
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,591 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 15 మంది మృతి చెందారు. తాజాగా 3,329 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,87,670 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,057 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,32,20,912 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.