క్యాతీ క్రాస్‌కు చోటు
దుబాయ్: న్యూజిలాండ్‌కు చెందిన క్యాతీ క్రాస్‌కు... ఐసీసీ అంపైర్ ప్యానెల్‌లో స్థానం లభించింది. ఓ మహిళకు ప్యానెల్‌లో చోటు దక్కడం ఇదే తొలిసారి.
2014 కోసం ఎంపిక చేసిన అసోసియేట్, అఫిలియేట్ ప్యానెల్‌కు ఆమెను ఎంపిక చేశారు. దీంతో వరల్డ్ క్రికెట్ లీగ్ 3, 6 డివిజన్ పోటీల్లో అంపైరింగ్ చేసేందుకు 56 ఏళ్ల క్యాతీ అర్హత సాధించింది. గతంలో 2009, 2013లో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ఆమె అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించింది.
ఐసీసీ ప్యానెల్‌లో తొలి మహిళా అంపైర్
Published Fri, Jan 31 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement