రారంభించాడు. కొద్ది రోజులకు అసలు రంగును బయటపెట్టాడు. న్యూడ్ కాల్స్, అసభ్య మెసేజ్‌లతో వేధించసాగాడు. మొదట ‘సారీ’.. ఆ తరువాత ‘కుక్క’ బుద్ధి..!మహిళ భర్త, మరో బంధువు పోలీస్ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌లు, వేధింపుల వ్యవహారాన్ని మహిళ బంధువైన ఏసీపీకి, ఎస్ఐగా పనిచేస్తున్న భర్తకు చెప్పింది. దీంతో వారు జైలర్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సదరు వ్యక్తి కేవలం ఫ్రెండ్షిప్ కోసమే మెస్సేజ్‌లు పంపించానని, సారీ చెప్పాడు. కొన్నాళ్లు మెస్సేజ్‌లు పంపించడం మానేశాడు. మళ్లీ గత నెల 25వ తేదీ నుంచి మెస్సేజ్‌లు, కాల్స్ చేయడం ప్రారంభించాడు. వేధింపులను భరించలేక సదరు మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, జైలర్‌ను అరెస్టు చేయడానికి అనంతపురం వెళ్లగా.. అప్పటికే పరారయ్యాడు. విశాఖకు వచ్చి 5వ ఏడీజే (ఫ్యామిలీ) కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖ పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్ పత్రాలను అందజేశాడు. శాఖాపరమైన చర్యలు..కాగా, జైలర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వీడియోలు


దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థల హెచ్చరిక


వనజీవి రామయ్య మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల


గవర్నర్ల నుంచి రాష్ట్రపతికి బిల్లులు .. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్


తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడింది: భూమన


హైదరాబాద్ ఇంటి నుంచి.. యాక్సిడెంట్ వరకు.. పాస్టర్ ప్రవీణ్ కేసులో జరిగింది ఇదే


వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు భారీ నిరసన ర్యాలీ


అల్లు అర్జున్ - అట్లీ మూవీకి 21 ఏళ్ల కుర్రాడు మ్యూజిక్..


రైస్ మిల్లులో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి