TDP Selfie Show In Palakollu Fields - Sakshi
Sakshi News home page

‘నిమ్మల’ నాటకాలు! 

Published Thu, Jul 20 2023 5:32 AM | Last Updated on Fri, Jul 21 2023 7:21 PM

TDP selfie show in Palakollu fields - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  ఒకవైపు పనులు జరగకుండా అడ్డుకోవడం.. మరోవైపు ఆగిపోయాయంటూ యాగీ చేయడం.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీరు ఇదీ.. సొంత నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటవుతుంటే స్వాగతించాల్సిందిపోయి అడ్డదారుల్లో అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకొల్లు మండలం దగ్గులూరులో 58.33 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్ల వ్యయంతో నూతన మెడికల్‌ కళాశాలకు సీఎం వైఎస్‌ జగన్‌ గతేడాది శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. తొలుత రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ల్యాండ్‌ ఫిల్లింగ్‌ పనులు చేస్తున్నారు.  27 మీటర్ల లోతులో ఆరు బోర్లు తవ్వారు. 1.7 మీటర్ల ఎత్తు వరకూ ఫ్లోర్‌ కాంక్రీట్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

పనులు దక్కించుకున్న మెగా సంస్థను యలమంచిలి మండలం వేల్పూరులంకలో ఇసుక తవ్వకానికి మైనింగ్‌ శాఖ అనుమతించింది.  ఎమ్మెల్యే నిమ్మల ఈ పనులను అడ్డుకునేందుకు అనుచరులతో పర్యావరణానికి హాని కలుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖ­లు చేయించారు. దీంతో ఐదు నెలల పాటు పనులు నిలి­చి­పోయాయి. కాంట్రాక్టర్‌ ప్రత్యా­మ్నాయ ఏర్పా­ట్లు చేసుకుని పనులను కొనసాగిస్తున్నారు.  పాలకొల్లులో సోమవారం టీడీపీ బస్సు యాత్ర సందర్భంగా పార్టీ నాయకులతో పొలాల్లో సెల్ఫీ దిగిన నిమ్మల రామానాయుడు ఇదే మెడికల్‌ కాలేజీ.. అసలు పనులే జరగడం లేదని బురద చల్లేందుకు ప్రయతి్నంచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement