అమర్నాథ్ యాత్ర రెండవ రోజు రద్దు | Amaranth yatra from Jammu remains suspended for 2nd day | Sakshi
Sakshi News home page

అమర్నాథ్ యాత్ర రెండవ రోజు రద్దు

Published Sun, Aug 11 2013 11:44 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

కిష్టవార్ జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రెండవ రోజు కూడా రద్దు అయిందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు.

కిష్టవార్ జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రెండవ రోజు కూడా రద్దు అయిందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు. అలాగే ఆ యాత్రకు కొత్త బృందాలను ఏవరిని అనుమతించడం లేదని తెలిపారు. దీనితోపాటు పూంచీ జిల్లాలోని మండి పర్వత సానువుల్లోని ప్రముఖ శివ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు చేసే బుద్ద అమరనాథయాత్రను కూడా ఈ రోజు రద్దు చేసినట్లు చెప్పారు.

 

రాజోరి జిల్లాలో ఏర్పాటు చేసిన కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ,కాశ్మీర్లో కిష్టవార్ జిల్లాలో గత రెండు రోజుల క్రితం మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో ఘర్షణలు జరిగే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని సమాచారం అందటంతో ఆ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం కర్ప్యూ విధించింది. అందులోభాగంగానే శనివారం అమర్యాత్రను రద్దు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement