Prevent diseases
-
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
అకాల వర్షాలు విరుచుకుపడటంతో గత రెండు, మూడు రోజులుగా అనేక చోట్ల అనేక పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఈ తోటల్లో పునరుద్ధరణకు, నష్ట నివారణకు సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.. మామిడివీలైనంత వరకు అకాల వర్షపు నీటిని 24 గంటల లోపు తోట బయటకు పంపాలి. అదే విధంగా నీరు నిలిచిపోయే పరిస్థితులను నివారించడానికి ఎతైన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 20గ్రా. కలిపి పేస్ట్ లాగ చేసి పూయాలి.రాలిపోయిన పండ్లను చెట్ల కింద నుంచి సేకరించి దూరంగా వేసి, నాశనం చేయాలి. వీటిని అలాగే వదలివేయటం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మామిడికి ప్రస్తుతం పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి 3 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా బాక్టీరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్ట్రె΄్టోమైసిన్ సల్ఫేట్ 0.5 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.పండ్ల పరిమాణం పెరగడానికి ఒక లీటర్ నీటికి కెఎన్03ను 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాయలకు పగుళ్లు రాకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి బోరాన్‌ను 1.25 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్, స్ట్రెపోటోమైసిన్ సల్ఫేట్, కెఎన్03, బొరాన్.. ఈ నాలుగింటిని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.ప్రస్తుతం తడి వాతావరణం వల్ల పండు ఈగ కాయల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉంది.నివారణకు మిథైల్ యూజీనాల్ (ఎర) ఉచ్చులను ఎకరానికి 10–20 అమర్చు కోవాలి.చెట్టుపైన మామిడి పండ్లను సంచులతో కప్పితే ఎగుమతికి అవసరమైన నాణ్యమైన పండ్లను పొందవచ్చు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుటమాటకాయలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బొరాక్స్ ఒక లీటర్ నీటికి 2 నుండి 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.పూత దశలో ఉంటే, పూత రాలి పోకుండా ఉండటానికి పోలానోఫిక్స్ ఒక మి.లీ., 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఒకలీటర్ నీటికి 5గ్రా. కలిపి పిచికారి చేయాలి.పసుపువర్షాల వల్ల ఆరబెట్టిన పసుపు తడిసి΄ోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ షీట్స్‌ను కప్పడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలు:శ్రీమతి కృష్ణవేణి – 9110726430పసుపు : శ్రీ మహేందర్ : 94415 32072మిర్చి : శ్రీ నాగరాజు : 8861188885 -
కరోనా కట్టడికి ఉ.కొరియా షూట్ ఎట్ సైట్
వాషింగ్టన్ : కరోనా వైరస్ కట్టడికి ఉత్తర కొరియా షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా యూఎస్ ఫోర్సెస్ కొరియా (యూఎస్ఎఫ్కే) కమాండర్ రాబర్ట్ అబ్రమ్స్ వెల్లడించారు. చైనాతో సరిహద్దుల్ని పంచుకున్నప్పటికీ ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ ఉత్తర కొరియాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే కావడంతో కరోనా కేసు చైనాలో బయటపడిన వెంటనే జనవరిలోనే కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది. ఒక వ్యక్తికి కరోనా వైరస్ అనుమానం ఉందనే చెప్పింది తప్ప, అధికారికంగా కొరియా నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇలాంటి తరుణంలో యూఎస్ఎఫ్కే కమాండర్ రాబర్ట్ వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆన్లైన్ సదస్సులో పాల్గొన్నారు. కరోనా కట్టడికి ఉత్తర కొరియా అధికారులు షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. కరోనా ఎవరికైనా సోకిందని తెలిసిన వెంటనే వారిని కాల్చి చంపేయాలని ఉత్తర కొరియా స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కి ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు -
రోగాలను నిరోధించే పచ్చికొబ్బరి
అన్నానగర్: పచ్చి కొబ్బరిలో కేవలం 50 శాతానికి మించి కొవ్వు ఆమ్లాలు లేవని, వీటిని మన దేహం పూర్తిగా శక్తిగా మారుస్తుందే కానీ మిగిలిన నూనెలకు మల్లే శరీరంలోని కొవ్వును వృద్ధి చేయదని న్యూట్రీషనిస్టులు చెప్పారు. కొబ్బరిలోని మోనోలారిన్ అనే పదార్థం మెదడును ఆరోగ్యంగా ఉంచి పక్షవాతం రాకుండా నివారిస్తుందని తెలిపారు. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి జీవులను శరీరంలో ఎదగనివ్వదన్నారు. కొబ్బరి తినేవారికి ఇన్ఫెక్షన్లు సోకవని పేర్కొన్నారు. కొబ్బరిలో సిలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, మాంగనీస్, కాపర్ వంటి లోహాలున్నాయన్నారు. అదేవిధంగా అకాల వృద్ధాప్యాన్ని నివారించే విటమిన్ ఈ, శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్ సితో పాటుగా బి-వన్, బి-త్రీ, బి-ఫైవ్, బి-సిక్స్‌లు సమృద్ధిగా ఒక్క కొబ్బరిలోనే లభ్యం అన్నారు. వాస్తవానికి కొబ్బరి వాడకపోవడం వల్లనే పిల్లల్లో పోషకాహార లోపాలు కన్పిస్తున్నాయని న్యూట్రీషనిస్టులు స్పష్టం చేశారు. ఉదయం తొమ్మిది గంటల లోపల కొబ్బరితో చేసిన పదార్థాలు తింటే ఎంతో మంచిదన్నారు. ఉదయం వేళ నూనెతో చేసిన వస్తువులను తినరాదని అయితే నూనె శాతం తక్కువ కలిగిన కొబ్బరి పదార్థాలు అంటే కొబ్బరి చట్నీ వంటి వాటిని తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ఎండుకొబ్బరి కంటే అప్పటికప్పుడు కొట్టిన పచ్చి కొబ్బరి వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. కొబ్బరిలో పాలీశాచ్యురేటడ్ తైలాలు ఎక్కువ అన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. కొబ్బరి జాతి వాస్తవానికి ఆస్ట్రేలియా దేశానిదని అయితే ఇవి భారతీయుల జన జీవనంలో ఒక ప్రధాన భాగమైపోయాయన్నారు. ఎండు కొబ్బరిని కొంచెం తక్కువగా వాడటం మంచిదని వీరు చెబుతున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం కొన్ని కంపెనీలు కొబ్బరి మంచిది కాదని చెప్పడం విచారకరమన్నారు.