
రేపు (ఫిబ్రవరి 26, బుధవారం) మహాశివరాత్రి.. దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణలతో మారుమోగిపోనున్నాయి. మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. మనదేశంలో పలు పురాతన శివాలయాలు ఉన్నాయి. వీటిలో ఐదు శివాలయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేదార్‌నాథ్
కేదార్‌నాథ్ దేవాలయం ఉత్తరాఖంఢ్‌లోని రుద్రప్రయాగలో ఉంది. ఇది నాలుగు ధామ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కేదార్‌నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు ఉత్తరాఖండ్‌లోని రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలు.
సోమనాథ్
గుజరాత్‌లోని కథియావర్ ప్రాంతంలో సముద్ర తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ వైభవం గురించి మహాభారతం, భగవద్గీత, స్కంద పురాణాలలో కూడా ఉందని చెబుతారు. శివుణ్ణి తన ప్రభువుగా భావించిన చంద్రుడు ఇక్కడ తపస్సు చేశాడని అంటారు.
త్రయంబకేశ్వర్
త్రయంబకేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం నల్ల రాతితో నిర్మితమయ్యింది. ఇక్కడికి వచ్చిన శివ భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతుంటారు.
దక్షేశ్వర్
ఉత్తరాఖంఢ్‌లోని హరిద్వార్‌లో దక్షేశ్వర శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేస్తే పలు ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు.
అమర్‌నాథ్
అమర్‌నాథ్ ఆలయం జమ్ముకశ్మీర్‌లో ఉంది. ఈ ఆలయం ఒక గుహ రూపంలో ఉంటుంది. ఈ పవిత్ర గుహలో దాదాపు 10 అడుగుల ఎత్తున సహజ శివలింగం మంచుతో ఏర్పడుతుంది. ఆషాఢ పూర్ణిమ నుండి రక్షాబంధన్ వరకు భక్తులు అమరనాథుణ్ణి దర్శనం చేసుకునేందుకు తరలివస్తుంటారు.
ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు