వాషింగ్టన్ : కరోనా వైరస్ కట్టడికి ఉత్తర కొరియా షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా యూఎస్ ఫోర్సెస్ కొరియా (యూఎస్‌ఎఫ్‌కే) కమాండర్ రాబర్ట్ అబ్రమ్స్ వెల్లడించారు. చైనాతో సరిహద్దుల్ని పంచుకున్నప్పటికీ ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ ఉత్తర కొరియాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే కావడంతో కరోనా కేసు చైనాలో బయటపడిన వెంటనే జనవరిలోనే కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది.
ఒక వ్యక్తికి కరోనా వైరస్ అనుమానం ఉందనే చెప్పింది తప్ప, అధికారికంగా కొరియా నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇలాంటి తరుణంలో యూఎస్‌ఎఫ్‌కే కమాండర్ రాబర్ట్ వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆన్‌లైన్ సదస్సులో పాల్గొన్నారు. కరోనా కట్టడికి ఉత్తర కొరియా అధికారులు షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. కరోనా ఎవరికైనా సోకిందని తెలిసిన వెంటనే వారిని కాల్చి చంపేయాలని ఉత్తర కొరియా స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కి ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment