not issued
-
వినియోగదారుల ఫోరం అరెస్ట్ వారెంట్ ఇవ్వజాలదు
కోల్‌కతా: వినియోగదారుల ఫోరంలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ జైలులో నిర్బంధించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రమే అధికారముంటుందని పేర్కొంది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఇచ్చిన అరెస్ట్ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. తన ఆదేశాల అమలు కోసం సీపీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)కింద వారెంట్ ఇచ్చేందుకు అధికారం లేదని పేర్కొంది. ఇటువంటి ఆదేశాలు వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించిన నిబంధనల పరిధిని అతిక్రమించడమే అవుతుందని తెలిపింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ కొనుగోలు కోసం 2013లో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. అతడు రూ.25,716 బకాయి చెల్లించలేదంటూ ఫైనాన్స్ కంపెనీ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో, బకాయిని పూర్తిగా చెల్లించిన ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తనకు తిరిగి ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆదేశాలను ఫైనాన్స్ కంపెనీ యజమాని పట్టించుకోలేదు. దీంతో, ఫోరం అతడి అరెస్ట్‌కు వారెంట్ జారీ చేసింది. ఫోరం అధికారాలను సవాల్ చేస్తూ అతడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఫోరం వారెంట్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
ముఫ్తీ పాస్‌పోర్ట్‌పై ఆదేశాలివ్వలేం
శ్రీనగర్: తనకు పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశించా లన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తిని జమ్మూకశ్మీర్ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మెహబూబా ముఫ్తీకి పాస్‌పోరŠుట్ట జారీ చేయకూడదని పోలీస్ వెరిఫికేషన్ నివేదిక సిఫారసు చేసినందువల్ల పాస్‌పోర్ట్ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని న్యాయమూర్తి జస్టిస్ అలీ మొహమ్మద్ మాగ్రే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని తాను ఆదేశించలేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసు కునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేద న్నారు. ‘పోలీస్ వెరిఫికేషన్ నివేదిక వ్యతిరేకం గా వచ్చినందున మీకు పాస్‌పోర్ట్ జారీ చేయలేమ’ని రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి మార్చి 26న మెహ బూబా ముఫ్తీకి లేఖ రాశారు. దీనిపై ముఫ్తీ స్పం దిస్తూ.. ‘కశ్మీర్లో నెలకొందని చెబుతున్న సాధారణ స్థితికి ఇదే ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు పాస్‌పోర్ట్ జారీ చేయడం భారతదేశ భద్ర తకు ప్రమాదకరమని సీఐడీ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి పాస్‌పోర్ట్ ఉండటం దేశ సార్వభౌమత్వానికి భంగకరమట’ అని ఆమె ట్వీట్ చేశారు. -
ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వొద్దు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు మరో మెలిక పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి స్థానికత విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు మరో అంశం జోడయింది. 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థానికులే అని ధ్రువీకరించడంలో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇది తేలేవరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. పదో తరగతిలోపు విద్యార్థులకు అవరమైతే పాత పద్ధతి (మాన్యువల్)గా ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ నుంచి ఆ పైస్థాయి కోర్సుల్లో చేరే విద్యార్థులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులుగా ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. స్థానికత అంశంతోపాటు బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిపివేతకు కారణమని అధికారులు చెబుతున్నారు.