తొలి టి20లో పాక్ విజయం | First T20 pakistan won | Sakshi
Sakshi News home page

తొలి టి20లో పాక్ విజయం

Published Sat, Dec 6 2014 12:34 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

First T20 pakistan won

దుబాయ్: రెండు టి20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 135 పరుగులు చేసింది. అండర్సన్ (48), రాంచీ (33), గప్టిల్ (32) రాణించారు. పాకిస్తాన్ 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి గెలిచింది. సర్ఫరాజ్ (76 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
 
 అజ్మల్ సిద్ధంగా లేడు: పీసీబీ
 కరాచీ: తమ స్పిన్నర్ అజ్మల్‌కు బయోమెకానిక్ పరీక్ష నిర్వహించేందుకు తేదీని ప్రకటించాలని కోరిన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి బౌలర్ సిద్ధంగా లేడని, పరీక్షను అలస్యంగా నిర్వహించాలని ఐసీసీని కోరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement