Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Papireddy Palli: YS Jagan Sri Sathya Sai District Tour Updates1
కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

పాపిరెడ్డిపల్లి కురుబ లింగమయ్య నివాసంలో వైఎస్‌ జగన్‌👉కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ👉 పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ భరోసా👉ఇటీవలే టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన లింగమయ్యవైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం👉టీడీపీ నేతల డైరెక్షన్‌లో ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు👉పాపిరెడ్డిపల్లి గ్రామంంలో నిషేధాజ్ఞలు👉స్థానికులను కూడా అనుమతించిన పోలీసులు👉వాహనాలు వదిలి పొలాల ద్వారా పాపిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు👉ఎన్ఎస్ గేట్, రామగిరి వద్ద వైఎస్సార్ సీపీ వాహనాలు అడ్డుకుంటున్న పోలీసులు👉పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలుటీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఏడాది మార్చి 30న కొందరు టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరి స్తున్న కురుబ లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు.దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు. అయితే మరుసటి రోజు లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగా మంగళవారం బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్లను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ సోమవారం పరిశీలించారు.

Telangana High Court Verdict In Dilsukhnagar Blasts Case Updates2
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష

సాక్షి, హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీల్‌ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్‌, జియా ఉర్‌ రహమాన్‌, తహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భత్కల్‌, అజాజ్‌ షేక్‌కు ఉరి శిక్ష విధించింది.2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది.అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్‌ అక్తర్, ఎజాజ్‌ షేక్, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

Kommineni Comments On Chandrababu Wealth Creation Campaign3
సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!

ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్‌ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్‌ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్‌ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్‌ రోడ్‌లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్‌లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్‌ మాల్‌ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్‌ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్‌ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

BCCI Announced Women Squad For Tri Series: Harmanpreet Returns To Lead4
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన

శ్రీలంకలో పర్యటించనున్న మహిళా క్రికెట్‌ జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. శ్రీలంక- సౌతాఫ్రికాలతో జరుగనున్న త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును వుమెన్స్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది.హర్మన్‌ప్రీత్‌ పునరాగమనంఈ ‍ప్రతిష్టాత్మక సిరీస్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) భారత జట్టును ముందుకు నడిపించనుండగా.. స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా కొనసాగనుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి, ఆంధ్ర క్రికెటర్‌, అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి కూడా చోటు దక్కించుకున్నారు.అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. శ్రీచరణితో పాటు మరో ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కశ్వీ గౌతమ్‌ (Kashvi Gautam), శుచీ ఉపాధ్యాయ్‌కు కూడా సెలక్టర్లు చోటివ్వడం విశేషం. మరోవైపు.. గాయాల కారణంగా రేణుకా సింగ్‌ ఠాకూర్‌, టైటస్‌ సాధు ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.చివరగా మంధాన సారథ్యంలోకాగా జనవరిలో ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హర్మన్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు ఆమె స్థానంలో మంధానకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో జనవరి 10- 15 వరకు జరిగిన ఈ సిరీస్‌లో మంధాన సేన ఐర్లాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌లో మంధానకు దీప్తి శర్మ డిప్యూటీగా వ్యవహరించింది.అన్నీ ఒకే స్టేడియంలోఇక ఏప్రిల్‌ 27 నుంచి శ్రీలంక- భారత్‌- సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా నాలుగు మ్యాచ్‌లకూ శ్రీలంకలోని కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ఈ సిరీస్‌లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్, స్నేహ్‌ రాణా, అరుంధతీ రెడ్డి, తేజల్ హసాబ్నిస్‌, శ్రీచరణి, శుచీ ఉపాధ్యాయ్‌.ట్రై సిరీస్‌లో భారత్‌ షెడ్యూల్‌ ఇదేఏప్రిల్‌ 27, ఆదివారం- ఇండియా వర్సెస్‌ శ్రీలంకఏప్రిల్‌ 29, మంగళవారం- ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికామే 4, ఆదివారం- ఇండియా వర్సెస్‌ శ్రీలంకమే 7, బుధవారం- ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా.చదవండి: గిల్‌, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్‌ దేవ్‌

Big Setback For Tamil Nadu Governor Governor Rn Ravi In Supreme Court5
సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి షాక్‌

ఢిల్లీ: సుప్రీం కోర్టులో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికుమార్‌ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వం పదిబిల్లులను ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జేబి పార్థీవాలా,ఆర్. మహాదేవన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. గవర్నర్‌ చట్టవిరుద్ధంగా వ్యవహించారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపాలని స్పష్టం చేసింది. Key pointers from Supreme Court judgement in Tamil Nadu Governer RN Ravi case:➡️ Reservation of 10 bills for consideration by parliament after they were reconsidered by State assembly is illegal. ➡️Any consequential steps taken by President on the 10 bills is NON EST ➡️ Court… pic.twitter.com/1nlANNi7Gs— Bar and Bench (@barandbench) April 8, 2025

Wedding Menu Lists Calorie Count Of Dishes Goes Viral6
వాట్‌ ఏ వెడ్డింగ్‌ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!

వివాహ వంటకాల్లో విందులు ఓ రేంజ్‌లో ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్లైతే భోజనంలో లెక్కపెట్టలేనన్ని వెరైటీలతో అతిథులను ఆశ్చర్యపరుస్తారు. కానీ ఇలా ఫిట్‌నెస్‌పై కేర్‌ తీసుకునే విధంగా ఆతిథ్యం ఇవ్వడం గురించి విన్నారా..?. అలాంటి వినూత్న ఆలోచనకు తెరతీశారు పశ్చిమబెంగాల్‌లోని ఓ కుటుంబం. తమ ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనే అతిథులంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావించారో ఏమో..! గానీ భలే అద్భుతంగా మెనూ అందించి విందు ఏర్పాటు చేశారు. వచ్చినవారంతా వారెవవ్వా..ఏం ఉంది ఈ మెనూలో వాటి వివరణ అని మెచ్చుకుంటున్నారు.ప్రస్తతం ప్రజలంతా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా పడితే అలా తినేందుకు ఇష్టపడటం లేదు. ఏది ఎంతవరకు తింటే మంచిదో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ఇలాంటి వివాహ వేడుకలో కూడా వారి డైట్‌కి ఇబ్బంది గలగకుండా జాగ్రత్త తీసుకుంటూ తాము అందించే వంటకాల కేలరీలను సవిరంగా మెనూలో అందించారు. అంతేగాదు ఈ విందులో నచ్చినవన్నీ తినండి..అలాగే అధిక కేలరీలను బర్న్‌ చేసుకునేందుకు ఈ వేడుకలో ఏర్పాటు చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌, డ్యాన్స్‌​వంటి కార్యక్రమాల్లో పాల్గొనండి చాలు. జీఎస్టీ ఏం ఉండదూ కూడా అంటూ చమత్కారంగా రాశారు. ఇక్కడ ఆ మెనూలో ఆరోగ్య స్ప్రుహ తోపాటు, ఆహారం వృధాను నివారించేలా విందును ఆస్వాదిద్దాం అని పిలుపునివ్వడం విశేషం. ఇంకో విషయం కూడా జత చేశారు..ఎంజాయ్‌ చేద్దామనే వచ్చాం కాబట్టి..దాన్ని మిస్‌ చేసుకోకుండా కంఫర్ట్‌గా ఉండమని మెనూ చివరలో సూచించారు. అందుకు సంబంధించిన విషయాలను రెడ్డిట్‌ వినియోగదారుడు నెట్టింట షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లంత ఇది వివాహ మెనూ కాదు..'కేలరీల మోమో' అంటూ ప్రశంసిస్తున్నారు.(చదవండి: 65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?)

gold and silver rates today on market in telugu states7
గోల్డెన్‌ ఛాన్స్‌! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,250 (22 క్యారెట్స్), రూ.89,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 దిగి రూ.82,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 తగ్గి రూ.89,880 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,03,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

China React On Trump Tariffs 50 Percent Tariff Threats8
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్‌ టారిఫ్‌ డెడ్‌లైన్‌పై చైనా

వాషింగ్టన్‌: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన డెడ్‌ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ‌ చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్‌ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్‌ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్‌ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్‌ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్‌ టారిఫ్‌ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్‌ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది.

Pawan Kalyan Son Injured In Singapore9
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కుమారుడికి గాయాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సింగపూర్‌ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్‌ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ ఉన్నారు. ఫోన్‌ కాల్‌ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్‌ వెళ్లనున్నారు.

Meerut Case Accused Found Pregnant During Health Check Up: Official10
మీరట్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి మరో కీలక విషయం

మీరట్‌: మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో అరెస్టైన ముస్కాన్‌, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్‌ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్‌ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.సౌరభ్‌ రాజ్‌పుత్‌(29), ముస్కాన్‌(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్‌(25)తో ముస్కాన్‌ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్‌ చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement