ICC umpire panel
-
ICC: ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితా విడుదల.. ఆ ఇద్దరికి దక్కని చోటు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2025–2026 సీజన్‌కుగాను పన్నెండు మందితో కూడిన ఎలైట్ అంపైర్ల ప్యానెల్ జాబితాను ప్రకటించింది. భారత్‌కు చెందిన నితిన్ మేనన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా... మైకేల్ గాఫ్ (ఇంగ్లండ్), జోయల్ విల్సన్ (ట్రినిడాడ్) చోటు కోల్పోయారు. మైకేల్ గాఫ్, జోయల్ విల్సన్ స్థానాల్లో అల్లావుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) తొలిసారి ఎలైట్ అంపైర్ల జాబితాలోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌కు చెందిన 41 ఏళ్ల నితిన్ 23 ఏళ్లకే అంపైర్‌గా మారాడు. ఇప్పటి వరకు నితిన్ పురుషుల విభాగంలో 30 టెస్టులు, 60 వన్డేలు, 50 టి20 మ్యాచ్‌ల్లో... మహిళల విభాగంలో 20 టి20 మ్యాచ్‌ల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు.ఇక భారత్‌కే చెందిన జయరామన్ మదనగోపాల్‌కు ఎమర్జింగ్ అంపైర్ల ప్యానెల్లోకి ప్రమోషన్ లభించింది. ‘ఎమర్జింగ్’ జాబితాలో ఉన్న వారికి విదేశాల్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా అంపైరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. తమిళనాడుకు చెందిన 50 ఏళ్ల జయరామన్ ఇప్పటి వరకు ఒక టెస్టు, 22 వన్డేలు, 42 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేశారు. ఎలైట్ అంపైర్ల జాబితానితిన్ మేనన్ (భారత్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్), క్రిస్టోఫర్ గాఫ్నీ (న్యూజిలాండ్), ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా), రిచర్డ్ ఇలింగ్‌వర్త్ (ఇంగ్లండ్), ఎహసాన్ రజా (పాకిస్తాన్), పాల్ రీఫెల్ (ఆస్ట్రేలియా), షర్ఫుద్దౌలా షాహిద్ (బంగ్లాదేశ్), రాడ్నీ టకర్ (ఆ్రస్టేలియా), అల్లావుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్). నిలకడగా తమీమ్ ఆరోగ్యం ఢాకా: బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సోమవారం ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) మ్యాచ్ ఆడుతున్న సమయంలో 36 ఏళ్ల తమీమ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలించగా... వైద్యులు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని... మరో 48 గంటలు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలిపారు.ఆ తర్వాత కూడా విశ్రాంతి అవసరమని వెల్లడించారు. ‘అతడి గుండె పనితీరు మెరుగ్గానే ఉంది. అయితే ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. తమీమ్ మా జాతీయ ఆస్తి. మరో రెండు మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచుతాం’ అని డాక్టర్ అబ్దుల్ వదూద్ అన్నారు.ప్రస్తుతానికి విశ్రాంతి అవసరమని... ఎలాంటి అంశాలకైనా అతిగా స్పందించకూడదని సూచించాడు. మూడు నెలల తర్వాత తమీమ్ తిరిగి క్రికెట్ ఆడొచ్చని పేర్కొన్నారు. మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌కు తమీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సోమవారం షినెపుకార్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా అస్వస్థతకు గురికాగా... వైద్య సిబ్బంది ఏంజియోప్లాస్టీ నిర్వహించారు.క్లిష్ట సమయంలో అండగా నిలిచిన వారికి తమీమ్ ధన్యవాదాలు తెలిపాడు. ‘ఆ దేవుడి దయ, మీ అందరి ప్రార్థనలతో తిరిగి బతికాను. ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండటం నా అదృష్టం. తోటివాళ్లకు అండగా నిలవడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండాలి. అందరికీ ధన్యవాదాలు’ అని తమీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. -
ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి.. కట్‌చేస్తే సక్సెస్ఫుల్ అంపైర్‌గా
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలి టెస్టుకు పాకిస్తాన్ అంపైర్ అహ్సన్ రాజా ఫీల్డ్ అంపైర్‌గా పనిచేయడం ఆసక్తి కలిగించింది. ఎలైట్ ఐసీసీ అంపైర్‌గా అహ్సన్ రాజాకు తొలిసారి యాషెస్ టెస్టు సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయం పాక్ అభిమానులను సంతోషపరిచింది. మరి అభిమానుల సంతోషం వెనుక కారణం ఏంటని అనుకుంటున్నారా.. 2009లో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. బస్సులో స్టేడియానికి వెళ్తున్న లంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగింది. అదే బస్సులో అహ్సన్ రాజా కూడా ఉన్నాడు. పలువురు లంక క్రికెటర్లతో పాటు అహ్సన్ రాజా కూడా ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలోకి బులెట్ దూసుకెళ్లడంతో బతకడం కష్టమన్నారు. కానీ అహ్సన్ రాజా బతకాలనే పట్టుదల అతన్ని కోలుకునేలా చేసింది. అంతేకాదు అంపైరింగ్ చేయాలన్న కోరికతో క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అహ్సన్ రాజా కోరిక మళ్లీ నెరవేరింది. అంపైరింగ్‌పై ఉన్న ఇష్టంతో అహ్సన్ రాజా క్రికెట్‌కు తొందరగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. తన కెరీర్లో అహ్సన్రాజా 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక క్రికెట్లో తాను సక్సెస్ కాలేనని గ్రహించిన అహ్సన్ రాజా ఆటకు గుడ్‌బై చెప్పి అంపైరింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. అలా 2006లో అంపైర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2006లో ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ద్వారా అహ్సన్ రాజా అంపైరింగ్ చేవాడు. ఆ తర్వాత 2009లో పీసీబీ కాంట్రాక్ట్ దక్కించుకున్న అహ్సన్ రాజా అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2018లో అండర్-19 వరల్డ్‌కప్, ఆ తర్వాత మహిళల టి20 వరల్డ్‌కప్, 2019 ఐసీసీ టి20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్, 2020 ఐసీసీ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక 2021లో పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ నిర్వహించాడు. అలా కేవలం నాలుగేళ్లలోనే అత్యంత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అహ్సన్ రాజా ఐసీసీ ఎలైట్ అంపైర్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. కట్‌చేస్తే.. ఇవాళ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తూ టాప్ అంపైర్‌గా పేరు తెచ్చుకున్నాడు. What an inspiring journey from Ahsan Raza. Was one of the victims of SL team attack back in 2009 and there were even rumors that he had expired but he fought through it and made his way to the top from bottom. From umpiring in Bermuda vs Namibia to umpiring in Ashes. pic.twitter.com/WiNjv2slxW — yang goi (@GongR1ght) June 16, 2023 so good to see ahsan raza umpiring in an ashes opener. icc have had always respect for aleem dar & after his retirement, they have passed in it onto ahsan raza. pic.twitter.com/W7PfSR7ppu — Kamran (@kamran_069) June 16, 2023 చదవండి: రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు -
19 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ అంపైర్
దిగ్గజ అంపైర్ అలీమ్ దార్ తన 19 ఏళ్ల అంపైరింగ్ కెరీర్‌కు గురువారం వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌కు చెందిన 54 ఏళ్ల అలీమ్ దార్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌గా విధులు నిర్వర్తించారు. దిగ్గజ అంపైర్‌గా పేరు పొందిన ఆయన రికార్డు స్థాయిలో 435 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇందులో 2007, 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌తో పాటు 2010, 2012 టి20 వరల్డ్‌కప్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. 2000లో అంపైర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అలీమ్‌దార్ పాకిస్తాన్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైరింగ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వ్యక్తిగా నిలిచిపోయారు. మొత్తంగా 435 మ్యాచ్‌ల్లో 222 వన్డేలు, 144 టెస్టులు, 69 టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ నిర్వహించారు. ఇక ఐదు వన్డే వరల్డ్‌కప్, ఏడు టి20 వరల్డ్‌కప్స్‌కు అంపైర్‌గా పనిచేశారు. 2009, 2010, 2011లో వరుసగా మూడుసార్లు డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ(ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్)ని గెలుచుకోవడం విశేషం. అంపైరింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై అలీమ్ దార్ స్పందిస్తూ.. ''అంపైర్‌గా లాంగ్ జర్నీని బాగా ఎంజాయ్ చేశాడు. ఒక అంపైర్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పేరు తెచ్చుకోవడం గౌరవంగా భావిస్తున్నా. అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలో ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు. మూడుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోవడం నా కెరీర్లోనే పెద్ద అచీవ్మెంట్. 19 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఇప్పుడున్న అంపైర్లకు నా సలహా ఏంటంటే.. కష్టపడండి, మర్యాదగా నడుచుకోండి..కొత్త విషయాలను నేర్చుకోవడం ఎప్పటికి ఆపకండి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఐసీసీ తమ ఎలైట్ ప్యానెల్ అంపైరింగ్ సభ్యులను 12కు పెంచింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూజిలాండ్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైకేల్ గోఫ్ (ఇంగ్లండ్), నితిన్ మీనన్ (భారత్), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) , రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లాండ్), రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా), జోయెల్ విల్సన్ (వెస్టిండీస్), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా) మరియు అహ్సన్ రజా (పాకిస్థాన్). చదవండి: సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా -
ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ!
ICC Elite Panel Umpire Asad Rauf: ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఒకప్పుడు అంపైర్‌గా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అసద్ రవూఫ్.. ప్రస్తుతం దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. క్రికెట్‌కు పూర్తిగా దూరమైన అతడు సెకండ్ హ్యాండ్ దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పాక్‌టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా డబ్బు చూశానని, ఇప్పుడు తన షాప్‌లో పనిచేసే వర్కర్ల కోసమే పని చేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ బ్యాటర్.. ఆయా మ్యాచ్‌లలో మొత్తం కలిపి 3423, 611 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంపైర్‌గా మారిన అతడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకుని కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఇక 2000-2013 వరకు 98 వన్డేలు, 49 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన అసద్ రవూఫ్.. ఐపీఎల్-2013 సందర్భంగా బుకీల నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆటకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలో లాహోర్‌లోని లాండా బజార్లో షాప్ నడుపుతున్న 66 ఏళ్ల అసద్‌ను స్థానిక మీడియా సంప్రదించగా.. తన జీవితంలో ఏ విషయానికి పశ్చాత్తాప పడటం లేదని పేర్కొన్నాడు. తాను చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. తనకు దురాశ లేదని, ఉన్నంతలో సర్దుకుంటానని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ఇది నాకోసం చేయడం లేదు. నా షాపులో పనిచేసే సిబ్బందికి రోజూ కూలీ చెల్లించాలనే ఉద్దేశంతోనే నేను కూడా పనిలో భాగమవుతున్నా. నా లైఫ్‌లో చాలా డబ్బు చూశాను. ప్రపంచం మొత్తం తిరిగాను. నా కుటుంబం విషయానికొస్తే.. నాకు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడు. మరో కుమారుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నిజానికి నేను ఏ రంగంలో ఉన్నా అందులో తారస్థాయికి చేరుకోవాలని కోరుకుంటాను. క్రికెట్ ఆడే సమయంలో, అంపైరింగ్‌లో టాప్‌లో ఉండేవాడిని. ఇప్పుడు షాప్‌కీపర్‌గా కూడా ఉన్నత స్థితికి చేరుకునేందుకు కృషి చేస్తున్నా. నేను చేస్తున్న పనితో పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని అసద్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో ఆ చేదు అనుభవం మినహా మిగతాకాలమంతా ఎంతో అత్యుత్తమంగా గడిచిందని పేర్కొన్నాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! Jos Buttler ODI Records: వన్డేల్లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు..! -
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఒకే ఒక్క భారతీయుడు
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో భారత అంపైర్ నితిన్ మీనన్ మరోసారి స్థానం దక్కించుకున్నాడు. మీనన్ సేవలను మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఐసీసీ గురువారం ప్రకటించింది. ఈ నెలాఖరులో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా మీనన్ న్యూట్రల్ అంపైర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. ఐసీసీ ప్రకటించిన 11 మంది సభ్యుల ఎలైట్ ప్యానెల్లో ఇండోర్‌కు చెందిన 38 ఏళ్ల నితిన్ మీనన్ ఏకైక భారత అంపైర్ కావడం విశేషం. 2020లో కోవిడ్ సమయంలో మీనన్ తొలిసారి ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నాడు. ఎస్. వెంకటరాఘవన్, ఎస్. రవి తర్వాత ఎలైట్ క్లబ్లో చేరిన మూడో భారతీయుడిగా నితిన్ మీనన్ రికార్డుల్లో నిలిచాడు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా మీనన్ కేవలం భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే అంపైర్‌గా వ్యవహరించాడు. తాజాగా విదేశాల్లో ప్రయాణ అంక్షలు ఎత్తివేయడంతో మీనన్ తొలిసారి న్యూట్రల్ అంపైర్‌గా కనిపించనున్నాడు. మీనన్ ప్రస్తుతంభారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో మీనన్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అలీమ్ దార్, న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, ఆస్ట్రేలియా నుండి పాల్ రీఫిల్, ఇంగ్లండ్ నుంచి రాడ్ టక్కర్, వెస్టిండీస్ నుండి జోయెల్ విల్సన్ ఉన్నారు. చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్‌తో సంబంధం అంటగట్టి' -
చారిత్రక మ్యాచ్‌కు అంపైర్లు ఖరారు.. జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సంబంధించిన అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న చారిత్రక పోరులో ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్.. నాలుగో అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారత అభిమానులు ఐరెన్ లెగ్గా పరిగణించే రిచర్డ్ కెటిల్ బరోకు కూడా స్థానం లభించింది. కెటిల్ బరోను థర్డ్ అంపైర్‌గా నియమిస్తూ ఐసీసీ ప్రకటన విడుదల చేయడంతో భారత అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. దీంతో అతన్ని అంపైర్‌గా తీసుకోవద్దని భారత అభిమానులు ఐసీసీని రిక్వెస్ట్ చేశారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పరంపర కొనసాగింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది. అలాగే, 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆతర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. చివరిసారిగా ఆయన అంపైరింగ్ చేసిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లోనూ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయినప్పుడు లెగ్ అంపైర్‌గా ఉన్న కెటిల్‌బరో.. ‘అయ్యో' అని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను భారత అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కాగా, భారత అభిమానులకు సానుకూలాంశం ఏంటంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తుండటం. చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు -
ఐసీసీ ప్యానెల్లో తొలి మహిళా అంపైర్
క్యాతీ క్రాస్‌కు చోటు దుబాయ్: న్యూజిలాండ్‌కు చెందిన క్యాతీ క్రాస్‌కు... ఐసీసీ అంపైర్ ప్యానెల్లో స్థానం లభించింది. ఓ మహిళకు ప్యానెల్లో చోటు దక్కడం ఇదే తొలిసారి. 2014 కోసం ఎంపిక చేసిన అసోసియేట్, అఫిలియేట్ ప్యానెల్‌కు ఆమెను ఎంపిక చేశారు. దీంతో వరల్డ్ క్రికెట్ లీగ్ 3, 6 డివిజన్ పోటీల్లో అంపైరింగ్ చేసేందుకు 56 ఏళ్ల క్యాతీ అర్హత సాధించింది. గతంలో 2009, 2013లో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ఆమె అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించింది.