తెలంగాణ బిల్లుకు మరిన్ని సవరణలు చేసే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు మరిన్ని సవరణలు చేసే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రుల బృందంలోని కీలక సభ్యుడు జైరాం రమేశ్ శనివారం రాత్రి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారని సమాచారం. హైదరాబాద్‌లో గవర్నర్ పాలన సహా బిల్లుకు చేయాల్సిన పలు సవరణల గురించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరిగినట్టు చెబుతున్నారు.