Top Stories
ప్రధాన వార్తలు

కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
పాపిరెడ్డిపల్లి కురుబ లింగమయ్య నివాసంలో వైఎస్ జగన్👉కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ👉 లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్👉 పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా👉ఇటీవలే టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన లింగమయ్యవైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం👉టీడీపీ నేతల డైరెక్షన్లో ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు👉పాపిరెడ్డిపల్లి గ్రామంంలో నిషేధాజ్ఞలు👉స్థానికులను కూడా అనుమతించిన పోలీసులు👉వాహనాలు వదిలి పొలాల ద్వారా పాపిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు👉ఎన్ఎస్ గేట్, రామగిరి వద్ద వైఎస్సార్ సీపీ వాహనాలు అడ్డుకుంటున్న పోలీసులు👉పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలుటీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఏడాది మార్చి 30న కొందరు టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరి స్తున్న కురుబ లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు.దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు. అయితే మరుసటి రోజు లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగా మంగళవారం బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ సోమవారం పరిశీలించారు.

దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కు ఉరి శిక్ష విధించింది.2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది.అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!
ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్ రోడ్లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు.. వారం మధ్యలో ఇలా ఎందుకంటే..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్, సీఎస్కే ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుండగా.. రాత్రి మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లన్పూర్ స్టేడియంలో జరుగనుంది.వారం మధ్యలో ఎందుకంటే..?తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు లేవు. అయితే ఏప్రిల్ 6న జరగాల్సిన కేకేఆర్, లక్నో మ్యాచ్‌ను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో కోల్‌కతా పోలీసులు మ్యాచ్‌కు భద్రతా ఏర్పాట్లు చేయలేమని చెప్పారు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్‌ను వాయిదా వేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీఐని కోరింది. దీంతో కేకేఆర్, లక్నో మ్యాచ్ నేటి మధ్యాహ్నానికి వాయిదా పడింది.ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..కేకేఆర్: క్వింటన్ డికాక్/రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో దుమ్మురేపుతున్న పంజాబ్ వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్కేతో తలపడనుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. సీఎస్కే నాలుగింట మూడు ఓడి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 2022 సీజన్ నుంచి జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు పంజాబే గెలిచింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి/అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ

సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి షాక్
ఢిల్లీ: సుప్రీం కోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పదిబిల్లులను ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహించారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలని స్పష్టం చేసింది. Key pointers from Supreme Court judgement in Tamil Nadu Governer RN Ravi case:➡️ Reservation of 10 bills for consideration by parliament after they were reconsidered by State assembly is illegal. ➡️Any consequential steps taken by President on the 10 bills is NON EST ➡️ Court… pic.twitter.com/1nlANNi7Gs— Bar and Bench (@barandbench) April 8, 2025గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అందువల్ల, ఆ చర్యను రద్దు చేస్తున్నాం. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ బిల్లులు గవర్నర్‌కు సమర్పించిన తేదీ నుండి ఆమోదించబడినట్లుగా పరిగణించబడతాయి’ అని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై సీఎం డీఎంకే స్టాలిన్ హర్షంసుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైందని’ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం ఒక్క తమిళనాడుకే కాదు. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు గర్వ కారణం’ అని అన్నారు.

వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
వివాహ వంటకాల్లో విందులు ఓ రేంజ్లో ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్లైతే భోజనంలో లెక్కపెట్టలేనన్ని వెరైటీలతో అతిథులను ఆశ్చర్యపరుస్తారు. కానీ ఇలా ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకునే విధంగా ఆతిథ్యం ఇవ్వడం గురించి విన్నారా..?. అలాంటి వినూత్న ఆలోచనకు తెరతీశారు పశ్చిమబెంగాల్లోని ఓ కుటుంబం. తమ ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనే అతిథులంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావించారో ఏమో..! గానీ భలే అద్భుతంగా మెనూ అందించి విందు ఏర్పాటు చేశారు. వచ్చినవారంతా వారెవవ్వా..ఏం ఉంది ఈ మెనూలో వాటి వివరణ అని మెచ్చుకుంటున్నారు.ప్రస్తతం ప్రజలంతా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా పడితే అలా తినేందుకు ఇష్టపడటం లేదు. ఏది ఎంతవరకు తింటే మంచిదో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఇలాంటి వివాహ వేడుకలో కూడా వారి డైట్‌కి ఇబ్బంది గలగకుండా జాగ్రత్త తీసుకుంటూ తాము అందించే వంటకాల కేలరీలను సవిరంగా మెనూలో అందించారు. అంతేగాదు ఈ విందులో నచ్చినవన్నీ తినండి..అలాగే అధిక కేలరీలను బర్న్ చేసుకునేందుకు ఈ వేడుకలో ఏర్పాటు చేసే ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్వంటి కార్యక్రమాల్లో పాల్గొనండి చాలు. జీఎస్టీ ఏం ఉండదూ కూడా అంటూ చమత్కారంగా రాశారు. ఇక్కడ ఆ మెనూలో ఆరోగ్య స్ప్రుహ తోపాటు, ఆహారం వృధాను నివారించేలా విందును ఆస్వాదిద్దాం అని పిలుపునివ్వడం విశేషం. ఇంకో విషయం కూడా జత చేశారు..ఎంజాయ్ చేద్దామనే వచ్చాం కాబట్టి..దాన్ని మిస్ చేసుకోకుండా కంఫర్ట్‌గా ఉండమని మెనూ చివరలో సూచించారు. అందుకు సంబంధించిన విషయాలను రెడ్డిట్ వినియోగదారుడు నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లంత ఇది వివాహ మెనూ కాదు..'కేలరీల మోమో' అంటూ ప్రశంసిస్తున్నారు.(చదవండి: 65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?)

గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,250 (22 క్యారెట్స్), రూ.89,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 దిగి రూ.82,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 తగ్గి రూ.89,880 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,03,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది.

సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు.

మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది.
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
క్రికెట్ బెట్టింగ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు.. వారం మధ్యలో ఇలా ఎందుకంటే..?
తగ్గిన భోజనం ధరలు
టాలీవుడ్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఫొటో వైరల్
అటెన్షన్ కోసమే ఇలా.. నేను అస్సలు తగ్గను: కరాటే కల్యాణి
'డియర్ ఉమ' టీజర్.. నిర్మాతగా తెలుగమ్మాయి సుమయ రెడ్డి
సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి షాక్
MI VS RCB: చరిత్ర సృష్టించిన భువీ
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
...సూపర్ సిక్స్ సార్!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
ప్రాణాలు తీస్తున్న సరదా
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ఈ పాపం.. ఎవరిది పవన్?
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
తల్లీకొడుకు... యాక్షన్
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
ట్రంప్ విధ్వంసం
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
చెట్లు కుములుతున్న దృశ్యం
ముంబై కంచుకోట బద్దలు.. పదేళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపు
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
మరో 50 శాతం వేస్తాం
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
ఎవరీ సోమాదాస్..? కోర్టులు ఆమె పోరాటాన్ని గౌరవించి మరీ..!
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
నయనతార@ 9
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
క్రికెట్ బెట్టింగ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు.. వారం మధ్యలో ఇలా ఎందుకంటే..?
తగ్గిన భోజనం ధరలు
టాలీవుడ్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఫొటో వైరల్
అటెన్షన్ కోసమే ఇలా.. నేను అస్సలు తగ్గను: కరాటే కల్యాణి
'డియర్ ఉమ' టీజర్.. నిర్మాతగా తెలుగమ్మాయి సుమయ రెడ్డి
సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి షాక్
MI VS RCB: చరిత్ర సృష్టించిన భువీ
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
...సూపర్ సిక్స్ సార్!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
ప్రాణాలు తీస్తున్న సరదా
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ఈ పాపం.. ఎవరిది పవన్?
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
తల్లీకొడుకు... యాక్షన్
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
ట్రంప్ విధ్వంసం
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
చెట్లు కుములుతున్న దృశ్యం
ముంబై కంచుకోట బద్దలు.. పదేళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపు
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
మరో 50 శాతం వేస్తాం
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
ఎవరీ సోమాదాస్..? కోర్టులు ఆమె పోరాటాన్ని గౌరవించి మరీ..!
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
నయనతార@ 9
సినిమా

టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్' తెలుగు ట్రైలర్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టామ్ క్రూజ్ నటించిన ఈ సిరీస్‌లోని 8వ సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible The Final Reckoning) తెరకెక్కింది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టామ్ క్రూజ్ ఇప్పటివరకూ చేయని ప్రమాదకరమైన స్టంట్స్ ఏంటి..? అనేది ఈ సినిమాలో చూడాల్సిందే.. అని చిత్ర యూనిట్ పేర్కొంది.

అల్లు అర్జున్ బర్త్‌డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే'
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ‘ఆర్య’ సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు.. పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ అని పిలుచుకునే బన్ని మలయాళంలో మల్లు అర్జున్ అయ్యారు. బాలీవుడ్ వాల్లకు పుష్పరాజ్‌గా స్థిరపడిపోయారు. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో అత్యంత శక్తివంతమైన హీరోగా ఆయన టాప్‌లో ఉన్నారు. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని రికార్డ్స్ రప్పా రప్పా అంటూ.. కొట్టేయాలని కొన్ని విషయాలు తెలుసుకుందాం.అల్లు అర్జున్‌లో ఇవన్నీ ప్రత్యేకమే..🎥 దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్🎥 రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్🎥 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.🎥 టాలీవుడ్లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్‌ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్నే🎥 అల్లు అర్జున్‌కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట🎥 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది.🎥 2025 పుష్ప2తో తొలిరోజు రూ. 294 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ తొలి చిత్రంగా రికార్డ్🎥 100 ఏళ్ల హిందీ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో రూ. 1000 కోట్లు సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప2 రికార్డ్🎥 అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ జాబితాలో పుష్ప2కు రెండో స్థానం, ఫస్ట్ దంగల్ 🎥 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్‌కు గుర్తింపు🎥 ప్రముఖ సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ కవర్‌పై అల్లు అర్జున్ ఫోటో 🎥 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ 🎥 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్‌కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు.🎥 బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట🎥 ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 28 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం

ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
టైమ్ లూప్ స్టోరీకి హారర్‌ను మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో 'రాక్షస' (Rakshasa) సినిమాలో చూడొచ్చు. ఈ ఏడాది మార్చి 7న కన్నడలో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు కన్నడ, తెలుగు వర్షన్స్‌లో ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కన్నడ నటుడు ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా దర్శకుడు లోహిత్ హెచ్ ఈ మూవీని తెరకెక్కించారు. టైమ్‌లూప్ కాన్సెప్టుతో వచ్చిన తొలి కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. 'రాక్షస' (Rakshasa) సినిమా ‘సన్‌నెక్ట్స్’ (Sun NXT)లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ఆ సంస్థ సోషల్ మీడియా ద్వరా ప్రకటించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు
క్రీడలు

భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ విల్ పకోవ్‌స్కీ (Will Pucovski) సంచలన ప్రకటన చేశాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. తరచూ గాయాల బారిన పడటమే ఇందుకు కారణమని 27 ఏళ్ల ఈ విక్టోరియా బ్యాటర్ స్పష్టం చేశాడు.కాగా దేశీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన యువ తార విల్ పకోవ్‌స్కీ. తన అద్భుత నైపుణ్యాల కారణంగా అభిమానులతో జూనియర్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) అంటూ నీరాజనాలు అందుకున్నాడు. విక్టోరియా తరఫున కఠినమైన వాకా (WACA) పిచ్‌పై వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచి.. ఆసీస్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.టీమిండియాతో మ్యాచ్‌లో అరంగేట్రంఈ క్రమంలో 2021లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా (India vs Australia)తో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా పకోవ్‌స్కీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఆఖరిగా గతేడాది మరోసారి గాయంఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పకోవ్‌స్కీకి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇందుకు ప్రధాన కారణం.. బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో తరచూ అతడి తలకు గాయం కావడం (కంకషన్). చివరగా మార్చి 2024లో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పుకోవ్స్కీ ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.అదే విధంగా.. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు లీసెస్టర్‌షైర్‌తో 2024లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా పుకోవ్స్కీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో 27 ఏళ్ల ఈ ఆసీస్ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఇకపై క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాతన నిర్ణయం గురించి మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే అనుకుంటున్నాను. అయితే, ఇకపై నేను ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోవడం లేదు. గతేడాది కష్టంగా గడిచింది. అందుకే నేను ఇకపై క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నా.సిడ్నీ మ్యాచ్‌లో శతకం బాదినప్పుడు పరిస్థితులు నాకు అనుకూలంగా మారిపోయాయి అనుకున్నా. మైదానంలో నన్ను నేను నిరూపించుకునేందుకు కఠినంగా శ్రమించాను. కానీ మళ్లీ పాత కథే పునరావృతమైంది’’ అని SEN రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పకోవ్‌స్కీ తెలిపాడు.కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 36 మ్యాచ్‌లు ఆడిన విల్ పకోవ్‌స్కీ ఏడు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 255. కాగా తన కెరీర్లో పకోవ్‌స్కీ పదిసార్లకు పైగా తలకు దెబ్బ తగిలించుకున్నాడు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.కోచ్‌గా కొత్త ప్రయాణంఅయితే, ఆటగాడిగా వీడ్కోలు పలికినా కోచ్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టాలని పకోవ్‌స్కీ భావిస్తున్నాడు. మెల్బోర్న్ ప్రీమియర్ క్రికెట్ క్లబ్‌కు అతడు కోచ్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. ‘‘వచ్చే ఏడాది మెల్బోర్న్ క్రికెట్ క్లబ్‌కు కోచ్‌గా వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.మెల్బోర్న్ నాకు సెకండ్ హోం లాంటిది. ఆటగాడిగా ఉన్న సమయంలోనూ నాకు ఎంసీసీ నుంచి మద్దతు లభించింది. ఎంసీసీ జూనియర్ అకాడమీలో కోచ్‌గా పనిచేసేందుకు నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని పకోవ్‌స్కీ చెప్పుకొచ్చాడు. చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..

నాన్నంటే భయం.. అన్నయ్యతో పాటూ నేనూ అక్కడే: ధోని
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటల్ని లిఖించుకున్న దిగ్గజ కెప్టెన్. రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన ఈ జార్ఖండ్ ‘డైనమైట్’.. తన ఆటతో పేరుప్రఖ్యాతులతో పాటు కోట్ల సంపదను ఆర్జించాడు.టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. 43 ఏళ్ల తలా రిటైర్మెంట్పై ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తల్లిదండ్రులు కూడా చెపాక్ స్టేడియానికి రావడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది.తొలిసారి స్టేడియానికి!సాధారణంగా ధోని భార్య సాక్షి (Sakshi Singh), కూతురు జీవా (Ziva Dhoni) మాత్రమే స్టేడియానికి వచ్చి సందడి చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అతడి తల్లిదండ్రులు కూడా రావడం ఆసక్తిని రేకెత్తించింది. అయితే, రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇంకా పది నెలల సమయం ఉందంటూ ధోని వదంతులను కొట్టిపారేశాడు.PC: CSKఇదిలా ఉంటే.. ధోని తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడడన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా రాజ్ షమానీ షోలో మాత్రం మొదటిసారి తన బాల్యం, తమ తండ్రి గురించి ధోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ఆడంబరాలు లేవు‘‘మేము చిన్నపిల్లలుగా ఉన్నపుడు జీవితంలో అభద్రతా భావం అన్న మాటకు మాకు అర్థం తెలియదు. రోజులు అలా గడిచిపోతూ ఉండేవి. ఉన్నంతలో దేనికీ లోటు లేకుండా మా తల్లిదండ్రులు చూసుకునేవారు. ఆడంబరాలు లేవు. ఫోన్లు వగైరా లాంటివేమీ లేవు.అన్నయ్యతో పాటూ నేనూ అక్కడేమా కాలనీలోనే స్కూల్ ఉండేది. టీచర్లంతా చుట్టుపక్కలే ఉండేవారు. కాబట్టి ఎల్లప్పుడూ గంభీర వాతావరణమే ఉండేది. బద్మాషీ వేషాలు వేసేందుకు ఆస్కారమే లేదు. మా అన్నయ్యకు నాకు వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరమూ ఒకే స్కూల్‌కు వెళ్లేవాళ్లం.మా కుటుంబం గురించి టీచర్లందరికీ తెలుసు. అయితే, కాలనీలో ఆటలు మాత్రం బాగా ఆడేవాళ్లం. ఒకరోజు ఓడితే.. మరో రోజు గెలవాల్సిందే. అంతలా పట్టుదలకు పోయేవాళ్లం.నాన్నంటే భయం.. కానీఅయితే, నాన్నను చూస్తే మాత్రం నేను భయపడిపోయేవాడిని. ఆయన చాలా స్ట్రిక్ట్. క్రమశిక్షణతో ఉండేవారు. సమయపాలన ఎక్కువ. మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ కొట్టలేదు. తిట్టలేదు. కానీ ఆయనను చూస్తే చాలు భయం వేసేది.బహుశా.. అది ఆయన మీద ఒకరకమైన గౌరవమే అనుకుంటా . మా దోస్తులు చెట్లు ఎక్కుతూ, గెంతుతూ అల్లరి చేసేవాళ్లు. కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆ పనిచేయలేదు. బయట ఉన్నపుడు మా నాన్న ఒక్క చూపు చూశారంటే.. అక్కడి నుంచి మాయమయ్యే వాడిని.నిజానికి నాన్న ఏమీ అనేవారు కాదు. కానీ అంతే ఆయనంటే ఓ రకమైన భయం ఉండేది. ఆయన క్రమశిక్షణే నాకూ అలవడింది’’ అని ధోని తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా ధోని ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 76 పరుగులే చేశాడు. ఇక ఈ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్.. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మేటి కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్కేకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ధోని కుటుంబం ఇదేధోని తల్లిదండ్రులు దేవకీ దేవి- పాన్ సింగ్. అన్న నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా. ధోని భార్య సాక్షి సింగ్ ధోని, కుమార్తె జీవా సింగ్ ధోని. ధోని తండ్రి ఉక్కు పరిశ్రమలో జూనియర్ మేనేజర్‌గా పనిచేసేవారు. తల్లి గృహిణి.చదవండి: సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి: పంత్ గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్The loudest cheer, from the closest hearts! 💛#CSKvDC #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/upbKdG7DZe— Chennai Super Kings (@ChennaiIPL) April 6, 2025

అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. తాజాగా సొంత మైదానం వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముందు తలవంచింది. ఆఖరి వరకు పోరాడినా పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని.. కాబట్టి తాను బౌలర్లను నిందించబోనని స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ ఈరోజు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని హర్షం వ్యక్తం చేశాడు.జస్ప్రీత్ బుమ్రా రాకతో జట్టు మరింత పటిష్టంగా మారిందని.. అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం ముఖ్యమని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 64) దంచికొట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (19 బంతుల్లో 40 నాటౌట్)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్‌కు ఒక వికెట్ దక్కింది. అయితే, బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17) వికెట్లు కోల్పోయింది.తిలక్, హార్దిక్ పోరాటం వృథావిల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) కూడా నిరాశపరచగా.. తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) అద్భుత ఇన్నింగ్స్‌తో గెలుపు ఆశలు రేకెత్తించారు. అయితే, బెంగళూరు బౌలర్ల ప్రతాపం ముందు వీరు తలవంచకతప్పలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై.. 209 పరుగుల వద్ద నిలిచిపోయి.. పరాజయాన్ని ఆహ్వానించింది.రోహిత్ రావడం వల్ల అతడు లోయర్ ఆర్డర్లోఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పరుగుల వరద పారింది. వికెట్ చాలా బాగుంది. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. పిచ్‌ను చూసిన తర్వాత బౌలర్లను తప్పుపట్టడానికి ఏమీ లేదనిపించింది.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం జట్టుకు వెన్నెముక లాంటిది. గత మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో లేడు కాబట్టి నమన్ ధీర్ టాపార్డర్‌లో ఆడాడు. నమన్ బహుముఖ ప్రజ్ఞగల ఆటగాడు. అతడు ఏ స్థానంలోనైనా రాణించగలడు. రోహిత్ వచ్చాడు గనుక ఈసారి లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగాడు.తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడుతిలక్ వర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో అతడిని రిటైర్డ్ అవుట్‌గా వెనక్కి పిలిపించాలన్న మా కోచ్ నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నా. ఏదేమైనా పవర్ ప్లేలో పరుగులు రాబట్టడమే అత్యంత ముఖ్యం.ఈరోజు మధ్య ఓవర్లలోనూ మేము ఒకటి, రెండు సందర్భాల్లో గట్టిగా హిట్టింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. ఇక బుమ్రా జట్టులోకి రావడం.. మా టీమ్‌ను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతుందనడం అతిశయోక్తి కాదు.ఈరోజు తను బాగానే రాణించాడు. మా జట్టు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటుంది. మా ఆటగాళ్లకు మేము అండగా ఉంటాం. తప్పక అనుకున్న ఫలితాలు రాబడతాం’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025

సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న సమయంలో భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా (Ashish Nehra) తనకు మానసికంగా ధైర్యాన్నిస్తూ అండగా నిలిచాడని వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గుర్తు చేసుకున్నాడు. అతడి స్ఫూర్తిదాయక మాటలతో తాను ప్రతికూల పరిస్థితులను అధిగమించానని పంత్ అన్నాడు. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి‘కష్టకాలంలో ఒక సలహా నాపై బాగా ప్రభావం చూపించింది. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. నేను ఆడే స్థానిక క్లబ్లో కూడా సీనియర్. ఆయన నా వద్దకు వచ్చి నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నాడు.నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేస్తూ ఉండు. నేను కూడా గతంలో చాలా సార్లు గాయాలబారిన పడ్డాను. అయినా సరే అన్నీ మరచి ఆనందంగా ఉండటం ముఖ్యం అని నెహ్రా చెప్పాడు. నేను కోలుకునే క్రమంలో ఈ మాటలు బాగా ప్రభావం చూపించాయి’ అని పంత్ వివరించాడు. సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితిఒకటి, రెండు రోజుల్లోనే కోలుకోలేనని వాస్తవం అర్థమైన తర్వాత తనను తాను తిట్టుకోవడం మానేశానని, ప్రతికూల విషయాల గురించి ఆలోచించడం తగ్గించాలని పంత్ చెప్పాడు. కారు ప్రమాదం వల్ల తాను జీవితాన్ని చూసే విధానం మారిందని రిషభ్ పంత్ భావోద్వేగంతో అన్నాడు. ఇది క్రికెట్ గురించి తన ఆలోచనలను కూడా మార్చేసిందని భారత వికెట్ కీపర్ పేర్కొన్నాడు. ‘ప్రమాదం తర్వాత నేను చాలా చిన్న చిన్న పనులు కూడా సొంతంగా చేసుకోలేకపోయేవాడిని. సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితి. అంతా బాగున్నట్లు మనం ఇలాంటివి పట్టించుకోం. కానీ వాటి విలువ నాకు అప్పుడు అర్థమైంది.నా ఆలోచనా ధోరణి మారిందిక్రీడల్లో కూడా ప్రతి రోజూ బాగా ఆడాలనే కోరుకుంటాం. కానీ అది ఎప్పుడూ జరగదు. ఇలాంటి అంశాల్లో ప్రమా దం తర్వాత నా ఆలోచనా ధోరణి మారింది’ అని పంత్ వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్ ప్రదర్శన బాగా లేదు. అయితే తాను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నానని, పరిస్థితి మారుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్
బిజినెస్

ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలు
అమెరికా టారిఫ్‌ల దెబ్బతో ఆందోళన చెందుతున్న ఎగుమతి సంస్థలకు బాసటగా నిల్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొత్త మార్కెట్లను అన్వేషించడంలో వాటికి మరింత తోడ్పాటు అందించనుంది. అలాగే, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందేలా చూడటం, యూరోపియన్ యూనియన్‌తో పాటు బ్రిటన్, న్యూజిల్యాండ్ తదితర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలను వేగవంతం చేయడం తదితర చర్యలు తీసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.భారత్ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆ్రస్టేలియా, బ్రెజిల్ లాంటి 20 దేశాలతో వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎగుమతి సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సులభంగా రుణాలు లభించేలా చూడటం, ఇతర దేశాలు అమలు చేసే టారిఫ్యేతర చర్యలను ఎదుర్కొనడంలో సహాయాన్ని అందించడం మొదలైన వాటి కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీములను రూపొందిస్తోంది. 2023–24లో 119.71 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన అమెరికా, మన దేశంపై 26 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా ఉంటుంది.ఎల్రక్టానిక్స్ సంస్థల్లో ‘అతి’గా ఆందోళన లేదు..అమెరికా టారిఫ్‌లపై దేశీయ ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగ తయారీ సంస్థల్లో ప్రస్తుతానికైతే ‘అతి’గా ఆందోళనేమీ లేదని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. అయితే, మారిపోతున్న పరిస్థితుల మీదే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తయారీ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కృష్ణన్ వివరించారు. ఎల్రక్టానిక్స్ విభాగంలో పోటీదేశాలతో పోలిస్తే తాము కొంత మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌ల వల్ల అమెరికాకు హార్డ్‌వేర్ ఎగుమతులపై ప్రభావం పడినా, ఆసియాలోని మిగతా తయారీ హబ్‌లతో పోలిస్తే సుంకాల భారం తక్కువే ఉండటం మనకు కొంత సానుకూలాంశమని టెలికం పరికరాల తయారీ సంస్థ జీఎక్స్ గ్రూప్ సీఈవో పరితోష్ ప్రజాపతి తెలిపారు.దిగుమతులపై ఫోకస్..సుంకాల మోతతో ఇతర దేశాల నుంచి భారత్‌లోకి దిగుమతులు వెల్లువెత్తే అవకాశాలను కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాలో టారిఫ్‌ల కారణంగా అక్కడికి ఎగుమతి చేయాల్సిన ఉత్పత్తులన్నింటినీ చైనా తదితర దేశాలు భారత్‌కు మళ్లించవచ్చని భావిస్తున్నారు. వీటిని సమీక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో వాణిజ్య శాఖ, రెవెన్యూ శాఖ, పారిశ్రామిక ప్రోత్సాహం..అంతర్గత వాణిజ్య విభాగానికి (డీపీఐఐటీ) చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. జూన్, జులై నుంచి దిగుమతులు ఒక్కసారిగా పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇదీ చదవండి: టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!కన్జ్యూమర్ గూడ్స్, ఎల్రక్టానిక్స్, రసాయనాలు, ఉక్కు మొదలైనవి వెల్లువెత్తవచ్చని భావిస్తున్నారు. దిగుమతులు పెరుగుదల, దేశీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపై తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయా శాఖలు, పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వం సూచించింది. భారత్ నుంచి మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 4 శాతమే అయినప్పటికీ దిగుమతుల్లో మాత్రం 15 శాతంగా ఉంటోంది. 2023–24లో చైనాకు భారత్ ఎగుమతులు 16.65 బిలియన్ డాలర్లుగా ఉండగా దిగుమతులు 101.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు ఉంటే, చైనాతో మాత్రం ఏకంగా 85 బిలియన్ డాలర్ల లోటు ఉంది.

టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!
న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్ వార్ సెగ అన్ని దేశాలకూ గట్టిగానే తగులుతోంది. అయితే భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాం తదితర పోటీ దేశాలపై అధిక సుంకాలు విధించడం మన టాయ్ పరిశ్రమ దీన్ని సదావకాశంగా మలుచుకోవడానికి సిద్ధమవుతోంది. ఇతర దేశాల సంస్థలతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు ద్వారా తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు దేశీ కంపెనీలు ఇప్పటికే పని మొదలు పెట్టాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఇతర దేశాలపై అధిక టారిఫ్‌ల ప్రభావంతో మన ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుందని, దీంతో ఈ వాణిజ్య యుద్ధంలో భారత్ విజయం సాధించనుందని కూడా వారు అంటున్నారు.ఆసియాలో చైనాపై 54 శాతం, బంగ్లాదేశ్‌పై 37 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం, ఇండోనేషియాపై 32 శాతం చొప్పున ట్రంప్ భారీగా సుంకాలను వడ్డించిన సంగతి తెలిసిందే. భారత్‌పై మాత్రం 26 శాతం టారిఫ్‌లతో సరిపెట్టారు. ‘ఇది మనకు భారీగా అవకాశాలను అందించనుంది. ఎందుకంటే వియత్నాం 6 బిలియన్ డాలర్లు, చైనా 80 బిలియన్ డాలర్ల చొప్పున ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. భారతీయ టాయ్స్‌తో పోలిస్తే వారి వస్తువులకు అధిక సుంకాలు పడతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బడా టాయ్ సంస్థలన్నీ భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నాయి’ అని ప్లేగ్రో టాయ్స్ ఇండియా సీఈఓ మను గుప్తా పేర్కొన్నారు.34.8 కోట్ల డాలర్ల ఎగుమతులు..పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లుగా భారత్ నుంచి 32.6–34.8 కోట్ల డాలర్ల విలువైన టాయ్ ఎగుమతులు జరుగుతున్నాయి. అమెరికాతో వీలైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారతీయ టాయ్ సంస్థలు యూఎస్‌కు తమ ఎగుమతులను పెంచేందుకు దోహదం చేస్తుందని కూడా గుప్తా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఇప్పుడు రంగాల వారీగా పాలసీలను రూపొందిస్తున్నాయన్నారు. కాగా, బడ్డెట్లో టాయ్ పరిశ్రమ కోసం ప్రకటించిన జాతీయ యాక్షన్ ప్లాన్ ఈ రంగానికి మరింత దన్నుగా నిలవనుందని సన్లార్డ్ గ్రూప్ ప్రమోటర్ అమితాభ్ ఖర్బందా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అప్పుల కుప్పలుగా రాష్ట్రాలుఇతర దేశాల ఆధిపత్యంతో భారత్ అనేక ఏళ్లుగా నికర టాయ్స్ దిగుమతిదారుగానే కొనసాగుతోంది. గడిచిన దశాబ్దకాలానికి పైగా చైనా పైనే పూర్తిగా ఆధారపడుతూ 76 శాతం మేర టాయ్స్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. 2012–13లో భారత్ చైనా నుంచి 21.4 కోట్ల డాలర్ల టాయ్స్ దిగుమతి చేసుకోగా, 2023–24లో ఇది 4.16 కోట్ల డాలర్లకు దిగొచి్చంది. అంటే దాదాపు 94 శాతం దిగుమతలు కాస్తా, 64 శాతానికి తగ్గాయి. అంతర్జాతీయ టాయ్ మార్కెట్లో భారత్ పోటీతత్వానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రపంచ మార్కెట్లు కుదేల్
ట్రంప్ సుంకాల విధింపు ‘అంచనాలకు మించి’ ఉన్నాయంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొంటూ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ట్రంప్ టారిఫ్ విధించిన తర్వాత అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలను 60%కు పెంచింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా మార్కెట్లు ఢమాల్ అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్‌ల బాంబ్‌తో గత వారాంతంలో భారీ నష్టాల మూటగట్టుకున్న సూచీలు.. తాజా సోమవారమూ భారీ నష్టాలబాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే యూఎస్ మార్కెట్ 5% మేర కుదేలైంది. భారత వర్తమాన కాలం ప్రకారం రాత్రి 10 గంటలకు నాస్డాక్ ఒకటిన్నర నష్టంతో 15,366 వద్ద, డోజోన్స్ రెండున్నర శాతం క్షీణతతో 37,462 వద్ద, ఎస్అండ్పీ 2% పతనంతో 4,993 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇటీవల గరిష్టం నుంచి 20 శాతానికి పైగా క్షీణించి నాస్డాక్ శుక్రవారం అధికారికంగా ‘బేర్ మార్కెట్’ జోన్లో ప్రవేశించింది.

మార్కెట్లు భగ భగ
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్... ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న భగభగలు చల్లారటం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా... చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్లు కనిపించినా ఈ ట్రేడ్ వార్ భయాలతో మళ్లీ భారీ పతనం దిశగా కదిలాయి. మరోవంక ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం భారీ పతనాన్ని చూశాయి. సెన్సెక్స్ ఆరంభంలో 4 వేల పాయింట్ల వరకూ నష్టపోయినా చివరకు కాస్త కోలుకుని 2,226.79 పాయింట్లు (–2.95%) క్షీణించి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (–3.24%) పడిపోయి 22,160 వద్ద ముగిసింది. ఈ పతనంతో రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనంఅవుతున్నాయి. మరోవైపు హాంకాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ 15% నష్టపోగా... తైవాన్ వెయిటెడ్ 11%, జపాన్ నికాయ్ 8%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 8%, చైనా షాంఘై 7% చొప్పున నష్టపోయాయి. యూరప్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లను బేర్ చీల్చిచెండాడింది. ఆసియా నుంచి అమెరికా దాకా బ్లాక్ మండే దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలయ్యారు. అమెరికా సుంకాలకు చైనా ప్రతీకార టారిఫ్‌లు విధించడం.. ఇతర దేశాలూ అదే బాటలో వెళ్తుండటంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చనే భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్‌పైనా విరుచుకుపడింది. ఫలితంగా భారత స్టాక్ సూచీలు పది నెలల్లో (2024 జూన్ 4 తర్వాత) అతిపెద్ద నష్టాన్ని చూశాయి. సెన్సెక్స్ 2,227 పాయింట్లు క్షీణించి 73,138 వద్ద, నిఫ్టీ 743 పాయింట్లు నష్టపోయి 22,162 వద్ద నిలిచింది. ఈ క్రాష్‌తో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్ల (4.54 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ఒకానొక దశలో సంపద రూ.20.16 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ముంబై: గత వారాంతంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో సోమవారం ఆసియా మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఆ సెగతో మన సూచీలు కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 3,915 పాయింట్ల క్షీణతతో 71,450 వద్ద, నిఫ్టీ 1,146 వద్ద పతనంతో 21,758 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 3,940 పాయింట్లు, నిఫ్టీ 1160 పాయింట్లు దిగజారాయి. జాతీయ, అంత్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో రోజంతా భారీ నష్టాల్లో కదలాడాయి. అయితే కనిష్టాల వద్ద కొన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత భర్తీ అయ్యాయి.→ సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్‌యూఎల్ (0.25%) మినహా మిగిలిన 29 షేర్లు నష్టాలు చవిచూశాయి. రంగాల వారీగా సూచీల్లో మెటల్ 6.22%, రియల్టీ 5.69%, కమోడిటీస్ 4.68%, ఇండ్రస్టియల్ 4.57%, కన్జూమర్ డి్రస్కేషనరీ 4%, ఆటో 3.77%, బ్యాంకెక్స్ 3.37%, ఐటీ, టెక్ మూడు శాతాలు క్షీణించాయి. బీఎస్ఈలో 3,515 షేర్లు నష్టపోయాయి. 570 స్టాక్స్ లాభపడ్డాయి. మిగిలిన 140 షేర్లలో ఎలాంటి మార్పుల్లేవు. 775 స్టాక్స్ ఏడాది కనిష్టాన్ని , 59 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి.ఐటీ షేర్లు.. హాహాకారాలు... ఆర్థిక మాంద్య భయాలతో అమెరికా నుంచి అధిక ఆదాయాలు ఆర్జించే ఐటీ షేర్లు భారీ క్షీణించాయి. ఆన్వర్డ్ టెక్నాలజీస్ 14%, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ 11% క్షీణించాయి. క్విక్ హీల్ టెక్నాలజీస్ 10%, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సరీ్వసెస్, డేటామాటిక్స్ గ్లోబల్ సరీ్వసెస్ 9%, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ 8%, హ్యాపియెస్ట్ మైండ్స్, సొనాటా సాఫ్ట్వేర్, టాటా టెక్నాలజీ, ఎంఫసిస్ 6% క్షీణించాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్ 4%, హెచ్‌సీఎల్ టెక్ 3%, టెక్ మహీంద్రా 2.50%, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 2%, విప్రో ఒకశాతం, టీసీఎస్ అరశాతంనష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో 8 శాతం క్షీణించింది.టాటా.. టప టపా!టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్స్ రంగాల్లో అధిక భాగం వ్యాపారాలు కలిగిన టాటా గ్రూప్ షేర్లు డీలా పడ్డాయి. టాటా ట్రెంట్ షేరు 15%, టాటా స్టీల్ 9%, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీ 6%, టీసీఎస్, టాటా కెమికల్స్, టైటాన్, ఇండియన్ హోటల్స్ షేర్లు 5–2% నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 16 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.90,000 కోట్లు హరించుకుపోయి రూ.25.3 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఒకానొక దశలో రూ.2.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది.అప్రమత్తత అవసరం: నిపుణులుతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పట్టకీ.., ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగా ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చు. రక్షణాత్మక రంగాల్లో పెట్టుబడి మరీ మంచిది అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యూహకర్త వి.కే. విజయ్‌కుమార్ తెలిపారు.
ఫ్యామిలీ

WorldHealthDay ఇది రెండో రౌండ్, అయినా యుద్ధమే!
నటి, దర్శకురాలు తహిరా కశ్యప్ (Tahira Kashyap) ఆరోగ్యం మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతంలో బ్రెస్ట్ కేన్సర్‌ను ఓడించిన ఈ యోధురాల్ని మహమ్మారి ఇంకా వదల్లేదు. మళ్లీ తాను బ్రెస్ట్ కేన్సర్ (Breast Cancer) బారిన పడినట్టు నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా భార్య తహిరా కశ్యప్ వెల్లడించింది. రొమ్ము కేన్సర్ మళ్లీ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో సహా పలువురు స్పందించారు. ఈ సారి కూడా ఈ వ్యాధి నుంచి బైటపడతావంటూ ధైర్యం చెప్పారు.తనకు మళ్లీ కేన్సర్ సోకిందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్యం దిన రోజున తన అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కి తహిరా క్యాప్షన్ ఇచ్చింది:"ఏడేళ్ల బాధలు, రెగ్యులర్ చెకప్‌లు.. మామోగ్రామ్లు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికీ అదే చెప్తూ ఉంటా... అయినా నాకు రౌండ్ 2...సోకింది అని తెలిపింది. అయినా తాను మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, ఈ వ్యాధితో పోరాడటానికి తాను నిశ్చయించుకున్నానని తెలిపింది. నాకు మళ్లీ కేన్సర్ వచ్చింది అని ప్రకటించడానికి మొహమాటం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య దినం రోజున ఇలా చెప్పడం బాధాకరమే. కానీ మన ఆరోగ్య సంరక్షణ గురించి మనం చేయ గలిగినంత చేద్దాం’ అంటూ పేర్కొంది. జీవితం నిమ్మకాయలు ఇచ్చినప్పుడు, నిమ్మరసమే తయారు చేసుకోవాలి. జీవితం గాడిన పడుతున్న సమయంలో మళ్లీ తిరగబెట్టినపుడు, దాన్ని కాలా ఖట్టా డ్రింక్‌లో దాన్ని పిండుకొని తాగడమే. ఎందుకంటే అది మంచి పానీయం. రెండోసారి కూడా నీకు కూడా మేలు జరుగుతుంది అంటూ రాసు కొచ్చింది"నా హీరో" అంటూ భార్య పోస్ట్‌పై ఆయుష్మాన్ ఖుర్రానా స్పందించగా, తాహిరా మరిది అపరశక్తి ఖురానా, "బిగ్ టైట్ హగ్ బాబీ! అని, మోర్ పవర్టూయూ అని మరొకరు, "నువ్వు దీన్ని కూడా గెలుస్తావు! మీ కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తా.. నీకు మరింత శక్తి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం దానిని ఎదుర్కోవడానికి ఉత్తమమైన మార్గాల్లోఒకటి అని తహిరా విశ్వాసం. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా తన పోరాటాలు ,చికిత్స ప్రయాణం గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజు కీమో థెరపీ దుష్ప్రభావంతో జుట్టు ఊడిపోయి గుండుగా మారిన పోటోతో మరో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పంచుకుంది.‘టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ ’ సహా అనేక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత్రి తహిరా కశ్యప్ .2018లో తహిరాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం కోలుకుంది. కీమోథెరపీ సమయంలో తన అనుభవాలను, బాధలతోపాటు, ఈ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచు కుంది. ‘‘శర్మ జీ కి బేటి" తో బాలీవుడ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసినటిగా తన ప్రతిభను చాటుకుంటోంది. ప్రకటించింది. ఇంతలోనే బ్రెస్ట్‌కేన్సర్ ఆమె సాహసానికి సవాల్ విసిరింది. యుద్ధంలో గెలవడానికి తాను సిద్ధంగా ఉన్నాననిగతంలో ప్రకటించిన మరీ కేన్సర్‌నుంచి బయటపడిన తహిరా ఇపుడు కూడా అదే నిబ్బరాన్ని ప్రకటించింది. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబం స్నేహితులు అందరూ ఆమెకు అండగా నిలిచారు. అదే ధైర్యంతో ఈ వ్యాధినుంచి బైట పడి, విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap)

వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్సీడీ–3.0 ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్‌తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు. బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. గుండె ప్రధానం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్‌డబ్‌మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి... శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్‌గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం)

పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి.

Bill Gates : రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్!
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని ఎంతో తాపత్రయంతో సంపాదిస్తుంటారు. కోట్లకొద్దీ ఆస్తులను కూడబెడుతుంటారు. ఒకవేళ పిల్లలకు చదువు అబ్బకపోయినా..ఏ చీకు చింతా లేకుండా దర్జాగా కూర్చుని తినాలనుకుంటారు. చాలామటుకు ధనవంతులైన తల్లిదండ్రులు ఇలానే ఆలోచిస్తుంటారు. కూర్చొని తింటే కొండలైనా కరిపోతాయనే పెద్దల నానుడిలా వారసత్వ సంపద, ఆస్తులు ఏరోజుకైనా కరిగిపోక మానవు. అవేమి వారికి బతికే స్థైర్యానివ్వవు. కేవలం వాళ్ల కాళ్లమీద నిలబడి బతకగలిగే సామర్థ్యమే..పిల్లలకు శ్రీరామ రక్ష అనేది జగమెరిగిన సత్యం. ఆ సిద్ధాంతాన్నే విశ్వసిస్తానంటున్నారు ప్రపంచ కుభేరులలో ఒకరైన, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. అంతేగాదు ఇదేం రాజులనాటి కాలం కాదు..ప్రతిదీ వారసత్వంగా తీసుకోవడానికి అని ప్రశ్నిస్తున్నారాయన. పిల్లల్ని ప్రయోజకులుగా చేయండి చాలు అంటున్నారు బిల్‌గేట్స్. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల 'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ' పాడ్‌కాస్ట్‌లో పిల్లల పెంపకం, వారి అభ్యున్నతికి సంబంధించి అమూల్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులు సృష్టించిన సంపదను వారసత్వంగా పొందడం కంటే స్వయంగా సక్సెస్ అవ్వడానికి మొగ్గు చూపేలా చేయాలి. అదే వారి అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. పిల్లలు ఉన్నత స్థానంలో ఉంచడటం కాదు..ఉన్నతంగా ఆలోచించేలా పెంచాలి. తాతలు, తండ్రుల ఆస్తులు వారసత్వంగా పొందడం కాదు..వాళ్ల ఐడెంటిటీతో బతికి.. స్వయంగా సంపాదించేలా ఎదగనివ్వాలంటున్నారు. పిల్లలను ప్రయోజకులగా తీర్చిదిద్దడం అంటే ఇదేనని నొక్కి చెప్పారు. అంతేగాదు బిల్‌గేట్స్ తన ముగ్గురు పిల్లలు కూడా తన సంపదలో కేవలం ఒక్క శాతం ఆస్తికి మాత్రమే అర్హులని అన్నారు. సంపన్న కుటుంబాలు తమ పిల్లల ఎదుగుదల కోసం స్వయంకృషికే పెద్దపీటవేయాలన్నారు. వారికి మంచి చదువు, వసతులను అందిస్తే చాలు..పైకి రావాల్సిన బాధ్యత వారిదేనని చెప్పారు. అలా చేస్తేనే డబ్బు విలువ, కష్టం గొప్పదనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులుగా మన పిల్లలపై మనకు అపారమైన ప్రేమ ఉంటుదనేది కాదనలేని సత్యం. కానీ ఆ ప్రేమ వారి ఎదుగుదలను కుంటుపడేలా చేయకూడదు. తమ పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యి..సమున్నత స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. వారు ఎదిగేందుకు అవకాశాలివ్వండే తప్ప ప్రతీది మనమే అమర్చిపెట్టేయకూడదని హితవు పలకారు. అలాగే వాళ్లకు ఇది తమతల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి.. తమది కాదనే భావన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశించడం అనే రోగం బారినపడకుండా పెంచాలని చెప్పారు. ఇక బిల్గేట్సకి తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్‌తో రోరీ గేట్స్, జెన్నిఫర్ గేట్స్ నాసర్, ఫోబ్ గేట్స్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఆయన రూ. 13 లక్షల కోట్ల సంపాదనలో కేవలం ఒక్కశాతం మాత్రమే తన పిలల్లకు వాటా ఉంటుందని అన్నారు. తన పిల్లలు తండ్రికి ఉన్నంత సంపదను కలిగి ఉండకపోయినా.. ప్రపంచ జనాభాలో ఒక శాతం మంది ధనవంతుల సరసన ఉంటారన్నారు. తన మిగతా సంపాదనంతా ఫౌండేషన్‌కి వెళ్లిపోతుందని, అర్హులైన వాళ్లకు దక్కుతుందన్నారు. ఇలా బిల్‌గేట్స్‌లా వారసత్వ సంపదను అందించకూడదన్న జాబితాలో ఆపిల్ కంపెనీకి చెందిన దివంగత స్టీవ్ జాబ్స్, అమెజాన్ కంపెనీకి చెందిన జెఫ్ బెజోస్ వంటి అనేక మంది ప్రముఖ టెక్ దిగ్గజాలు ఉన్నారు. వారంతా కూడా వారసత్వ సంపదను సృష్టించడం పట్ల మక్కువ చూపలేదు..తమ పిల్లలు తమ ఐడెంటిటీతో ఎదగాలని భావించారు. నిజంగా ఇది ప్రతి తల్లదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కదూ..! (చదవండి: Weight loss Surgery: బరువు తగ్గాలని సర్జరీ చేయించుకుంది..పాపం ఆ మహిళ..!)
ఫొటోలు


వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


మ్యాడ్‌డాక్ ప్రొడక్షన్ 20 ఇయర్స్ సక్సెస్ పార్టీలో మెరిసిన తారలు (ఫొటోలు)


భీమవరం విష్ణు కాలేజీలో ‘జాక్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)


Allu Arjun: ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుట్టినరోజు.. మధురమైన జ్ఞాపకాలు (ఫోటోలు)


భద్రాచలం : వైభవోపేతంగా రామయ్యకు పట్టాభిషేకం (ఫొటోలు)


రోమ్ వెళ్లారు.. మహేశ్ ని మాత్రం దాచేశారు (ఫొటోలు)


నేచురల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నటి కాయాదు లోహర్ గ్లామరస్ (ఫొటోలు)


ఓర చూపు, మైమరపించే అందాలతో మాయ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్


సన్‌రైజర్స్ vs గుజరాత్ మ్యాచ్‌లో సందడి చేసిన సినీనటి సౌమ్యజాను (ఫోటోలు)


పసలేదు బ్రో.. సన్‌రైజర్స్ ఆట తీరుపై అభిమానుల నిరాశ (ఫొటోలు)
అంతర్జాతీయం

Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు.

సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
టోక్యో: జపాన్‌లో హెలికాప్టర్ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెడికల్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురిని సహాయక బృందాలు రక్షించాయి. మృతిచెందిన వారిలో వైద్యుడి కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. జపాన్‌లో సాధారణంగా డాక్టర్ హెలికాప్టర్ అని పిలువబడే విమానం Medevac EC-135 ప్రమాదానికి గురైంది. ఆదివారం నాగసాకి ప్రిఫెక్చర్‌లోని విమానాశ్రయం నుండి ఫుకుయోకాలోని ఆసుపత్రికి రోగులను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. నైరుతి జపాన్ ప్రాంతంలోని సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన జపాన్ కోస్ట్ గార్డ్, సహాయక బృందాలు ముగ్గురిని కాపాడారు.అనంతరం, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన వారిలో వైద్య వైద్యుడు కీ అరకావా (34), రోగి మిత్సుకి మోటోయిషి (86), ఆమె సంరక్షకురాలు కజుయోషి మోటోయిషి (68) ఉన్నారని అధికారులు తెలిపారు. తరువాత వారి మృతదేహాలను జపాన్ ఎయిర్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా నీటి నుండి వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన వారిలో హెలికాప్టర్ పైలట్ హిరోషి హమడ (66), మెకానిక్ కజుటో యోషిటకే, నర్సు సకురా కునిటకే(29) ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు హైపోథర్మియాకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. #Breaking A Medevac EC-135 crashed off Nagasaki (Japan). 3 of 6 aboard died. Helicopter had been missing east of Tsushima island, found floating upside fown near Iki island. Helicopter [Registration “JA555H”] was operated by “SGC Saga Aviation opf Fukuoka Wajiro Hospital” pic.twitter.com/M5J4t7vf0H— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) April 6, 2025

టారిఫ్‌లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల విధింపు నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలపై ట్రంప్ స్పందించారు. సుంకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.ఈ తరుణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో.. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించే సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని నేను అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అది ఎంత కష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం వల్ల బాధపడినా సరే. వెనక్కి తగ్గకూడదని అన్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగసోమవారం పునఃప్రారంభం అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ క్రాష్ అవుతాయన్న అంచనాల నడుమ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుంకాల విధింపుపై నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు తన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోందని చెప్పారు. సుంకాల విధింపు తర్వాత అమెరికాతో వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 50కి పైగా దేశాలు తమని సంప్రదించాయని వెల్లడించారు. ‘టారిఫ్ విధింపుపై యూరోప్, ఆసియా ఇతర దేశాది నేతలతో మాట్లాడాను. యాభైకి పైగా దేశాలు వ్యాపార, వాణిజ్యం విషయంలో అమెరికా ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. మీ దేశం మా దేశంతో చేసే వాణిజ్యంలో ఎలాంటి లోటు ఉండకూడదు. లోటు ఉంటే మాకు నష్టమే. మేం లాభాల్ని ఆశించడం లేదు. అటు నష్టం, ఇటు లాభం కాకుండా సమతూల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారితో చెప్పామని, అందుకు వారు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. టారిఫ్ విధింపు తర్వాత మాతో వ్యాపారం, వాణిజ్యం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని తెలిపారు.
జాతీయం

బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్(Prasanna Sankar) దంపతులు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్.. తన భర్తే పెద్ద కా*పిశాచి అని దివ్యా శశిథర్(Dhivya Sashidhar) పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాండ్స్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రసన్నపై దివ్య సంచలన ఆరోపణలకు దిగింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్‌కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే అన్నట్లు చూసేవాడని తెలిపింది. ‘‘కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా నాతో బలవంతంగా సెక్స్ చేశాడు. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. బాత్రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవాడు. రోజూవారీ కార్యకలాపాల సమయంలో చిత్రీకరించేవాడు. సంపదపై పన్నులు పడొద్దని నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడు. .. ఒక వేళ నాతో శృంగారంలో పాల్గొనకుంటే, బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడు. తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అనూప్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు. భావోద్వేగమైనది మాత్రమే’’ అని ఆ ఇంటర్వూ్యలో తెలిపారామె. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలే అని ఖండించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది.

సైలెంట్ ఎపిడెమిక్: లక్షణాలు కనిపించకున్నా లక్షల మందిలో..
హైదరాబాద్: మన దేశంలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో జీవిస్తున్నారు. ఈ ‘నిశబ్ధ మహమ్మారి’ గురించి హెల్త్ ఆఫ్ ది నేషన్-2025 (Health Of The nation 2025) పేరిట అపోలో హాస్పిటల్స్(Apollo Hospitals) తన ఐదవ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఇందులో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు వెల్లడయ్యాయి. "లక్షణాల కోసం ఎదురుచూడకండి.. నివారణ ఆరోగ్యాన్ని మీ ప్రాధాన్యతగా చేసుకోండి"(Don't wait for symptoms--make preventive health your priority) అనే సందేశంతో ఈ నివేదికను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షించి దీన్ని రూపొందించారు. ఈ నివేదిక మూడు అత్యవసర ఆరోగ్య సవాళ్లపై దృష్టి సారించింది. కొవ్వు కాలేయ వ్యాధి, ఋతుస్రావం ఆగిన తర్వాత ఆరోగ్య క్షీణత, చిన్నారుల స్థూలకాయం రిపోర్ట్ అనే అంశాలు ఇందులో ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 26% మంది రక్తపోటు సమస్యతో, 23% మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. అయినప్పటికీ వారికి ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. 2019లో 10 లక్షల మంది ఆరోగ్య పరీక్షలు చేసుకోగా 2024లో 25 లక్షల మంది హెల్త్ టెస్టులు జరుపుకున్నారు. అంటే వీరి సంఖ్య ఐదేళ్లలో దాదాపు 150% వృద్ధి చెందిదన్నమాట. ఇది ప్రజల్లో నివారణ ఆరోగ్యం పట్ల అవగాహన, ఆసక్తి పెంచుతోందని తెలియజేస్తోంది. ఏపీ + తెలంగాణ డేటా24% వ్యక్తుల్లో రక్తపోటు (హైపర్‌టెన్షన్) లక్షణాలు గుర్తించబడ్డాయి82% మంది అధిక బరువు-ఊబకాయంతో బాధపడుతున్నారు81% మందికి విటమిన్ D లోపం ఉందిదాదాపు 47% మందిలో గ్రేడ్ I ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపించాయి. ఇది మొదటి దశలో ఉండే సమస్య, మెటబాలిక్ అసమతుల్యతలకు, అధిక బరువుకు సంబంధించినది27% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు, ఇది ముఖ్యంగా ఐరన్-సమృద్ధ ఆహారాల్లో లోటును సూచిస్తోంది83% మంది శారీరక కార్యాచరణలో తగ్గుదల వల్ల సడలింపు (ఫ్లెక్సిబిలిటీ) లోపం ఉన్నట్లు గుర్తించబడింది.ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాలను సృష్టించేందుకు భారత్ ముందుకు రావాలి. ప్రతి ఇల్లు ఆరోగ్య కేంద్రంగా మారాలి. నివారణ ఆరోగ్య సంరక్షణ ఇకపై భవిష్యత్ ఆకాంక్ష కాదు. ఈ నివేదిక మన బాధ్యతను తెలియజేస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేసే అంశాలను విద్యార్థులకు బోధించాలి. ఆరోగ్యాన్ని కూడా కుటుంబ దినచర్యల్లో భాగం చేయాలి. అప్పుడే వ్యాధుల చికిత్స నుండి ఆరోగ్య సంరక్షణకు మారగలం, రాబోయే తరాలకు దృఢమైన, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని అందించగలం.:::అపోలో చైర్మన్ ప్రతాప రెడ్డిఆరోగ్య పరీక్షలు జరిపిన వారిలో 66% మందికి కొవ్వు కాలేయం సమస్యలు ఉండగా.. వారిలో 85% మంది మద్యానికి దూరంగా ఉన్నారనే ఆసక్తికరమైన సంగతిని ఎండీ సునీతా రెడ్డి వెల్లడించారు.

యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు

World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
రాజకీయ నాయకుల ప్రధాన విధి.. ప్రజలకు సేవ చేయడం. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలంటే.. వాళ్లూ ఆరోగ్యంగా ఉండాల్సిందే. అప్పుడే పరిపూర్ణంగా.. విరామం ఎరగకుండా తమ కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ముఖ్య కారణాలు.. ఇంతకీ వీళ్ల ఆరోగ్యం దేశానికి ఎలా మహాభాగ్యమో ఓసారి పరిశీలిద్దాం..బిజీ షెడ్యూల్: నాయకులు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి శ్రమిస్తుంటారు. అలాగని.. ఆరోగ్యంగా ఉంటేనే వారు దీర్ఘకాలం సేవ చేయగలుగుతారు.నిరంతర ప్రయాణాలు: స్థల మార్పులు, వేళకి తగినపుడు ఆహారం పొందకపోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సరైన జీవనశైలి పాటించడం(టైం టు టైం తినడం లాంటివి..) ద్వారా దీన్ని నివారించగలుగుతారు.ఇమ్యూనిటీ బూస్ట్: రాజకీయ నేతలు ఎడతెరిపిలేని పర్యటనల్లో పాల్గొంటారని చెప్పుకున్నాం కదా. ఈ క్రమంలో రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి మంచి ఆహారం.. ఆరోగ్యపు అలవాట్లు పాటిస్తే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.మానసిక ఒత్తిడి: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే.. తీవ్ర ఒత్తిడికి గురైనట్లే. ధ్యానం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ప్రధాన ఆరోగ్య సమస్యలుగుండె సంబంధిత వ్యాధులు: అధిక ఒత్తిడి కారణంగా గుండెపోటు సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి.మధుమేహం : భోజన అలవాట్ల వల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది.హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు): చురుకైన రాజకీయ జీవితం వల్ల అధిక రక్తపోటుకి గురవుతారు.నిద్రలేమి: నిత్యం మీటింగులు, ప్రణాళికలు కారణంగా తగిన నిద్ర పొందలేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు..ఆహార నియంత్రణ : అధిక పిండి పదార్థాలు, కొవ్వు తగ్గించి.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవడం.నియమిత వ్యాయామం : రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం.ఆరోగ్య పరీక్షలు: ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం.నిద్ర-విశ్రాంతి: రోజుకు 7-8 గంటల నిద్ర పోవడం.. వీలు చిక్కినప్పుడు విశ్రాంతి తీసుకోవడం. మరీ వీలైతే కుటుంబ సభ్యులతో సమయం గడపడం.ఒత్తిడి నిర్వహణ : ధ్యానం, యోగా, స్మార్ట్ డిజిటల్ డిటాక్స్(స్మార్ట్ ఫోన్లకు కొంతకాలం దూరంగా ఉండడం) వల్ల ఒత్తిడి తగ్గుతాయి.నేతలు తమ ఆరోగ్యం కాపాడుకోవడం.. వాళ్ల సామాజిక బాధ్యత. ఆరోగ్యమున్న నాయకులే సమర్థవంతంగా దేశానికి సేవ చేయగలరు. అదే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. అది ప్రభుత్వ విధానాల మీద ప్రతికూల ప్రభావం చూపించగలదు. ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రజలకు శ్రద్ధగా సేవ చేయగలరు. ఆరోగ్యమే నిజమైన సంపద.. ఈ సందేశాన్ని ఈ World Health Day 2025 సందర్భంగా ప్రతీ నాయకుడు గుర్తించాలి!.
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

మియాపూర్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్‌లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జనవరి 12న నగరానికి రాక... బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్‌లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్‌కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు. మూడు రోజుల పాటు రెక్కీ... బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్‌ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్‌లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్‌కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్‌లో ఉండటంతో పటిష్ట నిఘా... ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు.

కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్..!
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరచూ ఆమె ఇలాగే బయటకు వెళ్లి వస్తూంటుంది. కానీ, ఈసారి అలా జరగలేదు. దీంతో, కుటుంబసభ్యులు ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. అనంతరం ఆమెను దగ్గర్లోని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత సొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిలో కొందరు మైనర్లు అయినందున పోలీసులు వీరి పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. అయితే, బాధితురాలు కానీ, ఆమె కుటుంబం కానీ లైంగిక దాడి జరిగినట్లుగా ఏప్రిల్ 4న ఫిర్యాదు అందించలేదని డీసీపీ చంద్రకాంత్ మీనా తెలిపారు. అత్యాచారం జరిగిందంటూ వారు ఈ నెల 6వ తేదీన మాత్రమే ఫిర్యాదు చేశారని, దర్యాప్తు పురోగతిలో ఉందని ఆయన వివరించారు.

సహజీవనం చేసే వాడే చంపేశాడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.

బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్(Prasanna Sankar) దంపతులు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్.. తన భర్తే పెద్ద కా*పిశాచి అని దివ్యా శశిథర్(Dhivya Sashidhar) పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాండ్స్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రసన్నపై దివ్య సంచలన ఆరోపణలకు దిగింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్‌కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే అన్నట్లు చూసేవాడని తెలిపింది. ‘‘కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా నాతో బలవంతంగా సెక్స్ చేశాడు. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. బాత్రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవాడు. రోజూవారీ కార్యకలాపాల సమయంలో చిత్రీకరించేవాడు. సంపదపై పన్నులు పడొద్దని నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడు. .. ఒక వేళ నాతో శృంగారంలో పాల్గొనకుంటే, బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడు. తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అనూప్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు. భావోద్వేగమైనది మాత్రమే’’ అని ఆ ఇంటర్వూ్యలో తెలిపారామె. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలే అని ఖండించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది.
వీడియోలు


జన సందోహాన్ని చూసి చంద్రబాబు గుండె గుబేల్


Majji Srinivasa Rao: విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసిన పవన్..


LIVE: రాప్తాడు లో కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ


రాజకీయా కక్షతోనే ... నిజాలు బయటపెట్టిన లింగమయ్య కుటుంబం


Perni Kittu: సొల్లు కబుర్లు వద్దు ఇంటి నుంచి బయటికి రండి


పెద్ది ఫస్ట్ షాట్ కే దేవర రికార్డు అవుట్


టాలీవుడ్ రూపురేఖలు మార్చబోతున్న బన్నీ 3000 కోట్లు ఫిక్స్


Raptadu Tour: వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు


ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మొర్రో అంటే..వైద్యం చిట్కాలు చెప్తున్న చంద్రబాబు


Cylinders Price: సామాన్యుల నెత్తిపై గ్యాస్ బండ