Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Mudragada Padmanabham Letter To YS Jagan Mohan Reddy1
వైఎస్‌ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ

కాకినాడ,సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి.. ఆ పార్టీ సీనియర్‌ నేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైఎస్‌ జగన్‌కి లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే అక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి’ అని పేర్కొన్నారు.

Fire Accident In Anakapalli District2
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య

విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని అదున్నారు. ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ విచారణకు ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన, క్షత గాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

More Policemen Affected by the Red Book Constitution in Andhra Pradesh3
ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరో 11మంది పోలీసులు బలి

గుంటూరు,సాక్షి: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరింత మంది పోలీసులు బలయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్‌ చేసినా సరే.. ముసుగు వేయలేదంటూ పోలీసులుపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా ఆదేశాలతో పదకొండు మంది పోలీసులపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మీడియా ముందు ముసుగు వేసి చూపించినందుకు పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. శనివారం ఎస్పీ ప్రెస్ మీట్ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్ మీట్‌లో హాజరు పరచేందుకు పోలీసులు ప్రయత్నించారు.అయితే, నేను ముసుగు వేసుకొను అని గోరంట్ల మాధవ్ పోలీసులు తేల్చి చెప్పారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ఎందుకు ప్రెస్ మీట్ ముందు హాజరు పరచలేదని ఎస్పీని ఎల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్‌మీట్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టనందుకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సీతారామయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. ఆకస్మితంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీఎస్పీతో పాటు మరో పదిమంది పోలీసుల పైన వేటు పడింది. అరండల్ పేట సీఐ వీరాస్వామితో పాటు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశించింది.

Used Car Market Sees Digital Growth More Women Buyers in India 20254
మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చాలామంది సొంతంగా వాహనం కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కార్ల కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025 మొదటి త్రైమాసికంలో కార్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ విడుదల చేసింది.స్పిన్నీ డేటా ప్రకారం.. 2025 మొదటి త్రైమాసికంలో ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్‌లో గణనీయమైన మార్పులను నివేదించింది. అమ్మకాలలో 77 శాతం డిజిటల్ లావాదేవీల ద్వారా జరుగుతున్నాయి. మహిళా కొనుగోలుదారుల సంఖ్య 28 శాతం పెరిగింది. మొదటిసారి కారు కొనుగోలు చేసినవారు 74 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ కార్ల అమ్మకాలు 29 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలు, పూణేలలో కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా బ్రాండ్ కార్లను అధికంగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. తెలుపు, బూడిద, ఎరుపు రంగు కార్లకే డిమాండ్ ఎక్కువని స్పిన్నీ స్పష్టం చేసింది.డిజిటల్ లావాదేవీలు 2023లో 70 శాతం, 2024లో 75 శాతం ఉండగా 2025 మొదటి త్రైమాసికంలో 77 శాతానికి చేరింది. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న వారిలో 57 శాతం మంది లోన్ ద్వారానే కార్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మహిళా కొనుగోలుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024లో 26 శాతం మంది మహిళా కొనుగోలుదారులు ఉండగా.. 2025 నాటికి వీటి సంఖ్య 28 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఏదంటే..60 శాతం మంది మహిళలు ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లను ఇష్టపడుతుంటే.. 18 శాతం మంది కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. లోన్ ద్వారా కార్లను కొనుగోలుచేస్తున్న మహిళలు 27 శాతం ఉన్నారని నివేదికలో వెల్లడైంది.రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి వాహనాలు అధిక ప్రజాదరణ పొందుతుండగా.. కాంపాక్ట్ SUVల విభాగంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ ఉన్నాయి. అమ్మకాల్లో 84 శాతం పెట్రోల్ కార్లు, 10 శాతం డీజిల్ కార్లు, 4 శాతం CNG కార్లు, 2 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. టాటా నిక్సన్ ఈవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ కూడా బాగా అభివృద్ధి చెందితోంది. అంటే కొనుగోలుదారుల్లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Chandrababu Naidu Another Grand Palace At Capital Amaravati5
చంద్రబాబు మరో మహా ప్యాలెస్‌

సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరా­బాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్‌మ­నేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్‌..! వీటికి­తోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజ­ధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కా­లిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్‌ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్‌ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పు­న ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్‌ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకు­ముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్‌ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ప్రాంతం హైటెక్‌ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూ­డలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్‌ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్న­మాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంత­మైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్‌ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్‌ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్‌ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్ర­బాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్‌ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్‌ రాజభవనం నిర్మా­ణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగ­పూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్‌ జగన్‌ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూ­డలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణా­నికి పూను­కున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజ­లను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటి­కప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.

SRH Abhishek Sharma Mother Breaks Internet With Reaction To Son Century6
ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న అభిషేక్‌ తల్లి వ్యాఖ్యలు.. ఆరెంజ్‌ ఆర్మీ మస్త్‌ ఖుష్‌

క్రికెట్‌ ప్రేమికుల్లో.. ముఖ్యంగా ఆరెంజ్‌ ఆర్మీలో ఎక్కడ చూసినా అభిషేక్‌ శర్మ నామస్మరణే.. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ పంజాబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనలోని మాస్టర్‌ క్లాస్‌ను వెలికి తీసి విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న తన వైఫల్యాలకు తెర దించుతూ బీస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయి.. భారీ సెంచరీ సాధించాడు. కేవలం నలభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న అభిషేక్‌.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.మొత్తంగా ఈ మ్యాచ్‌లో యాభై ఐదు బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ .. పద్నాలుగు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్‌ మ్యాచ్‌ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగానూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఆల్‌టైమ్‌ రికార్డు సాధించాడు.ఇలా తన సుడిగాలి ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గెలిపించి.. తిరిగి విజయాల బాట పట్టించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సహచర ఆటగాళ్లు, సన్‌రైజర్స్‌ ఫ్యామిలీతో పాటు అతడి కుటుంబం కూడా సంతోషంలో తేలియాడుతోంది.𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు ఇక అభి తల్లిదండ్రులు మంజు శర్మ, రాజ్‌కుమార్‌ శర్మ.. తమ కుమారుడి సెంచరీ పూర్తి కాగానే రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రైజర్స్‌ విజయానంతరం అభిషేక్‌ శర్మ తల్లి మంజు శర్మ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.జైత్రయాత్ర కొనసాగుతుంది‘‘ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.. నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను.. మొత్తం హైదరాబాద్‌ అంతా సంతోషంతో నిండిపోయింది.. మనం మ్యాచ్‌ గెలిచాం.. ఇన్నాళ్లు కాస్త మనకు బ్రేక్‌ పడింది... ఇకపై అలాంటిదేమీ ఉండబోదు.. జైత్రయాత్ర కొనసాగుతుంది’’ అని మంజు శర్మ ఆరెంజ్‌ ఆర్మీకి మాటిచ్చారు.ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. అమ్మ ఆశిర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ ఆరెంజ్‌ ఆర్మీ ఫుల్‌ ఖుషీ అయిపోతూ.. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2025లో ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది.అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. తమదైన దూకుడు శైలితో పంజాబ్‌ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని.. 18.3 ఓవర్లలోనే ఊదేసింది. తద్వారా శ్రేయస్‌ అయ్యర్‌ సేనపై కమిన్స్‌ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకోగలిగింది.ఐపీఎల్‌-2025: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌👉టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌.. మొదట బ్యాటింగ్‌👉పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు: 245/6 (20)👉హైదరాబాద్‌ స్కోరు: 247/2 (18.3)👉ఫలితం: పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపుచదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్‌Mother's blessings ✨Hyderabad's joy 😇Abhishek Sharma's whirlwind night to remember 🧡Describe his knock in one word ✍️#TATAIPL | #SRHvPBKS | @SunRisers | @IamAbhiSharma4 pic.twitter.com/yJwBK5bAiD— IndianPremierLeague (@IPL) April 12, 2025

Is Chiranjeevi Convince Tamannaah Bhatia to Announce Breakup with Vijay Varma7
తమన్నా-విజయ్‌ బ్రేకప్‌.. సలహా ఇచ్చిన చిరంజీవి?

మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా (Tamannaah Bhatia)- విజయ్‌ వర్మ (Vijay Varma) కొంతకాలం క్రితమే బ్రేకప్‌ చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు షాకయ్యారు. అయితే ఈ బ్రేకప్‌ను బాహాటంగా ప్రకటించమని మెగాస్టార్‌ చిరంజీవి సలహా ఇచ్చారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.చిరంజీవి సలహారిపబ్లిక్‌ వరల్డ్‌ కథనం ప్రకారం.. ఈ ఏడాది తమన్నా- విజయ్‌ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల గురించి తండ్రి ఆరా తీయగా తమన్నా నిరాసక్తత చూపించింది. తనకు ఇష్టం లేదని తెలిపింది. విజయ్‌ తనకు కట్టుబడి ఉన్నట్లు అనిపించడం లేదని పేర్కొంది. అతడి ఒత్తిడి వల్లే మీడియా ముందు పలుమార్లు జంటగా కలిసి కనిపించామని బాధపడింది. మరి.. ఈ బ్రేకప్‌ వార్తను జనాలకు ఎలా చెప్పగలవు? అని పేరెంట్స్‌ అడగ్గా.. చెప్పాల్సిన అవసరం లేదని తమన్నా అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) జోక్యం చేసుకుని బ్రేకప్‌ న్యూస్‌ను మీడియాకు వెల్లడిస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చారు.చిరంజీవి జోక్యం నిజమా?ఇది చూసిన నెటిజన్లు.. వాళ్లిద్దరి మధ్యలో చిరంజీవి ఎందుకు జోక్యం చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా నమ్మేట్లుగా లేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో బ్రేకప్‌ను దాచడం వల్ల ఒరిగేదేముంది.. ఉన్న విషయం బయటకు చెప్పమని చిరు సలహా ఇచ్చినట్లున్నాడు.. అందులో తప్పేముంది అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి

BJP Slams TMC MP Yusuf Pathan Insta Post8
యూసుఫ్‌ పఠాన్‌పై బీజేపీ ఫైర్‌.. కొంచమైనా సిగ్గుగా లేదా? అంటూ..

కోల్‌కతా: వక్ఫ్‌ (సవరణ) చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనల కారణంగా ముగ్గురు మృతిచెందగా.. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో రెండ్రోజుల ఘటనలకు సంబంధించి 118 మందిని అరెస్టు చేశారు. ఇలాంటి సమయంలో తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.కాగా, మాజీ టీమిండియా క్రికెటర్, టీఎంసీ యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటైన బహరంపూర్ నుండి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. జిల్లాలోని సుతి, ధులియా, సంసేర్‌గంజ్ సహా మరికొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. నిషేధాజ్ఞలు విధించడంతోపాటు ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు.బెంగాల్‌ దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ Instagram‌ వేదికగా తన ఫొటోలను షేర్‌ చేశారు. ఆయన కాఫీ తాగుతున్న ఫొటో ఒకటి కాగా.. దర్జాగా, ఉల్లాసంగా ఉన్న మరో ఫొటోను షేర్‌ చేశారు. దీంతో, ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌పై బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం, పఠాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే వారి ఆదుకోకుండా, కనీసం పరామర్శించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Yusuf Pathan (@yusuf_pathan) ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘బెంగాల్‌ మండిపోతోంది. పోలీసులు మౌనంగా ఉండగా.. మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తున్నారు! ఇంతలో యూసుఫ్ పఠాన్.. ఒక ఎంపీగా ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది తృణముల్‌ కాంగ్రెస్‌ అంటే అని’ ఘాటు విమర్శలు చేశారు. యూసుఫ్‌ పోస్టుపై అటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. హింసాత్మక ఘటనలపై కలకత్తా హైకోర్టులో శాసనసభ విపక్షనేత సువేందు అధికారి పిటిషన్‌ దాఖలు చేశారు. శనివారం సెలవైనా అత్యవసర విచారణ జరపడానికి జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నియమించారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని ఈ ధర్మాసనం ఆదేశించింది. పరిణామాలపై తాము కళ్లు మూసుకోలేమని జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌ వ్యాఖ్యానించారు. వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. Bengal is burningHC has said it can’t keep eyes closed and deployed centra forcesMamata Banerjee is encouraging such state protected violence as Police stays silent! Meanwhile Yusuf Pathan - MP sips tea and soaks in the moment as Hindus get slaughtered… This is TMC pic.twitter.com/P1Yr7MYjAM— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) April 13, 2025

PM Modi Pays Tribute To Jallianwala Bagh Massacre9
Jallianwala Bagh Anniversary: దేశ చరిత్రలో ఘోర అధ్యాయం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్(Jallianwala Bagh) హత్యాకాండ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేటి(ఏప్రిల్‌ 13)తో జలియన్‌వాలా బాగ్‌ ఘటనకు 105 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ తదితరులు జలియన్‌వాలా బాగ్‌ అమరులకు నివాళులు అర్పించారు. ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ జలియన్‌వాలా బాగ్‌ ఘటనలో వీరుల త్యాగం మనలో దేశభక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.ప్రతి ఏటా ఏప్రిల్ 13న ‘జలియన్‌వాలా బాగ్ దివస్’ జరుపుకుంటారు. 1919లో జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వలస పాలనలో భారతీయుల విషయంలో జరిగిన అత్యంత క్రూరమైన దాడులలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. నాడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌(Amritsar)లోని జలియన్‌వాలా బాగ్ గార్డెన్‌లో బ్రిటిష్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు నిరాయుధ ప్రదర్శనకారులపై సైనికులు తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో వెయ్యిమందికిపైగా జనం ‍ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ హత్యాకాండ తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా ఉద్యమం బలపడింది. జలియన్‌వాలా బాగ్‌ ఘటన బ్రిటిష్ వలస పాలకుల క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా చదవండి: సియాచిన్‌ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్‌ విజయం

Why Apple manufactures iPhones outside the US?10
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికంగా తయారీని పునరుద్ధరించడానికి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా వంటి దేశాల్లో భారీగా తయారవుతున్న యాపిల్‌ వంటి అమెరికన్‌ కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం పడుతుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కంపెనీ కూడా చాలాకాలంగా ఈమేరకు సుంకాల నుంచి మినహాయింపు కావాలని యూఎన్‌ను కోరుతుంది. దాంతో అమెరికా ఇటీవల ఫోన్లు, కంప్యూటర్లను ప్రతీకార సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అసలు యాపిల్‌ కంపెనీ తన ఉత్పత్తులను ఎందుకు యూఎస్‌లో తయారు చేయదో నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికాలో ఐఫోన్ల తయారీ అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. 2011 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ సహా సిలికాన్ వ్యాలీలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులు పాల్గొన్నారు. అందులోని సారాంశాన్ని 2012లో న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్‌లో మరణించడానికంటే కొన్ని నెలల ముందు ఈ సమావేశం జరిగింది. అందులో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతున్న సమయంలో అమెరికాలో ఐఫోన్లు తయారు చేయడానికి ఏమి కావాలని ఒబామా ఒక ప్రశ్న అడిగారు. దానికి స్పందించిన స్టీవ్‌జాబ్స్‌ నిర్మొహమాటంగా యాపిల్‌ తయారీకి యూఎస్‌ కంటే ఇతర దేశాలే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: డజను మంది మాజీ ఉద్యోగులు న్యాయపోరాటంయాపిల్ ఇతర దేశాల్లో ఉత్పత్తులను తయారు చేసేందుకు గల కొన్ని కారణాలను మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చైనా వంటి దేశాలు దశాబ్దాలుగా అత్యంత ప్రత్యేకమైన తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఇందులో నైపుణ్యం కలిగిన కార్మికులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాయి. యూఎస్‌లో లేబర్‌, ఉత్పత్తి ఖర్చులు ఇతర దేశాలతో పోలిస్తే అధికంగా ఉంటాయి. అమెరికాలో ఐఫోన్లు తయారైతే వాటి ధర మూడింతలు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కూడా ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ వంటి కంపెనీల ద్వారా యాపిల్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement