Eastern Fleet
-
ఆంధ్రా సిగలో ‘అణు’ ఖ్యాతి
ఆంధ్రప్రదేశ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడు శ్రుతి మించుతున్న తరుణంలో డ్రాగన్ జోరుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ నడుం బిగిస్తోంది. తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖపట్టణానికి దక్షిణంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాంబిల్లి గ్రామం. అక్కడ మన అణు జలాంతర్గాములు, యుద్దనౌకల కోసం వచ్చే ఏడాది కల్లా నూతన నౌకా స్థావరాన్ని ఉపయోగంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. మరోవైపు కర్ణాటకలో కార్వార్ నౌకా స్థావరం విస్తరణ పనులు కూడా ఊపందుకున్నాయి.తద్వారా అటు తూర్పు తీరం, ఇటు పశ్చిమ తీరాల్లో ప్రాంతీయంగా పెరుగుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధమవుతోంది. దాడులు జరిపే అణు జలాంతర్గాములు (ఎస్ఎస్ఎన్), బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లే న్యూక్లియర్ సబ్మెరైన్లు (ఎస్ఎస్బీఎన్) సహా మన అణు జలాంతర్గాముల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి ఓ భద్రమైన నెలవు ఏర్పాటు చేసేందుకు ‘ప్రాజెక్టు వర్ష’లో భాగంగా అండర్ గ్రౌండ్ పెన్స్, సొరంగాల నెట్వర్క్ ఫీచర్లతో రాంబిల్లి స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నారు.బంగాళాఖాతంలో అణు జలాంతర్గాములు గస్తీ తదితర రహస్య కార్యకలాపాలను నిర్వహించేందుకు పై ఫీచర్స్ ఉపకరిస్తాయి. హైనన్ దీవిలో చైనా అణు జలాంతర్గాముల స్థావరం మాదిరిగా రాంబిల్లి నౌకా స్థావరం కూడా... ఉపగ్రహాల కంటపడకుండా జలాంతర్గాములు లోతైన జలాల్లో రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది. బాలిస్టిక్ క్షిపణులను న్యూక్లియర్ సబ్మెరైన్లు గుట్టుగా మోసుకెళ్లడానికి ఇది తప్పనిసరి. 2014 నుంచి మొదలైన ‘ప్రాజెక్టు వర్ష’ తొలి దశ పూర్తి కావస్తోంది. ఇది 2026లో వినియోగంలోకి (కమిషన్) రావచ్చని భావిస్తున్నారు.ఇన్నర్ హార్బర్ ఇప్పటికే సిద్ధమైందని, ఔటర్ హార్బర్ పనులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఏడు వేల టన్నుల అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్- షిప్, సబ్మెర్సిబుల్, బాలిస్టిక్, న్యూక్లియర్) ‘ఐఎన్ఎస్ అరిధమన్’ ఈ ఏడాది జలప్రవేశం చేయనుంది. తన ముందు అణు జలాంతర్గాములైన ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ కంటే ఐఎన్ఎస్ అరిధమన్ కొంచెం పెద్దది. ఇది మరిన్ని కె-4 మధ్య శ్రేణి అణు క్షిపణులను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణులు 3,500 కిలోమీటర్ల రేంజిలోని లక్ష్యాలను ఛేదించగలవు. రూ.90 వేల కోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ (ఏటీవీ) ప్రాజెక్టులో భాగంగా ఈ మూడు మాత్రమే కాకుండా నాలుగో ఎస్ఎస్బీఎన్ నిర్మాణం కూడా త్వరలో మొదలు కావచ్చని అంటున్నారు.-జమ్ముల శ్రీకాంత్(Source: The Times of India, Business Standard, idrw.org) -
సముద్ర వాణిజ్యంలో భద్రతా సవాళ్లను అధిగమిద్దాం
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్లూ ఎకానమీలో మారీటైమ్ డొమైన్ కీలకంగా వ్యవహరిస్తోందనీ.. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ మహా సముద్రాలంతటా దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి వేదికగా మిలాన్ మారిందన్నారు. దేశ చరిత్రలో కీలకంగా వ్యవహరిస్తూ సముద్ర భద్రతలో, భారతదేశ సముద్ర చరిత్రలో కీలకమైన పాత్రను పోషించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో మిలాన్‌తో పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సహకారంతో సాగర జలాల్లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో మన దేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర వాణిజ్యంలో భద్రత సవాళ్లను కలిసికట్టుగా అధిగవిుంచాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎంతో అవసరమని, ఇందుకోసం భద్రత, సుస్థిరతను నిర్ధారించడానికి దేశాలు కలిసివచ్చి.. సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఉప రాష్ట్రపతి ధన్కర్ చెప్పారు. సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మిలాన్–2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఐఎన్ఎస్ డేగాలో నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మేయర్ హరివెంకటకుమారి, తూర్పు నావికాదళాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డీజీ(గ్రేహౌండ్స్) ఆర్కే మీనా తదితరులున్నారు. -
ఇక నేవీ సంరంభం
=రేపట్నుంచి వేడుకలు ప్రారంభం =నెల రోజులపాటు కార్యక్రమాలు, 4న నేవీడే =నౌకాదళం సర్వ సన్నద్ధం విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తూర్పు నౌకాదళ సంబరాలకు ఏటా మాదిరిగా విశాఖ వేదిక కానుం ది. ఈ నెల పదో తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు డిసెంబర్ 4న నేవీ డేతో ముగియనున్నాయి. సెలెం ట్ సర్వీస్ పేరిట నౌకాదళ సత్తాను చాటే విన్యాసాలకు సాగరతీరం మరోమారు స్వాగతం పలకనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్ యుద్ధ నౌకలు తూర్పుతీరం వెంట కొలువుతీరి కనువిందు చేయనున్నాయి. నౌకాదళ సేవలకు అద్దం పట్టే నేవీ మేళా ప్రత్యేక ఆకర్షణ కానుంది. నెలరోజుల పాటు సంబ రంగా సాగే వివిధ కార్యక్రమాలకు ఆదివారం తెరలేవనుంది. ఏటా చిన్నారుల చిత్ర లేఖనంతో ప్రారంభించడం ఆనవాయితీ. చిన్నారులతో పా టు ప్రత్యేక బాలలకు సయితం వేరే కే టగిరీలో పోటీలు నిర్వహిస్తారు. వీరు యుద్ధ నౌకల్లో ఎక్కి సాహస విన్యాసాల్ని వీక్షించేందుకుఅనుమతిస్తున్నారు. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల పదో తేదీన చిత్ర లేఖనం పోటీలు జరుగుతాయి. ప్రేమ సమాజంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. వినసొంపైనా నేవీ బ్యాండ్ వుడా పార్కులో 17న సంగీతాభిమానుల్ని ఓలలాడించనుంది. డే ఎట్ సీ పేరిట ఈ నెల 20న విన్యాసాల్ని ని ర్వహించనున్నారు. విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీల్లోనూ, ప్రత్యేక బా లలకు 22న, ప్రజల కోసం 23, 24 తేదీల్లో యుద్ధ నౌకల్ని డాక్లో బెర్తుల వద్దకే తీసుకురానున్నారు. ఆర్కే బీచ్ లో డిసెంబర్ 4న అకాశంలో డోర్నియర్లు, ఫైటర్లు విన్యాసాలు చేస్తుం డగా సాగరం నుంచి నేలపైకి వచ్చి శత్రు శిబిరాల్ని తుదముట్టించడం, జలాంతర్గామి ఒక్కసారిగా సముద్రంలో పైకి లేవడం, నౌకల నుంచే యుద్ధ విమానాలపై దాడిలాంటి విన్యాసాలతో విస్మయపరిచే ఆపరేషన్స్‌తో వేడుకలకు ముగింపు పలికేందుకు నేవీ సర్వసన్నద్ధమైంది.