
ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్ ఆప్షన్ తీసుకొచ్చింది.
చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్
వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది.